LATEST NEWS
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.  రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి గురువారం (ఏప్రిల్ 3) వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం పేర్కొంది. ఈ వర్షాల కారణంగా వాతావరణం చల్లబడు తుందనీ, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2, 3 తేదీల్లో వాన‌ల కార‌ణంగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డి గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 3 నుంచి 4 డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది.  ముఖ్యంగా   నిజామాబాద్‌, కామారెడ్డి, మెద‌క్, వికారాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌, వ‌న‌ప‌ర్తి, నిర్మ‌ల్‌, జోగులాంబ గ‌ద్వాల్   జిల్లాల్లో  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. భూముల వేలానికి నిర్ణయం తీసుకున్న సర్కార్ భారీ పోలీసు బందోబస్తు నడుమ  ఆ భూముల చదును కార్యక్రమాన్ని చేపట్టింది.  అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అక్కడ నుంచి పంపేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు దాదాపు 200 మంది విద్యార్థులను అదుపులోనికి తీసుకున్నారు. దీనిని బీజేపీ, బీఆర్ఎస్ లు కండించాయి. భూముల వేలం వేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,  ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే రేవంత్ సర్కార్ కూ పడుతందని హెచ్చరించారు.  హెచ్ యూసీకి ఆనుకుని ఉన్న ఈ భూములను గతంలో అంటే 2004లో అప్పటి ప్రభుత్వం  ఈ 400 ఎకరాల భూమిని క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం న్యూయార్క్ కు చెందిన ఐఎంజీకి (ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ గ్రూప్) కేటాయించింది.   ఈ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో 2008లో అప్పటి ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై ఐఎంజీ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుప్రీం కోర్టులో సుదీర్ఘ కాలం న్యాయపోరాటం కూడా జరిగింది.  ఎట్టకేలకు 2024 ఏప్రిల్ లో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ భూమిని వినియోగించుకోవాలని భావించింది.  2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిని ఉపయోగించుకోవాలని చూస్తోంది. అంతే కాకుండా ఈ భూమి హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది ప్రభుత్వం చెబుతోంది.   గత ఏడాది జులైలో   యూనివర్సిటీ రిజిస్ట్రార్ సమ క్షంలో సర్వే కూడా నిర్వహించింది. ఎటువంటి ఇబ్బందులూ లేని కారణంగానే ఈ భూమిని వేలం వేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ భూమిలో సరస్సులు, బఫర్ జోన్ లు లేవనీ స్పష్టం చేసింది. పర్యావరణ పరంగా కీలకమైన రాక్ ఫార్మేషన్లు, సరస్సులను హరిత ప్రదేశాలుగా ప్రకటించి వాటిని పరరక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు రేవంత్ సర్కార్ విస్పష్ట హామీ ఇచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిని ఆక్రమించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని క్లారిటీ ఇచ్చింది. అదే విధంగా రాతి నిర్మాణాలు, సరస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నశనం చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఐఎంజీ కేటాయింపు రద్దును సుప్రీం కోర్టు సమర్ధించి ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వెలువరించిన తరువాతనే వీటిని వేలం వేయాలని నిర్ణయించామనీ, విద్యార్థుల మనో భావాలను గాయపరిచే ఏ నిర్ణయం తీసుకోబోమనీ ప్రభుత్వం స్పష్టం చేసిందిి.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్న నానిని ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ ఏఐసీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొడాలి నానికి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు వాల్వ్ లు మూసుకుపోయాయనీ, స్టంట్ అమర్చాలి  లేదా బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కొసం ముంబైలోని ఏషియన్ హర్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించాలని నిర్ణయించు కున్నారు. దీంతో వారి విజ్ణప్తి పేరకు ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నానిని డిశ్చార్జ్ చేశారు.  ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించారు. ఈ ఎయిర్ అంబులెన్స్ లో కొడాలి నానితో పాలటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు,  అలాగే ఏఐజీ ఆస్పత్రికి సంబంధించిన ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో  అంటే ఏప్రిల్ 4 తో ఈ సమావేశాలు ముగుస్తాయి. అయితే,ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు  అయితే ఈ చివరి నాలుగు రోజుల కథ మరొక ఎత్తు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును  ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా  కూటమి నాయకులు  వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు  విషయంలో పట్టు బిగిస్తున్నారు. ఇంతదాక ఒక లెక్క ఇక పై మరో లెక్క అంటున్నారు. ఒకరు గెలుస్తాం అంటుంటే  మరొకరు అదే జరిగితే అల్లకల్లోలమే అని హెచ్చరిస్తున్నారు.  నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు నుంచీ వివాదాస్పద వక్ఫ్‌ సవరణ బిల్లు అంశం  రాజకీయ వర్గాల్లో, రాజకీయ చర్చల్లో రగులుతూనే వుంది. ఎంఐఎం సహా అనేక ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలు వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.  మరోవంక  ఎన్డీఎ ప్రభుత్వం, తగ్గేదే లే అంటోంది. పద్దతిగా  పనిచేసుకు పోతోంది. గతంలో విపక్షాల డిమాండ్ చేసిన విధంగా  వక్ఫ్‌ సవరణ బిల్లు పై ఏర్పాటు చేసి  జేపీసీ ఇచ్చిన నివేదికను  సవరణలతోసహ  కేంద్ర మంత్రి వర్గం  ఫిబ్రవరిలో ఆమోదించింది. అప్పుడే  బడ్జెట్ సమావేశాల్లో  వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశ పెట్టాలనే నిర్ణయం జరిగిపోయింది. మరో వంక ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత షా, గత శుక్రవారం  ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశ పెడుతుందని  స్పష్టం చేశారు.   ఈ నేపథ్యంలో ఇప్పడు దేశ  రాజకీయ, మీడియాలో  సవరణ బిల్లుకు ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్డీఎ భాగస్వామ్య  పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు  సామాన్య జనంలోనూ ఉత్కంఠ వ్యకమవుతోంది. ఆసక్తికర చర్చ జరుగుతోంది. వక్ఫ్ బిల్లును ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయు), జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్),లోక్ జనశక్తి(ఎల్జీపీ) రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది ఆసక్తి కరంగా మారింది.  ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు జరగనున్న బీహార్ లో ముస్లిం సమాజం నుంచి ముఖ్యమంత్రి నితీష్ కుమార్  పై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్  ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించడంద్వారా ప్రధాన ముస్లిం సంస్థలు జేడీయు పట్ల తమ అసంతృప్తి స్పష్టంగా వ్యక్తం చేశాయి. ఒక విధంగా చూస్తే  ఇఫ్తార్ విందును బహిష్కరించడం ద్వారా ముస్లిం సంస్థలు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అటో ఇటో తెల్చుకోమని  అల్టిమేటం ఇచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే ముస్లిం సంస్థలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిం చట్ట సవరణకు ఒప్పించినట్లు  జేడీయు వర్గాలు చెపుతున్నాయి. తాజాగా  ఆదివారం (మార్చి 30) న రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంమక్షంలో  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయనని, ఎన్డీఎ, మోదీ  చేయి’ వదలనని, చేతిలో చెయ్యేసి చెప్పినట్లు  చెప్పినట్లు వార్తలొచ్చాయి. అలాగే  ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని  గట్టి హామీ ఇచ్చారు. మిగిలిన ఎన్డీఎ భాగసామ్య పక్షాలు బిల్లుకు మద్దతు తెలిపే విషయంలో కొంచెం అటూ ఇటుగా ఉన్నా, బిల్లును వ్యతిరేకించక పోవచ్చునని అంటున్నారు.  అయితే, అంత మాత్రం చేత ఎన్డీఎలో అంతా బాగుందని కాదు కానీ బిల్లు గట్టెక్కుతుందని బీజేపీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. మరో వంక  ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కూడా అటూ ఇటూ తేల్చుకోలేకుండానే  ఉన్నాయని అంటున్నారు. నిజానికి  ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనూ వక్ఫ్  బిల్లు విషయంలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు. అందుకే  ఇండియా కూటమి పార్టీలు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఇటు అధికార ఎన్డీఎ కూటమికి అటు విపక్ష ఇండియా కూటమికి వక్ఫ్ బిల్లు పే..ద్ద.. పరీక్ష.. అంటున్నారు.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 26న తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని సోమవారం (మార్చి 31)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ హెల్త్ బులిటిన్ మేరకు కొడాలి నానికి హార్ట్ లో మూడు బ్లాక్స్ ఉన్నాయి. ఆయనకు స్టంట్ అమర్చడం కానీ ఆపరేషన్  కానీ చేయాల్సి ఉంది. అయితే కొడాలి నాని కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తీసుకువెళ్లాలని నిర్ణయించుకోవడంతో వారి అభ్యర్థన మేరకు కొడాలి నానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.  కొడాలి నానికి హార్ట్ లో మూడు బ్లాక్ లు పూర్తిగా మూసుకుపోవడంతో ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.  అయితే కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని భావిస్తున్నారు. కొంత కాలం చికిత్స అందించి, ఆ తరువాత అవసరం మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కొడాలి నాని విశ్రాంతి తీసుకోనున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
Viision Movie Makers, produced films like Ala Ninnu Cheri, Mandira featuring Sunny Leone, are gearing up to release their third film, titled Sumathi Shatakam. The film is presented by Kommalapati Sridhar and produced by Kommalapati Sai Sudhakar. Notably, this film marks the directorial debut of M. M. Naidu. Sumathi Shatakam stars Bigg Boss fame Amardeep Chowdary and Sayli Chaudhari playing the lead roles. The makers promise the movie to be a youthful and engaging romantic entertainer. The grand Pooja ceremony for the film was held on the auspicious occasion of Ugadi and makers stated that shoot will commence in short time. The film’s story has been penned by Bandaru Naidu, while music is composed by Subhash Anand. Cinematography is handled by Halesh, and editing is handled by Suresh Vinnakota. More updates will be released by the makers at appropriate time. 
Telugu Youtuber Anvesh, who is famous for his funny travel vlogs in Telugu has been talking about batting app promotions on social media. He targetted Comedian Ali and stated that he is cheating people who follow by wearing a mask of goodness. He called him as Pakistani Terrorist trying to hurt Indian Youth.  He explained that Ali's wife, Zubeida is running a YouTube channel and she is heavily promoting the betting apps on her videos. He stated that more than 50 lakhs people have watched their video and if not everyone, at least some will believe in such apps being promoted by such respective people.  Anvesh further stated that he loves Ali and he know that Ali has worked in more than 1000 films but these betting app promotions have changed his impression. He stated that muslims don't really encourage such things and Ali should realise his mistake and give away the money earned from betting app promotions to those who lost their lives involved in betting.  He explained that many have lost their lives and gave examples of several people from villages who could not bear the brunt of losing their lifetime savings. He also asked all the celebrities to not promote betting apps and asked them to learn from a small timer like Uppal Balu, who doesn't encourage them even if they offer big checks. 
  చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) బాక్సాఫీస్ వార్ కి తెలుగునాట ఎప్పుడూ ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పలుసార్లు తలపడగా.. కొన్నిసార్లు చిరు, మరికొన్ని సార్లు బాలయ్య పైచేయి సాధించారు. చివరగా వీరిద్దరూ 2023 సంక్రాంతికి తలపడ్డారు. ఆ పోరులో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ గా నిలవగా, బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' హిట్ తో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ అగ్ర హీరోలు మరోసారి బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ 'అఖండ-2' (Akhanda 2). బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న సినిమా కావడంతో 'అఖండ-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఇదే తేదీపై చిరంజీవి సినిమా కన్ను పడినట్లు సమాచారం.   చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' (Vishwambhara) అనే సోషియో ఫాంటసీ ఫిల్మ్ చేస్తున్నారు. వేసవికి విడుదల కావాల్సిన ఈ చిత్రం.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. జులై లేదా ఆగస్టులో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ని హడావుడిగా చుట్టేయకుండా, మరింత సమయం తీసుకొని.. అదిరిపోయే అవుట్ పుట్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నారట. అందుకే దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే చిరంజీవి, బాలకృష్ణ మధ్య మరోసారి బాక్సాఫీస్ వార్ చూడనున్నాం. మరి ఈ ఫైట్ లో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.  
