LATEST NEWS
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందు కోసం ఆయన వెలగపూడిలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఈ6 రోడ్డుకు ఆనుకుని ఉండే ఈ స్థలానికి నాలుగువైపులా రోడ్డు ఉంది. అంతే కాకుండా అమరావతిలో కీలకమైన సీడ్  యాక్సెస్ మార్గానికి చేరువగా ఉంది. హైకోర్ట్, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, ఎన్జీవోల నివాససముదాయాలు చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి కేవలం రెండు కీలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఐదు ఎకరాల స్థలంలో ఇంటిట నిర్మాణంతో పాటు ఉద్యానవనం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి వాటికి వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక సాధ్యమైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రానున్న సంగతి తెలిసిందే. ఆ లోపుగానే తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయాలని భావిస్తున్న చంద్రబాబు అందుకు ఏప్రిల్ 9 ముహూర్తంగా నిర్ణయించారు.  
భారత రాజకీయాలలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. ఒక ప్రభంజనం.  రాజకీయాలలోనే సంక్షేమ పర్వానికి తెరతీసిన సందర్భం. దేశంలోనే ప్రాంతీయ పార్టీలకు ఒక మోడల్. ఒక ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎకఛత్రాధిపత్యానికి చరమగీతం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.  ఆవిర్భావమే ఒక ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలలకే కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అంతేనా వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ సోపానంగా మారింది. ప్రజల దగ్గరకు రాజకీయాలను నడిపించింది. వారినే రాజకీయ నిర్ణేతలుగా మార్చింది. రాజకీయం అంటే ఆధిపత్యం కాదు.. ప్రజా సేవ అని చాటింది.   తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆదర్శం, సందేశం ఆచరణ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సిద్థాంతానికి కట్టుబడి గత నాలుగు దశాబ్దాలకు పైగా రాష్ట్ర, దేశ రాజకీయాలలో అత్యంత క్రియాశీలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే.  అటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలలో  ఘనంగా జరుపుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. తెలుగు వాళ్లు ఉన్న ప్రతి రాష్ట్రం, దేశంలో కూడా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో హైదరాబాద్ లో సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు అంటే మార్చి 29న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పురుడుపోసుకున్న తెలుగుదేశం.. ఈ 43 ఏళ్లుగా తెలుగువాడి వాడివేడి సత్తా చాటుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ ప్రవేశం చేసిన ఎందరో నేతలు ప్రజాసేవలో ఒదిగి ఎదిగారు.   43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. పార్టీ ఆవిర్భవించిన 9 నెలల వ్యవధిలోనే  ఉమ్మడి ఏపీలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న టీడీపీ… ఆ వెంటనే  అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటిలత్వం కారణంగా అధికారానికి దూరం అయ్యింది. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో కాంగ్రెస్ దిగివచ్చి మళ్లీ పువ్వుల్లో పెట్టి తెలుగుదేశం కు అధికారం అప్పగించింది. ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమే ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కార్యదక్షత, దీక్షను ప్రపంచానికి చాటింది.  ఆ తర్వాత ఓ ప్రాంతీయ పార్టీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ఏకైక పార్టీగా తెలుగుదేశం అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకుంది.  దేశానికి రాష్ట్రపతి నుంచి ప్రధానులుగా ఎవరుండాలో నిర్దేశించింది.   అటువంటి పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించిన పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ జరుపుకునే పొండుగ ఒక్క తెలుగుదేశం ఇఆవిర్బావ దినోత్సవం మాత్రమేనని చంద్రబాబు అన్నారు.  43 ఏళ్లుగా కష్టనష్టాలలో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని పార్టీతో నడుస్తున్న నేతలు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు  ఈ సందర్బంగా చెప్పారు.  పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా ముందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే విధంగా పని చేస్తున్నామనీ,  ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు. తానూ అదే  ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తున్నానన్నారు.    సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు.   తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించడంతో పాటు మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో వాటా హక్కు కల్పించింది టీడీపీ. టెక్నాలజీని అందిపుచ్చుకుని అవకాశాలు సృష్టించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది మన తెలుగుజాతికి గర్వకారణం. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడ్డామంటే దీనికి కార్యకర్తల త్యాగాలు, పోరాటాలే కారణమన్నారు.  2019 తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బెదిరిపుంలు, అరెస్టులు వంటి చర్యలతో భయోత్పాతం సృష్టించినా కార్యకర్తలు జెండా వదల్లేదు. గొంతుపై కత్తిపెట్టి చంపుతామన్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారంటే... అలాంటి కార్యకర్తలు ఉండటం పార్టీకే గర్వకారణం. 43 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది నాయకులను పోగొట్టుకున్నాం. పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప నాయకులను కోల్పోయాం. త్యాగాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదు. ఏం చేసినా రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ కేడర్ నిలబడ్డారని అన్నారు. 
వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గఢ్ దద్దరిల్లిపోతున్నది. తాజాగా శనివారం (మార్చి 28) ఉదయం చత్తీస్గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో  జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  దండకారణ్యంలో శనివారం (మార్చి 28) ఉదయం కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గోగుండా హిల్ పై మావోయిస్టుల కదలికలకు సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ జరిపాయి. ఆ సందర్భంగా కెర్ల పాల్ పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను గమనించగానే ముందుగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతిగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పులలో 15 మంది నక్సలైట్లు హతమయ్యారు.  ఎదురు కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో డిస్ట్రిక్ట్ రిజర్వ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లు పాల్గొన్నాయి.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒకరోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ద్వంసం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను ఎస్టీఎస్టీ అట్రాసిటీస్ కోర్టు కొట్టివేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూవివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై నమోదైన కేసులో విచారణ నిమిత్తం వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు గన్నవరం కోర్టులో దాఖలు చేసిన  పిటిషన్ ను విచారించిన కోర్టు వంశీని ఒక రోజు పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు శనివారం (మార్చి 29) తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.   
