LATEST NEWS
పొత్తు సాకుగా చూపి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తన పబ్బం గడుపుకుంటోంది. తెలుగుదేశం వ్యతిరేకులకు కూటమి కోటాలో పదవులు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. అయినా చంద్రబాబు మిత్రధర్మం, కూటమి బంధం అంటూ క్యాడర్ ను సముదాయించడానికే ప్రయత్నిస్తున్నారు. అయితే 2019-2024 మధ్య కాలంలో అధికారంలో ఉన్న జగన్ కు వంత పాడి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజుకు ఎమ్మెల్యే కోటీ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ టికెట్ లభించడాన్ని తెలుగుదేశం క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నది. అలాగే జనసేనానిపై కూడా సోము అప్పట్లో చేసిన విమర్శలను గుర్తు చేస్తూ జనసేన క్యాడర్ కూడా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఏమిటని బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. పబ్బం గడిస్తే చాలన్నట్లుగా బీజేపీ హైకమాండ్ వ్యవహరిస్తున్నది.  ఈ నేపథ్యంలో కూటమి పార్టీల అభీష్ఠానికి వ్యితిరేకంగా బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్న సోము వీర్రాజు.. ఇప్పుడు చంద్రబాబుతో తన అనుబంధం వెరీ స్పెషల్ అంటున్నారు. ఎంత స్పెషల్ అంటే చంద్రబాబు, మోడీ మధ్య అనుబంధం ఎలాంటిదో.. చంద్రబాబుతో తన అనుబంధం కూడా అలాంటిదేననీ చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజు ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజు మాజీ సీఎం జగన్ కోవర్టు అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అదంతా అవాస్తవమని చెబుతూ 2019లో జగన్ సీఎం అయ్యేంత వరకూ తనకు ఆయనతో పరిచయం కూడా లేదన్నారు. అయితే చంద్రబాబుతో మాత్రం తొలి నుంచీ ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పుడే చంద్రబాబు తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని సోము వీర్రాజు చెప్పుకున్నారు. అయితే ఆ ఎన్నికలలో సోము అసలు పోటీ యే చేయలేదు.  ఆ తరువాత ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యారు. అయినా కూడా సోము వీర్రాజు ఎన్నడూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన సందర్భం లేదు. అంతే కాకుండా రాజధాని అమరావతి విషయంలో కూడా సోము వీర్రాజు జగన్ విధానాలనే సమర్ధించారు. జగన్ హయాంలో సోము వీర్రాజు వ్యవహార శైలిపై బీజేపీ రాష్ట్ర నేతలే మండిపడ్డారు. సోముకు వ్యతిరేకంగా బీజేపీ అధిష్ఠానానికి అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ వచ్కకచిన తరువాత సోము వీర్రాజు ఒక్క సారిగా స్వరం మార్చేశారు. తాను ఎప్పుడూ అమరావతి రాజధానికే మద్దతుగా నిలిచానని చెప్పుకొస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కోసం తాను ఎటువంటి లాబీయింగ్ చేయలేదనీ, బీజేపీ అధిష్ఠానమే తన సీనియారిటీకి గుర్తింపుగా టికెట్ ఇచ్చిందని చెప్పుకున్నారు. అంతే కాదు మీడియా ముందు ఆయన తాను ఎప్పుడూ వైసీపీకి అనుకూలంగా లేననీ, వైసీపీ విధానాలకు గట్టిగా వ్యతిరేకించాననీ చెప్పుకోవడానికి నానా తంటాలూ పడ్డారు. మీడియా ఎదుట ఆయన ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ, జగన్ హయాంలో ఆయన వ్యవహరించిన తీరును, ఆయన జగన్ అనుకూల వైఖరినీ ఎవరూ మరిచిపోరు. ఇప్పుడు తాను వైసీపీకి అనుకూలంగా ఎన్నడూ వ్యవహరించలేదని ఎంతగా చెప్పుకున్నా ఎవరినీ నమ్మించలేరు.  
దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలలో ఐటి దాడులు   రెండో రోజు కొనసాగుతున్నాయి.  తెలుగు రాష్ట్రాలతో బాటు చెన్నయ్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నగరాల్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి.  విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీచైతన్య యాజమాన్యం పన్నులు కట్టడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రత్యేక సాప్ట్ వేర్ రూపొందించి ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం ఐటీశాఖకు కోట్లాది రూపాయయలు ఎగబెట్టినట్టు సమాచారం.   దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుపుతుంది. యాజమాన్యం అక్రమ లావాదేవీలు జరుపుతున్నట్టు సమాచారంతో ఐటీ శాఖ ఏక కాలంలో దాడులు జరుపుతోంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఐటీ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. ఐటీ అధికారుల సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల తారకరామారావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే ఆయన తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతానని ప్రకటించిన తరువాత కూడా కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నిజంగా హాజరౌతారా? లేక హాజరు కోసం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసే రోజు మాత్రమే హాజరై ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ లా మిగిలిన రోజులన్నీ డుమ్మా కొట్టి ఫామ్ హౌస్ కు పరిమితమౌతారా అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.  ఎందుకంటే కేసీఆర్ తాను అసెంబ్లీకి హాజరు అవుతానని వెల్లడించారు. అదే సమయంలో బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే రోజున తాను అసెబ్లీకి హాజరౌతానని ఆయన చెప్పారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి కేవలం అటెండెన్స్ కోసమే వస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజు ఆయన ప్రసంగం తరువాత సభ వాయిదా పడుతుంది. ఆ రోజు సభలో ఇంక ఎటువంటి కార్యక్రమాలూ జరగవు.   కాగా ఈ విషయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివరణ ఇస్తూ.. గవర్నర్ ప్రసంగం రోజున మాత్రమే కాదు., ఆ తరువాత కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగే రోజులలో కేసీఆర్ సభకు హాజరౌతారన్నారు. కేసీఆర్ కుమారుడిగా తాను ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకోవడం లేదన్న కేటీఆర్.. అందుకు కారణం కాంగ్రెస్ సభ్యుల చౌకబారు వ్యాఖ్యలు, ప్రసంగాలను చూపారు.  అంతే కాదు.. కాంగ్రెస్ లో ఎవరూ కూడా కేసీఆర్ కు తగ్గ స్థాయి ఉన్నావారు లేరన్నాని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ సెంటిమెంట్ ను అర్ధం చేసుకోవచ్చు కానీ, అసలు కేసీఆర్ సభలో ఏ మేరకు క్రియాశీలంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది.   కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. అయితే ఆ హోదాలో ఆయన ఇంత వరకూ సభకు కేవలం ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు.  ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు హాజరై ప్రజా సమస్యలపై గళమెత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అదలా ఉంచితే.. తెలంగాణ రాజకీయ వర్గాలలో మాత్రం కేసీఆర్ సభకు హాజరు కావడానికి అనర్హత వేటు నుంచి తప్పించుకునేలా హాజరు వేయించుకోవడానికే అన్న చర్చ జరగుతోంది.  పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  జగన్ అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా శాసనసభ సభ్యత్వం రద్దౌతుందన్న భయంతో ఒకే ఒక్క రోజు అసెంబ్లీకి హాజరైన సంగతిని గుర్తుచేస్తున్నారు పరిశీలకులు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనర్హత వేటు భయంతో జగన్ ఫార్ములానే అనుసరిస్తున్నారని అంటున్నారు. అయితే ఇంత వరకూ తెలంగాణలో ఏ నాయకుడూ కూడా కేసీఆర్ అనర్హత గురించి మాట్లాడిన సందర్భం లేదు. అయినా నిబంధన అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే, ఆ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు బుధవారం (మార్చి 12) నుంచి ప్రారంభం అవుతాయి. మార్చి 27 వరకూ సాగుతాయి.  
