RSS Feeds

There are billions of pages on the Internet and trying to find what you want can often prove to be really tedious. But you can now have customised content delivered to your desktop through RSS (Really Simple Syndication) feeds. teluguone.com/news offers free headlines for personal, non-commercial use via Really Simple Syndication (RSS 2.0). This is an easy way to get the latest news from teluguone.com/news even if you are not logged on to the site.

The feeds are available for the following sections:


English

Telugu

LATEST NEWS
Protest for Special Status for Andhra Pradesh is public protest to be held at RK Beach in Vizag on January 26th, invoking massive protests against the ban on Jallikattu at Chennai’s Marina Beach in neighboring state of Tamil Nadu. In fact, Jana Sena Party chief Pawan Kalyan influenced youth of the state to take the decision. He has been well supported by young heroes from his family and also other heroes in Tollywood. Here are tweets of Varun Tej and SDT in support of the protests. Varun Tej, "Will be supporting anything tht is for the welfare of the people of our states! I Support the Special Status of AP! #APDemandsSpecialStatus" Sai Dharam Tej, "Its time for us to be united and fight for what we were promised and deserve #ApDemandsSpecialStatus #SilentProtest" Interestingly, hero Sampoornesh Babu who hails from Siddipet of Telangana state lend his support for the protests. In fact, he will be the first hero to go to RK Beach to take part in the movement. “My Ticket is confirmed to Vizag. See you there. Hum Jeetne tak ladenge..special status leke hi rahenge. AP DEMANDS SPECIAL STATUS. Na madhathu Yuvathaki, a political party ki kaadhu, jarigedhi political party meeting ayithe nenu raanavasaram ledhu - mee sampoo,” Tweeted Sampoo. However, it is yet not clear whether Pawan Kalyan will directly take part in the protests by going Vizag or not!
Pranab Mukherjee is going to be the first-ever president to emphasize his powers with regard to the government, by rejecting its recommendations while considering mercy petitions of death-row convicts. Pranab, whose term completes in the middle of this year, has on January 1, commuted the death sentences of four convicts, to life imprisonment, in the Bara massacre case. They are Krishna Mochi, Nanhe Lal Mochi, Bir Kuer Paswan and Dharmendra Singh. In the Bara massacre, which took place in 1992, 34 upper-caste Bhumihars were killed allegedly by the activists of the Maoist Communist Centre, now CPI-Maoist, to avenge an earlier massacre of Dalits by the Bhumihars. Three of the four convicts who were sentenced to death in the case are Dalits.
USA New President Donald Trump will speak to Prime Minister Narendra Modi tonight over phone. "The President speaks with Indian Prime Minister, Narendra Modi," the White House said as it released Trump's schedule for today. Trump is scheduled to speak with Modi over phone at 1 PM Washington DC time, which is 11:30 PM IST.  With this Modi, would be the fifth foreign leader Trump would have spoken with over phone after being sworn-in as the US President on January 20. On January 21, Trump spoke with Canadian Prime Minister Justin Trudeau and Mexican Premier Pena Nieto.  On Sunday, Trump spoke with Israeli Prime Minister Benjamin Netanyahu and yesterday he had a telephonic conversation with the Egyptian President Abdel Fattah el-Sisi.  After Trump surprised the world with his historic victory in the November 8 general elections, Modi was among the first five world leaders to have congratulated Trump.  During his gruelling election campaign, India is among the few countries in addition to Israel with whom Trump spoke of strengthening ties if elected to power. 
ALSO ON TELUGUONE N E W S
టైటిల్‌ వినగానే ఇదేం పిచ్చి ప్రశ్న అని మీరు అనుకోవచ్చు..సమంత ఇప్పటి వరకు నాగ్‌ను ఎలా పిలిచినా..నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మామగారు అని పిలవకతప్పదు..మీరు ఫిఫ్టీ ప్లస్‌లో కూడా చాలా యంగ్‌గా కనిపిస్తారు..అలాంటప్పుడు మీ కోడళ్ల చేత మామగారు అని పిలిపించుకోవడానికి ఇబ్బంది పడతారా అని జర్నలిస్ట్‌లు అడగ్గా..దానికి వెరైటీగా సమాధానం చెప్పారు కింగ్. శ్రియా భూపాల్ చిన్నప్పటి నుంచి నాగ్ మామ అని పిలస్తుంది. సమంత మాత్రం నన్ను మామ అని పిలిచేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది..ఎప్పుడూ "నాగ్ సార్" అని పిలిచే సమంతను ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు నాగార్జున నవ్వుతూ చెప్పారు. 
భారత దేశంలో సినీ తారలకు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ ఉండదు..జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన తారను చూడాలనుకుంటారు ఈ దేశంలో అభిమానులు..కానీ అభిమానం ఒక్కోసారి విషాధానికి కారణమవుతూ ఉంటుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దేశంలో ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఆయన తాజా చిత్రం "రయీస్" ప్రమోషన్‌లో భాగంగా షారుఖ్ ఖాన్ చిత్ర యూనిట్‌తో పాటు ముంబై సెంట్రల్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు అగస్త్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పలు స్టేషన్లలో షారుఖ్‌ని చూడటం కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని వడోదర స్టేషన్‌లో అపశృతి చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో రైలు వడోదర స్టేషన్‌కు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం..ఇంతలో రైలు బయలుదేరడంతో ఫ్యాన్స్ దాని వెంట పరుగులు తీశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న షారుఖ్ ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
బాలీవుడ్‌లో బచ్చన్ ఫ్యామిలీపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మొన్నామధ్య ఐశ్వర్య-రణబీర్ కపూర్ రొమాన్స్‌పై పెద్ద దూమారం రేగి బచ్చన్‌ ఫ్యామిలీలో సునామీ సృష్టించింది..ఈ విషయంపైనే అభిషేక్-ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని..త్వరలోనే వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ వేడి వేడి వార్తలు వండి వర్చింది హిందీ మీడియా..కానీ రీసెంట్‌గా జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల ఫంక్షన్‌లో అభిషేక్-ఐశ్వర్యలు అన్యోన్యంగా మెలిగి పుకారు రాయుళ్ల నోళ్లు మూయించారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్-జయాబచ్చన్ కలిసి ఉండటం లేదంటూ బాంబు పేల్చారు..అది చెప్పింది మామూలు వ్యక్తయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు..కానీ ఆ విషయం చెప్పింది ఎవరో కాదు బచ్చన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డ అమర్‌సింగ్. ప్రజంట్ బిగ్‌బి-జయల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వారు విడివిడిగా ఉంటున్నారు..ఒకరు ప్రతీక్షలో..మరోకరు జానక్‌లో నివాసం ఉంటున్నారంటూ అమర్‌సింగ్ చేసిన కామెంట్స్ బి-టౌన్‌లో సంచలనం సృష్టించాయి.. మరి వీటిపై బచ్చన్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Off Late, Mahesh Babu and Ram Charan are moving close to each other. While Charan was seen alongside Mahesh, when the latter’s family went for a vacation for New Year, Charan along with his wife Upasana has attended birthday party of Mahesh’s wife Namrata Shirodkar. Both the families are seen enjoying company of each other. But, the big question is why they have become that close all of sudden. Here comes the answer for this. As per reports, Charan and Mahesh have plans to enter hotel business. They will turn business partners by starting their own hotel chains in few cities in India. However, none have announced the news officially. We all know that, Charan’s dad Chiranjeevi has partnered with Nagarjuna in broadcasting business. They are co-partners of MAA TV.
