LATEST NEWS
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి చేవెళ్ల కోర్టు బుధవారం (ఏప్రిల్ 23) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఘోరీ తరఫు లాయర్ చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీది చీటింగ్ కేసు కావడంతో.. కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పలేమన్నారు. బెయిల్ ఎప్పుడు వస్తుందో  కూడా చెప్పలే మన్నారు. చీటింగ్ కేసు రుజువైతే అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీ తరఫున వాదించిన న్యాయవాదే అహోరికి శిక్షపడే అవకాశం ఉందనడం ఆసక్తిగా మారింది.    ఇలా ఉండగా కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి పోలీసులు బుధవారం (ఏప్రిల్ 23) లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.  అఘోరీకి పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించారు. కానీ జైలు అధికారులు లింగ నిర్ధారణ కాకుండా జైలులో ఉంచుకోలేమని తేల్చి చెప్పడంతో పోలీసులు అఘోరీని తిరిగి కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో కోర్టు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్షకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్స చేయించారు.   
అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.   వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.  ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు.  విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధకారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనీల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కొన్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తనను తాను కాపాడుకోవడం ఎలాగో తెలియక అనిల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో స్థాయి మరిచి.. ఇష్టారీతిగా తెలుగుదేశం, జనసేన అధినాయకులపై అనిల్ కుమార్ చేసిన అనుచిత విమర్శలు, వ్యాఖ్యల కారణంగా ఆ రెండు పార్టీలలోనూ అవకాశం లేకపోయింది. దీంతో అనివార్యంగా ఆయన ఇటు వైసీపీకి దూరమై, అటు మరో పార్టీ అండ లేకుంటే కేసులను తట్టుకోవడం సాధ్యం కాదని భావించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ జగన్ పంచన చేరి పబ్బం గడుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా నిన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడాన్ని చూపుతున్నారు. మొత్తం మీద అజ్ణానం నుంచి అజ్ణాతంలోకి అక్కడ నుంచి మళ్లీ జగన్ పంచకు చేరిన అనిల్ కుమార్ ప్రస్తతం తన భవిష్యత్ ఏమిటన్న అయోమయంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. 
  జగన్ మీడియా అసత్య కథనాలపై దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఏలూరు జిల్లా మీడియా కార్యాలయంలో వద్ద  నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి  ఆఫీస్‌ ముందు టెంట్ వేసుకోని నిరసన వ్యక్తం చేశారు.  రక్త తర్పణం’ అంటూ బ్లూ మీడియా ప్రచురించింది.  వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా రాస్తారంటూ  రిపోర్టర్‌పై చింతమనేని ఫైర్‌య్యారు. సదరు వ్యక్తి  బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.   తనపై తప్పుడు వార్తలు రాసినందుకు నిలదీయడానికి మాత్రమే వచ్చానని చింతమనేని వివరణ ఇచ్చారు. వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని, తనకి సంబంధం లేకపోయినా తన పేరుని అందులో చేర్చారని చింతమనేని వాపోయారు. ఈ  విషయం తెలుసుకోవటాని తాను  ఆఫీస్ కి వచ్చాని ఆయన అన్నారు. అంతేకానీ తాను అక్కడ ఎలాంటి గొడవ చేయలేదని చింతమనేని క్లారీటీ ఇచ్చారు  
బోరుగడ్డ అనిల్   అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని  మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు.  ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు. చర్చి స్థలం విషయంలో అనంతపురం మూడో పట్టణ సీఐను బెదరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను అనంతపురం తీసుకువచ్చారు. ఈ కేసు విచారించిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు సమయం పెద్దగా లేకపోవడంతో ఆయన తిరిగి రాజమహేంద్రవరం తరలించకుండా అనంతపురంలోనే రిటైన్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బూరగడ్డ అనిల్   ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసినలో రాజమహేందరవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే 2018లో బోరుగడ్డ సీఐని బెదరించిన కేసులో అరెస్టై బెయిలు పొంది విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచీ విచారణకు డుమ్మా కొట్టడంతో అనంతపుం మొబైల్ కోర్టు బోరుగడ్డ అనిల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకువచ్చారు.  ఈ కేసు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా పడటంతో అంతవరకూ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా జైలులో రిటైన్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో బోరుగడ్డ అనిల్ అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.  ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ తనను తాను సమర్ధించుకుంటూ తాను బెయిలు కోసం ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు సమర్పించలేదని చెప్పుకున్నారు.  
  జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.  ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ అమరులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీబీజేపీ చీఫ్  కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు.  పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని, ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాక్ నిప్పులు పోస్తోందని మండిపడ్డారు. భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనన్నారు.ఉగ్రదాడి బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామన్నారు. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. అన్ని మండలాల్లో బస్తిల్లో ప్రజలు నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కె.లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి పాల్గోన్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam)లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందన్న వార్తల నేపథ్యంలో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ కి చెందిన నటీనటులు భాగమైన సినిమాలను ఇండియాలో బ్యాన్ చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి.   పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన హిందీ చిత్రం 'అబిర్ గులాల్' మే 9న విడుదల కావాల్సి ఉండగా, దీనిని బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు పిలుపునిస్తున్నారు. అంతేకాదు, ఈ బ్యాన్ ప్రభావం ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ఫౌజి'ని కూడా తాకేలా ఉంది.   ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఫౌజి'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో ఇమాన్వీ ఇస్మాయిల్ (Imanvi Ismail) హీరోయిన్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన ఈమె.. ఏకంగా ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీని 'ఫౌజి' చిత్రం నుంచి తొలగించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.   ఇమాన్వీ కుటుంబం పాకిస్తాన్ లోని కరాచీకి చెందినది. అంతేకాదు, ఆమె తండ్రి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ పాకిస్తాన్ సైనిక అధికారి. ఇదే ఇప్పుడు భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. ఇమాన్వీని 'ఫౌజి' నుంచి హీరోయిన్ గా తొలగించాలని పలువురు కోరుతున్నారు. లేదంటే సినిమాని బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదంపై 'ఫౌజి' టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  
Prabhas is one of the biggest stars of Indian Cinema and he never faced any sort of "Boycott" or "Ban" troubles for his films. Either they get delayed due to post production works or shooting delays. Now, his next film, reportedly, titled as "Fauji" directed by Hanu Raghavapudi is landing in huge trouble.  The movie stars Iman Esmail, a.k.a Imanvi, in the leading role and she hails from Pakistani family. Her family settled in California and she moved to Delhi, following her ambition to become an actor. But the Pahalgam attacks have brought out the dormant anger in several Indians against Pakistanis.  So, several people are calling for destroying Pakistan and their terriorist organisations in totality. Some are publicly expressing their hatred towards one community and this is all going to land this big budget love story into trouble. Even the story follows an Indian soldier falling in love with a Pakistani lady, it seems.  Hanu Raghavapudi would be wishing for this anger to calm down for his film to work on a big scale. Producers Mythri Movie Makers will also be hoping that this factor won't rupture their film's business at all. But looking at current emotional state of Indians, many would call for Boycotting and Banning Pakistani artists, again.  Even though Imanvi has shifted to Delhi, her family ties in Karachi and her father's Pakistani General career could effect her big break into film industry for sure. Let's wait and see, how Prabhas, "Fauji" crew will handle this issue.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హిట్-3'. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'హిట్-3'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీస్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసింది. (Hit 3)   'హిట్-3' మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ.13 కోట్లు, ఆంధ్రాలో రూ.15 కోట్లు, సీడెడ్ లో రూ.5.40 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ.33.40 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో రూ.10 కోట్ల బిజినెస్ జరగగా, కర్ణాటక(రూ.3 కోట్లు), రెస్టాఫ్ ఇండియా కలిపి దాదాపు రూ.6 కోట్లు జరిగినట్లు సమాచారం. అంటే ప్రపంచవ్యాప్తంగా రూ.49.40 కోట్ల బిజినెస్ చేసిందన్నమాట. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.50 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.    దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నాని నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో మునుపెన్నడూ లేనంత వయలెంట్ గా కనిపిస్తున్నాడు. మరి మొదటిసారి పూర్తి వయలెంట్ గా మారిపోయిన నాని.. హిట్-3 తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.  
Santhanam became a huge comedian after Vadivelu got into political crossfire and lost his market. But Santhanam started trying his luck as lead actor like Sunil. With big void in comedy space, many Tamil producers have been hoping for Santhanam to change his stance and return of huge star like Vadivelu.  Vadivelu is at the level of Brahmanandam in Tamil Cinema as a legend who is popular with memes and others. But the star comedian could not spark a huge comeback till date even though he appeared in several films, off late. He even showcased his serious acting skills in Maamannan.  While, many offered him similar serious roles, Vadivelu is more focused on being a comedian. Sundar C, the director, who is known for his comic capers has been able to revive comedian Santhanam's demand with his long awaited Madha Gaja Raja, this year. The movie took 12 years to release and Santhanam's comedy became highlight of it.  So, the reports suggest that Santhanam is planning to make a comeback as comedian once his current projects as lead actor are over. Now, Vadivelu and Sundar C combination is back with Gangers. The movie is releasing on 25th April and many are anticipating a big comeback from the legend.  We have to wait and see, if Sundar C's commercial formula does weave magic again for Vadivelu, as well, in the same year. The movie is projected as biggest reunion of comedy legends and let's hope that would be the case. 
  సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu), సంజోశ్(Sanjosh) హీరోలుగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సోదరా'(Sodara). ఈ నెల 25 న విడుదల కాబోతున్న ఈ మూవీని కాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పై చంద్ర నిర్మించాడు. ప్రచి బన్సాల్(Prachi Bansal), ఆర్తి గుప్తా(Aarti Gupta) హీరోయిన్స్ గా చేస్తుండగా బాబుమోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.   రిలీజ్ ని పురస్కరించుకొని మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆర్తిగుప్తా.. 'సోదరా'కి సంబంధించిన విషయాలతో పాటు కొన్ని పర్సనల్ విషయాలని కూడా పంచుకుంది. "మూవీలో అమాయకపు పల్లెటూరి అమ్మాయి క్యారక్టర్ లో కనిపించాను. బాగా చదువుకున్నా కూడా చాలా సింపుల్ గా ఉండటంతో పాటు మంచి లవ్ ట్రాక్ కూడా  ఉంది. అయితే అన్నదమ్ముళ్లలో ఎవరితో ప్రేమలో పడతానో మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. నేను పుట్టి పెరిగిందంతా చండీగఢ్. అయినా సరే ముంబైలో స్థిరపడ్డాను. తెలుగు ఇండస్ట్రీలో స్థిర పడాలనే లక్ష్యంతో తెలుగు నేర్చుకుంటున్నాను. అన్ని తరహా పాత్రలు చేసి ప్రేక్షకుల్లో మంచి నటి అనే పేరు తెచ్చుకోవాలనేదే నా లక్ష్యం. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అలియా భట్ నటన నాకు స్ఫూర్తి" అని చెప్పుకొచ్చింది. 