2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన 'మహాకుంభమేళా'(Maha Kumbhmela)లో జీవనోపాధి కోసం రుద్రక్షమాలలు,పూసల దండలు అమ్ముకుంటున్న'మోనాలిసా'(Monalisa)ఓవర్ నైట్ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం తెలిసిందే.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా అయితే  తన కొత్త సినిమా'ది డైరీ ఆఫ్ మణిపూర్' లో మొనాలిసాని ఒక క్యారక్టర్ కి ఎంపిక చేసుకున్నాడు. రీసెంట్ గా సనోజ్ మిశ్రా పై ఉత్తరప్రదేశ్ లోని 'ఝాన్సీ'నగరానికి చెందిన ఒక యువతి పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది.ఆమె తన ఫిర్యాదులో 2020 వ సంవత్సరంలో టిక్ టాక్,ఇనిస్టాగ్రమ్ ద్వారా సనోజ్ మిశ్రా తో పరిచయం జరిగింది.సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని తరచు ఫోన్ చేసి చెప్పేవాడు.ఒక రోజు ఝాన్సీ వచ్చి చెప్పిన చోటుకి రాకపోతే చనిపోతానని బెదిరిస్తే వెళ్ళాను.ఆ తర్వాత రిసార్ట్ కి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అసభ్య వీడియోలు చిత్రీకరించాడు.ఆ వీడియో లతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడు.పెళ్లి చేసుకుంటానని ప్రమాణాలు కూడా చేసాడని సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.దీంతో ఢిల్లీ పోలీసులు సనోజ్ మిశ్రాని అరెస్ట్ చేశారనే కథనాలు వస్తున్నాయి. 2014 లో  బేతాబ్ తో దర్శకుడిగా పరిచయమైన సనోజ్ మిశ్రా 'గాంధీగిరి,రామ్ కి జన్మ భూమి,లఫంగే నవాబ్,శ్రీనగర్,ది డైరీ ఆఫ్ బెంగాల్ వంటి పలు విభిన్న చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు పొందాడు.'రీసెంట్ గా సనోజ్ తెరకెక్కించిన 'కాశీ టూ కాశ్మీర్' చిత్రం ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది.  
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)ఈద్(Eid)కానుకగా ఈ నెల 30 న'సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)హీరోయిన్ గా చెయ్యగా,తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్(Ar Murugadoss)దర్శకత్వం వహించాడు.సత్యరాజ్,కాజల్ అగర్వాల్,షర్మాన్ జోషి,అంజిని ధావన్,కిషోర్,సంజయ్ కపూర్,నవాబ్ షా,ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషించగా అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలా 200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాడు. సికందర్ తొలి రోజు ఇండియా వైడ్ గా 26 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.భారీ కాస్టింగ్ ఉన్నా కూడా సల్మాన్ గత చిత్రం టైగర్ 3  కంటే తక్కువ కలెక్షన్స్ రావడం పలువురిని ఆశ్చర్య పరుస్తుంది.ఇక సికందర్ రిలీజ్ రోజు కంటే రోజు  శనివారం చాలా వెబ్ సైట్స్ లో  ప్లే అయ్యింది.దీంతో వెంటనే దాన్ని తొలగించాలని చిత్ర నిర్మాత సంబంధిత అధికారులని కోరగా ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.    
గాడ్ఆ ఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna)నట విశ్వరూపంలో మరో కోణాన్నిప్రేక్షకులకి  పరిచయం చేసిన మూవీ 'ఆదిత్య 369(aditya 369)1991ఆగస్టు 18న విడుదలైన ఆదిత్య 369 ఎవరి ఊహకి అందని విధంగా గతాన్ని,భవిష్యత్తుని,వర్తమానంతో ఒక సరికొత్త లోకాన్ని ప్రేక్షకుల కళ్ళ ముందు ఉంచి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.టైం మిషన్ నేపథ్యంలోఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఫస్ట్ తెరకెక్కిన మూవీ కూడా ఆదిత్య 369 నే.బాలయ్య ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని నింపగా అనేక రికార్డులు కూడా నెలకొల్పింది.ఇంతటి ప్రతిష్టాత్మక మూవీని శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా లెజండ్రీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa Rao)తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ 4 న రీ రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో నిర్మాత  శివలెంక కృష్ణ ప్రసాద్( Sivalenka Krishna Prasad)మాట్లాడుతు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)గారు ఆదిత్య 369 ప్రమోషన్స్ కోసం దూరదర్శన్ లో 15 నుంచి 20 సెకన్ల పాటు యాడ్ ఇచ్చారు.కానీ ఈ విషయం ఎవరకి తెలియదని చెప్పుకొచ్చాడు.కృష్ణ ప్రసాద్ చెప్పిన ఈ మాటతో అగ్ర హీరోలు అప్పట్నుంచి కూడా ఎంత ఆప్యాయతగా ఉండే వాళ్ళో తెలుస్తుంది. బాలకృష్ణ సరసన మోహిని(Mohini)హీరోయిన్ గా చెయ్యగా చంద్ర మోహన్,అమ్రిష్ పురి, బాబు మోహన్,సిల్క్ స్మిత,టిను ఆనంద్,గొల్లపూడి మారుతీరావు,అన్నపూర్ణ,మాస్టర్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు.మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.    