A magical moment happened on the stage of ace director SS Rajamouli’s dad Vijayendra Prasad’s latest directorial Srivalli audio release function occurred last night. As to release audio CD on the stage Vijayendra Prasad came on stage along with other film unit members. Rajamouli who observed his father’s shoe lace was untied has tied the lace without any shy. He simply went near his father and bent down to tie the shoe-lace which was an eye candy moment for the onlookers. Rajamouli recalled few incidents to describe greatness of his father, while he was speaking at the event. He further said he will feel proud if the film Srivalli is technically sound adding he will always see his father as a competitor as a director.
డొనాల్డ్ ట్రంప్... ఒకప్పుడు ఈ పేరు కామెడీ! కాని, తరువాత క్రమంగా సీరియస్ గా తీసుకున్నారు జనం! కొందరు వ్యతిరేకిస్తే , అంతకు మించి సమర్థించిన వారు వున్నారు. దాని ఫలితమే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవటం. హిల్లరీని కాదని ఈ అల్లరినే ఎంచుకున్నారు అమెరికన్స్. కాని, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రెసిడెంట్ ట్రంప్ అనే సత్యాన్ని ఇంకా ఆయన వ్యతిరేక వర్గం జీర్ణించుకున్నట్టు కనిపించటం లేదు. అందుకే, అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. అత్యుత్సాహంతో కొంపలు మునిగేలా వున్నాయి...  అమెరికా అంటే స్వేఛ్ఛా. అమెరికా అంటే ప్రజాస్వామ్యం. అమెరికా అంటే సమానత్వం. అక్కడున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా అందరూ భావించేది ఇదే. ఆ మాట నిజమేనన్నట్టు కొనసాగుతున్నాయి యాంటీ ట్రంప్ ర్యాలీలు. సాక్షాత్తూ దేశాధ్యక్షుడికే వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి వస్తున్నారు. వాళ్లకి మీడియా కూడా వంత పాడుతోంది. మొత్తంగా ట్రంప్ పాలన అంత ఆషామాషీగా సాగనవ్విమని ఆందోళనకారులు సిగ్నల్స్ ఇస్తున్నారు!  ట్రంప్ ఎన్నికయ్యాక ఇంకా పెద్ద వివాదాస్పద నిర్ణయాలేం తీసుకోలేదు. ఆయన్ని దోషిగా చూపించేందుకు నిరసనకారుల వద్ద బలమైన కారణాలు కూడా లేవు. అయినా కూడా మీడియా, ఉద్యమకారులు అపొహల ఆధారంగానే రచ్చకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ప్రజల చేత న్యాయబద్ధంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడికి నిజంగా అవమానమే. అతను గతంలో చేసిన కామెంట్స్,ప్రకటనలు ఎలా వున్నా ఇప్పుడు మాత్రం ప్రెసిడెంట్. ఆయన ఏం చేస్తాడో కొన్నాళ్లైనా వేచి చూడాలి. అంతే తప్ప ప్రమాణ స్వీకారోత్సవం నుంచే ప్రతీకారంతో రగిలిపోతే ఖచ్చితంగా అతే అనిపించుకుంటుంది. మన దగ్గర మోదీ ఎన్నిక తరువాత మీడియా ప్రవర్తించినట్టే అమెరికాలోనూ ప్రవర్తిస్తోంది. ట్రంప్ ప్రమాణానికి కేవలం 2లక్షల మంది వచ్చారంటూ అబద్ధాలు చెబుతోంది అమెరికన్ మీడియా. అంతే కాదు రోజుకో రకం విష ప్రచారం చేస్తోంది. ఇక్కడి అవార్డ్ వాప్సీ గ్యాంగ్ లాగా అమెరికాలోనూ ఒక వర్గం మేధావులు, జర్నలిస్టులు ట్రంప్ కు వ్యతిరేకంగా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇదంతా నూతన అధ్యక్షుడికి చిర్రెత్తించే విషయమే. అందుకే, ఆయన  కూడా ప్రతి దాడి మొదలుపెట్టాడు. జర్నలిస్టులంత నీతి లేని వాళ్లు వుండరని తిట్టిపోశాడు. వైట్ హౌజ్ ప్రతినిధులు అయితే తమ కొత్త ప్రెసిడెంట్ తో మీడియా సరిగ్గా నడుచుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామని బెదిరిస్తున్నారు. నిరసనలు అంటూ విధ్వంసానికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పదేళ్లు జైలులో వుంచేలా కేసులు పెట్టే ఆలోచనలో వున్నారు!  డొనాల్డ్ ట్రంప్ దెబ్బ బయటి ప్రపంచానికి ఎలా వుండబోతోందో కాని... అమెరికాలోని అంతర్గత శత్రువులకి మాత్రం గట్టిగానే పడేలా కనిపిస్తోంది. నాలుగేళ్ల సంఘర్షణకి తెర లేచినట్టే అనిపిస్తోంది!  