హైదరాబాద్‌ హబ్సిగూడలో  విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు  తాళలేక  ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (44), కవిత (35) దంపతులు ఏడాది క్రితం  హైద్రాబాద్ హబ్సిగూడకు  బతుకుదెరువు కోసం వచ్చారు. వీరికి 10 ఏళ్ల  విశ్వాన్‌రెడ్డి , 15 ఏళ్ల శ్రీతరెడ్డి సంతానం. చంద్రశేఖర్‌రెడ్డి  ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం  సద్యోగం లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది.  ఆర్థిక సమస్యలతో ఆ కుటుంబం సతమతమయ్యింది. ఈ నేపథ్యంలో  చంద్రశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబం తిరిగిరాని లోకాలకు చేరుకుంది. సోమవారం  కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషమిచ్చి చంపేసిన తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీతరెడ్డికి  మాత్రం ఉరివేసి చంపేశారు.  పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న  భార్యాభర్తలు ఇద్దరూ ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు చంద్రశేఖర్ రెడ్డి రాసిన సుసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. మా చావులకు ఎవరూ కారణం కాదు అని ఆ నోట్ లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
కాంగోలో జరిగగిన ఘోర పడవ ప్రమాదంలో కనీసం పాతిక మంది మరణించారు. ఈ ప్రమాదం నుంచి 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఫుట్ బాల్ క్రీడాకారులు కూడా ఉన్నారు.   మై-నోంబే ప్రావిన్స్‌లో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొని క్రీడాకారులు తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న పడవ క్వా నదిలో బోల్తాపడటంతో ఆ ప్రమాదం జరిగింది.   
ALSO ON TELUGUONE N E W S
డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఒక సినిమా స్టార్ట్‌ చేశాడూ అంటే అది పూర్తయి రిలీజ్‌ అయ్యే వరకు దానిపైనే వర్క్‌ చేస్తాడు తప్ప మరో విషయం గురించి ఆలోచించరు. ఓ పక్క షూటింగ్‌ చేస్తూనే దాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తారు.  ఎక్కడ చూసినా తమ సినిమా గురించే చర్చ జరగాలి అనే దానిపై దృష్టి పెడతారు. దానికి తగ్గట్టుగానే పథక రచన కూడా చేస్తాడు అనే మాట ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు 12 సినిమాలు డైరెక్ట్‌ చేసిన రాజమౌళి అతని ప్రతి సినిమాకి సంబంధించి ఏదో ఒక అంశాన్ని జనంలోకి ఇంజెక్ట్‌ చేస్తాడు. దాన్ని మీడియాలో, సోషల్‌ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటారు. అదే అతనికి కావాల్సింది కూడా. అయితే సినిమా ప్రారంభమైన తర్వాత ప్రేక్షకుల్ని ఎలర్ట్‌ చేసేందుకు అలాంటి జిమ్మిక్స్‌ చేస్తాడు.  కానీ, ఇప్పుడు అతను చేస్తున్న 13వ సినిమాకి సంబంధించి ఓ కొత్త మార్గాన్ని అనుసరించ బోతున్నట్టు తెలుస్తోంది. ఓ పక్క ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. మరో పక్క రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది అనేది వాస్తవం కాదని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. షూటింగ్‌ ప్రారంభం కాని ఈ సినిమాకి అప్పుడే లీకుల బెడద పెరిగిపోయిందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సెట్‌లో స్టిల్స్‌ బయటికి వచ్చాయని, తాజాగా సినిమాలోని కీలక సన్నివేశం లీక్‌ అయిందని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను కూడా వైరల్‌ చేస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం టెస్ట్‌ షూట్‌ మాత్రమే నడుస్తోందని, అందులోని క్లిప్‌ మాత్రమే బయటికి వచ్చిందనేది తాజా సమాచారం. ఈమధ్యకాలంలో స్టార్‌ హీరోల సినిమాలకు లీకుల బెడద బాగా పెరిగిపోవడంతో తన తాజా సినిమా విషయంలో రాజమౌళి చాలా కేర్‌ తీసుకుంటున్నారు. సెట్‌లోకి సెల్‌ ఫోన్లు అనుమతించడం లేదు. టెస్ట్‌ షూట్‌లో కూడా దాన్నే పాటిస్తున్నారని తెలుస్తోంది. అంత స్ట్రిక్ట్‌గా ఉన్నప్పటికీ ఒక క్లిప్‌ బయటికి రావడం అనేది సాధారణ విషయం కాదు. రాజమౌళి స్ట్రాటజీని బట్టి చూస్తే దాన్ని కావాలనే బయటికి వదిలినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సీన్‌ను చాలా దగ్గర నుంచే షూట్‌ చేసినట్టు అర్థమవుతోంది. టెస్ట్‌ షూట్‌ సీన్సే లీక్‌ అయితే రేపు రెగ్యులర్‌ షూటింగ్‌ జరిగే సమయంలో మరెన్ని క్లిప్స్‌ బయటికి వస్తాయనేది ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం.  