Salman Khan has been able to make big holiday Eid his own with continuous blockbusters. In fact 2010's will be written in history books of Hindi and Indian Cinema has pure domination of one Superstar - Salman Khan for Eid holiday weekend. Shah Rukh Khan delivered a big blockbuster Chennai Express for Eid but he did not own the date. It became evident that Salman Khan will come for his Eidi gift on Eid at the big box office. He started this Eid sentiment with Wanted in 2009. The movie became his comeback hit at the box office and then, Dabangg in 2010 became his biggest blockbuster till that time. Making Eid sentiment stronger, Bodyguard released in 2011.  Ek Tha Tiger in 2012, Kick in 2014, Bajrangi Bhaijaan in 2015, Sultan in 2016 cemented his command at the Eid box office so heavily that even other Superstar Khans have decided to not give him competition for the date. It became ominous to clash with Salman's films during the holiday weekend. But starting with Tubelight in 2017, Race 3 in 2018, Bharat in 2019, Radhe in 2021, Kisi Ka Bhai Kisi Ki Jaan in 2023, Salman Khan failed big time at the Eid box office. Makers used to be saved with opening weekend numbers at least from big disastrous returns till Bharat, even that changed now.  Kisi Ka Bhai Kisi Ki Jaan took an abysmal opening of Rs.15.81 crores with opening weekend numbers at Rs.68.17 crores. This Eid's release Sikandar took a better opening but it released on Sunday and collected just Rs.25-27 crores. If it had been a Friday release, it would have been even lower than KKBKKJ.  The movie marked Salman's big ticket release after 1 and half year, post Tiger 3 and despite low promotions, many wanted it to be at least put up numbers higher than Chhaava's Rs.31-33 crores. With such low returns, that too with big action film that too directed by a reputed filmmaker like AR Murugadoss, trade experts are asking Salman Khan to take a gap like SRK and return with a much better film that focuses on screenplay and not just his stardom.  Rashmika Mandanna's Pan-India success streak that started with Animal and continued with Pushpa 2 The Rule till Chhaava has ended with Sikandar. Even die hard fans of Salman Khan are not satisfied with the film and movie is facing overwhelming negative word of mouth.   Earlier Salman films did not get affected by it but that is not the case, now. Murugadoss fans are hoping for his big comeback with Sivakarthikeyan's Madharasi. 
  ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో.. ఐపీఎస్ సజ్జనార్, యూట్యూబర్ అన్వేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా.. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారి వివరాలు బయటపెడుతూ వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా కమెడియన్ ఆలీని టార్గెట్ చేశాడు. "ఆలీ బెట్టింగ్ యాప్స్.. పాకిస్తాన్ తీవ్ర వాది" అనే థంబ్ నెయిల్ తో ఒక వీడియోని పోస్ట్ చేశాడు.   ఆలీ తనకు ఇష్టమైన కమెడియన్ అని, కానీ ఆయన ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడో అప్పటినుంచి ఆయన మీద అభిమానం పోయిందని అన్వేష్ అన్నాడు. "మీరు 50 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఉన్నారు, వెయ్యి కోట్లకు పైగా సంపాదించి ఉంటారు.. అలాంటి మీరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి, పాపపు సొమ్ము సంపాదించుకోవడం అవసరమా?" అని ఆలీని అన్వేష్ ప్రశ్నించాడు.   ముస్లింలు అబద్దాలు చెప్పరు, ఇలాంటి పాపపు సొమ్ముకి ఆశపడరు. కానీ, ఆలీ గారు పవిత్రమైన రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారని అన్వేష్ అన్నాడు. "బిర్యానీ మోసం" పేరుతో ఆలీ బెట్టింగ్ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేశాడో అన్వేష్ రివీల్ చేశాడు. "ఆలీ, ఆయన వైఫ్ జుబేదాతో కలిసి యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటారు. ఒక వీడియోలో పదివేల రూపాయల ఖర్చుతో బిర్యానీ వండి, దానిని పంచి పెట్టి, మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందారు. ఇలా చేయడం తప్పు కాదు.. కానీ, ఆ వీడియోలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేశారు." అని అన్వేష్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఇలాంటి ప్రమోషన్స్ చేయడం తప్పని తాను కామెంట్ పెడితే.. అలా అని ఖురాన్ లో రాసుందా? అని షాకింగ్ రిప్లై ఇచ్చారని అన్వేష్ ఆరోపించాడు.   అలాగే ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి సంచలన విషయాన్ని కూడా అన్వేష్ బయటపెట్టాడు. ఆ యాప్ పాకిస్తాన్ కి చెందిన ఒక వ్యక్తిది అని.. పాకిస్తాన్, చైనా వంటి దేశాలు ఇండియా యూత్ ని దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని అన్నాడు. డబ్బుల కోసం ఆశపడి, ఆ యాప్స్ ని ప్రమోషన్ చేస్తూ.. మీకు తెలియకుండానే దేశానికి తీవ్ర నష్టం చేస్తున్నారని అన్వేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.   ఉప్పల్ బాలుని అందరూ ట్రోల్ చేస్తుంటారు. కానీ అతను పేదవాడు అయినప్పటికీ, బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయడం తప్పని వాటికి దూరంగా ఉన్నాడు. అలాంటిది ఇంత ఆస్తి ఉన్న ఆలీ.. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంపై అన్వేష్ అసహనం వ్యక్తం చేశాడు. బెట్టింగ్స్ యాప్స్ వల్ల ఎందరో యువత ప్రాణాలు కోల్పోయారు. ఆ యాప్స్ ని ప్రమోట్ చేసి మీరు సంపాదించిన పాపపు సొమ్ముని, కనీసం ఆ కుటుంబాలకి ఇచ్చి ఆదుకోండని అన్వేష్ అన్నాడు.   ఆలీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడాన్ని తప్పుబడుతూ అన్వేష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెజారిటీ నెటిజన్లు అన్వేష్ కి మద్దతు తెలుపుతూ.. ఆలీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కాంబోలో ఈ నెల 27న పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఎల్ 2 ఎంపురాన్ (l2 empuraan)ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరి,మరిన్ని భారీ  వసూళ్లు రాబట్టే దిశగా దూసుకెళ్తుంది.కాకపోతే కొన్ని వర్గాల వారి నుంచి మూవీలోని పలు సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పాడు.దర్శకుడు  పృథ్వీ రాజ్ సుకుమారన్ పై అయితే  సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై పృథ్వీ రాజ్ సుకుమారన్ తల్లి మల్లిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'నా కుమారుడు ఎవరని మోసం చెయ్యడం గాని,ఎవరి వ్యక్తిగత నమ్మకాల్ని వ్యతిరేకించడం గాని  చెయ్యలేదు.అందరి ఆమోదయోగ్యంతోనే మూవీ తెరకెక్కింది.రచయిత కూడా ఎప్పుడు పక్కనే ఉండేవాడు.అవసరమైతే డైలాగుల్లో మార్పులు కూడా చేసేవారు.మూవీలో ఏమైనా సమస్యలు ఉంటే,అందులో భాగమైన అందరకి బాధ్యత ఉంటుంది.మోహన్ లాల్ నాకు ఎప్పట్నుంచో తెలుసు.నా తమ్ముడితో సమానం.ఆయనతో పాటు నిర్మాతలెవరు తమని పృథ్వీ రాజ్ మోసం చేసాడని చెప్పలేదు.ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా నా కుమారుడిని బలి పశువుని చెయ్యాలని చూస్తున్నారు. ఈ వివాదంపై స్పందించాలని అనుకోలేదు.కానీ నా కుమారుడిపై తప్పుడు కథనాలు చూసి ఆవేదనతో స్పందిస్తున్నాను.ఈ సినిమా తెరకెక్కించడం కోసం నా కొడుకు చాలా కష్టపడ్డాడు.  మోహన్ లాల్ కి తెలియకుండా కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని చెప్పుకొచ్చింది.అభ్యంతరాలు వస్తున్న సీన్స్ ని మార్చినట్టుగా తెలుస్తుంది.లైకా ప్రొడక్షన్స్,ఆశీర్వాద్ సినిమాస్,గోకులం మూవీస్ అత్యంత భారీ వ్యయంతో ఎల్ 2 ఎంపురాన్ ని నిర్మించాయి.   
  తెలుగు సినీ చరిత్రలో మొదటి టైమ్ ట్రావెల్ చిత్రం 'ఆదిత్య 369'. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, 1991లో విడుదలై సంచలన విజయం సాధించింది. మూడు దశాబ్దాల తర్వాత ఈ క్లాసిక్ ఫిల్మ్ కి సీక్వెల్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. (Adity 369)   'ఆదిత్య 369' మూవీ ఏప్రిల్ 4న రీ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ కథ రెడీగా ఉందని, త్వరలోనే సినిమా చేస్తామని అన్నారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. (Balakrishna)   నిజానికి ఆదిత్య 369 సీక్వెల్ ని బాలకృష్ణ తన దర్శకత్వంలోనే చేయాలని భావించారు. ఈ మూవీతో తన తనయుడు మోక్షజ్ఞను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ, ఎందుకనో ఈ సీక్వెల్ కి కొబ్బరికాయ కొట్టలేదు. ఓ వైపు బాలకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ మొదటి సినిమాని హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రకటించారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్ ఇప్పట్లో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఈ సీక్వెల్ మళ్ళీ తెరపైకి వచ్చింది.   'ఆదిత్య 369' రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాటలను బట్టి చూస్తే, సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని అనిపిస్తోంది. పైగా ప్రశాంత్ వర్మ కూడా ప్రస్తుతం 'జై హనుమాన్'తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. మోక్షజ్ఞ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో ఆదిత్య 369 సీక్వెల్ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. మరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఇదే అవుతుందేమో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఆచార్య చాణక్యుడు గొప్ప నీతి శాస్త్రజ్ఞుడు.  ఆయన చెప్పిన నీతి శాస్త్ర విషయాలు ఇప్పటికీ ఆచరించదగినవి. నీతి శాస్త్రంలో జీవితంలో అన్ని విషయాలకు పరిష్కారాన్ని అందించడం ఆచార్య చాణక్యుడికే చెల్లింది. చాణక్యుడు విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు.  ఆచార్య చాణక్యుడు రాసిన చాణక్య నీతిని ఇప్పటికీ ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు.    చాలావరకు శత్రువులు వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.  ఇలా ఇబ్బంది పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవాలని ఉన్నా ఎలా తప్పించుకోవాలో చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలకు ప్రధాన కారణం శత్రువు. ముఖ్యంగా సంతోషంగా ఉంటూ జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వారి జీవితంలో వారిని ఇబ్బంది పెట్టడానికి శత్రువు ప్రవేశిస్తాడు. ఎంతలా  ఎన్ని కారణాలుగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెడతాడు కూడా. అయితే ఇలా ఇబ్బందులు పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆచార్య చాణక్యుడి నీతిని పాటించడం సరైన పరిష్కారంగా పనిచేస్తుంది. శత్రువు వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటే మొదట చేయాల్సిన పని శత్రువు గురించి తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.  శత్రువు ఎవరైనా సరే.. ఆ శత్రువు బలవంతుడా లేదా బలహీనుడా అనే విషయం తెలుసుకోవాలి.  ఆ శత్రువు బలం,  బలహీనత ఆధారంగా ఒక వ్యూహం  రచించాలి.  ఆ వ్యూహాన్ని అనుసరించే ముందడుగు వేయాలి.  అలా చేస్తే శత్రువు మీద విజయం సాధించగలుగుతారు.  అయితే శత్రువు మీద విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు కూడా అలవర్చుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే. సహనం,  సంయమనం.. చాలా సార్లు ప్రజలు కోపంగా ఉండి తమ శత్రువుపై నేరుగా దాడి చేస్తారు. కానీ చాణక్యుడి ప్రకారం శత్రువును ఓడించడానికి సంయమనం,  సహనం అవసరం. పరిస్థితి ఏమైనప్పటికీ,  ఓర్పు,  సంయమనం పాటించాలి.  సరైన సమయంలో  తదుపరి అడుగును ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. శత్రువును అయోమయంలో ఉంచాలి.. శత్రువును ఎప్పుడూ అయోమయంలో ఉంచాలి అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే శత్రువుకు మీ ప్రణాళికలు,  ఉద్దేశాల గురించి తెలిస్తే వారు  మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతారు. కాబట్టి వారికి తగిన  బుద్ధి చెప్తూనే  ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి.                                          *రూపశ్రీ.