జనవరి 23... నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి! మరి వర్ధంతి ఎప్పుడు? ఏమో తెలియదు! ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మరే నేతకి వుండదనుకుంటా! బోస్ బతికుండగా ఎంత ప్రత్యేకంగా జీవించాడో... మరణంలోనూ అంతే విశిష్టంగా కొనసాగుతున్నాడు. అసలు ఆయన ఈ భూమ్మీద భౌతికంగా లేడంటే ఇప్పటికీ నమ్మేవారు లేరు! కాని, ఆయన 120వ జయంతి అయిన జనవరి 23, 2017న ఆయన మన మధ్య లేరని మనం అంగీకరించక తప్పుదు. నూటా ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి నేతాజీ తమ అవతారం చాలించే వుంటారు. కాని, ఈ విషయం ఖచ్చితంగా మాత్రం చెప్పలేం...   జనవరి 23, 1897న ఒడిషాలోని కటక్ లో పుట్టిన సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ కు వ్యతిరేకంగా సాగుతోన్న భారత స్వాతంత్ర్య సంగ్రామ హోమంలో హవిస్సులా పడ్డాడు! దాన్ని భగ్గున మండిచాడు! గాంధీ నేతృత్వంలో ఒకవైపు అహింసాయుత ఉద్యమం సాగుతోంటే తెల్లోడికి అసలు వేడి తగిలేలా సైనిక పంథా అనుసరించాడు బోస్. 1857లో తొలి స్వాతంత్ర్య సంగ్రామం చేసిన మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీభాయి, నానా సాహేబ్, తాంత్యా తోపే లాంటి వారి వారసత్వాన్ని ఆయన గర్వంగా అందుకున్నాడు. కురుక్షేత్రంలో గీతా బోధ చేసిన శ్రీకృష్ణుని యుద్ధోపదేశాన్ని ధైర్యంగా పాటించాడు. అంతిమ గెలుపు బోస్ కు దక్కినా దక్కకున్నా ఆయన చేసిన ప్రయత్నమే గొప్ప విజయం. ఎందుకంటే, ఆయన ప్రపంచాన్ని తన పిడికిట్లో బంధించిన సామ్రాజ్యవాద గ్రేట్ బ్రిటన్ని స్వదేశంలో ఎదుర్కోలేదు. జర్మనీ, జపాన్ లాంటి సుదూర దేశాల్లో ఎదుర్కొన్నాడు. ఆనాటి ప్రపంచ నేతలతో భారత్ తరుఫున మాట్లాడాడు! అంటే, నిజంగా చెప్పుకుంటే స్వతంత్రానికి ముందే ఇండియాకు ఆయన ప్రతినిధి అయ్యారు. బెర్లిన్ నుంచి సింగపూర్ దాకా మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. అండమాన్ దీవుల్లో ఏర్పాటు చేసిన తన ప్రభుత్వం సాక్షిగా ఇప్పటికీ మార్మోగే జై హింద్ నినాదం ఇచ్చాడు!   రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సాహసోపేతంగా బ్రిటీష్ కు వ్యతిరేక వర్గంతో చేతులు కలిపిన బోస్ వ్యూహం పలించి వుంటే ఇవాళ్ల భారత్ ముఖ చిత్రమే వేరుగా వుండేది. కాని, దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. హిట్లర్ అరాచక నిర్ణయాల వల్ల, జపాన్ దుందుడుకు వ్యవహారం వల్లా అమెరికా, రష్యాల ప్రభావంతో అంతా తలకిందులైంది. అప్పుడే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ విధి రాత కూడా వక్రీకరించింది.    చంద్రబోస్ మనకు స్వాతంత్ర్యం తేలేకపోయినా ఆయన మీద భారతీయుల్లో వున్న గౌరవం, అభిమానం, భక్తి మాత్రం చెక్కుచెదరలేదు. అందుకు, ఆయన చుట్టూ అల్లుకున్న కథనాలే సాక్ష్యం. 1945లో విమాన ప్రమాదంలో మరణించాడని చెప్పే కథనం మొదలు ఉత్తర్ ప్రదేశ్ లో, బెంగాల్లో సాధువుగా గడిపాడని చెప్పే ప్రచారాల వరకూ ఎన్నో వున్నాయి. వాటన్నటి సారాంశం ఒక్కటే. బోస్ కు మరణం లేదు. ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదు. రష్యాలో వుండి వచ్చ. చైనాలో గడిపి వుండవచ్చు. కాదంటే ఉత్తరాదిలో చాలా మంది విశ్వసించే విధంగా సుభాష్ చంద్రబోస్ ఉత్తర్ ప్రదేశ్ లో గుమ్నామి బాబాగా స్థిరపడి వుండవచ్చు. ఇక కొంత మంది బెంగాలీలు 1970లలో ప్రచారం చేసినట్టు ఆయన శ్రీమత్ శారదానందజీ అనే సాధువుగా సిద్ధి పొంది వుండవచ్చు...   సుభాష్ చంద్రబోస్ చుట్టు అల్లుకున్న కథనాల్లో ఏది నిజం అన్నది ఇప్పటికీ పెద్ద శేష ప్రశ్నే! అది ఎప్పటికి స్పష్టం అవుతుందో కూడా చెప్పలేం. మోదీ సర్కార్ వరుసగా బయటపెడుతోన్న రహస్య డాక్యుమెంట్లు కూడా ఇప్పటి దాకా సంచలన విషయాలేం వెల్లడి చేయలేదు. కాబట్టి మరింత కొంత కాలం బోస్ వర్ధంతి లేని మహానాయకుడిగానే కొనసాగుతాడు. లేదంటే శాశ్వతంగా ఆయన మరణం పెద్ద మర్మంగానే మిగిలిపోవచ్చు! అయినా కూడా నష్టమేం లేదు... ఎందుకంటే, జయంతి మాత్రమే వుండి వర్ధంతి లేని వారు దేవుళ్లే! బోస్ భారతీయులకి దేవుడు కాక మరేంటి?