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా  కు పరిచయమ అవసరం లేదు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోదరి. అంతే కాదు, గతంలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ ( కేరళ) నియోజక వర్గం ప్రస్తుత ఎంపీ ప్రియాంక. 2024 ఎన్నికల్లో రాహుల గాంధీ  వయనాడ్ తో పాటుగా ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు.  ఆ తర్వాత  రాహుల్ గాంధీ అమేథీని ఉంచుకుని  వయనాడ్ ను వదిలేశారు. సొంత నియోజక వర్గం అమేథీ ఎంపీగా కొనసాగుతున్నారు. అలా రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్  లోక్ సభ స్థానానికి   జరిగిన ఉపఎన్నికల్లో ప్రియాంక వాద్రా కాంగ్రస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. గెలిచారు. ఇప్పడు, ఆమె వయనాడ్  ఎంపీ. అయితే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినా  ఇప్పడు  ఆమె గురించి మాట్లాడుకోడానికి ఓ మంచి కారణమే వుంది. ఆమె ఓ మంచి బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. ఆమె  తమ నియోజక వర్గం ప్రజల మాతృ భాష మలయాళం నేర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో  కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ ఇచ్చిన సలహా మేరకు తాను  ప్రత్యేకంగా ఒక టీచర్ ను పెట్టుకుని మరీ మళయాళం నేర్చుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు  ఇప్పటికే తనకు మలయాళం కొంచెం కొంచెం అర్థమవుతోందని, కుంచెం కుచెం   మాట్లాడగల్గుతున్నానని  చెప్పారు. సంతోషం. అభినందనీయం.   ఐదేళ్ళు అదే వయనాడ్  నియోజక వర్గానికి ప్రాతినిత్యం వహించిన రాహుల్ గాంధీకి మలయాళం ఎంత వచ్చునో, ఎంత రాదో మనకు తెలియదు కానీ, ఉప ఎన్నికల్లో గెలిచి ఇంకా ఐదు నెలలు అయినా కాక ముందే ప్రియాంక  మలయాళం నేర్చుకోవడం  అభినందనీయం. అన్నిటినీ మించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సమస్యలు తెలుసుకునేదుకు  వారి మాతృ భాష నేర్చుకోవాలని  ఆంటోనీ ఇచ్చిన సలహాను అక్కడే మరిచి పోకుండా   ఆచరణలో పెట్టడం చాలా చాలా అభినందనీయం.    సహజంగా  ప్రజాప్రతినిధులకు తాము ప్రాతినిధ్యం వహించే’ నియోజక వర్గం ప్రజల భాష వచ్చే ఉంటుంది. కానీ  ఇదిగో ఇలా వలస వెళ్లి వేరే రాష్టాల నుంచి పోటీ చేయవలసి వచ్చి నప్పుడే భాషా సమస్య వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది నాయకులు దక్షణాది రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు  భాషా సమస్యను ఎదుర్కుంటారు.  గతంలో  1999లో కర్ణాటకలోని బళ్ళారి లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికలో  కాంగ్రెస్ అభ్యర్ధిగా, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అభ్యర్ధిగా  సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఇద్దరికీ  కన్నడం రాదు. సోనియా గాంధీ ఏ భాషలో మాట్లాడారో ఏమో కానీ,   సుష్మాస్వరాజ్  మాత్రం పట్టుపట్టి కన్నడం నేర్చుకున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కన్నడంలో ప్రసంగించారు. అయినా  ఆ ఎన్నికల్లో సోనియా గాంధీ గెలిచారు. సుష్మా స్వరాజ్ ఓడి పోయారు. ఓడిపోతే  ఓడి పోయారు కానీ, ఆమె చాలా తక్కువ సమయంలో అంటూ  30 రోజులకంటే తక్కువ రోజుల్లో  కన్నడ  భాష నేర్చుకున్నారు.  సరే  ప్రజాప్రతినిధులు అందరూ సుష్మా స్వరాజ్ లా పక్షం రోజుల్లోనే పరాయి భాష నేర్చుకోలేక పోవచ్చును. పీవీ నరసింహ రావులాగా  14 భాషల్లో మాట్లాడలేక పోవచ్చును కానీ, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత ప్రజల భాష మాట్లాడ లేక పోవడం మాత్రం, ఆక్షేపణీయం. ఒక రకంగా అది వారికే అవమానం.   కానీ తెలుగురాష్ట్రంలోనూ ప్రజల భాష తెలుగు రాని ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ శాసన సభ విషయాన్నే తీసుకుంటే, ఎంఐఎం  పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 20 ఏళ్లకు పైగానే  తెలుగు సభ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలోని చాంద్రాయగుట్ట నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మాత్రమే కాదు,ఆయన తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ  కూడా ఎమ్మెల్యేలుగా,  ఎంపీలుగా ఉన్నారు. అయినా ఆయనకు గానీ, అయన కుటుంబ సభ్యులకు గానీ తెలుగు రాదు.ఇంగ్లీష్ లో  అయితే అనర్గళంగా మాట్లాడతారు. అవసరం అనుకుంటే  తమ ఓటర్ల  కోసం ఉర్దూలోకి షిఫ్ట్ అవుతారు. కానీ తెలుగులో మాత్రం ఒక్క ముక్క మాట్లాడలేరు. మాట్లాడ లేక పోవడం  మాత్రమే కాదు. కనీసం అర్థం చేసుకోలేరు. తెలుగు రాష్ట్రంలో పుట్టి  తెలుగు రాష్ట్రంలో పెరిగి,  20 ఏళ్లకు పైగా తెలుగు శాసనసభలో సభ్యునిగా ఉండి మెజారిటీ సభ్యులు, మంత్రుల తెలుగు ఉపన్యాసాలు  వింటూ కూడా ఆయనకు తెలుగు తలకెక్కలేదు.   అయితే  ఆయన మంత్రి సీతక్కకు ఉర్దూ, ఇంగ్లీష్ రాదని ఆక్షేపించారు. మంత్రికి ఇంగ్లీష్, ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు, పరస్పరం ఒకరిని  ఒకరం అర్థంచేసుకోలేక పోతున్నాం.  అంటూ తనకు తెలుగు రానందుకు  క్షమాపణలు చెప్పారు. కానీ  అదే సమయంలో ఆయన మంత్రి సీతక్కను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాద మయ్యాయి.  అయినా ఇప్పటికైనా  ప్రియాంకను ఆదర్శంగా తీసుకుని అయినా ఒవైసీ సోదరులు తెలుగు నేర్చుకుంటారేమో చూద్దాం. నిజానికి  ఒవైసీ సోదరులు మాత్రమే కాదు  ప్రజల భాష రాని ప్రజా ప్రనిధులు ఇంకా ఉండే ఉంటారు. ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్ కు ఒరియా భాష రాదని అంటారు. అది ఎంత వరకు నిజమో కానీ  ప్రజాప్రతినిధులకు ప్రజల భాష రావడం అవసరం. అది ఒవైసీలు కావచ్చును, మరొకరు కావచ్చును.
ALSO ON TELUGUONE N E W S
గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం(Sp Balasubramanyam)తనయుడు ఎస్ పి చరణ్(Sp charan)ప్రధాన పాత్రలో,శ్రీహర్ష అన్నపురెడ్డి(sri harsha annapareddy)కషికా కపూర్(Kashika Kapoor)జంటగా నటిస్తున్న చిత్రం'లవ్ యువర్ ఫాదర్'.చతప్రతి శేఖర్, నవాబ్ షా,రఘుబాబు,షకలక శంకర్,ప్రవీణ్ బెల్లంకొండ ఇతర పాత్రల్లో కనిపిస్తుండగా పవన్ కేత రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.గతంలో ఎస్ వి కృష్ణా రెడ్డి తో కలిసి ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన కిషోర్ రాఠీ, అన్నపురెడ్డి సామ్రాజ్యంతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా ఏప్రిల్ 5 న మూవీ రిలీజ్ కానుంది. రీసెంట్ గా 'లవ్ యువర్ ఫాదర్'(Lyu)ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మేడ్చల్ ఏంఎల్ఏ మాజీ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Chamakura mallareddy)హాజరవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ప్రసంగించిన మల్లారెడ్డి చిత్ర బృందానికి విషెస్ చెప్పాడు.హీరోయిన్ కషికా కపూర్ ని ఉద్దేశించి మాట్లాడుతు హీరోయిన్ పేరు కసికపూర్ అంట,కసికసిగా ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది.దీంతో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆడపిల్ల మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనే విమర్శలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి.  
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal)కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ఎల్ 2 ఎంపురాన్(L2 empuraan)ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదలైంది.మలయాళంతో పాటు తెలుగు,తమిళ,కన్నడ,హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా అన్ని ఏరియాల్లోను పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ కలెక్షన్స్ వివరాలని చూసుకుంటే తొలిరోజు వరల్డ్ వైడ్ గా 67.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.ఇండియా 24.50 కోట్లు గ్రాస్ వసూలు చెయ్యగా ఓవర్సీస్ లో 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.మోహన్ లాల్ కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేసాడు.ఎల్ 2 కి దర్శకత్వం వహించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆడుకాలం'వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 64 .75 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి మలయాళ చిత్ర సీమలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఇప్పుడు ఆ రికార్డుని l 2 క్రాస్ చేసినట్టయ్యింది.దీంతో ఇప్పుడు మలయాళ బిగ్గెస్ట్ ఓపెనర్ గా  l2 నిలిచిందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.డే 2 కూడా తన సత్తా చాటుతు 40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందనే వార్తలు వస్తున్నాయి.దీంతో రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని,రాబోయే రోజుల్లో మలయాళ చిత్ర సీమలో హయ్యస్ట్ గ్రాసర్ గా ఉన్న మంజుమ్మేల్ బాయ్స్ రికార్డుని ఎల్ 2 క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.మంజుమ్మేల్ బాయ్స్ 240 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇక ఎల్ 2 ని లైకా ప్రొడక్షన్స్,ఆశీర్వాద్ సినిమాస్, గోకులం మూవీస్ పై సుభాస్కరాన్ ,ఆంథోనీ పెరంబవుర్, గోకులం గోపాలన్ నిర్మించగా పృథ్వీరాజ్ సుకుమారన్,మంజువారియర్,టోవినో థామస్, అభిమన్యు సింగ్,ఆండ్రియా తివాదర్, జెరోమ్ ప్లిన్, బోరిస్ ఆలివర్, కిషోర్,ఎరిక్ ఎబోని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  
2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్'(Mad)మూవీ సాధించిన సంచలన విజయం అందరకి తెలిసిందే.ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకోగా,నిన్నఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన 'మ్యాడ్ స్క్వేర్'(Mad Square)వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 16 కోట్ల గ్రాస్ ని సాధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై మేకర్స్ అధికార ప్రకటన చెయ్యాల్సి ఉంది.మూవీకి అయితే  ప్రేక్షకుల దగ్గరనుంచి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.దీంతో వీకెండ్స్ లో భారీగా కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వారు అంచనా వేస్తున్నారు. మ్యాడ్ కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్(Kalyan Shankar)'మ్యాడ్ స్క్వేర్'కి కూడా దర్శకత్వం వహించాడు.అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగవంశీ(Naga vamsi)ఫస్ట్ పార్ట్ ని మించి సెకండ్ పార్ట్ ని నిర్మించగా నార్నేనితిన్(Narne Nithin)సంగీత్ శోభన్,రామ్ నితిన్,ప్రియాంక జవాల్కర్,విష్ణుఓయ్,మురళిధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.భీమ్స్ సిసిరోలియో(Bheems ceciroleo)సంగీతాన్నిథమన్(Thaman)బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు.  
Cast: Nithiin, Sreeleela, Rajendra Prasad, Vennela Kishore, David Warner, Devadatta Nage Crew:  Music Direction by GV Prakash Kumar Cinematography by Sai Sriram Edited by Koti Written & Directed by Venky Kudumula Produced by Naveen Yerneni and Y Ravi Shankar Robinhood has been one of the most actively and creatively publicized movies of Telugu Cinema in recent times. The movie has been able to create good buzz prior to release. Nithiin, Sreeleela have promised a thorough entertainer with the film and Venky Kudumula delivered two blockbusters like Chalo and Bheeshma prior to this film. Let's discuss about the film produced by Mythri Movie Makers, in detail.  Plot:  Ram (Nithiin) is an orphan and he turns into Robinhood to help his orphanage and everyone in the country to survive. He starts to steal from those cheaters who showcase compassion for publicity sake and give false promises. During one operation, he gets to know that a Police Officer is coming closer to him and decides to not engage in operations and join a security agency. Nira Vasudev (Sreeleela) appoints his security agency as her primary security for her India visit to her parental village. But the village is under control of Swami (Devadatta Nage) and he grows cannabis there. How will Robinhood solve this issue? Watch the movie in theatres to know more.  Analysis:  Nithiin is good in this role and his looks, performance are an asset. Sreeleela looked glamorous and did well in emotional scenes. Her comic timing in few scenes could have been better but she did well. Rajendra Prasad and Vennela Kishore comedy scenes are good but they did not work out at the level that we anticipate. Devadatta Nage has a generic villainous role and David Warner cameo is good.  Technically, the movie is good as Sai Sriram could bring visual grandeur to the film. But his over utilisation of pastels and concentrated highlights does make the frame look a little bit artificial. VFX could have been better and editing at places feels rushed and random. Music by GV Prakash Kumar is good to listen individually but the placement of songs in screenplay did not help them much. His Background score is good enough.  Venky Kudumula could create funny scenes still sticking to a commercial formula with Chalo and Bheeshma. Here, he tried to mix many elements and narrate few things with sugar coating of comedy all over. But certain sequences have been so over the top that it is hard to swallow humor in them. His one-liners have come good at few places while looked out of place at many. Still, he delivered a passable time pass flick.  The movie could have used a little bit more concentration on the emotional thread rather than hinting it as a twist. It would have worked better with a narrative that carries us with the emotions along with the adventure, comedy. Few scenes looked too obvious and forced for the commerical aspects. As the movie keeps a good smile on our face throughout, it is fine to watch for time pass at theatres.  In Conclusion:  Robinhood works fairly when comedy is at the offing but emotionally doesn't connect.  Rating: 2.5/5 
గత కొన్నిరోజులుగా బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్లపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలు, 25 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగానే విచారణకు హాజరు కావాల్సింది అందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొదట యాంకర్‌, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు నోటీసులు ఇవ్వగా, ఆమె క్వాష్‌ పిటిషన్‌ వేశారు. దాన్ని విచారించిన హైకోర్టు శ్యామలను అరెస్ట్‌ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణకు పోలీసులకు సహకరించాలని ఆమెకు సూచించింది కోర్టు.  ఇదిలా ఉంటే.. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌లో నిందితురాలిగా ఉన్న యాంకర్‌ విష్ణుప్రియకు కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు. దాంతో ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు ఆమె హాజరైంది. అలాగే ఈనెల 25న మరోసారి ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తనపై నమోదైన రెండు కేసులను క్వాష్‌ చెయ్యాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్‌ దాఖలు చేసింది. శుక్రవారం ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసేందుకు నిరాకరించింది. విష్ణుప్రియను విచారించాల్సిందేనని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అలాగే విచారణ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. 
  నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’  4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది.   1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా మార్చి 30, ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ తో సహా చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్ లో రీ- రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్.   ఈ సందర్బంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ "నందమూరి బాలకృష్ణ గారు రెండు విభిన్న పాత్రల్లో అలరించి, మా సంస్థకి భారీ విజయాన్ని, చిరస్మరణీయ గుర్తింపుని అందించిన "ఆదిత్య 369" చిత్రాన్ని ఏప్రిల్ 4న రీ-రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా సమక్షంలో ఈ ఉగాదికి రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశాము. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. చక్కని థియేటర్లు కూడా లభించడంతో వైభవంగా రీ-రిలీజ్ చేస్తున్నాం" అన్నారు.  
బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో హృతిక్ రోషన్(Hrithik Roshan)కూడా ఒకడు.రెండున్నర దశాబ్దాల నుంచి తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు.ప్రస్తుతం తన కొత్త మూవీ వార్ 2(war 2)తో బిజీగా ఉన్నాడు.టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్(Ntr)తో కలిసి వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.తన నెక్స్ట్ మూవీగా క్రిష్ సిరీస్ కి కొనసాగింపుగా వస్తున్న క్రిష్ 4 చెయ్యబోతున్నాడు.ఇప్పటికి వరకు వచ్చిన మూడు భాగాలకి దర్శకత్వం వహించిన రాకేష్ రోషన్ నే నాలగవ భాగానికి దర్శకుడని అందరు అనుకున్నారు.కానీ ఇటివల ఒక ఇంటర్వ్యూ లో రాకేష్ రోషన్(Rakesh Roshan)మాట్లాడుతు క్రిష్ 4(krrish 4)కి నేను దర్శకత్వం వహించడం లేదని చెప్పడం జరిగింది.దీంతో దర్శకుడుగా ఎవరు చేస్తారనే చర్చ బాలీవుడ్ సర్కిల్స్ లో గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా రాకేష్ రోషన్ 'ఎక్స్ 'వేదికగా హృతిక్ రోషన్ ని ఉద్దేశించి పోస్ట్ చేస్తు ఇరవై ఐదేళ్ల క్రితం నిన్ను యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాను.ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదేళ్ల తర్వాత ఆదిత్య చోప్రా,నేను కలిసి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.ప్రతిష్టాత్మక క్రిష్ 4 కి నువ్వు దర్శకుడిగా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటు పోస్ట్ చేసాడు. బాలీవుడ్ సినీ రంగంలో హృతిక్ లాంటి ఒక బిగ్ స్టార్ తన సినిమాకి తానే దర్శకత్వం వహించడం,పైగా క్రిష్ 4 లాంటి ఒక ప్రెస్టేజియస్ట్ మూవీకి దర్శకత్వం వహించడంతో ఈ న్యూస్ ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.క్రిష్ 4 ని మొదటి మూడు పార్టులు మించి హాలీవుడ్ రేంజ్ లో 700 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్నాయి.మూవీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.రాకేష్ రోషన్, హృతిక్ తండ్రి కొడుకులనే విషయం తెలిసిందే.హృతిక్ ఫస్ట్ మూవీ 'కహోనా ప్యార్ హై' కి రాకేష్ రోషనే దర్శకుడు.  
దాదాపు 50 సంవత్సరాలపాటు తమిళ సినీ రంగంలో నటుడుగా తనదంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేశారు శివాజీగణేశన్‌. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించిన ఆయన సౌత్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న శివాజీకి ఇద్దరు కుమారులు రామ్‌కుమార్‌, ప్రభు. నటుడిగా, నిర్మాతగా రాణించి తండ్రి పేరును నిలబెట్టారు ప్రభు. ఈ కుటుంబానికి తమిళనాడులోనే కాదు, సౌత్‌లో ఎంతో మంచి పేరు ఉంది. 2001లో 72 ఏళ్ళ వయసులో కన్నుమూసారు శివాజీ గణేశన్‌. ఇప్పుడు ఆయన నివాసం ఉన్న ఇల్లు కోర్టు వివాదంలో ఇరుక్కుంది. అంత పెద్ద ఫ్యామిలీకి చెందిన ఆస్తి కోర్టు వరకు వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే.. శివాజీ పెద్ద కొడుకు రామ్‌కుమార్‌ కొడుకు దుష్యంత్‌, అతని భార్యతో కలిసి ధనభాగ్యం అనే ఫైనాన్స్‌ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. విష్ణు విశాల్‌ హీరోగా ఎజిల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జగజాల కిలాడీ’ చిత్ర నిర్మాణం కోసం దుష్యంత్‌ ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టారు. ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో దుష్యంత్‌ విఫలమయ్యాడు. దీంతో ధనభాగ్యం కంపెనీ కోర్టులో కేసు వేసింది. అంతటితో ఆగకుండా టి నగర్‌లో ఉన్న శివాజీ గణేశన్‌ ఇంటిని జప్తు చేసి వేలం వేయాలని ఆ కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఆ కేసును విచారణకు తీసుకున్న కోర్టు దుష్యంత్‌కు నోటీసులు జారీ చేసింది. కానీ, అతను సమాధానం ఇవ్వలేదు. అయినప్పటికీ కోర్టు మరి కొంత సమయం ఇచ్చింది. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ధనభాగ్యం కంపెనీ కోరినట్టుగా శివాజీ గణేశన్‌ ఇంటిని జప్తు చేయాలని ఆర్దర్‌ వేసింది.  కోర్టు వేసిన ఆర్డర్‌ చూసి ప్రభు షాక్‌ అయ్యారు. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రభు పిటిషన్‌ వేశారు. అందులో.. తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలోనే ఆ ఇల్లును తన పేరు మీద రాశారని, అది తన సొంతం అని, రామ్‌కుమార్‌ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తన సొంత ఇంటిని జప్తు చేయడానికి ఆర్డర్‌ వేయడంతో తాను షాక్‌ అయ్యానని తెలిపారు. ఇల్లు తన పేరు మీదే ఉందని, అందులో సోదరుడు రామ్‌కుమార్‌కి ఎలాంటి హక్కు లేదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. వెంటనే జప్తు ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలని ఆ పిటిషన్‌లో ప్రభు కోరారు. వచ్చే వారం ఈ కేసు విచారణకు రాబోతోంది. ప్రభు వేసిన పిటిషన్‌ కారణంగా తీర్పు అతనికే అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కోర్టు వేసిన జప్తు ఆర్డర్‌ చూసి షాక్‌ అయిన ప్రభు.. అది తన సొంతమని, అన్నయ్య కుటుంబానికి ఇందులో ఎలాంటి హక్కు లేదని పిటిషన్‌ వేసి షాక్‌ ఇచ్చారు. 