  మహిళలు అంటే వంటింటి కుందేళ్లు అని అనుకుంటారు. కానీ ఇంటి గడప దాటి ఉద్యోగాలు చేయడం నుండి వివిధ పోరాటాలలో పాల్గొనడం వరకు మహిళలు ఎందులోనూ తీసిపోరు. తాజాగా సునితా విలియమ్స్ అంతరిక్షాన్నే జయించి సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చారు. అయితే ప్రపంచం అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో జరిగిన  మహిళల పోరాటం చాలా మందికి తెలియదు.   1947 సంవత్సరం దేశం మొత్తం స్వాతంత్ర్యం పొందింది. అయితే, దానిలో ఒక చిన్న భాగం అయిన గోవా మాత్రం  మరో 14 సంవత్సరాలు పోర్చుగీస్ నియంత్రణలో ఉంది. 1961లో మాత్రమే గోవా  విముక్తి పొందింది. 400 సంవత్సరాల వలస పాలనకు ముగింపు పలికింది. ఆ సంవత్సరాల్లో నిరంతర ఆక్రమణలో ఒక నిశ్శబ్ద విప్లవం పుట్టుకొచ్చింది. స్వేచ్ఛను కోరుతూ వినిపించిన లెక్కలేనన్ని స్వరాలలో, లొంగిపోవడానికి నిరాకరించిన ధైర్యవంతులైన మహిళలు ఉన్నారు . గోవా విముక్తి కోసం అచంచలమైన సంకల్పంతో పోరాడారు. ఈ నిర్భయ మహిళలలో కొంతమంది వారి అద్భుతమైన ధిక్కార చర్యల గురించి తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1955 ప్రాంతంలో గోవా వాసులు నమ్మే ఏకైక వార్త 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్' ద్వారా వ్యాప్తి చేయబడిన వార్త. నిజం కోసం రేడియో ప్రసారాన్ని నమ్మవచ్చు. సమయం కఠినంగా ఉంది. గోవా తనను తాను విడిపించుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తోంది. ఆ సంవత్సరాల్లో చాలా మంది మహిళలు సామాజిక ప్రతీకారం లేదా విమర్శలకు భయపడకుండా తిరుగుబాటులో ముందుకు వచ్చారు. వారిలో ఒకరు లిబియా లోబో సర్దేశాయ్. ఆమె తన భర్త వామన్ సర్దేశాయ్‌తో కలిసి ఎవరూ  గుర్తుపట్టకుండా ఉండటానికి ఒక అడవి నుండి 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్'ను ప్రారంభించారు. వారి వార్తా ప్రసారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి. జాతీయవాద మనస్తత్వాన్ని పెంచింది.   జనవరి 2025లో లిబియా తన ధైర్యసాహసాలకు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. విమోచన దినోత్సవం  19 డిసెంబర్ 1961 గోవా స్వేచ్ఛను రుచి చూసిన రోజు ఆమె మనస్సులో చెక్కుచెదరకుండా ఉంది. “గోవా విముక్తి పొందినప్పుడు, జనరల్ జెఎన్ చౌధురి [అప్పటి భారత సైన్యం  సైన్యాధ్యక్షుడు] మా వద్దకు వచ్చి స్వయంగా వార్తలను అందించారు. నాకు ఎలా స్పందించాలో తెలియలేదు. నేను తోట నుండి ఒక పువ్వును తీసుకొని అతనికి ఇచ్చాను. అతను నన్ను అడిగాడు, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?' అని. నేను 'నేను దానిని ఆకాశం నుండి ప్రకటించాలనుకుంటున్నాను' అని అన్నాను. మరుసటి రోజు గోవా విముక్తిని ప్రకటించే కరపత్రాలతో రాష్ట్రం నిండిపోయింది. మూలం ఆకాశం నుండి  లిబియా  సర్దేశాయ్ కూర్చున్న విమానం నుండి కరపత్రాలను రాష్ట్రం లో కుమ్మరించారు. ఈ  విధంగా రాష్ట్రానికి స్వేచ్ఛ అందిన వార్త విని రాష్ట్రం ఎంతగానో సొంతోషించింది.                                               *రూపశ్రీ
పుత్రోత్సాహము తండ్రికి  పుత్రుడు జన్మించినపుడె పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగ  బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతీ!! అంటాడు సుమతీ శతకకర్త.  ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగును. అని వె పద్య భావం.  సమాజంలో ముఖ్యంగా భారతీయులలో మగపిల్లాడు అంటే వంశాకురమని, వారసత్వం ఉండాలంటే మగపిల్లలే మూలమని భావిస్తారు. దానికి అనుగుణంగా భారతీయ మనస్తత్వాలు కూడా ఉంటాయి. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు అనేది భారతీయులు విశ్వసించే మాట. అయితే మగపిల్లాడు పుట్టగానే ఏ తండ్రి సంతోషపడడు. ఆ కొడుకు ప్రయోజకుడై సమాజం ఆ కొడుకును పొగిడినప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు. ఇప్పుడు కొడుకుల గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అనిపిస్తుంది.  ప్రతి సంవత్సరం మార్చి 4 వ తేదీన ఇంటర్నేషనల్ సన్స్ డే జరుపుకుంటారు. ఈ international sons day ని మార్చ్ 4వ తేదీన మాత్రమే కాకుండా.. సెప్టెంబర్ 28వ తేదీ కూడా జరుపుకుంటారు.  పుత్రుల దినోత్సవం ఎందుకు??  ఇప్పటి కాలంలో మగపిల్లలను కలిగున్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది?? మగపిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్న సంఘటనలు చాలా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. సమాజంలో తల్లిదండ్రులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న మగపిల్లలు వారి తల్లిదండ్రుల బాధకు, కష్టాలకు కారణం అవుతున్నారు. తల్లిదండ్రుల స్థితిగతులు తెలుసుకోలేని నిర్లక్ష్యంలో ఎంతోమంది సుపుత్రులు ఉన్నారు.  మగపిల్లల ప్రవర్తన ఏదైనా సరే అది తల్లిదండ్రుల ఆలోచనలు, వారి పెంపకం, వారు మగపిల్లలకు ఇస్తున్న స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉంటుంది. చిన్నతనంలోనూ, కుర్రాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొడుకులకు ఇచ్చే స్వేచ్చనే వారిని పెద్దయ్యాక నిర్లక్ష్య వ్యక్తిత్వం కలవారిగా మారుస్తుంది.  