  ఫేస్బుక్,ట్విట్టర్,వాట్సప్,ఇన్ స్టాగ్రామ్ వగైరా వగైరా...ఇవి లేకుండా ప్రపంచాన్ని ఇప్పుడు మనం ఊహించలేం.పొద్దున్న లేస్తే వాష్ రూంలోకి వెళ్లి వచ్చిన విషయం మొదలు గుడ్ నైట్ చెప్పేసి...ఇక పండుకుంటున్నా...అనేంత వరకూ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటం చాలా మందికి మామూలైపోయింది.ఒకవేళ ఏ కారణంతోనైనా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లన్నీ వారం రోజులు అందుబాటులో లేకపోతే ఎంత మందికి పిచ్చేక్కేస్తుందో! మందు,సిగరెట్,గుట్కా లాంటి వ్యసనంగా మారిపోయింది ఇంటర్నెట్ కూడా.మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో టైంపాస్ చేయటం కోట్ల మందికి దురలవాటుగా మారిపోయింది.దీని వల్ల విలువైన సమయం వృథా కావటమే కాదు ఇంకా అనేక నష్టాలు నెత్తిన పడుతున్నాయి.అసలు సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాలే పోతున్నాయంటే ఎవరైనా షాకవుతారు.కాని,ఇది ఇప్పుడొక ఆధునిక నిజం.  పూణేలో ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన భార్యని గొంతు నులిమి చంపేశాడు.తరువాత తాను కూడా ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.కారణం ఫేస్బుక్కే!అందులో తన భార్య విపరీతంగా పర్సనల్ విషయాలు పంచుకుంటోందని అతడి ఫ్రస్ట్రేషన్.బహుశా చాలా సార్లు ఆ విషయం ఆమెకు చెప్పి కూడా వుండవచ్చు.అయినా 28ఏళ్ల ఆ మాజీ ఐటీ ఎంప్లాయి వినలేదు.సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలు విచ్చలవిడిగా బయటపెట్టింది.ఉన్మాదానికి,ఆవేశానికి లోనైన 34ఏళ్ల భర్తకి హత్య,ఆత్మహత్య తప్ప మార్గం కనిపించలేదు! భార్య చేసిన పొరపాటుకి ఆ భర్త విధించిన శిక్ష అస్సలు సమర్థనీయం కాదు.కాని,తాను కూడా ప్రాణం తీసుకున్న అతనిపై పడ్డ ఒత్తిడి గురించి మనం ఆలోచించాలి.సొషల్ మీడియా వినియోగం హద్దులు దాటితే జీవితాలు ఎలా ఛిద్రం అవుతాయో గ్రహించాలి.ఫేస్బుక్,ట్విట్టర్ లాంటివన్నీ మాయా,భ్రమ.అక్కడి మనుషులు,మాటలు,భావాలు ఏవీ నిజం కాదు.ఇంటిలో వున్నట్టుగా ఇంటర్నెట్లో జనం వుండరు.అందంగా వుంటారు.తియ్యగా మాట్లాడతారు.కాని,ఆ నటన వెనుక హిపోక్రసీ దాగుంటుంది.అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియా కోసం ఫ్యామిలీని,రియల్ ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవద్దు.కాని,ఇప్పుడు చాలా మంది గంటల తరబడి కంప్యూటర్లు,స్మార్ట్ ఫోన్లకు హతుక్కుపోయి అదే చేస్తున్నారు... ప్రకృతిలో సహజంగా వచ్చే అన్నమే తక్కువగా తింటే ఆకలేస్తుంది!ఎక్కువగా తింటే ఆయాసం కలుగుతుంది!ఇక కృత్రిమమైన సోషల్ మీడియా లాంటి ఆకర్షణలకి లోనైతే చెప్పేదేముంది?వాట్ని వాడకపోతే మనం వెనకబడిపోతాం.ఎక్కువగా వాడితే పాడుబడిపోతాం.అందుకే,నెట్ వర్కింగ్ సైట్స్ ని మనం మన అవసరం మేరకే వాడుకోవాలి.వాటికి ఆవల వున్న నిజమైన ప్రపంచాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టకూడదు...  
  రౌడీలు, గూండాలు అంటే మనకు ఒక ఊహ వుంటుంది. వారు భారీ ఆకారాలతో, భీకరమైన పనులతో, వెంట ఓ ముఠాని వేసుకుని తిరుగుతూ వుంటారని అనుకుంటాం. ఇంత కాలం అదే నిజం కూడా. కాని, సోషల్ మీడియా శకం మొదలయ్యాక రౌడీ, గూండా అనే మాటలకు అర్థాలు మారిపోయాయి! ఈ సోషల్ మీడియా గూండాలు, రౌడీలు, పోరంబోకులు కళ్లకు కనిపించరు. వినిపించరు. కేవలం ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సైట్లలో కామెంట్లు పెడుతూ, ఇబ్బంది పెడుతూ, బెంబేలెత్తిస్తుంటారు. వీళ్లు ఈ మతం ఆ మతం అని కాదు... అన్ని మతాల వారూ వుంటుంటారు! కొన్ని మతాల్లోని ఛాందసవాదులు మరింత ఎక్కువ దాదాగిరి, గూండాగిరి చేసేస్తుంటారు. ఎంతగా అంటే సెలబ్రిటీలు సైతం వీళ్ల బారినపడి అల్లాడిపోవాల్సిందే. బెదిరిపోవాల్సిందే.   ఇంటర్నెట్ దౌర్జన్యానికి తాజా ఉదాహరణ దంగల్ చిత్రంలో నటించిన బాలనటి జయిరా వాసిమ్ ఉదంతమే. ఆమెకి జస్ట్ పదహారేళ్లు. దంగల్ చిత్రంలో ఆమీర్ కూతురిగా నటించింది. గీతా ఫోగట్ అనే రెస్లర్ చిన్న నాటి పాత్రలో జయిరా కనిపించింది. ఆ పాత్రకి బాగా పేరు రావటంతో ఆమె జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని గౌరవపూర్వకంగా కలిసింది. జయిరాది కాశ్మీరే. అయితే, దంగల్ లాంటి చిత్రంలో గొప్ప పాత్ర చేసినందుకు కాశ్మీర్ సీఎం జయిరాను మెచ్చుకుంది. ట్విట్టర్ లో తాను ఎంతో మందికి రోల్ మోడల్ అని కీర్తించింది. అది నిజం కూడా!   తన స్వంత రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా పొగిడితే ఎవరికి మాత్రం ఆనందం కలగదు? కాని, జయిరా మాత్రం మెహబూబాను కలిసిన కొన్ని రోజులకి ఓ పెద్ద క్షమాపణ లేఖ షేస్బుక్ లో పోస్ట్ చేసింది. తాను కొందరిని కలిసి తప్పు చేశానని, తాను ఎవరికీ రోల్ మోడల్ కాననీ, ఇంకా చాలా మంది గొప్పవారు వున్నారని జయిరా చెప్పుకొచ్చింది. తనని క్షమించమని వేడుకొంది. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? మనం ఇందాకా మాట్లాడుకున్న ఇంటర్నెట్ రౌడీ మూకల వల్ల! జయిరా దంగల్ లో నటించటం, మెహబూబాను కలుసుకోవటం కాశ్మీర్ లోని వేర్పాటువాదులకి నచ్చలేదు. వాళ్ల తమ ఛాందసవాదం అంతా బయటకి తీసి పదహారేళ్ల జయిరాపై సోషల్ మీడియాలో విషంగక్కారు. కామెంట్సు, బెదిరింపులు, బూతులతో బిక్కచచ్చిపోయేలా చేశారు. దాని ఫలితమే జయిరా వాసిమ్ క్షమాపణ లేఖ. అయితే, ఆమె సారీ చెబుతూ పెట్టిన పోస్ట్ కొంత సేపటికే డిలీట్ చేసేసింది. తరువాత ఈ గొడవని ఇక్కడితో వదిలేయండని మనవి చేసింది!   దంగల్ లో నటించి పాప్యులర్ అయిన బాలనటి సోషల్ మీడియాలో దాడి ఎదుర్కోవడం ఆమీర్ సహించలేదు. తాను అండగా వుంటానని చెప్పాడు. జయిరా తప్పు చేయలేదని, తనకు కూడా ఆమె రోల్ మోడల్ అని చెప్పాడు. కాని, ఆశ్చర్యకరంగా మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్... సోషల్ మీడియాలో జయిరాను భయపెట్టిన ఛాందసవాదుల్ని మాత్రం పల్లెత్తు మాటనలేదు. ఆమీర్ బాటలోనే ఇప్పుడు చాలా మంది ప్రముఖులు జయిరాకి జైకొడుతున్నారు కాని అసలు రౌడీల్ని, గూండాల్ని మాత్రం విమర్శించలేకపోతున్నారు!   జయిరా వాసిమ్ మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా క్రికెటర్ మహ్మద్ షమీ కూడా హీట్ ఎదుర్కొన్నాడు. ఆయన భార్యతో దిగిన ఫోటో షేర్ చేస్తే ఛాందసవాద నెటిజన్లు తిట్టిపోశారు. బురఖా లేకుండా గ్లామరస్ దుస్తులు ఆమె వేసుకున్నందుకు ఆగ్రహఃతో ఊగిపోయారు. ఇక మరో క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూర్య నమస్కారాలు చేస్తూ ఫోటోలు పెట్టాడు. వాట్ని కూడా సోషల్ మీడియా అరాచకులు వదల్లేదు. కైఫ్ ని రోజుల తరబడి వెంటాడారు.ఇంటర్నెట్ లో తమకు నచ్చని వార్ని వేధించటం కేవలం ముస్లిమ్ ఛాందసవాదులే చేస్తారనుకోలేం. మిగతా మతాల వాళ్లు కూడా ఇలాంటి దాడికి దిగుతుంటారు. కాకపోతే, చేసింది ఎవరైనా ఈ ఆధునిక రౌడీయిజం వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్రంగా భంగం కలిగిస్తోంది. అందరూ దీనిపై పోరాడాల్సిన అవసరం వుంది.