నితిన్(Nithiin)శ్రీలీల(sreeleela)కాంబోలో తెరకెక్కిన 'రాబిన్ హుడ్'(Robin Hood)మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.'భీష్మ'మూవీతో నితిన్ ని వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసిన'వెంకీ కుడుముల'(Venki Kudumula)దర్శకత్వంలో రాబిన్ హుడ్ తెరకెక్కగా,మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు నితిన్ ని వెంకీ మళ్ళీ హిట్ ట్రాక్ మీదకి తీసుకొచ్చాడనే మాట చెప్తున్నారు. నితిన్ ఈ రోజు తిరుమల తిరుపతి(Tirupathi)లో కొలువు తీరిన శ్రీ ఏడుకొండల వాడిని దర్శనం చేసుకోవడం జరిగింది.స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతు ఈ రోజు నేను నటించిన రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా తిరుమల వచ్చి స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.రాబిన్ హుడ్ ని ఇటివల పుష్ప 2(Pushpa 2)తో భారీ హిట్ ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది. రాజేంద్ర ప్రసాద్,వెన్నెల కిషోర్,షైన్ టామ్ చాకో,లాల్,శుభలేఖ సుధాకర్,సిజ్జు,ఆడుకాలం నరేన్, దేవ్ దత్త నాగే వంటి వారు ప్రధాన పాత్రలు పోషించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.డేవిడ్ అనే డ్రగ్ డీలర్ క్యారక్టర్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్,ప్రముఖ హీరోయిన్ కేతికాశర్మ ప్రత్యేక గీతంలో చేసారు.    
సినిమా ఇండస్ట్రీలో రకరకాల వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు టైటిల్‌ గురించి వివాదం నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో తన కథ కాపీ కొట్టారంటూ ఒకరు కేసు పెడతారు. ఇలాంటి వివాదాలు సర్వసాధారణం. అయితే ఇప్పుడు మరో కొత్త వివాదం కోర్టు వరకు వెళ్లింది. అది కూడా ఒక బయోపిక్‌ కావడం విశేషం. రామకృష్ణ దర్శకత్వంలో ‘డొక్కా సీతమ్మ’ పేరుతో వి.ప్రభాకర్‌గౌడ్‌ ఓ బయోపిక్‌ను నిర్మిస్తున్న ప్రకటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సెట్స్‌కి వెళ్ళకముందే ఈ సినిమా చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. అదే కథతో మరో సంస్థ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలుసుకున్న ప్రభాకర్‌గౌడ్‌ కోర్టును ఆశ్రయించారు.  2016లో డొక్కా సీతమ్మ స్క్రిప్ట్‌ని తెలుగు రచయితల సంఘంలో రిజిస్టర్‌ చేశారు ప్రభాకర్‌గౌడ్‌. సినిమాను ప్రారంభించేందుకు సిద్ధపడుతుండగా మరొక సంస్థ ఇదే కథతో సినిమాను ప్లాన్‌ చేశారని తెలిసి కోర్టుకు వెళ్లారు. కాపీరైట్‌ యాక్ట్‌ తమకు ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉండడంతో సినిమాను నిర్మించేందుకు ముందుకు వెళ్లలేకపోతున్నామని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కథతో ఇద్దరు నిర్మాతలు సినిమాలు తీసేందుకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే డొక్కా సీతమ్మ అనే వ్యక్తి గురించి విననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది. విదేశాల్లో సైతం ఆమె గురించి ప్రముఖంగా చెప్పుకుంటారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవితకథ తెరకెక్కడానికి ఇన్ని అవరోధాలు ఎదురుకావడం నిజంగా దురదృష్టమే.  తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణగానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్తంగా ఉన్న లంకల గన్నవరం అనే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతాలలో తరచూ వచ్చే వరదల కారణంగా అతివృష్టి, అనావృష్టి ఏర్పడి పలు ఇబ్బందులకు గురవుతున్న ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకుంటూ తన ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహాఇల్లాలు. చదువు సంధ్యలు లేని సీతమ్మ ఓ సాధారణ స్త్రీ. నిత్యాన్నదానం చేయడం ద్వారా విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా ‘అతిథి దేవోభవ’ అన్నపదానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తి ఆమె.  ఆరోజుల్లోనే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆమె ధాతృత్వాన్ని గుర్తించింది. కింగ్డ్‌ ఎడ్వర్డ్‌ ఆమెను తన వార్షికోత్సవానికి భారతదేశంలోని ఇతర అతిథులతో కలిసి రావాల్సిందిగా డొక్కా సీతమ్మను ఆహ్వానించారు. గౌరవంతో ఆమెను ఢల్లీికి తీసుకురావాలని ఆయన మద్రాస్‌ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కానీ, మర్యాదగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు సీతమ్మ. ప్రచారం కోసం తాను సేవలను అందించడం లేదని స్పష్టం చేశారు. దాంతో మద్రాసు ప్రధాన కార్యదర్శి.. సీతమ్మకు బదులుగా ఆమె ఫోటోను తీసుకొని వెళ్లారు. ఆ వేడుకలో సీతమ్మకు కేటాయించిన కుర్చీపై ఆ ఫోటోను ఉంచి ఆమెపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు కింగ్‌ ఎడ్వర్డ్‌. అంతటి మహనీయ చరిత్ర కలిగిన డొక్కా సీతమ్మ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఇన్ని అవాంతరాలు ఎదురు కావడం గమనార్హం. ఆమె గొప్పదనాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన ఫథకానికి ‘డొక్కా సీతమ్మ’ పేరు పెట్టింది. అన్నా క్యాంటీన్ల మాదిరిగానే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ప్రారంభిస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరడం విశేషం.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మహిళలు అంటే వంటింటి కుందేళ్లు అని అనుకుంటారు. కానీ ఇంటి గడప దాటి ఉద్యోగాలు చేయడం నుండి వివిధ పోరాటాలలో పాల్గొనడం వరకు మహిళలు ఎందులోనూ తీసిపోరు. తాజాగా సునితా విలియమ్స్ అంతరిక్షాన్నే జయించి సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చారు. అయితే ప్రపంచం అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో జరిగిన  మహిళల పోరాటం చాలా మందికి తెలియదు.   1947 సంవత్సరం దేశం మొత్తం స్వాతంత్ర్యం పొందింది. అయితే, దానిలో ఒక చిన్న భాగం అయిన గోవా మాత్రం  మరో 14 సంవత్సరాలు పోర్చుగీస్ నియంత్రణలో ఉంది. 1961లో మాత్రమే గోవా  విముక్తి పొందింది. 