గోంగూర చికెన్

 

 

 

కావలసినవి:
చికెన్   - అరకిలో
గోంగూర - రెండు కట్టలు       
లవంగాలు  - 4
యాలికలు  - 2
నూనె - సరిపడా
ఉప్పు  - తగినంత
ఉల్లిపాయలు - 2
పచ్చి మిరపకాయలు -3
అల్లం వెల్లుల్లి= 1/2 స్పూను
దాల్చిన చెక్క - 1 ఇంచ్
దనియాలు  - 1 టీ  స్పూను
జీల కర్ర  - 1 టీస్పూన్
కరివేపాకు  - కొద్దిగా
పుదినా ఆకులు  -    కొన్ని
గసగసాలు - 1 టీస్పూను
పసుపు - 1/2 టీ స్పూను
కారము  - 1 టీస్పూను

 

తయారి
ముందుగా  గోంగూర ఆకులను కడిగి శుబ్ర చేసుకుని ఉడికించి పక్కన పెట్టుకుని చల్లారిన తరువాత మిక్సిలో వేసి పేస్టు లాగా చేసుకోవాలి. తరువాత  ఉల్లిపాయలను పేస్టు లాగా చేసుకోవాలి. ఇప్పుడు  లవంగాలు, యాలికలు, జీల కర్ర, దాల్చిన చెక్క, దనియాలు, గసగసాలు, మిక్సిలో వేసి పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నూనె పోసి  ఉల్లి పేస్టు , అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత చికెన్ వేసి అందులో పసుపు , కారం వేసి రెండు నిముషముల పాటువేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలిపి  గోంగూర పేస్టు కూడా వేసి రెండు నిముషాలు వేగాక పుదినా, కరివేపాకు, ఉప్పు, సరిపడా నీళ్ళు పోసి 5 నిముషముల పాటు ఉడికించాలి
గ్రేవి దగ్గరకి వచ్చాకా స్టవ్ అఫా చేసి రైస్ తో సర్వ్ చేసుకోవాలి.