మగాడికేంటి పుట్టగోచి పెట్టుకుని బయటకు వెళ్లగలడు నువ్వు అలాగ వెళ్తావా అనేది చాలామంది ఆడ, మగపిల్లలు ఉన్న ఇళ్లలో ఆడపిల్లలను ఉద్దేశించి తల్లులు చెప్పే మాట. కొడుకుల మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో అంతకు మించి బాధ్యత కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతను వదిలిపెట్టి మగజాతి అంటేనే ఏదో బాధ్యతలు మోసుకుతిరిగే వర్గమని, వారికి ఏ విషయం చెప్పక్కర్లేదులే అని అనుకుంటే బాధ్యత లేని కొడుకులను తయారుచేసినట్టే.. ఎవరితో మాట్లాడుతున్నావ్, ఎంత ఖర్చు చేశావ్, దేనికోసం ఖర్చు చేశావ్?? ఎందుకింత లేటుగా వచ్చావ్?? మగపిల్లలతో మాటలేంటి?? పద్దతిగా, బుద్దిగా ఉండు. వంటి మాటలు మీ కూతుళ్లకు చెప్పేముందు కొడుకులకు కూడా ఇంకొంచెం గట్టిగా, అంతకు మించి బాధ్యతగా చెప్పండి. అడిగిందల్లా చేతిలో పెడుతూ ఆడపిల్లలకు ఎందుకులే డబ్బు వంటి మాటలు కట్టి పెట్టి మగపిల్లలకు కూడా డబ్బు విషయంలో కట్టడి చేయండి. ఇలా చేస్తే డబ్బు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం వారికి కూడా అర్థమైతుంది. సులువుగా చేతిలోకి డబ్బు వస్తుంటే ఎవరికి అయితే విలువ అర్థం కాదు.విలువ అర్థం కానప్పుడు మనుషుల కష్టం, మనుషుల విలువ కూడా వారికి తెలియదు.  ప్రస్తుత కాలంలో కొడుకులు ఉండీ వృద్ధాశ్రమాలలో బ్రతుకు వెళ్లదీస్తున్న పెద్దలను గుర్తు చేసుకొని అయినా మగపిల్లలకు విలువలు, బాధ్యతల గురించి చెప్పండి. మీ కొడుకులు పెడదోవ పడితే వారిని అందరూ నిందిస్తుంటే బాధపడేది మీరే.. కాబట్టి అబ్బాయిలకూ మంచి నడవడిక నేర్పించండి. అప్పుడే వారు ఉదయించే సూర్యుడిలా తల్లిదండ్రుల కళ్ళకు వెలుగు పంచగలడు.                                    ◆నిశ్శబ్ద.
శరీర బలం చాలా వరకు  ఎముకలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎముకలు  మన అవయవాలకు లోపల  బయటి నుండి రక్షణ కల్పిస్తాయి. కానీ చాలా మందికి ఉండే ఒక తప్పుడు  అలవాటు  ఎముకలను బలహీనపరుస్తుందని  తెలుసా? నిజం ఆ ఒక్క తప్పు వల్ల  శరీరానికి అవసరమైనంత కాల్షియం తీసుకున్నా సరే.. అది స్పాంజ్ నీటిని పీల్చేసినట్టు.. ఆ ఒక తప్పు శరీరంలో కాల్షియంను పీల్చుకుని ఎముకలను పెళుసుగా మారుస్తాయి. ఇంతకీ ఆ తప్పేంటో తెలుసుకుంటే.. సూర్యకాంతి లేకపోవడం.. శరీరంలో కాల్షియం లోపానికి ప్రధాన కారణం ఎండలో బయటకు వెళ్లకపోవడమే.  ఎండలో కూర్చోవడం వల్ల  శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. శరీరంలో కాల్షియంకు ఇది చాలా ముఖ్యమైనది. అందుకే రోజూ ఉదయాన్నే  కొద్దిసేపు సూర్యుడి లేత కిరణాలు ఉన్నప్పుడు ఆ ఎండలో కనీసం 10 నుండి 30 నిమిషాలు గడపాలి. సూర్యకాంతి,  విటమిన్ డి.. శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డి కూడా ముఖ్యమైనది.  ఈ విటమిన్-డి  అవసరాన్ని తీర్చడానికి,  కొంత సమయం ఎండలో కూర్చోవడం ముఖ్యం.సూర్యకాంతి శరీరంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ పై పడినప్పుడు అది  శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్-డి అదే శరీరంలో తయారు అవుతుంది.  ఇలా విటమిన్-డి తయారు కాకపోతే.. విటమిన్-డి లోపం ఏర్పడి శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఎండలో కూర్చోవడం తప్పనిసరి.. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎండలు,   ఉష్ణోగ్రత పెరగుదల ఎక్కువ ఉంది.  ఖచ్చితంగా ఉదయం సూర్యరశ్మిని శరీరానికి సోకేలా ప్లాన్ చేసుకోవాలి.  ఎందుకంటే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకపోవడం వల్ల  విటమిన్ డి లోపంతో బాధపడవచ్చు. సూర్యకాంతికి ఏ  సమయం  మంచిది? ఆరోగ్య నిపుణులు ఉదయం 10 గంటల లోపు,  సాయంత్రం 4 గంటల తరువాత నుండి 6 గంటల వరకు ఉత్తమ సమయంగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి బాగా పనిచేస్తుంది. ఇది విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడుతుంది. ఎంత సమయం.. ప్రతి రోజూ సూర్యరశ్మి కనీసం 15 నుండి 30 నిమిషాలు శరీరానికి సోకేలా చూసుకోవాలి.  తీవ్రమైన ఎండ చర్మాన్ని దెబ్బతీస్తుంది.  కాబట్టి లేత సూర్య కిరణాలు మాత్రమే శరీరానికి మేలు చేస్తుంది.                                *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మనిషిలో ప్రాణ శక్తి అంతా రక్తంలోనే ఉంటుంది.  రక్తం శరీరంలో ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితం కొనసాగుతుంది. అయితే చాలా మంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎక్కువ శాతం రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు.  