ప్రభుత్వం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థ, అధికార గణం... ఇవన్నీ  దేశం చక్కగ నడవటానికి మూల కారణాలు. అయితే, వీటికి ఎప్పుడూ తోడుగా వుంటూ వస్తోంది మీడియా. ఒకప్పుడు పత్రికలు, తరువాత ఛానల్స్, ఇంకా తరువాత వెబ్ మీడియా ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుతూనే వున్నాయి. కాని,ఇప్పుడు ఫోర్ట్ ఎస్టేట్ అయిన మీడియాకి తోడుగా, జోడుగా ఫిఫ్త్ ఎస్టేట్ తయారైంది! అదే సోషల్ మీడియా!   ఆ మధ్య ఈజీప్ట్ లో తమ నియంతకి వ్యతిరేకంగా జోరుగా నిరసనలు జరిగాయి. తరువాత అనేక దేశాల్లో అమాంతం ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. అమెరికాలో వాల్ స్ట్రీట్ మొదలు మన ఢిల్లీ వీధుల్లో నిర్భయ నిరసనల దాకా ప్రపంచం అంతా అట్టుడికింది. వీటికంతటికీ సోషల్ మీడియానే కారణం అనేది ఒక వాదన! పైకి ఎవరికి వారు సరదాగానో, కాలక్షేపంగానో ఫేస్బుక్ , ట్విట్టర్ లలో తచ్చాడుతున్నట్టు కనిపిస్తున్నా సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితంలో అతి కీలకం అయిపోయింది. దాని ప్రభావం మనకు తెలియకుండానే మనపై తిరుగులేనంత పడుతోంది. ఇంతకు ముందులా ఇప్పుడు ఉద్యమాలు ఎవరి వల్ల వస్తాయి, ఎటు నుంచీ మొదలవుతాయి అని అర్థం కావటం లేదు. అసలు ఒక్కోసారి కొన్ని చారిత్రక ఉద్యమాలు కూడా ఎవ్వరూ ప్రత్యేకంగా పిలుపునివ్వకుండానే మొదలైపోతున్నాయి. మొత్తం వ్యవస్థని స్థంభింపజేసే వరకూ వెళుతున్నాయి.   ప్రస్తుతం చెన్నై మెరీనా బీచ్ లో జల్లికట్టు కోసం జనం మొండిపట్టుతో కూర్చున్నారు. దీనికి ఎవరు పిలుపునిచ్చారు? అన్నాడీఎంకే అధికారంలో వుంది కాబట్టి ప్రతిపక్ష డీఎంకే జనాల్ని రోడ్లపైకి రమ్మన్నదా? అలాంటిదేం జరగలేదు! రజినీకాంత్,కమల్ హసన్ లాంటి సెలబ్రిటీలు జల్లికట్టుకు తమ మద్దతు తెలిపారు. నిషేధం తప్పన్నారు. అయినా వారు కూడా ఎవ్వర్నీ మెరీనా బీచ్ కి రమ్మని చెప్పలేదు. కాని, రాత్రికి రాత్రి మెరీనా బీచ్ లో సముద్రంతో పోటీపడేలా జన  సముద్రం ఉప్పొంగింది! అదీ కాక ఇక్కడ మనం గుర్తించాల్సిన మరో విషయం వుంది.   వచ్చిన వారిలో అధిక భాగం స్మార్ట్ ఫోన్లు వాడే ప్రజెంట్ జెనరేషనే! సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే యూత్, స్టూడెంట్స్, ఎంప్లాయిస్ వరదలా వచ్చేశారు. వీర్ని ఏకం చేసింది నిస్సందేహంగా సోషల్ మీడియానే! కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఫేస్బుక్ స్టేటస్ లు, ట్విట్టర్ పోస్టులు అసాధ్యం సుసాధ్యం చేశాయి. ఎన్నికల ర్యాలీలకు కోట్లు కుమ్మరించినా రాని జనం క్షణాల్లో జల్లికట్టు కోసం వాలిపోయారు! ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ మధ్య జరిగిన నిర్భయ నిరసనల్లో కూడా సోషల్ మీడియా యూజర్సే ఎక్కువగా కనిపించారు. పైగా ఢిల్లీ కావటంతో నెటిజన్స్ నడివీధుల్లోకి అవలీలగా వచ్చేశారు. కొన్ని రోజుల పాటూ కేంద్రాన్ని కల్లోల పరిచారు. చాప కింద సునామీలా ఉప్పొంగుతున్నా సోషల్ మీడియా సత్తా అది!   సెల్ఫీలు తీసుకుని తమ టైం లైన్ పై పెట్టి లైక్ లు, కామెంట్స్ కోరుకునే యూజర్సే సోషల్ మీడియాలో చాలా మంది కనిపించవచ్చు. కాని, పైకి ప్రశాంతంగా కనిపించే సరస్సులా వున్నా లోలోపల బడబాగ్నితో రగిలిపోయే సముద్రం లాంటిది సోషల్ మీడియా. దాని వల్ల జల్లికట్టు ఉద్యమాల లాంటి శాంతియుత పరిణామాలు రావచ్చు... లేదంటే కాశ్మీర్ అల్లర్ల మాదిరి హింసాత్మక ధోరణులు కూడా చోటు చేసుకోవచ్చు. అందుకే, ప్రభుత్వాలు, జనం సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అది రెండు వైపుల పదునున్న కత్తిలా మారిపోయిందిప్పుడు!
  అమెరికాలో ట్రంప్ టైమ్స్ మొదలవన్నున్నాయి.మరి కొద్ది గంటల్లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ లో కాలుమోపుతాడు.ఇది అమెరికా అంతరంగిక వ్యవహారం అని కొట్టిపారేయటానికి అస్సలు వీలు లేదు.ప్రపంచంలోని ఇతర దేశాల అధ్యక్షులు,ప్రధానులు,రాజులు అధికారం చేపట్టినట్టు కాదు అమెరికన్ ప్రెసెడింట్ మారటం అంటే.అది భూగోళంపై పెను ప్రభావం చూపే అత్యంత కీలకమైన పరిణామం.పైగా ఈసారి ట్రంప్ లాంటి టెంపర్ వున్న ప్రెసిడెంట్ ని అమెరికన్స్ ఎంచుకోవటం మరింత ఆసక్తి,ఆందోళన కలిగిస్తోంది! నథింగ్ అనుకున్న ట్రంప్ మెల్లెమెల్లగా సమ్ థింగ్ అయ్యాడు.ఎన్నికల్లో గెలిచి ఎనీథింగ్ అనిపించుకున్నాడు.ఇప్పుడు అధికారికంగా అధ్యక్షుడు అవ్వనున్న సమయంలో ఎవ్రీథింగ్ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు.ఆయనొస్తే ఏదో కొన్ని ఉద్యోగాలు పోతాయిలే అనుకున్న వారు ఇప్పుడు అవాక్కయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నాడు.దిమ్మతిరిగిపోయే కామెంట్స్ చేస్తున్నాడు.నిన్న మొన్నటి వరకూ ట్రంప్ అంటే మెక్సికో లాంటి దేశాలు మండిపడేవి.కారణం ఆయన అక్కడి నుంచి వలస వస్తోన్న జనాన్ని టార్గెట్ చేయటమే.మెక్సికో వలస జనాలను రాకుండానైతే,ఏకంగా గోడ కడతానని చెబుతున్నాడు ట్రంప్!కాని,ఆయన ఎక్స్ పరిమెంట్స్ అక్కడితో ఆగటం లేదు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలకు కూడా మంట పుట్టిస్తున్నాయి...  అమెరికాలోని కంపెనీలు అమెరికన్స్ కే ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలని బెదిరిస్తోన్న ట్రంప్ మిలటరీ విషయాల్లో కూడా దూకుడుగా వెళుతున్నాడు. ఒకప్పుడు అమెరికానే చొరవ చూపి సృస్టించిన నాటో ఇప్పుడు దండగ అనేస్తున్నాడు!నాటో అంటే యూరప్,అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల సైనిక కూటమి.ఇరాక్,అఫ్గనిస్తాన్,సిరియా లాంటి అనేక దేశాలపై నాటో సేనలు దాడులు చేశాయి ఈ మధ్య కాలంలో.ఇలా చాలా సార్లు నాటో అమెరికా ఉద్దేశాలకు ఉపయోగపడుతూ వచ్చింది.కాని,ట్రంప్ ఎన్నికల ముందు నుంచే నాటోపై పెదవి విరుస్తున్నాడు.నాటో నిర్వహణ కోసం ఖర్చయ్యే వేల కోట్ల డాలర్లు కేవలం అమెరికానే భరిస్తోందని ఆయన వాదిస్తున్నాడు.మిగతా దేశాలు తక్కువ ఖర్చుతో సైనికంగా లాభాలు, రక్షణ పొందుతున్నాయని ట్రంప్ కంప్లైంట్! నాటో గురించి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదన నిజమే.నాటో కోసం ఎక్కువగా ఖర్చు చేసేది అమెరికానే.కాని,ఇప్పుడు దాన్ని దండగ అంటూ ఒకవేళ అమెరికా అమాంతం పక్కకు తప్పుకుంటే మిగతా దేశాలకు పెద్ద షాకే తగులుతుంది.కెనడా లాంటి దేశాలు ఇప్పటికిప్పుడు తమ రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచుకోవాల్సి వస్తోంది.ఇటలీ,జర్మనీ,ఫ్రాన్స్ లాంటి యూరప్ దేశాలు కూడా తమ సేఫ్టీ తాము చూసుకోవాల్సి వస్తుంది.అన్నిటికంటే ముఖ్యంగా,ట్రంప్ నాటో నుంచి వైదొలగాలని నిర్ణయిస్తే అది రష్యాకి పెద్ద లాభం.ఇదే ఇప్పుడు చాలా మందిని ఆందోళన పరుస్తోన్న అంశం... రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నాటో ఏర్పాటుకు అసలు కారణం సోవియట్ రష్యా.దాన్ని అడ్డుకునేందుకే అమెరికా అనేక దేశాల మద్దతుతో నాటోను సృష్టించింది.కమ్యూనిస్ట్ రష్యాను విజయవంతంగా అడ్డుకుంది.కాని,ఇప్పడు కాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయాయి.ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా క్లోజ్.అందుకే,డొనాల్డ్ గత అమెరికన్ ప్రెసిడెంట్ల మాదిరిగా కాకుండా రష్యా అంటే కొత్త ప్రేమ ప్రదర్శిస్తున్నాడు.సిరియా విషయంలో రష్యా జోక్యం చేసుకున్నందుకు విధించిన ఆంక్షలు కూడా అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు.ట్రంప్ ప్రదర్శిస్తోన్న ఈ రష్యన్ లవ్ ఎవ్వరికీ ఓ పట్టాన అంతు పట్టడం లేదు... ట్రంప్ తాను అనుకున్న విధంగా నాటో నుంచి అగ్ర రాజ్యాన్ని తప్పిస్తే ప్రపంచ సైనిక సమీకరణల్లో పెను మార్పు గ్యారెంటీ.రష్యా ఇప్పటి కంటే ఇంకా దూకుడుగా తన కండ బలం ప్రదర్శించే చాన్స్ వుంది.ఇంతకాలం పెద్దన్న అమెరికాను నమ్ముకుని నిశ్చింతగా వున్న వివిధ నాటో దేశాలు ఇకపై జాగ్రత్తగా తమని తాము కాపాడుకుంటూ ముందుకు సాగాలి.అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంత కాలం కొనసాగుతూ వస్తోన్న అమెరికా సైనిక ఆధిపత్యానికి గండి పడే అవకాశం వుంది!