  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలకు తెలుగు నాట ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొన్నేళ్లుగా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమాల స్పీడ్ తగ్గింది. పైగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా కావడంతో.. కొత్త సినిమాలు అంగీకరించడం మాట అటుంచితే, గతంలో కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడానికే చాలా సమయం పడుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా.. గతంలో అంగీకరించిన సినిమాలు విడుదలైనా చాలని ఎదురుచూస్తున్నారు.    ప్రస్తుతం పవన్  చేతిలో 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఉన్నాయి. 'హరి హర వీరమల్లు' షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ మరో నాలుగైదు రోజులు డేట్స్ కేటాయిస్తే సరిపోతుందని సమాచారం. నిజానికి ఈ నెల మొదట్లో పవన్ షూట్ లో పాల్గొనాలని భావించారు. కానీ, ఆయన తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడటంతో డేట్స్ కేటాయించలేకపోయారు. దీంతో మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమాని మరోసారి వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరమల్లు ఇప్పటికే అటుఇటుగా పదిసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి కొత్త డేట్ ని వెతికే పనిలో చిత్ర బృందం ఉంది. త్వరలో వీరమల్లు బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తానని పవన్ మాట ఇచ్చారట. మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో సినిమాని విడుదల చేయాలని మూవీ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది.   'ఓజీ' షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. జూన్, జూలైలో డేట్స్ కేటాయించి దీనిని కూడా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'ఓజీ' సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది అంటున్నారు. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే.. 'వీరమల్లు', 'ఓజీ'తో పోలిస్తే.. షూటింగ్ చాలా తక్కువగా జరిగింది. దీంతో అసలు 'ఉస్తాద్' ఉంటుందా లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో కూడా ఉన్నాయి. కానీ, పవన్ మాత్రం జూలై తర్వాత డేట్స్ ఇస్తానని నిర్మాతలకు చెప్పినట్లు వినికిడి. 'ఉస్తాద్' సంగతేమో కానీ.. న్యూస్ వినిపిస్తున్నట్టుగా మే లేదా జూన్ లో 'వీరమల్లు', సెప్టెంబర్ 'ఓజీ' విడుదలైతే మాత్రం పవన్ అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవు.  
జమ్మూకాశ్మీర్ లోని 'పహల్ గామ్'(Pahalgam)లో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా జరిపిన దాడిలో, అక్కడి ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి వెళ్లిన  టూరిస్టులు కొంత మంది చనిపోవడంతో పాటు, మరికొంత మంది గాయపడ్డారు. ఊహించని ఈ   సంఘటన ప్రతి ఒక్క భారతీయుడిని  ఎంతగానో కలచివేస్తుంది. ప్రముఖ నటి దీపికా కాకర్(Dipika Kakar)ఆమె భర్త షోయబ్(Shoaid Ibrahim)ఇటీవల కాశ్మీర్ వెళ్లారు. అక్కడ అందమైన లొకేషన్స్ లో దిగిన కొన్ని ఫోటోలని ఆదివారం ఇనిస్టాగ్రమ్ లో పంచుకున్నారు. దీంతో నిన్న 'పహల్ గామ్' దాడి జరగడంతో వాళ్లిద్దరు ఎలా ఉన్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ చేసారు. దీంతో అభిమానుల మెసేజెస్ కి దీపికా, షోయబ్ లు రిప్లై ఇస్తు 'మేము క్షేమంగానే ఉన్నాం. మంగళవారం ఉదయమే కాశ్మీర్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నాం. ఎవరు ఆందోళన పడకండని చెప్పుకొచ్చారు. అయితే షోయబ్ మరో పోస్ట్ లో 'కాశ్మీర్ పర్యటనపై వ్లాగ్ చేసాం. అది త్వరలోనే విడుదల చేస్తామని పోస్ట్ చేసాడు. దీంతో దేశం మొత్తం కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిపై భాదపడుతుంటే  ఇప్పుడు వ్లాగ్ ప్రచారం చేసుకుంటున్నారా అంటు పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీపికా కాకర్ హిందీ టెలివిజన్ రంగంలో ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో క్యామియో రోల్స్ లో కూడా కనిపించిన దీపికా 2015 లో మొదటి భర్త రౌనక్ సాంసన్ కి విడాకులు ఇచ్చి 2018 లో షోయబ్ ని పెళ్లి చేసుకుంది.  