400 సంవత్సరాల వలస పాలనకు ముగింపు పలికింది. ఆ సంవత్సరాల్లో నిరంతర ఆక్రమణలో ఒక నిశ్శబ్ద విప్లవం పుట్టుకొచ్చింది. స్వేచ్ఛను కోరుతూ వినిపించిన లెక్కలేనన్ని స్వరాలలో, లొంగిపోవడానికి నిరాకరించిన ధైర్యవంతులైన మహిళలు ఉన్నారు . గోవా విముక్తి కోసం అచంచలమైన సంకల్పంతో పోరాడారు. ఈ నిర్భయ మహిళలలో కొంతమంది వారి అద్భుతమైన ధిక్కార చర్యల గురించి తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1955 ప్రాంతంలో గోవా వాసులు నమ్మే ఏకైక వార్త 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్' ద్వారా వ్యాప్తి చేయబడిన వార్త. నిజం కోసం రేడియో ప్రసారాన్ని నమ్మవచ్చు. సమయం కఠినంగా ఉంది. గోవా తనను తాను విడిపించుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తోంది. ఆ సంవత్సరాల్లో చాలా మంది మహిళలు సామాజిక ప్రతీకారం లేదా విమర్శలకు భయపడకుండా తిరుగుబాటులో ముందుకు వచ్చారు. వారిలో ఒకరు లిబియా లోబో సర్దేశాయ్. ఆమె తన భర్త వామన్ సర్దేశాయ్‌తో కలిసి ఎవరూ  గుర్తుపట్టకుండా ఉండటానికి ఒక అడవి నుండి 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్'ను ప్రారంభించారు. వారి వార్తా ప్రసారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి. జాతీయవాద మనస్తత్వాన్ని పెంచింది.   జనవరి 2025లో లిబియా తన ధైర్యసాహసాలకు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. విమోచన దినోత్సవం  19 డిసెంబర్ 1961 గోవా స్వేచ్ఛను రుచి చూసిన రోజు ఆమె మనస్సులో చెక్కుచెదరకుండా ఉంది. “గోవా విముక్తి పొందినప్పుడు, జనరల్ జెఎన్ చౌధురి [అప్పటి భారత సైన్యం  సైన్యాధ్యక్షుడు] మా వద్దకు వచ్చి స్వయంగా వార్తలను అందించారు. నాకు ఎలా స్పందించాలో తెలియలేదు. నేను తోట నుండి ఒక పువ్వును తీసుకొని అతనికి ఇచ్చాను. అతను నన్ను అడిగాడు, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?' అని. నేను 'నేను దానిని ఆకాశం నుండి ప్రకటించాలనుకుంటున్నాను' అని అన్నాను. మరుసటి రోజు గోవా విముక్తిని ప్రకటించే కరపత్రాలతో రాష్ట్రం నిండిపోయింది. మూలం ఆకాశం నుండి  లిబియా  సర్దేశాయ్ కూర్చున్న విమానం నుండి కరపత్రాలను రాష్ట్రం లో కుమ్మరించారు. ఈ  విధంగా రాష్ట్రానికి స్వేచ్ఛ అందిన వార్త విని రాష్ట్రం ఎంతగానో సొంతోషించింది.                                               *రూపశ్రీ
పుత్రోత్సాహము తండ్రికి  పుత్రుడు జన్మించినపుడె పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగ  బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతీ!! అంటాడు సుమతీ శతకకర్త.  ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగును. అని వె పద్య భావం.  సమాజంలో ముఖ్యంగా భారతీయులలో మగపిల్లాడు అంటే వంశాకురమని, వారసత్వం ఉండాలంటే మగపిల్లలే మూలమని భావిస్తారు. దానికి అనుగుణంగా భారతీయ మనస్తత్వాలు కూడా ఉంటాయి. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు అనేది భారతీయులు విశ్వసించే మాట. అయితే మగపిల్లాడు పుట్టగానే ఏ తండ్రి సంతోషపడడు. ఆ కొడుకు ప్రయోజకుడై సమాజం ఆ కొడుకును పొగిడినప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు. ఇప్పుడు కొడుకుల గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అనిపిస్తుంది.  ప్రతి సంవత్సరం మార్చి 4 వ తేదీన ఇంటర్నేషనల్ సన్స్ డే జరుపుకుంటారు. ఈ international sons day ని మార్చ్ 4వ తేదీన మాత్రమే కాకుండా.. సెప్టెంబర్ 28వ తేదీ కూడా జరుపుకుంటారు.  పుత్రుల దినోత్సవం ఎందుకు??  ఇప్పటి కాలంలో మగపిల్లలను కలిగున్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది?? మగపిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్న సంఘటనలు చాలా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. సమాజంలో తల్లిదండ్రులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న మగపిల్లలు వారి తల్లిదండ్రుల బాధకు, కష్టాలకు కారణం అవుతున్నారు. తల్లిదండ్రుల స్థితిగతులు తెలుసుకోలేని నిర్లక్ష్యంలో ఎంతోమంది సుపుత్రులు ఉన్నారు.  మగపిల్లల ప్రవర్తన ఏదైనా సరే అది తల్లిదండ్రుల ఆలోచనలు, వారి పెంపకం, వారు మగపిల్లలకు ఇస్తున్న స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉంటుంది. చిన్నతనంలోనూ, కుర్రాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొడుకులకు ఇచ్చే స్వేచ్చనే వారిని పెద్దయ్యాక నిర్లక్ష్య వ్యక్తిత్వం కలవారిగా మారుస్తుంది.  మగాడికేంటి పుట్టగోచి పెట్టుకుని బయటకు వెళ్లగలడు నువ్వు అలాగ వెళ్తావా అనేది చాలామంది ఆడ, మగపిల్లలు ఉన్న ఇళ్లలో ఆడపిల్లలను ఉద్దేశించి తల్లులు చెప్పే మాట. కొడుకుల మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో అంతకు మించి బాధ్యత కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతను వదిలిపెట్టి మగజాతి అంటేనే ఏదో బాధ్యతలు మోసుకుతిరిగే వర్గమని, వారికి ఏ విషయం చెప్పక్కర్లేదులే అని అనుకుంటే బాధ్యత లేని కొడుకులను తయారుచేసినట్టే.. ఎవరితో మాట్లాడుతున్నావ్, ఎంత ఖర్చు చేశావ్, దేనికోసం ఖర్చు చేశావ్?? ఎందుకింత లేటుగా వచ్చావ్?? మగపిల్లలతో మాటలేంటి?? పద్దతిగా, బుద్దిగా ఉండు. వంటి మాటలు మీ కూతుళ్లకు చెప్పేముందు కొడుకులకు కూడా ఇంకొంచెం గట్టిగా, అంతకు మించి బాధ్యతగా చెప్పండి. అడిగిందల్లా చేతిలో పెడుతూ ఆడపిల్లలకు ఎందుకులే డబ్బు వంటి మాటలు కట్టి పెట్టి మగపిల్లలకు కూడా డబ్బు విషయంలో కట్టడి చేయండి. ఇలా చేస్తే డబ్బు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం వారికి కూడా అర్థమైతుంది. సులువుగా చేతిలోకి డబ్బు వస్తుంటే ఎవరికి అయితే విలువ అర్థం కాదు.విలువ అర్థం కానప్పుడు మనుషుల కష్టం, మనుషుల విలువ కూడా వారికి తెలియదు.  ప్రస్తుత కాలంలో కొడుకులు ఉండీ వృద్ధాశ్రమాలలో బ్రతుకు వెళ్లదీస్తున్న పెద్దలను గుర్తు చేసుకొని అయినా మగపిల్లలకు విలువలు, బాధ్యతల గురించి చెప్పండి. మీ కొడుకులు పెడదోవ పడితే వారిని అందరూ నిందిస్తుంటే బాధపడేది మీరే.. కాబట్టి అబ్బాయిలకూ మంచి నడవడిక నేర్పించండి. అప్పుడే వారు ఉదయించే సూర్యుడిలా తల్లిదండ్రుల కళ్ళకు వెలుగు పంచగలడు.                                    ◆నిశ్శబ్ద.
