ఆవబెట్టిన పులిహోర

 

 

కావలసిన పదార్ధాలు :-

అన్నం

శనగ పప్పు

మినప్పప్పు

పల్లీలు

ఆవాలు

ఎండుమిర్చి

ధనియాల పొడి

ఇంగువ

నిమ్మరసం

ఆవపొడి

ఉప్పు

కరివేపాకు

 

తయారు చేసే విధానం :-

ముందుగా బాణలిలో నూనె పోసి అది కాగాక, శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, పల్లి గింజలు, ఇంగువ వేసి స్టవ్ ఆర్పేసి పచ్చిమిర్చి వేసి కలిపి అన్నంలో కలిపి ఉప్పు కలిపిన నిమ్మరసం, ఆవపొడి, ధనియాల పొడి వేసి కరివేపాకు తో గార్నిష్ చేసుకుంటే ఆవపెట్టిన నిమ్మకాయ పులిహోర రెడీ.. 

********

 

కజ్జికాయలు

 

 

కావలసిన పదార్ధాలు :-

చక్కర పౌడర్

పుట్నాల పొడి

మైదా పిండి

కొబ్బరి పొడి

యాలకుల పొడి

 

తయారు చేసే విధానం :-

కజ్జికాయలు తయారు చేయడానికి 2 గంటలు ముందుగానే మైదా పిండిని నానబెట్టుకోవాలి. ఆ తరవాత ఒక గిన్నెలో నాలుగు స్పూన్ ల పుట్నాల పొడి, 5 స్పూన్ ల కొబ్బరి పొడి, 5 స్పూన్ ల చక్కర పౌడర్, యాలకుల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.ఆ తరవాత ఒక బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి, ఈ లోపు మైదా పిండి పూరీల్లా చేసుకుని అందులో కొబ్బరి మిశ్రమాన్ని వీడియోలో చూపిన విధంగా కజ్జికాయల చెక్క సహాయంతో కజ్జికాయల్లా తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ.