సజ్జ తెప్లా

 


 

కావలసిన పదార్ధాలు:

సజ్జ పిండి - 1టిన్నర కప్పులు

నూనె - 2 టేబుల్‌ స్పూన్లు

పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు కలిపిన ముద్ద - 2 టీ స్పూన్లు

గోధుమ పిండి - అర కప్పు

మెంతి పొడి - చిటికెడు

పంచదార పొడి - ఒక టీ స్పూను

ఉప్పు - తగినంత

పెరుగు - పిండి కలపడానికి తగినంత

కొత్తిమీర - 2 టీ స్పూన్లు

 

తయారుచేసే విధానం:

ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్పు వేసి కలిపి దింపేయాలి.

ఒక పాత్రలో గోధుమ పిండి, సజ్జ పిండి, మెంతి పొడి, పంచదార పొడి, పచ్చిమిర్చి మిశ్రమం ముద్ద జత చేసి కలపాలి. వేడి నీళ్లు జత చేస్తూ పిండిని కలపాలి.

పెరుగు జత చేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి. పరాఠాల మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఒత్తుకున్న తెప్లాలను (పరాఠా మాదిరిగా) రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి. 

కొత్తిమీరతో అలంకరించి చట్నీతో అందించాలి.