  రంగస్థలం.. పేరు వినగానే రామ్ చరణ్ గుర్తొస్తాడు. ఆ సినిమా స్టోరీ మొత్తం కళ్ల ముందు కదులుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నది రంగస్థలం సినిమా గురించి కాదు.  అసలైన రంగస్థలం గురించి. ప్రజలకు కనువిందు చేసే థియేటర్ ప్రాముఖ్యత గురించి,ఈ థియేటర్ అనేది కేవలం సినిమానే కాదు.. నాటకరంగాన్ని,  ఎన్నో రకాల షో లను కూడా ప్రజలకు పరిచయం చేసింది. ప్రతి సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా రంగస్థలం గురించి,  దీని చరిత్ర గురించి,  రంగస్థలం అభివృద్ది చెందిన విధానం గురించి తెలుసుకుంటే.. రంగస్థలం అనేది  మానవ స్వభావాన్ని వ్యక్తీకరించే సాధనంగా పనిచేస్తుంది.  మానవ అనుభవాలు,  భావోద్వేగాలలో ఉండే వైవిధ్యాలు, భావోద్వేగాలలో దాగిన విషాదం, సంతోషం,  ఈర్ష్య,  అసూయ,  జాలి, దయ.. ఇలాంటివన్నీ  లోతుగా పరిశీలించి, ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు రంగస్థలం కల్పిస్తుంది.  ఇది కేవలం వినోదం మాత్రమే కాదు..  విద్య,  సామాజిక మార్పుకు కూడా శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్రాముఖ్యత.. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ITI) 1961లో ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ప్రారంభించింది. మార్చి 27న పారిస్‌లో 1962లో "థియేటర్ ఆఫ్ నేషన్స్ సీజన్"  నిర్వహించబడటంతో ఇది ప్రారంభం అయింది. అప్పటి నుండి  ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగస్థల ప్రదర్శన కూడా గొప్ప కళారూపం. ఈ కళారూపాన్ని ప్రోత్సహించడం,  ప్రభుత్వాలు, వ్యక్తులు,  సంస్థలు నాటక సమాజానికి మద్దతు ఇవ్వడానికి,  ప్రోత్సహించడానికి కృషి చేయడం. ఈ రోజున ప్రజలు అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రసంగాలు,  నాటక సమాజాలు కార్యక్రమాలు, అవార్డు వేడుకలు,  ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా రంగస్థల దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటారు. రోజువారీ హడావిడి జీవితాలలో థియేటర్ అనేది ప్రజలకు కొద్దిసేపు అన్ని గోలలు మరచిపోయి కాస్త వినోదాన్ని,  మరికొంద ప్రశాంతతను పంచే వేదిక. సాధారణ పౌరుడి నుండి విలాసవంతమైన జీవితం గడిపే వారి వరకు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక దశలో,  సందర్భంలో ఈ థియేటర్ తో ముడి పడి ఉంటుంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు జరిగే కొన్ని కార్యకలాపాలు.. ప్రత్యేక థియేటర్ ప్రదర్శనలు.. చాలా థియేటర్లు ప్రత్యేక నాటకాలు ,  రంగస్థల ప్రదర్శనలను నిర్వహిస్తాయి. కొన్ని ప్రొడక్షన్స్ ప్రేక్షకులను థియేటర్‌తో నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించడానికి ఉచిత లేదా తగ్గింపు టిక్కెట్లను అందిస్తాయి.  అంతర్జాతీయ సందేశం.. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటక రంగం ప్రముఖుడు ప్రపంచ నాటక దినోత్సవ సందేశాన్ని వ్రాసి అందజేస్తాడు.  ఇది ప్రపంచవ్యాప్తంగా పంచుకోబడుతుంది. ఈ సందేశం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నాటక రంగానికి ఉన్న శక్తిని తెలియజేస్తుంది. కళకు తమను తాము అంకితం చేసుకున్న వారు ఈ సందర్భంగా గుర్తించబడతారు.  తగిన గౌరవం పొందుతారు.  ఇది వ్యక్తి కళను ప్రపంచానికి మరింత విస్తృతం చేయడానికి సరైన మార్గం అవుతుంది. థియేటర్ వర్క్‌షాప్‌లు,  ప్యానెల్ చర్చలు.. థియేటర్ గ్రూపులు,  సాంస్కృతిక సంస్థలు నటన, నాటక రచన,  రంగస్థల కళపై వర్క్‌షాప్‌లు, చర్చలు,  మాస్టర్‌క్లాస్‌లను నిర్వహిస్తాయి. నిపుణులు థియేటర్  పరిణామం చెందిన విధానం,   ప్రాముఖ్యతపై తమ తమ అభిప్రాయాలు,  నాటి రాలపు సంఘటనలు  పంచుకుంటారు. వీధి నాటకాలు,  బహిరంగ ప్రదర్శనలు.. సామాజిక, సాంస్కృతిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి వీధి నాటక బృందాలు బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తాయి. విశ్వవిద్యాలయాలు,  నాటక పాఠశాలలు తరచుగా బహిరంగ ప్రదర్శనలను నిర్వహిస్తాయి. నాటక కళాకారుల గుర్తింపు.. అత్యుత్తమ నాటక కళాకారులు, నాటక రచయితలు,  ప్రదర్శకులకు కళారూపానికి చేసిన కృషికి అవార్డులు , గౌరవాలు ఇవ్వబడతాయి. సోషల్ మీడియా , ఆన్‌లైన్ ప్రచారాలు.. థియేటర్ ను ఇష్టపడేవారు,  సంస్థలు,  కథలు, కోట్స్,  మరచిపోలేని ప్రదర్శనలను పంచుకోవడానికి వరల్డ్ థియేటర్ డే వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తాయి. వర్చువల్ ప్రదర్శనలు,  ప్రత్యక్ష ప్రసారం చేయబడిన థియేటర్ ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పాల్గొనడానికి అనుమతిస్తాయి.                                       *రూపశ్రీ.