  ఆటలు జీవితంలో ఒక భాగం కావచ్చు. శారీరక వ్యాయామానికో, మనసు సంతోషంగా ఉండటానికో వాటిని మనం ఆడుతూ ఉండవచ్చు. కానీ ఆ ఆటని కనుక నిశితంగా గమనిస్తే, అందులోంచి నేర్చుకునేందుకు ఎంతో కొంత ఉంది అనిపిస్తుంది.   స్పష్టమైన లక్ష్యం - ప్రతి ఆటగాడికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. బౌలర్ అయితే వీలైనంత త్వరగా వికెట్ తీయాలనుకుంటాడు. బ్యాట్స్మెన్ అయితే వీలైనన్ని పరుగులు చేయాలనుకుంటాడు. ఫుట్బాల్ ఆటగాడైతే గోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే గోల్ కీపర్ అయితే... ఇలా ప్రతి ఒక్కరికీ తనదైన లక్ష్యం ఉంటుంది. లేకపోతే ఆట వృధాగా మారిపోతుంది. జీవితం కూడా అంతే! ఏ లక్ష్యమూ లేని మనిషి, మైదానంలో అయోమయంగా తిరిగే ఆటగాడితో సమానం.   సమస్యని ఎదుర్కోవాల్సిందే - బరిలోకి దిగాక మన సత్తువనంతా ప్రదర్శించాల్సిందే! సమ ఉజ్జీలాంటి సమస్య ఎదురుపడినప్పుడు మన శాయశక్తులా పోరాడితేనే ఫలితం దక్కేది. కళ్లు మూసుకుని అది దాటిపోతుందిలే అనుకుంటే విలువైన అవకాశం కాస్తా చేజారిపోతుంది.   పైపై మెరుగులు పనికిరావు - ఆటలోకి దిగాక డాంబికాలతో ఫలితాలు రావు. ఏదో కాసేపు పని జరుగుతుందేమో కానీ ఆఖరు విజయం మాత్రం అర్హుడికే దక్కుతుంది.   గెలుపు ఓటములను స్వీకరించాలి - ఆడే ప్రతి ఆటలోనూ గెలుపు సాధ్యం కాదు. గెలిచేవాడుంటే ఓడిపోయేవాడు కూడా ఉండి తీరాల్సిందే. ఓడిపోయాను కదా అని క్రుంగిపోతే ఇక ఎప్పటికీ అతని మనసు గెలుపు మీద లగ్నం కాలేదు. గెలిచానని విర్రవీగినా అతనికి విలువ ఉండదు. ఓడినప్పుడు మరోసారి కసిగా ఆడేందుకు ప్రయత్నించాలి. గెలిస్తే వినయంతో దాన్ని స్వీకరించాలి.   జట్టు గురించి ఆలోచించాలి - తానొక్కడినే గెలవాలి అన్న స్వార్థం చివరికి వేదననే మిగులుస్తుంది. జట్టుతో కలిసి ఆడితేనే అసలైన విజయం లభిస్తుంది. Live and Let Live అన్న సూత్రంతోనే జీవితానికైనా, ఆటకైనా అర్థం ఉంటుంది.   లోపాలను జయించాలి - ఎంతటి ఆటగాడైనా కానీ ఓ చిన్నపాటి లోపం ఉంటే చాలు, అతనిలోని నైపుణ్యాలన్నీ పనికిరాకుండా పోతాయి. స్వీయవిశ్లేషణతో ఆ లోపాలను గ్రహించి, వాటిని అధిగమించినప్పుడే విజేతగా నిలవగలడు.   క్రమశిక్షణ - సచిన్, వినోద్ కాంబ్లి ఇద్దరూ సరిసమానమైన ఆటగాళ్లే. కానీ కాంబ్లి వెనకబడిపోవడానికి కారణం అతనిలోని క్రమశిక్షణాల లేమి అంటారు. ఆటైనా, జీవితమైనా తగిన క్రమపద్ధతిలో లేకుండా అరాచకంగా సాగిపోతే ఎదుగుదలలో ఎదురుదెబ్బలు తప్పవు. - నిర్జర.
ఓ చిన్న ప్రయోగం చేసి చూద్దామా! ఓ నాలుగు గోడల మధ్య కూర్చుని మీ జీమెయిల్‌ అకౌంట్‌ ఓపెన్ చేయండి. ఆ అకౌంట్ అలా ఓపెన్ చేసి ఉండగానే గూగుల్‌ సెర్చ్‌లో ఏదో ఒక విషయం గురించి సెర్చ్‌ చేయండి. ఇప్పుడు ఏదన్నా ఇంటర్నెట్‌ సెంటర్‌కి వెళ్లి కూర్చోండి. అక్కడ మీ జీమెయిల్‌ అకౌంట్ ఓపెన్ చేయండి. అలా చేసి ఉండగానే గూగుల్‌ సెర్చ్‌ చేసే ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు మీరు రహస్యంగా సెర్చ్‌ కొట్టిన కీవర్డ్స్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద కనిపించడం ఖాయం. ఇదేమీ మాయా కాదు మంత్రమూ కాదు. గూగుల్‌ తల్లి నిరంతరం మిమ్మల్ని గమనిస్తోంది అని చెప్పే సూచన మాత్రమే! గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వెబ్‌సైట్లు తమ ఖాతాదారుల ప్రైవసీని కాపాడతామని చెబుతూనే వారిని వేయి కళ్లతో గమనిస్తూ ఉంటాయి. మీరు అమెజాన్‌లో ఓ పుస్తకం చూసి ముచ్చటపడితే, గూగుల్‌ తల్లి మీరు ఎక్కడకి వెళ్లినా అదే పుస్తకాన్ని చూపిస్తూ ఊరిస్తూ ఉంటుంది. ఇలా ఇంటర్నెట్ వాడకందారుల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోతున్నాయంటూ ఆందోళనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అయితే కేవలం గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వెబ్‌సైట్లే కాదు కాస్త పెద్ద సంస్థ ఏదైనా సరే, మనల్ని అంతర్జాలంలో వెంబడించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఆస్ట్రేలియాలోని కొందరు పరిశోధకులు కలిసి మన వ్యక్తిగత వివరాలు ఎంతవరకు సురక్షితం అనే విషయం మీద ఓ అధ్యయనం చేశారు. ఇందుకోసం వారు కొన్ని కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించారు. వాటి ద్వారా ఒక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించేవారి తీరుని పట్టేయవచ్చునంటున్నారు. వీరి అంచనా ప్రకారం ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నట్లే వాళ్లు వెబ్‌సైట్లని చూసే తీరులో కూడా ప్రత్యేకత ఉంటుంది. అమెజాన్‌లో సైన్సు పుస్తకాల గురించి వెతికేవారు ఇతర చోట్ల కూడా అలాంటి పుస్తకాలనే వెతకవచ్చు. లేదా పాత సినిమాలను ఇంటర్నెట్‌లో శోధించేవారు, నిత్యం అదే పని మీదే ఉండవచ్చు. ట్విట్టర్ లేదా ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కనుక మీరు మీ సెర్చ్‌లను కొనసాగిస్తుంటే... మీ ప్రొఫైల్‌ మొత్తం పట్టేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి తమ వెబ్‌సైట్లలో ఉంచిన ప్రకటనలని ఎవరు చూస్తున్నారనే విషయాన్ని రహస్యంగా ఉంచుతామని వివిధ సంస్థలు చెబుతూ ఉంటాయి. కానీ ఆయా ప్రకటనలకి కనుక కొన్ని రకాల ప్రోగ్రామ్‌లను జోడిస్తే, వాటిని ఎవరు చూస్తున్నారనే విషయాన్ని పనిగట్టేయవచ్చునట. అదీ విషయం! వినడానికి కాస్త గందరగోళంగా ఉన్నా... మనం అంతర్జాలంలో చేసే ప్రతి పనినీ ఎవరో ఒకరు అధికారికంగానో, అనధికారికంగానో గమనించేసే అవకాశం ఉందని చెప్పడం ఈ పరిశోధన లక్ష్యం! కాబట్టి వ్యక్తిగతం అనుకున్న ఫోన్‌నెంబర్ల వంటి వివరాలను, ఫొటోలను మన సామాజిక మాధ్యమాలలో ఉంచకపోవడమే మేలు.   - నిర్జర.