ఒక సినిమాకి సంబంధించి ఎన్ని లీకులు జరిగినా ఆ సినిమా ఫలితంపై వాటి ప్రభావం ఉండదని గతంలో కూడా రుజువైంది. ఈ విషయంలో అత్తారింటికి దారేది చిత్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి దాదాపు 45 నిమిషాల నిడివి ఉన్న ఫుటేజ్‌ బయటికి వచ్చేసింది. అది కూడా ఫస్ట్‌హాఫ్‌కి సంబంధించింది. అది సోషల్‌ మీడియాలో, మీడియాలో విపరీతంగా సర్క్యులేట్‌ అయింది. కానీ, దాని వల్ల సినిమాకి ఎలాంటి నష్టం జరగలేదు.. సరికదా ఒక చరిత్ర సృష్టించింది. పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. లీకుల విషయంలో దర్శకనిర్మాతలు, హీరోలు.. ఎవరూ ఆందోళన చెందడం లేదనేది వాస్తవం. మీడియా, సోషల్‌ మీడియా మాత్రం దాన్ని కొండంతలు చేసి.. కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టుగా వైరల్‌ చేసేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే సినిమాను పైసా ఖర్చు లేకుండా ప్రమోట్‌ చేసేందుకు ఎస్‌ఎస్‌ఎంబి29 యూనిట్‌ ‘లీకులు’ అనే ఆయుధాన్ని వాడుతున్నట్టు కనిపిస్తోంది. మహేష్‌తో రాజమౌళి చేస్తున్న సినిమా సెట్స్‌కి ఇంకా వెళ్ళలేదు. కానీ, రాజమౌళి దాన్ని ప్రమోట్‌ చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేయడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 
'పెళ్లి చూపులు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు ప్రియదర్శి(Priyadarshi).హీరోగా కూడా మల్లేశం,బలగం వంటి చిత్రాలతో తనేంటో నిరూపించుకున్నాడు. గత చిత్రం 'డార్లింగ్' తో పరాజయాన్ని అందుకున్న ప్రియదర్శి   ఈ నెల 14 న 'కోర్ట్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.నాచురల్ స్టార్ నాని(Nani)ఈ మూవీకి నిర్మాత కావడంతో కోర్ట్ పై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది.  ప్రియదర్శి రీసెంట్ గా ఒక  ఇంటర్వ్యూలో కోర్ట్ మూవీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.ప్రియదర్శి మాట్లాడుతు కోర్ట్ మూవీలో 'సూర్యతేజ' అనే లాయర్ క్యారక్టర్ పోషించాను.ఈ క్యారక్టర్ కోసం ఎంతో రీసెర్చ్ చేశా. న్యాయవాదులు కోర్టు టైంలో ఎలా ఉంటారు.వాళ్ళ బాడీలాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది.న్యాయమూర్తులతో ఏ విధంగా మాట్లాడతారు అనే విషయాలని కోర్టులకి వెళ్లి  గమించాను.స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సస్ రాధాకృష్ణ మా కోర్టు కథకి స్ఫూర్తి.'ఫోక్సో' చట్టం అంటే ఏమిటి దానిని ఏ విషయంలో అమలు చేస్తారు. ఒక అమాయక కుర్రాడు ఫోక్సో కేసులో ఇరుక్కుంటే న్యాయవ్యవస్థ తనని ఎలా కాపాడిందనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.ఇందులో నేను హీరోని అని అనుకోవడం  లేదు.ప్రతి క్యారక్టర్ కూడా హీరోనే.ఏ ఒక్క క్యారక్టర్ లేకపోయినా సినిమా వర్క్ అవుట్ అవ్వదని చెప్పుకొచ్చాడు.సాయికుమార్,శుభలేఖ సుధాకర్,శివాజీ,శ్రీదేవి,రోహిణి, హర్షవర్ధన్,హర్ష  రోషన్, రాజశేఖర్ అనింగి,సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా నూతన దర్శకుడు రామ్ జగదీష్(Ram jagadeesh)ఎంతో రీసెర్చ్ చేసి ఈ కోర్ట్ మూవీని తెరకెక్కించాడు.    
  దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ది పారడైస్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కథా నేపథ్యం, నాని గెటప్ చూసి అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. రెండు జడలు, ముక్కుపుడుకతో నెవెర్ బిఫోర్ లుక్ లో నాని కనిపించాడు. అయితే ఈ సినిమాలో నాని రోల్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. (The Paradise)   'పారడైస్'లో నాని ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపిస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియదు కానీ, ఒకవేళ నిజమైతే మాత్రం.. ఇది సెన్సేషన్ అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో లేడీ గెటప్ వేసిన స్టార్స్ ఉన్నారు కానీ, ట్రాన్స్ జెండర్ రోల్ చేసిన స్టార్స్ లేరనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు నాని ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తే.. ఖచ్చితంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది అనడంలో సందేహం లేదు. పైగా నాని.. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ట్రాన్స్ జెండర్ పాత్ర పోషిస్తే.. నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు.   ఇక 'పారడైస్' మూవీకి సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. 'పారడైస్'ను రెండు భాగాలుగా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఉన్నాడట. నిర్మాత సుధాకర్ చెరుకూరి సైతం రెండు భాగాలు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారట. అయితే నాని మాత్రం నో అంటున్నాడట. బాహుబలి నుంచి ఈ రెండు పార్ట్ ల ట్రెండ్ ఊపందుకుంది. భారీ సినిమాలు అన్నింటినీ రెండు భాగాలుగా చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలా అన్ని సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండంపై ప్రేక్షకుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. అందుకే నాని.. "రెండు భాగాలు వద్దు, ఒకే సినిమా ముద్దు" అంటున్నాడట. రన్ టైం ఎక్కువైనా పర్లేదు కానీ, చెప్పాలనుకున్న కథని ఎఫెక్టివ్ గా ఒకే సినిమాలో చెప్పేద్దామని నాని సూచించాడట. మరి నాని అదే మాటకు కట్టుబడి ఉంటాడో లేక షూటింగ్ మధ్యలో దర్శకనిర్మాతల ఆలోచనకు తగ్గట్టుగా రెండు పార్ట్ ల వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.  