  మనిషిలో ప్రాణ శక్తి అంతా రక్తంలోనే ఉంటుంది.  రక్తం శరీరంలో ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితం కొనసాగుతుంది. అయితే చాలా మంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎక్కువ శాతం రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు.  రక్తహీనత అంటే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం. అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపించడం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో 12 పాయింట్లకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలని వైద్యులు చెబుతారు. అయితే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే మహిళలలో కొన్ని రకాల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. చర్మం... ముఖం తెల్లగా మారడం మొదలైతే చాలా మంది తాము మంచి రంగుకు మారుతున్నాం అని పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది రంగు మారడం కాదు అది  శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల చర్మం రంగు గణనీయంగా మార్పుకు లోనవుతుంది. చర్మం ఎర్రగా ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉన్నట్టు అర్థం. పొడిబారడం.. ముఖం మీద చర్మం పొడిగా మారితే అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం  కూడా  తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. నల్ల మచ్చలు.. ముఖం మీద కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం మొదలైతే  రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో రక్తం లేకపోవడానికి అతిపెద్ద సంకేతం నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు. హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో రక్తం ఎన్ని పాయింట్లు ఉందో తెలుసుకోవచ్చు. మొటిమలు రక్తం లేకపోవడం వల్ల  ముఖం మీద మొటిమలు సమస్య రావచ్చు. ఎందుకంటే తక్కువ రక్తంలో టాక్సిన్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇది మొటిమలు వంటి సమస్యలను కలిగిస్తుంది.                                       *రూపశ్రీ.
చిన్న విషయాలకే కోపంగా ఉంటారా?  ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడుతున్నారా? అవును అయితే ఇది కేవలం మానసిక స్థితిలో మార్పు మాత్రమే కాదు మీ శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి సంకేతం కూడా కావచ్చని అంటున్నారు ఆరగ్య నిపుణులు. కోపం,  చిరాకు అనేది ఒత్తిడి లేదా పని ఒత్తిడి వల్ల మాత్రమే వస్తుందని మనం తరచుగా అనుకుంటాము. కానీ వాస్తవానికి పోషకాహార లోపం కూడా దీని వెనుక ఒక పెద్ద కారణం కావచ్చు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్లు మాట్లాడుతుంటే..  లేదా ఇంట్లో వాళ్లు ఏదైనా సాధారణ పని చెబితే ఊహించని విధంగా వారి మీద అరిచేస్తుంటాం.  అలాగే స్నేహితులు,  చుట్టాలు,   తెలిసిన వారు పలకరించినప్పుడు  లేదా ఏదైనా విషయం గురించి సమాచారం అడిగినప్పుడు చిరాకుగా సమాధానం ఇస్తుంటారు.  ఎదుటి వ్యక్తులు ఈ మాత్రం దానికే ఇంత కోపమా? అని,  ఈ మాత్రం దానికే ఇలా చిరాకు పడాలా అని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇదంతా మనిషి ఒత్తిడి వల్ల కలిగే సమస్య లేదా వాతావరణం వల్ల కలిగే సమస్య కానే కాదట.  ఇది స్పష్టంగా ఆహారం వల్ల వచ్చే సమస్య కూడా కావచ్చు అని అంటున్నారు ఆహార నిపుణులు,  ఆరోగ్య నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయో తెలుసుకుంటే.. మనకు ఎందుకు కోపం, చిరాకు వస్తుంది? కొన్నిసార్లు చిన్న విషయాలకే కోపంగా మాట్లాడటం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం మీ మనస్సు,  శరీర స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం,  హార్మోన్ల మార్పులు దీనికి ప్రధాన కారణాలు.  కానీ అవసరమైన పోషకాలు లేకపోవడం కూడా మానసిక స్థితిని పాడు చేస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు అందనప్పుడు నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది.  ఇది  మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం.. విటమిన్ బి కాంప్లెక్స్‌లో బి1, బి6,  బి12 వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లన్నీ మన మనస్సును ప్రశాంతంగా,  సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. వాటి లోపం మెదడులోని సెరోటోనిన్,  డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిలో మార్పులు,  కోపాన్ని పెంచుతుంది. విటమిన్ డి లోపం.. విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుంది.  కాబట్టి దీనిని 'సూర్యరశ్మి విటమిన్' అని పిలుస్తారు. దీని లోపం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  దీని లోపం వల్ల  వ్యక్తి నిరాశగా,  చిరాకుగా అనిపించవచ్చు. మీరు ఎండలో తక్కువ సమయం గడిపినట్లయితే, విటమిన్ డి స్థాయిలు తగ్గవచ్చు. మెగ్నీషియం,  జింక్ లోపం..  మానసిక స్థితిని నియంత్రించడంలో మెగ్నీషియం,  జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి లోపం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  కోపాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. విటమిన్లను ఎలా చూసుకోవాలి? ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాలు ఎండలో గడపాలి. ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పాలు,  గుడ్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. వైద్యుడి సలహా మేరకు  సప్లిమెంట్లను తీసుకోవచ్చు.  యోగా,  ధ్యానం నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఆహారంలో ప్రోటీన్ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది.  కండరాల నిర్మాణానికి,  శరీరం బలంగా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే శాకాహారులలో ప్రోటీన్ కు సంబంధించి భయాలు ఎక్కువ ఉంటాయి.  దీనికి కారణం.. ప్రోటీన్ అంటే మాంసాహారం లోనే ఉంటుందని నమ్మడం. చాలా వరకు ప్రోటీన్ కోసం అధిక శాతం మంది గుడ్లు ఎక్కువ తీసుకుంటారు.  కానీ గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన కొన్ని శాఖాహార ఆహారాలు ఉన్నాయి.  మీరు శాఖాహారులు అయి, కండరాలను బలంగా పెంచుకోవాలనుకుంటే, ఈ సూపర్‌ఫుడ్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఇవి మీ శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇవ్వడమే కాకుండా కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడతాయి.. సోయాబీన్.. సోయాబీన్‌ను శాఖాహార ప్రోటీన్లకు రాజు అంటారు. ఇందులో 100 గ్రాములకు దాదాపు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు కంటే చాలా రెట్లు ఎక్కువ! సోయాబీన్స్‌లో కండరాల నిర్మాణానికి సహాయపడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. దీనిని టోఫు, సోయా పాలు లేదా సోయా ముక్కలుగా తినవచ్చు. శనగపప్పు.. మన భారతీయ ఆహారంలో శనగపప్పు ఒక ముఖ్యమైన భాగం. 100 గ్రాముల శనగలల దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అది కాబూలి శనగలు  అయినా లేదా మినప్పప్పు అయినా రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పప్పుధాన్యాలు.. పప్పులు, పెసలు, శనగ,  మినపప్పు వంటి పప్పుధాన్యాలు ప్రోటీన్కు  అద్భుతమైన వనరులు. 100 గ్రాముల పప్పు దినుసులలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ప్రోటీన్ మాత్రమే కాకుండా ఐరన్ మరియు ఫైబర్,  పుష్కలంగా ఉంటాయి. పనీర్.. పనీర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగించబడుతుంది. 100 గ్రాముల పనీర్ ల  దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. వేరుశనగ.. వేరుశెనగలు చౌకగా ఉండటమే కాకుండా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల వేరుశెనగలో దాదాపు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిని స్నాక్ గా లేదా వేరుశెనగ వెన్న రూపంలో తినవచ్చు.                                    *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...