అది హిమాలయ పర్వతాల కింద ఓ చిన్న పట్నం. ఆ పట్నంలోకి ఓ సెలయేరు ప్రవహిస్తూ ఉండేది. పర్వతాల నుంచి ప్రవహించే ఆ సెలయేరుతో పట్నం అద్భుతంగా తోచేది. ఆ సెలయేరుని మరింత అందంగా తీర్చిదిద్దడం ఎలా అన్న ఆలోచన వచ్చింది ఊరిపెద్దలకి. ‘ఏముంది సెలయేరులోకి పై నుంచి ఎలాంటి చెత్తా చెదారం వచ్చి చేరకుండా ఎవరినన్నా నియమిస్తే సరి!’ అని సూచించాడు ఓ యువకుడు. ఆ సలహా మిగతా ఊరిపెద్దలకు నచ్చడంతో వెంటనే ఓ కుర్రవాడని నియమించారు. ఆ సెలయేటిలోకి చేరుతున్న ఎండుటాకులు, పుల్లముక్కలనీ శుభ్రం చేస్తూ ఉండటమే ఆ కుర్రవాడికి పని!   ఏళ్లు గడిచేకొద్దీ ఆ సెలయేరు మరింత అందంగా రూపొందింది. ఆ సెలయేటిలో మునకలు వేసేందుకు ఎక్కడి నుంచో హంసలు వస్తుండేవి. ఆ సెలయేటి చెంతనే గాలిమరలు ఏర్పాటయ్యాయి. వీటన్నింటినీ చూడ్డానికి వెలాదిగా యాత్రికులు రావడం మొదలుపెట్టారు. ఓ ముప్ఫై ఏళ్లకి ఆ పట్నం ప్రముఖ పర్యటకక్షేత్రంగా మారిపోయింది. ఒక రోజు ఊరిపెద్దలంతా సమావేశమయ్యారు. ఆ ఏడాది ఊరి కోసం చేసిన ఉమ్మడి ఖర్చులను పరిశీలిస్తుండగా వారికి సెలయేటిని శుభ్రం చేసేందుకు చెల్లిస్తున్న లెక్కలు కనిపించాయి. ‘శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో చెత్త ఏముంటుంది. దీని కోసం ఒక మనిషిని నియమించడం ఏమిటి? జీతం పేరుతో డబ్బులు దండగ చేయడం దేనికి!’ అంటూ ఓ ఊరిపెద్ద మండిపడ్డాడు. అతనితో పాటు మిగతా ఊరిపెద్దలు కూడా అంతా కుర్రకారే! వారంతా కలిసి ఆ ‘చెత్త’ మనిషిని ఉద్యోగంలోంచి తొలగించాలని నిర్ణయించారు.   ఊరిపెద్దలు తీసుకున్న నిర్ణయం వల్ల మొదట్లో పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ నిదానంగా ఆకురాలు కాలం మొదలైంది. కొండ మీదనున్న చెట్ల ఆకులన్నీ సెలయేటిలో కలవసాగాయి. ఎండిన కొమ్మలు విరిగి నీటి ప్రవాహాన్ని అడ్డుకోసాగాయి. వాటితో తెల్లటి నీరు కాస్తా పసుపుపచ్చగా మారింది. మరికొన్నాళ్లకి ఆ పసుపుపచ్చ నీరు కాస్తా మురికిపట్టి నాచుతో ఆకుపచ్చరంగులోకి జారింది. ఇంకొన్నాళ్లకి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయి, చెత్త పేరుకుపోయి తెల్లటి సెలయేరు కాస్తా నల్లటి బురదగా మారింది. నీటి ప్రవాహం లేకపోవడంతో గాలిమరలు నిలిచిపోయాయి. ఎటుచూసినా దుర్గంధంతో పట్నంలోని జనాలకు నానారోగాలూ వ్యాపించసాగాయి. ఆ పట్నంలోకి అడుగుపెట్టేందుకే పర్యటకులు భయపడిపోయారు. ఇక హంసల సంగతి సరేసరి!   ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు ఊరిపెద్దలంతా సమావేశమయ్యారు. ఆ సమావేశంలోకి ఒక కొత్త మనిషి కూడా అడుగుపెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా అతన్ని చూస్తుండగా ‘మీలో చాలామంది నన్ను చూసి ఉండరు. ఓ ముప్ఫై ఏళ్ల నుంచి నేను ఈ సెలయేటిని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ పట్నంలోకి చేరుకునే సెలయేటి దారిలో ప్రయాణిస్తూ అందులోకి చేరే చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాను. నేను చేస్తున్న పని అద్భుతమో కాదో నాకు తెలియదు. కానీ ఆ పని వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉందని మాత్రం నాకు తెలుసు. ఈ పట్నం నన్ను గుర్తించకపోయినా, నా శ్రమని ఎవరూ గౌరవించకపోయినా నా పనిని నేను నిశ్శబ్దంగా చేసుకుపోయాను. నా చిన్న పని వల్ల అప్పటికప్పుడు ఫలితం కనిపించకపోవచ్చు. కానీ నాది వృధా ప్రయాస కాదు. ఆ విషయం ఈపాటికే మీరు అర్థమై ఉంటుంది,’ అంటూ ముగించాడు.   అతని మాటలు విన్న ఊరిపెద్దలకి తమ తప్పేమిటో అర్థమైంది. పట్నం క్షేమంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి అవసరమూ ఎంతటిదో తెలిసివచ్చింది. వెంటనే అతడిని క్షమాపణ కోరి మళ్లీ ఉద్యోగంలో నియమించారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.