Shah Rukh Khan, Salman Khan and Aamir Khan, the three biggest stars of Indian Cinema have faced several indifferent campaigns like Boycotting their films in recent years. The three big Khans started staying away from media about International and Indian political events.  Aamir Khan did come out in open against the growing intolerance few years ago and due to the kind of opposition he saw, he started maintaining silence on political issues. Now, his production house tweeted about Andaz Apna Apna re-release as recently as yesterday. But he remained silent about Pahalgam attacks.  Salman Khan has been facing issues with middling films and they have become huge disasters. The actor has taken to X, to post his workout images stating that he is looking to comeback into the shape. But he did not respond on Pahalgam Attacks.    Shah Rukh Khan has also been silent on Pahalgam attacks. The actor has been cornered several times and even his films like Pathaan got boycott slogans. His old interviews about intolerance have been brought to light to insight such hate against him as well.    Looks like it all has made them go silent on every political thing. But them choosing to stay silent even on Pahalgam Attacks has been resulting in new rage of trolls on social media against them. The Khans have been trying to avoid any sort of problems or issues against them and their films but this is too much for their image.  Maybe the actors could come out and react to this situation but their silence is definitely damaging them and their image further.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా 'పహల్ గామ్'(Pahalgam)లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది టూరిస్టులు చనిపోవడంతో పాటు ఇరవై మంది దాకా గాయపడ్డారు. దీంతో ఈ సంఘటనపై చిత్ర పరిశమ్రకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఉగ్రవాద దాడిని ఖండిస్తు మృతుల కుటుంబాలకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది.  విజయ్ దేవరకొండ(VIjay Deverakonda)కూడా ఈ విషయంపై ట్వీట్ చేస్తు' ఉగ్రవాద దాడి చాలా భాదాకరమైనది. రెండు సంవత్సరాల క్రితం ఒక  మూవీ షూటింగ్ కోసం 'పహల్ గామ్' వెళ్లిన నేను,  అక్కడి ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా పుట్టిన రోజు వేడుకని 'పహల్ గామ్' లోనే జరుపుకున్నాను. స్థానికంగా ఉండే కాశ్మిరీ స్నేహితులు నన్ను బాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు  ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనతో నా హృదయం పగిలిపోయింది. సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరపడం సిగ్గు చేటు. ఇలాంటి పిరికి వాళ్ళని త్వరలోనే మన సైన్యం అంతమొందిస్తుందని ఆశిస్తున్నా. భారత దేశం ఉగ్రవాదానికీ ఎప్పటికి తల వంచదు. బాధిత కుటుంబాలకి అండగా నిలుస్తామంటు ట్వీట్ చేసాడు.  సినిమాల పరంగా చూసుకుంటే విజయదేవరకొండ ప్రస్తుతం 'కింగ్ డమ్'(Kingdom)అనే మూవీ చేస్తున్నాడు. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటుండగా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
Telugu Cinema big stars have been active and vocal in the face of calamities and natural disasters to extend their help and support. In Pahalgam terrorist attack, 28 innocent Indian lives have been lost to terriorists inhumane attack.   The most disturbing accept of the attacks is that the terrorists attacked on religious basis sparking major religious disparity in the country. At this moment, TFI actors have come forward to express their deep shock and condolences while asking Indian government to attack against terrorism, swiftly. Here are the reactions from various celebrities:  Chiranjeevi "The ghastly attack killing 26 innocent people and tourists in Pahalgam, Jammu & Kashmir is horrifying and heartbreaking. It is an unpardonable act of cruelty. My heart goes out to the families of those killed. Nothing can undo the loss they suffered. My condolences and prayers for them."    Akkineni Nagarjuna  "Deeply saddened by the horrific terror attack in Pahalgam, Jammu & Kashmir. My heartfelt condolences to the families who’ve lost their loved ones. Praying for strength, healing, and peace for all those affected. Grateful to Hon’ble PM @narendramodi ji for the swift response and support."     Pawan Kalyan (Deputy CM of Andhra Pradesh) "The horrific Pahalgam attack has deeply shaken us. My heart goes out to the bereaved families. As a mark of respect & solidarity, JanaSena will observe 3 days for mourning across the Telugu States. Our party flag will fly at half-mast. In this dark hour, we remain resolute; Our Bharat's unity cannot be broken by terror. I have full faith that our leadership will respond with strength and purpose to ensure justice prevails and such atrocities never occur again. Together, we will overcome. Together, we will heal. "   Mahesh Babu "A dark day… Deeply saddened by the attack in #Pahalgam. Hope we find the strength to stand together against such cruelty.. My thoughts and prayers are with the families during this difficult time…."   