స్టార్ కొరియోగ్రాఫర్ 'శేఖర్ మాస్టర్'(Sekhar master)గురించి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. రెండు దశాబ్డల నుంచి కొనసాగుతు వస్తున్న తన సినీజర్నీలో ఎన్నో పాటలకి అద్భుతమైన కోరియోగ్రాఫ్ ని అందిస్తు వస్తున్నాడు.జనతా గ్యారేజ్ లోని 'నేను పక్కా లోకల్', 'దివి నుంచి భువికొచ్చావా ఆపిల్ బ్యూటీ',బ్రూస్ లీ లోని 'కుంగ్ ఫూ కుమారి, ఫిదా నుంచి 'వచ్చిండే', సరైనోడు లో 'బ్లాక్ బస్టర్', ఖైదీ నెంబర్ 150 లోని 'అమ్మడు లెట్స్ డు  కుమ్ముడు', దువ్వాడ జగన్నాధం 'సిటిమార్' సాంగ్, ఇస్మార్ట్ శంకర్ 'దిమాక్ ఖరాబ్, గుండె జారీ గల్లతయ్యింది నుంచి టైటిల్ సాంగ్, అల వైకుంఠ పురంలోని 'రాములో  రాములా',ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలకి తనదయిన స్టైల్లో స్టెప్ లని అందించి నేటికీ ఆ స్టెప్ లని ప్రేక్షకులు ఫాలో అయ్యేలా చేస్తున్నాడు. శేఖర్ మాస్టర్ రీసెంట్ గా నితిన్(Nithiin)హీరోగా వెంకీ కుడుముల(venki Kudumala)దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ లోని ఒక సాంగ్ కి కోరియోగ్రఫీని అందించడం జరిగింది.'అదిదా స‌ర్‌ప్రైజు'(Adhi Dha Surprisu)అంటూ సాగిన ఆ సాంగ్ మూవీలో వచ్చే ఐటెం సాంగ్ అని అర్ధమవుతుంది.ప్రముఖ హీరోయిన్ కేతిక శర్మ పై ఆ సాంగ్ చిత్రీకరించడం జరిగింది.రీసెంట్ గా ఆ సాంగ్ కి సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ అవ్వగా, అందులో కేతిక చేత శేఖర్ మాస్టర్ చేయించిన హుక్ స్టెప్ పై కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.శేఖ‌ర్ మాస్ట‌ర్ ఈమ‌ధ్య శ్రుతి మించుతున్నాడేంటి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా చెయ్యడం మొదలుపెట్టారు.ఖైదీ నెంబర్ 150 లో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ లో కూడా  సిగ్నేచర్ స్టెప్ ఉంది.చరణ్ చిరంజీవి లు కూడా కలిసి ఆ స్టెప్ వేస్తారు.కాకపోతే ఆ సిగ్నేచర్ స్టెప్ లో ఎలాంటి అసభ్యత లేకుండా ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది.నేటికీ చాలా మంది ఆ స్టెప్ ని వేస్తుంటారు. కానీ రాబిన్ హుడ్ లో కేతిక శర్మ చేత చేయించిన స్టెప్ మాత్రం అంత ఆక్షేపణీయం కాదని, సోషల్ మీడియా యుగంలో అలాంటి స్టెప్స్ పిల్లలపై ప్రభావం చూపిస్తాయని సామాజిక విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.శేఖర్ మాస్టర్ ఇటీవల కంపోజ్  చేసిన మిస్టర్ బ‌చ్చ‌న్‌, డాకూ మ‌హారాజ్‌లోని  హుక్ స్టెప్పులుపై కూడా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.     
'క' లాంటి విభిన్న జోనర్ తో కూడిన మూవీతో హిట్ ట్రాక్ లో వచ్చిన 'కిరణ్ అబ్బవరం'(Kiran Abbavaram)ఈ నెల 14 న 'దిల్ రుబా'(DilRuba)అనే లవ్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'రుక్సర్ థ్రిల్లన్(Ruxar Thillan)'హీరోయిన్ గా చేస్తుండగా 'విశ్వకిరణ్'(Viswa Kiran)దర్శకత్వం వహించనున్నాడు. శివమ్ సెల్ల్యులాయిడ్స్, మరో రెండు సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా భార్య ప్రెగ్నెసీ గా ఉన్నప్పుడు మలయాళ మూవీ 'మార్కో'(Marco)కి వెళ్ళాం.అందులోని హింసకి నా భార్య చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యింది.దాంతో సెకండ్ ఆఫ్ కంప్లీట్ అవ్వకుండానే,థియేటర్ నుంచి బయటకి వచ్చేశామని చెప్పాడు.ప్రముఖ హీరోయిన్ 'రహస్య గోరఖ్' ని కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఇద్దరు కలిసి తమ మొదటి మూవీ 'రాజావారు రాణివారు' లో కలిసి నటించే సమయంలో ప్రేమలో పడటంతో పెళ్లి చేసుకున్నారు. కిరణ్ చెప్పిన 'మార్కో' మూవీ 2024 డిసెంబర్ 20 న విడుదలవ్వగా జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్(Ntr)సోదరుడుగా చేసిన'ఉన్ని ముకుందన్(Unni Mukundan)'మార్కో గా చాలా పవర్ ఫుల్ గా చేసాడు. మూవీలోని సీన్స్ అన్ని ఎక్కువభాగం చాలా హింసాత్మకంగా ఉండటమే కాకుండా, మలయాళ చిత్ర సీమలోనే అత్యంత హింసాత్మక చిత్రంగా కూడా 'మార్కో' ని సినీ  ట్రేడ్ వర్గాలు పేర్కొంటాయి.సిద్దికీ, కబీర్ సింగ్, జగదీష్ ముఖ్య పాత్రలు పోషించాగా హనీఫ్(Hanif)దర్శకత్వాన్ని వహించాడు.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 155 కోట్లు దాకా రాబట్టింది.      
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)వార్ 2(War 2)తో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithk Roshan)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండ డంతో,ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మల్టిస్టారర్ గా వార్ 2 నిలిచింది.దీన్నిబట్టి  పాన్ ఇండియా లెవల్లో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.ముంబై లో వేసిన ఒక భారీ సెట్ లో ఎన్టీఆర్,హృతిక్ తో పాటు 500 మంది డాన్సర్స్ పై ఒక భారీ సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.  అందుకు సంబంధించి రిహార్సల్స్ జరుగుతుండగా హృతిక్ కి గాయాలవడంతో,నెల రోజుల పాటు డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారని,దీంతో సాంగ్ వాయిదా పడిందనే న్యూస్ బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.మరి ఇదే నిజమైతే కనుక, అగస్టు 14 న మూవీ రిలీజ్ కావడం కష్టమనే అభిప్రాయం కూడా సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.అయితే హృతిక్ గాయం గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. నిజానికి వార్ 2  స్టార్ట్ అయినప్పట్నుంచి నేటి వరకు కూడా చిత్ర బృందం అధికారకంగా ఏ విషయాన్నీ వెల్లడి చెయ్యటం లేదు.కనీసం ఎన్టీఆర్,హృతిక్ స్టిల్స్ కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. వార్ 2 ని అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా,అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ, జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఎన్టీఆర్ నుంచి దేవర తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోయే మూవీ అయితే వార్ 2 నే.2019 లో హృతిక్, టైగర్ ష్రఫ్ కలిసి నటించిన వార్ మూవీకి సిక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతుంది.      