రక్తహీనత అంటే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం. అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపించడం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో 12 పాయింట్లకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలని వైద్యులు చెబుతారు. అయితే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే మహిళలలో కొన్ని రకాల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. చర్మం... ముఖం తెల్లగా మారడం మొదలైతే చాలా మంది తాము మంచి రంగుకు మారుతున్నాం అని పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది రంగు మారడం కాదు అది  శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల చర్మం రంగు గణనీయంగా మార్పుకు లోనవుతుంది. చర్మం ఎర్రగా ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉన్నట్టు అర్థం. పొడిబారడం.. ముఖం మీద చర్మం పొడిగా మారితే అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం  కూడా  తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. నల్ల మచ్చలు.. ముఖం మీద కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం మొదలైతే  రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో రక్తం లేకపోవడానికి అతిపెద్ద సంకేతం నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు. హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో రక్తం ఎన్ని పాయింట్లు ఉందో తెలుసుకోవచ్చు. మొటిమలు రక్తం లేకపోవడం వల్ల  ముఖం మీద మొటిమలు సమస్య రావచ్చు. ఎందుకంటే తక్కువ రక్తంలో టాక్సిన్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇది మొటిమలు వంటి సమస్యలను కలిగిస్తుంది.                                       *రూపశ్రీ.
చిన్న విషయాలకే కోపంగా ఉంటారా?  ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడుతున్నారా? అవును అయితే ఇది కేవలం మానసిక స్థితిలో మార్పు మాత్రమే కాదు మీ శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి సంకేతం కూడా కావచ్చని అంటున్నారు ఆరగ్య నిపుణులు. కోపం,  చిరాకు అనేది ఒత్తిడి లేదా పని ఒత్తిడి వల్ల మాత్రమే వస్తుందని మనం తరచుగా అనుకుంటాము. కానీ వాస్తవానికి పోషకాహార లోపం కూడా దీని వెనుక ఒక పెద్ద కారణం కావచ్చు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్లు మాట్లాడుతుంటే..  లేదా ఇంట్లో వాళ్లు ఏదైనా సాధారణ పని చెబితే ఊహించని విధంగా వారి మీద అరిచేస్తుంటాం.  అలాగే స్నేహితులు,  చుట్టాలు,   తెలిసిన వారు పలకరించినప్పుడు  లేదా ఏదైనా విషయం గురించి సమాచారం అడిగినప్పుడు చిరాకుగా సమాధానం ఇస్తుంటారు.  ఎదుటి వ్యక్తులు ఈ మాత్రం దానికే ఇంత కోపమా? అని,  ఈ మాత్రం దానికే ఇలా చిరాకు పడాలా అని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇదంతా మనిషి ఒత్తిడి వల్ల కలిగే సమస్య లేదా వాతావరణం వల్ల కలిగే సమస్య కానే కాదట.  ఇది స్పష్టంగా ఆహారం వల్ల వచ్చే సమస్య కూడా కావచ్చు అని అంటున్నారు ఆహార నిపుణులు,  ఆరోగ్య నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయో తెలుసుకుంటే.. మనకు ఎందుకు కోపం, చిరాకు వస్తుంది? కొన్నిసార్లు చిన్న విషయాలకే కోపంగా మాట్లాడటం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం మీ మనస్సు,  శరీర స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం,  హార్మోన్ల మార్పులు దీనికి ప్రధాన కారణాలు.  కానీ అవసరమైన పోషకాలు లేకపోవడం కూడా మానసిక స్థితిని పాడు చేస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు అందనప్పుడు నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది.  ఇది  మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం.. విటమిన్ బి కాంప్లెక్స్‌లో బి1, బి6,  బి12 వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లన్నీ మన మనస్సును ప్రశాంతంగా,  సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. వాటి లోపం మెదడులోని సెరోటోనిన్,  డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిలో మార్పులు,  కోపాన్ని పెంచుతుంది. విటమిన్ డి లోపం.. విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుంది.  కాబట్టి దీనిని 'సూర్యరశ్మి విటమిన్' అని పిలుస్తారు. దీని లోపం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  దీని లోపం వల్ల  వ్యక్తి నిరాశగా,  చిరాకుగా అనిపించవచ్చు. మీరు ఎండలో తక్కువ సమయం గడిపినట్లయితే, విటమిన్ డి స్థాయిలు తగ్గవచ్చు. మెగ్నీషియం,  జింక్ లోపం..  మానసిక స్థితిని నియంత్రించడంలో మెగ్నీషియం,  జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి లోపం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  కోపాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. విటమిన్లను ఎలా చూసుకోవాలి? ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాలు ఎండలో గడపాలి. ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పాలు,  గుడ్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. వైద్యుడి సలహా మేరకు  సప్లిమెంట్లను తీసుకోవచ్చు.  యోగా,  ధ్యానం నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...