NTR "Heart goes out to the victims of the #Pahalgam attack. My thoughts are with their families. Praying for peace and justice." Allu Arjun "Soo heart broken by #Pahalgam Attack . Such a beautiful place with kind hearted people . Condolences to all the families, near and dear of the victims. May their innocent souls rest in peace . Truly Heart breaking."     Nani "Three months back we were there. Over 200 people team for almost 20 days. Pahalgam was like a dream. The place, the people and the warmth. Heart broken and speechless. Why?"   Vijay Deverakonda "I celebrated my birthday 2 years ago in Pahalgam, amidst shooting a film, amidst laughter, amidst my local Kashmiri friends who took the greatest care of us.. What happened yesterday is heartbreaking and infuriating - calling yourself a Force and shooting tourists is the most shameful embarrassing and cowardly act of dumb terrorism hiding behind guns. We stand with the victims and their families. We stand with Kashmir. And i hope these cowards are cleaned out. Swiftly. India will never bow to terror." Nikhil  "Heartbreaking to see the Inhuman Attack in Pahalgam... 28 Innocent Tourists were Killed today and many more Injured... Hope God gives strength to the Families of the Victims and Justice is Served to them." 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రాచీన భారతీయ పండితుడు చాణక్యుడు రాసిన చాణక్య నీతి జీవితంలోని ప్రతి అంశాన్ని సరైన దృక్కోణం నుండి చూడటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. జీవితంలోని వివిధ అంశాలను వివరించడానికి ఇది అనేక ముఖ్యమైన,  ఉపయోగకరమైన విషయాలను కలిగి ఉంది. జీవితంలో కొంతమంది నమ్మదగినవారు కారు.  ఇలాంటి వారితో స్నేహం చేయకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతారు.  చాణక్యుడి ప్రకారం కొందరు  వ్యక్తులు మోసం చేయడానికి మాత్రమే చూస్తుంటారు.   అలాంటి  వారితో స్నేహం చేయడం వల్ల మానసిక,  భావోద్వేగ హాని  కలుగుతుంది.  కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ స్నేహానికి విలువైనవారు కారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఆ 5 రకాల వ్యక్తులు ఎవరో తెలుసకుంటే.. అబద్ధం చెప్పే వారు.. చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ అబద్ధం చెప్పే వారితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. అబద్ధం చెప్పే వ్యక్తితో ఏ సంబంధంలోనూ స్థిరత్వం ఉండదు. అలాంటి వారు తమ స్వలాభం కోసమే అబద్ధాలు చెబుతారు.  సమయం వచ్చినప్పుడు మోసం కూడా చేయగలరు. మాట మీద నిలబడని వారు..   ఎటువంటి స్థిరమైన ఆలోచనలు లేనివారు,  తమ మాటల మీద నిలబడని వారు ఎప్పటికీ నమ్మదగినవారు కారు. ఒక వ్యక్తి  మాటలు చెప్పి  పదే పదే వెనక్కి తగ్గినప్పుడు,  ఆ మాటలకు తగినట్టు ఉండనప్పుడు  అతని ఉద్దేశాలు ప్రశ్నార్థకంగా మారతాయి. చాణక్యుడి ప్రకారం అలాంటి వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ సంబంధాన్ని అయినా మార్చుకోవచ్చు,  వారి సహవాసం ఎప్పుడైనా ఏ  వ్యక్తికి ద్రోహం చేయవచ్చు. స్వార్థపరులు.. స్వార్థపరులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు . అలాంటి వ్యక్తులు తమ సొంత శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచిస్తారు.  ఇతరుల భావాలను గౌరవించరు. వారు సంబంధాలలో తమ సొంత ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు,  వారి పని పూర్తయిన తర్వాత వారు ఇతరులను వదిలివేస్తారు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరు. వీరు మోసం చేయడంలో నిపుణులు. అలాంటి వారితో స్నేహం చేయడం మానుకోవాలి. అసూయపడేవారు.. మీ విజయాన్ని చూడలేని కొంతమంది మిమ్మల్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. చాణక్యుడి ప్రకారం అలాంటి వ్యక్తులు ఎప్పటికీ మీకు మంచి స్నేహితులు కాలేరు. ఈ వ్యక్తులు మీ విజయం చూసి అసూయపడతారు,  వారికి అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని కిందకు దించడానికి ప్రయత్నిస్తారు. వారితో స్నేహం చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం బలహీనపడి, మీ విజయ మార్గంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాంటి వ్యక్తులు మీ వైఫల్యాన్ని మాత్రమే కోరుకుంటారు. కాబట్టి వారికి దూరంగా ఉండటం మంచిది. ప్రాముఖ్యత ఇవ్వని వారు.. మిమ్మల్ని అభినందించని,  ఎల్లప్పుడూ మిమ్మల్ని విస్మరించే వారు ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండలేరు. చాణక్యుడి ప్రకారం జీవితంలో మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, మీ సహకారాన్ని అంచనా వేసే వ్యక్తులతో మీరు స్నేహం చేయాలి. మీరు ఎల్లప్పుడూ మీ కృషి, ప్రేమ,  అంకితభావాన్ని చూపించే వ్యక్తులు కానీ వారు మిమ్మల్ని ఎప్పుడూ విలువైనదిగా భావించరు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడమే కాకుండా మీ సమయాన్ని, శక్తిని కూడా వృధా చేయగలరు.                               *రూపశ్రీ.