  గతేడాది 'దేవర'తో అలరించిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో పాటు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. వీటి తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. (NTR Nelson Movie)   తక్కువ సినిమాలతోనే కోలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్. ముఖ్యంగా రజినీకాంత్ తో చేసిన 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం 'జైలర్-2'తో  బిజీగా ఉన్నాడు. దీని తర్వాత నెల్సన్ చేయబోయే మూవీ.. ఎన్టీఆర్ తోనే అని తెలుస్తోంది. నెల్సన్ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. అంతేకాదు, ఈ సినిమాకి 'రాక్' (Rock) అనే టైటిల్ ను లాక్ చేసినట్లు వినికిడి. ఈ మూవీ 2026 లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.   ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల్లో 'వార్-2' ఆగస్టులో విడుదల కానుంది. 'డ్రాగన్' 2026 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, వేసవికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 'రాక్', 'దేవర-2' పట్టాలెక్కనున్నాయి.   
Natural Star Nani shocked everyone with his attire and raw, bold statement from his The Paradise. The movie will have him playing a "bastard" without any recognition. He will be becoming a leader of a community who are downtrodden and oppressed in fictional Secunderabad.  Srikanth Odela is directing the film and he is planning the movie in two parts, suggest new reports. It is stated that the makers are seriously considering the two parts style of making due to budget and the world of the story.  But the reports also suggest that Nani is not in favour of this segregation. He asked the director to keep the runtime over 3 hours rather than stretching over 4 hours, to make it two parts. For now, the entire team is working on the script to fine tune it before starting shoot, it seems.  Well, KGF franchise, Pushpa have become highly successful in two parts post Baahubali. Also, Kalki is planned in two parts but these films did receive criticism for stretching out the plot.  Nani is said to be very cautious about this approach and he is puhsing for single part release only. Also, there are wild rumors going around about Nani playing a transgender in the film. We have to wait and see, how the makers will decide to proceed going forward and clear the rumors.
Suriya has been accepting diverse film scripts post Kanguva debacle. He completed Retro with Karthik Subbaraj and he is shooting for his 45th film in the direction of RJ Balaji. He already signed to be part of Vetrimaaran's Vaadivaasal and his fans have been waiting for the shoot of the film, to start from long time.  Now, the latest reports suggest that Venky Atluri, who delivered a huge blockbuster like Lucky Baskhar with Dulquer Salman, has been in talks with Suriya, from some time. The recent update is that the film shoot will start before Vaadivaasal. The movie will start shooting from June, this year.  It could simultaneously be shot along with Vaadivaasal state the reports. The movie could have two leading ladies and Bhagyashri Borse, Niddhi Agerwal are being considered for these roles. The movie will talk about a sensitive issue that involves women.  While reports also suggest that it could be a biopic of a famous Indian industrialist but the latest reports suggest that a new script has been considered with highly sensitive topic. We have to wait and see how Vetrimaaran will be planning his most awaited film shoot if the reports are true.
Popular actresses from Indian Cinema are now considering special songs in recent biggies. The producers are trusting in old commercial formula of adding a special song in their films. Pooja Hegde has did a special song in Rajinikanth, Nagarjuna Akkineni starrer Coolie.  Few more actresses are said to be doing special songs. Kiara Advani is considered for special song in Yash's Toxic. Also, Shraddha Kapoor is said to be doing special song in War 2 with Hrithik Roshan and NTR. The song will be highly special like Gunguroo Toot Gaye, it seems.  Shriya Saran after many years did a special song in Suriya's Retro and the song will be highlight of the film, it seems. And another interesting rumor is that Neha Shetty, famous as Tillu's Radhika, will be appearing in a special song in Pawan Kalyan's OG, it seems.  On top of it all, for Jailer 2, makers are again approaching Tamannaah Bhatia for a special song and this time, her role has been extended further and will have scenes with Rajinikanth, as well, say the reports. So, looks the makers have decided to give glam dose to every big budget film with these special songs and popular ladies.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనందరిలోను ఒక ప్రవృత్తి వుంది అదేంటంటే…. అన్నిటితోనూ సర్దుకుపోవడం అని. దాన్నే అలవాటుపడిపోవడం అంటారు.  పరిస్థితులను నిందిస్తూ కాలం గడపడం, పరిస్థితులు వేరుగా వున్నట్లయితే, నేనూ మరో విధంగానే రూపొందేవాడిని అనో, నాకో అవకాశం ఇవ్వండి, యేం చేస్తానో చూడండి అనో, అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు అనో, ఇలా ఒకటి అని కాదు బోలెడు రకాల మన ఇబ్బందులను ఇతరులకు, పరిస్థితులకు, మన చుట్టూ ఉండే వాతావరణానికి, ఆర్థిక ఒత్తిడులకు ఇలా ఏదో ఒకదానికి అంటగట్టడానికి ప్రయత్నిస్తాము. ఈ చికాకులకు అలవాటు పడిపోయాడంటే వ్యక్తి మనసు బద్ధకంగా తయారయిపోయిందన్నమాట. మన చుట్టూ వున్న సౌందర్యానికి అలవాటు పడిపోయి దాని అస్తిత్వాన్నే గమనించకుండా వుండిపోతాము గదా! అలవాటు పడిపోకపోతే, దాన్నుంచి పరుగులు తీద్దామనుకుంటాము, ఏ మందో మాకో తీసుకుని, రాజకీయ ముఠాలలో చేరి, అరుస్తూ, వ్రాసుకుంటూ, ఆటలకు వెడుతూ గుడి గోపురానికో దర్శనానికి నడుస్తూ పారిపోదామనుకుంటాం. ఏదో మరో రకం వినోదం కల్పించుకుంటూ వాస్తవ విషయాల నుంచి ఎందుకని పరుగెత్తుకుపోదాం అనుకుంటాం?  మనకు మృత్యువు అంటే భయం. ఇది అందరికీ తెలిసిన విషయమే…. ఎవరూ మృత్యువుని ప్రేమించరు. దీనికోసం ఎన్నో రకాల సిద్ధాంతాలు, ఆశలు, విశ్వాసాలు కనిపెడతారు.  మృత్యువుకు ముసుగు వేయటానికి, అయినా వాస్తవం అలా ఇంకా నిలిచే వుంది. వాస్తవాన్ని అవగాహన చేసుకోవాలంటే మనం దానివంక చూడగలగాలి, దాని నుంచి పారిపోవడం మార్గం కాదు.  మనలో చాలమందికి బ్రతకాలన్నా భయమే, మృత్యువన్నా భయమే. మనకు కుటుంబం అంటే భయం, పదిమంది మాట అంటే భయం, ఉద్యోగం పోతుందేమోనని భయం, మన భద్రత  గురించి భయం, ఇంకా ఇలాంటివే వందలాది విషయాలను గురించి భయం. అసలు వాస్తవం ఏమిటంటే  మనకు భయం, దీన్ని చూసి దాన్ని చూసి కాదు.  వాస్తవాన్ని చూడలేక కలుగుతున్న భయం అది. మనం ఎందుకని ముఖాముఖి ఆ వాస్తవాన్ని చూడలేకపోతున్నాం??  వాస్తవాన్ని సందర్శించడం అనేది వర్తమానంలోనే సాధ్యం. కానీ  ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ దాన్ని ముందుకు రానివ్వడమే లేదు. పలాయన ప్రక్రియకు అనుగుణంగా మనమొక చక్కని వల తయారు చేసుకున్నాం కాబట్టి ఈ అలవాటులోనే చిక్కుబడి పోతున్నాం. మనుషులు అందరూ సునిశితులు, తీవ్రంగా ఆలోచించేవాళ్ళు అయితే, వారి నిబద్ధత వారికి తెలిసి రావడమే కాకుండా, అది తీసుకువచ్చే తదుపరి ప్రమాదాలు కూడా గమనించగలుగుతారు. అది ఎంత క్రౌర్యం, హింస, దుస్సహసస్థితి తీసుకు వస్తుందో తెలుసుకోగలుగుతారు. మీ నిబద్ధతలో వున్న ఈ ప్రమాదాలనన్నిటినీ గమనించినప్పుడు, పని చేయటానికి ఎందుకు పూనుకోరు?  సోమరిపోతులు కాబట్టినా ? సోమరితనం ఎలా కలుగుతుంది??  తగినంత శక్తి - జీవసత్వం లేకపోవడం వల్ల కలుగుతుంది. మీ కళ్లకు ఎదురుగా ఏదో పామో, మంటో, గుంటో వుంటే ఆ స్థూల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అవసరమయ్యే శక్తి మీకు తక్షణమే వాటిని చూసిన వెంటనే సమకూరుతుంది కదా! మరి కొన్ని జీవితకాల విషయాల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు. మాటమాత్రంగానే చూసినందువల్ల  మాటకు, ఆచరణకు వైరుధ్యం వస్తుంది. ఆ వైరుధ్యం శక్తి సంపదనంతా కొల్లగొట్టుకుపోతుంది. నిబద్ధతతో స్పష్టంగా చూసి దానిపల్ల వచ్చే ప్రమాదాలను తక్షణమే గమనించగలిగితే అప్పుడే మీరు కార్యాసక్తులవుతారు. కాబట్టి చూడడమే కార్యాచరణ.  మనలో చాలమందిమి జీవితాన్ని అశ్రద్ధగా తీసుకుంటాము. మనం పెరిగిన వాతావరణానికి అనుగుణంగా స్పందనలు, ప్రతిస్పందనలు చేస్తూ వుంటాము. ఇవన్నీ మరింత కట్టుబాటును, బంధనాన్ని తీసుకువస్తాయి. అలా వచ్చినప్పుడే మనిషికి తనమీద తనకు ఒక స్పష్టత చేకూరుతుంది.                                        ◆నిశ్శబ్ద.  
చట్టం సమాజంలో, దేశంలో ప్రతి పౌరుడికి కొండంత భరోసా ఇస్తుంది. పౌరులందరికి సమన్యాయం చేసేది చట్టమే. అయితే ఆ చట్టం సరైన విధంగా ఉంటేనే ఆ సమన్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో సమన్యాయం అనే మాట కాసింత చర్చలకు దారి తీస్తుంది.  ముఖ్యంగా లింగ సమానత్వం అనే విషయం మీద ఎప్పుడూ సమాజంలో ఏదో ఒక చర్చ,  అభిప్రాయం పుట్టుకొస్తూనే ఉంటుంది.  పదుగురికి న్యాయం అందించే న్యాయ సేవ విభాగంలో మహిళలు కూడా ప్రవేశించి,  న్యాయ దేవతలకు ప్రతి రూపంగా నిలుస్తున్నారు.  న్యాయ సేవలో మహిళల పాత్రను,  ఆవశ్యకతను గుర్తు చేస్తూ.. మహిళలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 10 వ తేదీన  అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం జరుపుకుంటారు. చట్టం గురించి  అద్భుతమైన విషయం ఏమిటంటే అది న్యాయంగా ఉండాలి. న్యాయం గుడ్డిది, పక్షపాతంతో  లేనిది,  అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. అయినప్పటికీ భారతదేశ న్యాయవ్యవస్థను  పరిశీలిస్తే ఒక విచిత్రమైన విషయాన్ని గమనించవచ్చు. న్యాయం గుడ్డిది కావచ్చు, కానీ అది చాలా స్పష్టంగా ఒక రూపంలో న్యాయాన్ని వ్యక్తం చేస్తుంది.  న్యాయం అనగానే చాలా మందికి నల్లకోటు, టై ధరించిన లాయర్ ఏ గుర్తుకువస్తాడు. ప్రతి సంవత్సరం మార్చి 10న  ప్రపంచం అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలు చట్టాన్ని  అర్థం చేసుకోగలరని న్యాయ సేవలో భాగం కాగలరని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దినోత్సవాన్ని 2021లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది.  మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2022లో జరుపుకున్నారు. న్యాయవ్యవస్థలో మహిళల సహకారాన్ని  గుర్తు చేసుకోవడానికి, న్యాయపరమైన పాత్రలను కొనసాగించడానికి ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహించడానికి దీనిని ప్రవేశపెట్టారు.  ఖతార్ రాష్ట్రంలో సాంప్రదాయకంగా లింగ సమానత్వం లేదు. కానీ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశ్యంతో దినోత్సవాన్ని ఖతార్ రాష్ట్రం రూపొందించిందని అంటున్నారు. సమన్యాయం ? భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటి.  అపారమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. అయినప్పటికీ భారతదేశ హైకోర్టులలో సిట్టింగ్ జడ్జిలలో కేవలం 14% మాత్రమే మహిళలు ఉన్నారు . ఇది గత సంవత్సరాలతో పోలిస్తే (2023లో 13%,  2022లో 11%) మెరుగుదల. కానీ, సూటిగా చెప్పాలంటే, ఇది కొద్ది శాతం మాత్రమే మెరుగైనది.  ప్రస్తుతం భారతదేశంలోని 754 హైకోర్టు న్యాయమూర్తులలో, కేవలం 106 మంది మహిళలు మాత్రమే ఉన్నారు . ఒక మహిళా న్యాయమూర్తి సగటు పదవీకాలం 4.5 సంవత్సరాలు . అంటే అన్ని న్యాయమూర్తుల మొత్తం సగటు కంటే ఒక సంవత్సరం తక్కువ.  ఇది  ఆందోళ కలిగించే అంశం . ఎందుకిలా అనే ఆలోచన వస్తే.. మహిళలకు న్యాయ విభాగంలో సరైన చోటు ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. కొన్ని హైకోర్టులు బాగానే పనిచేస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్ & హర్యానాలో 14 మంది మహిళా న్యాయమూర్తులు , మద్రాసులో 12 మంది, బొంబాయిలో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఢిల్లీలో 9 మంది ఉన్నారు, దేశ రాజధానితో పోలిస్తే ఇది  తక్కువే. ఇతర ప్రాంతాలలో అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాలలో మహిళా న్యాయమూర్తులు లేరు.  సిక్కిం, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఇతరు రాష్ట్రాలలో కేవలం ఒకరే ఉన్నారు. . జమ్మూ & కాశ్మీర్, లడఖ్ లలో ఇద్దరు.. ఇది కేవలం  నెంబర్స్ లెక్కపెట్టడంలో తమాషా చూడటం లా చాలా మందికి అనిపిస్తుందేమో..  కానీ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలలో మహిళలు లేరని చెప్పడానికి నిదర్శనం.  చట్టపరమైన నిర్ణయాలకు పురుషులు ఎక్కువగా బాధ్యత వహించడంలో సమస్య ఏమిటంటే, వారు ఎక్కువగా పురుషాధిక్య తీర్పులను తీసుకుంటారు. ఇది  దురుద్దేశంతో కాదు కానీ అలవాటు, పక్షపాతం,  చట్టపరమైన చరిత్ర అనే ఒక వాక్యాన్ని చూపి మహిళలను చిన్న సహాయక పాత్రలుగా మలిచేస్తున్నారు. మహిళా న్యాయమూర్తులు ఎందుకు చాలా తక్కువ మంది ఉన్నారని  అడిగితే అనేక రకాల నమ్మశక్యం కాని సమాధానాలు లభిస్తాయి.. మహిళలు తగినంత అర్హత కలిగి ఉండరని చాలా మంది అంటారు. కానీ చాలా  లా స్కూల్స్‌లో మహిళలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, తరచుగా వారి తరగతిలో అగ్రస్థానంలో పట్టభద్రులవుతారు. సమస్య సామర్థ్యం కాదు అవకాశం లేకపోవడం.  మహిళలకు న్యాయ విభాగంలో తగినంత అవకాశాలు ఇవ్వరు. న్యాయమూర్తి పదవికి మహిళలు దరఖాస్తు చేయరని కొందరు అంటారు. కానీ..  మహిళలు దరఖాస్తు చేయకపోవడం నిజమేనట.. ఎందుకంటే  అవి లభించవని మహిళలకు  తెలుసట. న్యాయ నియామకాలను కొలీజియంలు (ముఖ్యంగా, కొత్త నియామకాలను సిఫార్సు చేసే సీనియర్ న్యాయమూర్తుల చిన్న సమూహాలు) నిర్ణయిస్తాయి. ఈ సమూహాలు చారిత్రాత్మకంగా పూర్తిగా పురుషులతో కూడుకున్నవి, అంటే వారు సహజంగానే ఎక్కువ మంది పురుషులను ప్రోత్సహించడం వైపు మొగ్గు చూపుతారు. న్యాయవాద వృత్తికి సమయం ఎక్కువ కేటాయించాలని చెబుతారు.  కానీ అది నిజం కాదు.. మహిళలు వంటగదిలో ఉండటమే మంచిది అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన చాలామందిలో ఉండిపోయింది.  ఇలా మహిళలకు చాలా విధాలుగా న్యాయ విభాగంలో అడ్డుగోడలు ఉన్నాయి.  మహిళలు ఈ విభాగంలో రాణించాలంటే అందరి తోడ్పాటు, ప్రోత్సాహం తప్పకుండా లభించాలి.   అప్పుడే  న్యాయ దేవతలాగా, మహిళా న్యాయ మూర్తులు న్యాయాన్ని త్రాసులో సమంగా తూచగలుగుతారు.                                      *రూపశ్రీ.
  ఆడవారిని ప్రకృతిలా భావిస్తారు.  శక్తిగా పూజిస్తారు.  అలాంటి ఆడవారి గౌరవార్థం, వారికి ప్రత్యేక గుర్తింపు,  వారి హక్కులు,  వారి లక్ష్యాలు, వారి కలల గురించి ప్రోత్సాహం ఇచ్చేందుకు.. ఇలా ఎన్నో అంశాలు దృష్టిలో ఉంచుకుని మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.  ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాలలో మహిళల విజయాలను, ప్రయత్నాలను గౌరవించడానికి ఒక ప్రపంచ వేదికగా పనిచేస్తుంది. 2025 సంవత్సరానికి " మహిళలు,  బాలికలకు హక్కులు. సమానత్వం. సాధికారత" అనే థీమ్ ప్రముఖంగా నిలిచింది.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే.. మహిళా దినోత్సవం..  బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ (1995) ను స్వీకరించినప్పటి నుండి లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి  మహిళాదినోత్సవానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వార్షికోత్సవం చట్టపరమైన సంస్కరణలు, ఆర్థిక విషయాలు, సామాజిక సమానత్వం,  లింగ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటంలో సాధించిన పురోగతిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో.. భారతదేశం మహిళా కేంద్రీకృత అభివృద్ధి నుండి మహిళలు చురుకుగా పురోగతిని నడిపించే  వైపు దృష్టి సారిస్తోంది. ఈ పరివర్తన విధాన చట్రాలు, శాసన పురోగతులు,  విద్య, ఆర్థిక సంస్కరణలు,  నాయకత్వాన్ని ప్రోత్సహించే అట్టడుగు స్థాయి నుండి తీసుకునే చొరవలో కనిపిస్తుంది. 