  పిల్లలకు ఒక వయసు రాగానే పుస్తకాలతో సావాసం మొదలవుతుంది. చాలా వరకు పిల్లల జీవితంలో పుస్తకాలు అంటే అవి పాఠ్యపుస్తకాలే ఎక్కువగా ఉంటాయి.  పిల్లలు ఎంత ఎక్కువ తరగతి పుస్తకాలు చదువుతూ ఉంటే తల్లిదండ్రులకు అంత తృప్తి.  వారు చదువులో బాగా రాణిస్తారని తల్లిదండ్రుల ఆశ.  అయితే పిల్లల జీవితం చదువులోనే కాకుండా విలువలు, వ్యక్తిత్వం,  మంచి అలవాట్లు,  గొప్ప గుణాలు వంటివి మాత్రం  పుస్తక పఠనం ద్వారానే సాధ్యమవుతుంది.  పుస్తక పఠనం అంటే పాఠ్య పుస్తకాలు చదవడం కాదు.  పిల్లలలో ఆలోచనలు కలిగించే, స్పూర్తిని కలిగించే,  ప్రేరణ కలిగించే విషయాలు కలిగిన పుస్తకాలు చదవడం.  గొప్ప వ్యక్తుల చరిత్రలు కావచ్చు, నీతి కథలు కావచ్చు, సామాజిక విషయాలకు సంబంధించినవి కావచ్చు.  ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ సందర్భంగా పుస్తక పఠనం గురించి,  ఈ పుస్తక దినోత్సవం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే.. ఏప్రిల్ 23న  విలియం షేక్స్పియర్,  మిగ్యుల్ డి సెర్వంటెస్ వంటి గొప్ప సాహిత్యవేత్తలు మరణించారు. ఈ సాహిత్యవేత్తలకు  నివాళిగా ఈ తేదీని ప్రపంచవ్యాప్తంగా పుస్తక దినోత్సవంగా జరుపుకుంటారు. పుస్తకాలను చదవడం, ప్రచురించడం,  మేధో సంపత్తి రక్షణను ప్రోత్సహించడానికి యునెస్కో దీనిని వార్షిక వేడుకగా ప్రకటించింది. థీమ్.. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది పుస్తక దినోత్సవం సందర్భంగా థీమ్ ఏర్పాటయింది. "మీ మార్గాన్ని చదవండి: ప్రతి మనసుకు విభిన్న పుస్తకాలు" అనే థీమ్ ఈ ఏడాది ప్రవేశపెట్టారు.  ఈ థీమ్ చదవడాన్ని మొదలుపెట్టడాన్ని,  చదవడంలో వైవిధ్య ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది పాఠకులను సాహిత్యం ద్వారా విభిన్న విషయాలు, దృక్పథాలు,  సంస్కృతులను అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది, సహానుభూతి,  ప్రపంచ అవగాహనను ప్రోత్సహిస్తుంది. చరిత్ర.. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని UNESCO 1995లో స్థాపించింది. ఈ ఆలోచన స్పానిష్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్ నుండి వచ్చింది. ఆయన రచయిత మిగ్యుల్ డి సెర్వంటెస్‌ను సత్కరించాలని కోరుకున్నారు. 1995 నుండి ప్రపంచ పుస్తక దినోత్సవం పాఠశాలలు, గ్రంథాలయాలు, రచయితలు,  ప్రచురణకర్తలు పాల్గొనే ఒక ప్రధాన ప్రపంచ కార్యక్రమంగా పరిణామం చెందింది. ఇది చదవడంలో ఆనందాన్ని వ్యాప్తి చేస్తుంది. UK,  ఐర్లాండ్ వంటి కొన్ని దేశాలలో, దీనిని మార్చిలో జరుపుకుంటారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23 న జరుపుకుంటారు. పుస్తకాలు చదివితే.. అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది..  పిల్లలు,  పెద్దలు పుస్తకాలు చదివితే అక్షరాస్యత స్థాయిలను పెంచేలా ప్రోత్సహిస్తుంది. ప్రచురణకు మద్దతు ఇస్తుంది..  ప్రపంచవ్యాప్తంగా రచయితలు, చిత్రకారులు,  ప్రచురణకర్తలు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. వారిని ప్రోత్సహిస్తుంది. ఊహాశక్తిని పెంపొందిస్తుంది..   చదవడం సృజనాత్మకత, పదజాలం,  విమర్శనాత్మక ఆలోచనను పెంచుతుంది. సంస్కృతులకు వారధిగా నిలుస్తాయి.. పుస్తకాలు విభిన్న నేపథ్యాలు,  అనుభవాల నుండి వచ్చిన వ్యక్తులను కలుపుతాయి. మార్పును ప్రేరేపిస్తుంది.. సాహిత్యం వ్యక్తిగత,  సామాజిక పరివర్తనను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది.                                         *రూపశ్రీ.
  విజయం అంత సులువుగా ఎవరినీ వరించదు. జీవితంలో సక్సెస్ సాధించడం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా వరకు సొంతంగా ఎదిగి లక్షాధికారులు,  కోటిశ్వరులు అయిన వారి జీవితాలను పరిశీలిస్తే వారు సమయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ పర్సన్స్ ను ఇతరుల కంటే భిన్నంగా ఉంచేది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుణమే..  ఇంతకీ సక్సెస్ ఫుల్ పర్సన్స్ ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించుకుంటారంటే.. సక్సెస్ ఫుల్ పర్సన్స్ తమకు లభించే ఖాళీ సమయాన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం ఎంచుకుంటారు.  స్నేహితులు,  కుటుంబ సభ్యులు,  ఆత్మీయులతో మాట్లాడటం చర్చలు చేయడం,  ఆలోచనాత్మకంగా మాట్లాడటం ద్వారా సక్సెస్ ఫుల్ పర్సన్స్ కొత్త ఆలోచనలకు, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీని వల్ల వారు ఎదుగుతూనే ఉంటారు. పుస్తకాలు చదవడం,  కొత్త విషయాల గురించి అణ్వేషించడం, అధ్యయనం చేయడం,  తమకు ఉన్న ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించడం,  గొప్ప వ్యక్తుల మాటలు, ఇంటర్వ్యూలు చదవడం, చూడటం మొదలైనవి చేయడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. వాటిని అవసరమైన మెరకు తమ జీవితంలో వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. అయితే సక్సెస్ ఫుల్ పర్సన్స్ మాత్రం పెయింటింగ్,  సంగీతం,  గార్డెనింగ్, వంట వంటి వాటిని ఇష్టమైన అభిరుచులుగా మార్చుకుంటారు. వీటిలో సమయం గడుపుతారు.  ఇలా వారు గడిపే సమయంలో వారికి కొత్త ఆలోచనలు పుడతాయట.  మెరుగైన ప్రణాళికలకు బీజం పడుతుందట. ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో మంచి స్థాయికి వెళ్లినా దాన్ని అస్వాదించగలగరు. అందుకే యోగ,  జాగింగ్.  స్విమ్మింగ్ వంటి కార్యాచరణలతో పాటు జిమ్ చేయడం ఇంట్లోనే వ్యాయామం చేయడం వంటివి తమ రోజులో బాగం చేసుకుంటారు. కళల పట్ల ఆసక్తి ఉన్నవారు,  ఏదైనా కళలో ప్రవేశం ఉన్నవారి ఆలోచనలు చాలా మెరుగ్గా ఉంటాయి.  వీరి ఆలోచనా పరిధి విస్తృతంగా ఉంటుంది. సామాజిక విషయాల పట్ల ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.  సామాజిక కార్యకలాపాలలో భాగస్వాములు అవుతుంటారు. వ్యక్తి వేగంగా విజయం వైపు నడవడానికి ఇవి చాలా సహాయపడతాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలామంది అలవాటు.   ఇది చాలా మందికి కొత్త ఆలోచనలను,  కొత్త అనుభవాలను ఇస్తుంది.  ఈ అనుభవాల నుండి కొన్ని కార్యాచరణలు రూపుదిద్దుకుంటాయి.                                                   *రూపశ్రీ.
  ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను అందరూ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవి కాలంలో  తేలికైన ఆహారం తినడానికి ఇష్టపడతారు. పైగా పండ్లలో నీటి శాతం ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు అనేది ముఖ్యమైన విషయం.  అందువల్ల పండ్లు, పెరుగు, లస్సీ వంటి చల్లని పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే పండ్లైన పుచ్చకాయ,  కర్భూజ వంటి పండ్లకు చాలా  డిమాండ్ ఉంటుంది ఈ కాలంలో. కానీ కొంతమంది పండ్లు కొనేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఇంటికి వచ్చి పండు కోసిన తర్వాత, అది పచ్చిగా ఉందని,  రుచి తక్కువగా ఉందని,  తియ్యగా లేదని  నిరాశ పడుతుంటారు.  అయితే ఇలా జరగకుండా  కొనుగోలు చేసేటప్పుడే పండ్లు తియ్యగా ఉన్నాయని కేవలం చూడటంతోనే తెలుసుకునే టిప్స్ ఉన్నాయి.  దీనివల్ల తియ్యని పండ్లను కొని ఆస్వాదించవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. దానిమ్మ.. దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  పండ్లలో దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది.  దానిమ్మపండు కొంటుంటే మొదట దాని నోరు(దానిమ్మ పైన పువ్వు లాంటి ఆకారం) చూడాలి. అది తెరిచి ఉంటే దానిమ్మపండు తియ్యగా ఉంటుందని అర్థం. కానీ దాని నోరు మూసుకుని ఉంటే  అది తక్కువ తీపిగా ఉంటుందని అర్థం. పుచ్చకాయ.. కర్భూజ  లాగే, పుచ్చకాయ కూడా వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీరంలోని నీటి లోపాన్ని భర్తీ చేస్తుంది. కానీ పుచ్చకాయ కొనేటప్పుడు పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి . పుచ్చకాయకు చారలు ఉండి, అది పొడవుగా ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం. ఇది చారలు లేకుంటే  కొద్దిగా పచ్చిగా ఉండవచ్చు. నారింజ.. తీపి,  పుల్లని నారింజను కొనాలంటే దానిమ్మపండులా దాని ముఖాన్ని చూడాలి. దాన్ని లోపలికి నొక్కితే దాని రంగు ముదురు రంగులో ఉంటే అది తీపిగా, పుల్లగా ఉంటుందని అర్థం. అయితే లేత రంగు,  పెద్ద నోరు కలిగిన నారింజలు తక్కువ రుచిని కలిగి ఉంటుందట. డ్రాగన్ ఫ్రూట్.. మార్కెట్లో అధిక ధరకు అమ్ముడవుతున్న డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . కానీ  ఖరీదైన ఖరీదైన డ్రాగన్ ఫ్రూట్  కొనడంలో తప్పు చేస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు దాని ముఖాన్ని చూడండి. అది తాజాగా,  ఆకుపచ్చ ఆకులతో ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం. కానీ అది వాడిపోతే రుచి తక్కువగా ఉంటుందని అర్థం. బొప్పాయి.. చాలా మంది  తెలియకుండానే ఇంటికి పచ్చి బొప్పాయిని తెస్తారు. ఇది పండటానికి చాలా సమయం పడుతుంది.  వెంటనే దీన్ని  తినలేము.  తియ్యటి బొప్పాయి కొనాలనుకుంటే దాని రంగు చూడాలి. పూర్తిగా పసుపు రంగులో ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం . అయితే పచ్చి బొప్పాయి పచ్చిగా ఉంటుంది.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
చూయింగ్ గమ్ చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది.  ఏ సమయంలో అయినా సరే చూయింగ్ గమ్ ను అలా నములుతూ ఉంటారు.  దీని వల్ల దవడలకు మంచి వ్యాయామం లభిస్తుందని,  ముఖానికి కూడా వ్యాయామం లభిస్తుందని అంటుంటారు.  క్రీడాకారులు,  ఆటగాళ్లు, డాన్స్ చేసేవారు.. ఇలా చాలామంది చూయింగ్ గమ్ ను తమ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుని ఉంటారు. అయితే చూయింగ్ గమ్ తినే అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా అని పరిశోధనలు చేస్తే  చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చూయింగ్ గమ్ గురించి, చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే హాని  గురించి శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతిని కలిగించే  విషయాలు వెల్లడించారు.  వీటి గురించి తెలుసుకుంటే.. చూయింగ్ గమ్ పరిశోధనలో  సగటున ఒక గ్రాము చూయింగ్ గమ్‌కు వందల నుండి వేల వరకు మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని పరిశోధనలలో  కనుగొనబడింది.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సింథటిక్,  సహజ చూయింగ్ గమ్‌లలో ఒకే మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయట. అలాగే ఒకే రకమైన పాలిమర్లు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు చూయింగ్ గమ్ ద్వారా మాత్రమే కాకుండా అనేక ఇతర మార్గాల ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్‌లతో సంబంధంలో  ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో వివిధ పరిశోధనలలో మైక్రోప్లాస్టిక్ బయటపడటం తెలుస్తూనే ఉంది.  వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా,  పర్యావరణంలోకి ప్రవహించే పెయింట్ ముక్కలతో ఇవి సంభవిస్తున్నాయి.  ఇవి ఆరోగ్యం పై అనేక ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. శ్వాసకోశ, హృదయనాళ ప్రభావాలు.. వాతావరణంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉండటం వల్ల  శ్వాస ద్వారా మైక్రోప్లాస్టిక్‌లను సంపర్కం చేసుకోవచ్చని ఒక అధ్యయనం వెల్లడించింది. గాలిలో తక్కువ సాంద్రత కలిగిన మైక్రోప్లాస్టిక్‌లకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల వ్యక్తి యొక్క సున్నితత్వం,  కణ లక్షణాలను బట్టి శ్వాసకోశ,  హృదయ సంబంధ వ్యాధులు వస్తాయట. జీర్ణక్రియ,  రోగనిరోధక శక్తి.. మైక్రోప్లాస్టిక్‌లు మానవ శరీరంలోని జీర్ణ,  రోగనిరోధక వ్యవస్థలతో సహా వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయట. మైక్రోప్లాస్టిక్‌లు పేగు మైక్రోబయోమ్‌లో మార్పులకు కారణమవుతాయి. ఫలితంగా ప్రయోజనకరమైన,  హానికరమైన బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం,  ప్రేగు అలవాట్లలో మార్పులు వంటి వివిధ రకాల జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. పునరుత్పత్తి.. మైక్రోప్లాస్టిక్స్  పునరుత్పత్తిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది అనేక పునరుత్పత్తి లోపాలు, వంధ్యత్వం, గర్భస్రావం,  పుట్టుకతో వచ్చే వైకల్యాలకు కారణమవుతుంది.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నేటి బిజీ జీవితాలలో బ్రేక్ ఫాస్ట్ అంటే చాలా మంది ఆలోచలో పడిపోతారు.  ఉద్యోగాలకు వెళ్లేవారు పిల్లలను స్కూల్ కు పంపేవారు ఉదయాన్నే టిఫిన్,  మధ్యాహ్నానికి లంచ్ రెండూ తయారు చేయడం అంటే కాస్త కష్టమే.  పైగా తల్లి కూడా ఉద్యగస్తురాలు అయితే ఇక వంట చేయడం దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. చాలా మంది సులువైన పరిష్కారాల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వాటిలో బ్రెడ్ కూడా ఒకటి.  ఉదయాన్నే బ్రెడ్ కు కాస్త జామ్ రాస్ శాండ్విచ్ తయారు చేస్తే ఇంటిల్లిపాదీ ఈజీగా బ్రేక్పాస్ట్ చేసేయవచ్చు. అయితే ఇలా అల్పాహారంగా ప్రతి రోజూ బ్రెడ్ తీసుకోవడం ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలామంది ఆలోచన చేయరు. దీని గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటే.. బ్రెడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  ప్రిజర్వేటివ్‌లు శరీర జీవక్రియను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  శరీరంలో వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. కొంతమంది మద్యం తాగకపోయినా వారి శరీరంలో ఆల్కహాల్ ఏర్పడటం ప్రారంభమవుతుందట. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ABS) లేదా గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వైద్య పరిస్థితి. ఈ స్థితిల, ఒక వ్యక్తి కడుపు లేదా ప్రేగులలో ఉండే కొన్ని రకాల ఈస్ట్ (ఫంగస్) శరీరంలోకి తీసుకున్న కార్బోహైడ్రేట్‌లను  బ్రెడ్, బియ్యం లేదా స్వీట్లు వంటివి - కిణ్వ ప్రక్రియకు గురిచేసి ఆల్కహాల్‌గా మారుస్తాయి. ఫలితంగా ఒక వ్యక్తి మద్యం తాగకపోయినా, తలతిరగడం, అలసట,  గందరగోళం వంటి మత్తు లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే అది క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుందట. బ్రెడ్ వల్ల  సమస్య ఎందుకు? బ్రెడ్ తయారీలో ఉపయోగించే శుద్ధి చేసిన పిండి, ప్రిజర్వేటివ్స్,  అధిక సోడియం కంటెంట్ జీర్ణక్రియను బలహీనపరచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. బ్రెడ్ లో పోషకాలు లోపిస్తాయి, దీని కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు ఏమీ అందవు. ఎవరు తినకూడదు.. డయాబెటిస్, రక్తపోటు లేదా థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా బ్రెడ్ తినకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి, ఇది క్రమంగా  'స్లో పాయిజన్' లాగా పనిచేస్తుంది. బ్రెడ్ బదులు ఏం తినవచ్చంటే.. రోజువారీ బ్రెడ్ కు బదులుగా మల్టీగ్రెయిన్ రోటీ, ఓట్స్ ఉప్మా, క్వినోవా, శనగపిండి చీలా లేదా దోశ  లేదా ఇంట్లో తయారుచేసిన ఫ్రూట్ స్మూతీ వంటివి ఎంచుకోవచ్చు. అవి పోషకమైనవి మాత్రమే కాదు, సులభంగా జీర్ణమవుతాయి,  రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...