2025 మహిళాదినోత్సవానికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలు తమ విజయగాథలను నమో యాప్ ఓపెన్ ఫోరమ్ ద్వారా పంచుకోవాలని ప్రోత్సహించారు . మార్చి 8న వారి విజయాలను ప్రేరేపించే, ప్రదర్శించే వేదికను అందించారు. లింగ సమానత్వం.. చట్టాలు.. అంతర్జాతీయంగా లింగ సమానత్వాన్ని సాధించడానికి వివిధ చట్టాలను ప్రపంచ వ్యాప్తంగా చేసిన ఏర్పాటులో భారతదేశం కూడా ప్రముఖంగా ఉంది. *మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (1948) *మహిళలపై అన్ని రకాల వివక్షత నిర్మూలనపై సమావేశం (CEDAW), 1979 *బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ (1995) *UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎజెండా 2030) మహిళా సాధికారతకు ప్రభుత్వ చట్టాలు.. విద్యా హక్కు చట్టం, 2009:  ఉచిత,  తప్పనిసరి విద్య రెండూ హామీ ఇవ్వబడ్డాయి. బేటీ బచావో బేటీ పడావో (BBBP): బాలికల విద్యను పెంపొందించడానికి, బాల-లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి చొరవలు కీలకమైనవి. సమగ్ర శిక్షా అభియాన్: ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను పెంపొందించడం, సమానత్వం,  నాణ్యమైన అభ్యాసాన్ని నిర్ధారించడం. జాతీయ విద్యా విధానం (NEP) 2020: రాజ్యాంగ విలువల ప్రకారం న్యాయమైన, సమ్మిళితమైన,  వైవిధ్యమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడే బాధ్యతాయుతమైన,  చురుకైన పౌరులను తయారు చేయడం దీని లక్ష్యం. భారతదేశంలో మహిళా ఆరోగ్య విజయాలు.. భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉండేది. అయితే 2014-16,  2018-20 మధ్య ప్రసూతి మరణాల రేటు (MMR) వరుసగా 130 నుండి 97కి తగ్గింది .  5 సంవత్సరాలలోపు పిల్లల మరణాల రేటు (U5MR) 2015లో 43 నుండి 2020లో 32కి పడిపోయింది . మహిళల ఆయుర్దాయం 71.4 సంవత్సరాలకు (2016-20) పెరిగింది, 2031-36 నాటికి అంచనాలు 74.7 సంవత్సరాలకు చేరుకుంటాయని అంటున్నారు. ఆర్థిక సాధికారత & ఆర్థిక చేరిక మహిళల స్వాతంత్య్రాన్ని,  భద్రతను కల్పించడంలో ఆర్థిక స్వయం ప్రతిపత్తి కీలక పాత్ర పోషిస్తుంది. భారత శ్రామిక శక్తిలో మహిళలు.. భారతదేశంలో మహిళలు ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరడానికి, పోరాట పాత్రలను పోషించడానికి,  భారత సాయుధ దళాలలో భాగంగా సైనిక్ పాఠశాలల్లో చేరడానికి అవకాశం కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5% మంది పైలట్లతో పోలిస్తే, భారతదేశంలో 15% మంది మహిళలు ఉన్నారు. స్టార్టప్‌లలో మహిళలను ప్రోత్సహించడానికి SIDBI నిధులలో 10% మహిళలు నేతృత్వంలోని సంస్థలకు కేటాయించబడ్డాయి.                                    *రూపశ్రీ.
  ఇయర్ ఫోన్స్ ఇప్పటి ప్రజల జీవనశైలిలో భాగం అయిపోయాయి.  ఉదయాన్నే వాకింగ్,  జాకింగ్ చేస్తున్నా,  ప్రయాణాలు చేస్తున్నా,  ఎవరితో అయినా ఫోన్  మాట్లాడుతున్నా.. ఇలా చాలా సందర్భాలలో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది.  ఇక నిరంతరం ఫోన్ లు మాట్లాడే వృత్తి లేదా వాతావరణంలో ఉండే వారు రోజులో చాలా గంటల సేపు ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు.  ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లు రిసీవ్ చేసుకుని మాట్లాడటానికి వీలు లేని వారు కనీసం ఒక చెవికి అయినా ఇయర్ ఫోన్ లేదా ఇయర్ బడ్ పెట్టుకుని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తారు.  చాలా మంది రోజులో 10-12 గంటలు ఇయర్ ఫోన్స్ మాట్లాడుతూ గడిపేస్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే పెద్ద సౌండ్స్ తో ఇయర్ ఫోన్స్ వాడేవారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అవేంటంటే.. ఇయర్‌ఫోన్ వాడకం వల్ల వినికిడి ఆరోగ్యంపై ప్రభావం పెరుగుతోంది. "70 డెసిబెల్స్ (dB) కంటే ఎక్కువ శబ్ద స్థాయిలకు ఎక్కువ కాలం గురికావడం శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది. అయితే 100 dB కంటే ఎక్కువ శబ్దాలకు అకస్మాత్తుగా గురికావడం తక్షణ చెవుడుకు కారణమవుతుంది." రద్దీగా ఉండే వీధులు,  80-100 dB ట్రాఫిక్, 120 dB కంటే ఎక్కువ బిగ్గరగా ఉండే కచేరీలు లేదా పటాకులు మోత మొదలైన వాటి కారణంగా శబ్ద స్థాయిలు పెరుగుతాయి.  ఇది వినికిడి లోపానికి కారణమవుతుంది. వీటికి తోడు ఇయర్ ఫోన్ ల వాడకం పెరిగితే తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇయర్ ఫోన్స్ నేరుగా చెవి లోకి ధ్వనిని పంపుతాయి, దీని వలన వినికిడి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చాలా మంది  తెలియకుండానే తీవ్రమైన శబ్దానికి గురవుతారు. తరచుగా ఎక్కువసేపు సంగీతం లేదా కాల్‌లను ఎక్కువసేపు వింటారు. మరికొందరికి సంగీతం అనేది ఎక్కువ శబ్దం పెట్టుకుని ఆస్వాదించడం అనే అలవాటు కూడా ఉంటుంది.  " 60% కంటే ఎక్కువ వాల్యూమ్‌లలో ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది". రూల్ ఆఫ్ 60 అంటే.. "60 నియమం" అంటే శబ్దాన్ని  60% కంటే తక్కువగా ఉంచడం.  ఇయర్‌ఫోన్ వినియోగాన్ని రోజుకు 60 నిమిషాలకు మించకుండా పరిమితం చేయడం. అదనంగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు సురక్షితమైన ప్రత్యామ్నాయం, ఎందుకంటే అవి ఇన్-ఇయర్ పరికరాలు చేసే విధంగా చెవి లోకి ధ్వనిని లోతుగా ప్రసారం చేయవు. అధిక వాల్యూమ్ నష్టం.. ఎక్కువసేపు 85dm కంటే ఎక్కువ వాల్యూమ్‌లో సంగీతాన్ని వింటే, అది శాశ్వత వినికిడి లోపానికి కారణమవుతుంది. ఇయర్‌ఫోన్‌లను విరామం లేకుండా నిరంతరం ఉపయోగించడం వల్ల చెవికి ఒత్తిడి వస్తుంది, దీని వలన అసౌకర్యం,  తాత్కాలిక వినికిడి లోపం సంభవించవచ్చు. హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, ఇయర్‌బడ్‌లు కర్ణభేరికి దగ్గరగా ఉంటాయి. ఇది ధ్వని ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది.  దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. బిగ్గరగా సంగీతం వినడమే కాకుండా, ఇయర్‌ఫోన్‌లను ఇతరులకు ఇవ్వడం,  ఇతరులవి తీసుకుని వాడటం వంటివి  లేదా ఎక్కువసేపు వాడటం వల్ల కూడా చెవిలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.                                            *రూపశ్రీ.  
  వేసవి కాలం ప్రారంభం కావడంతోనే  చెరకు రసం కోసం డిమాండ్ కూడా పెరుగుతుంది. చెరకు రసం సహజమైన,  ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించబడుతుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది.  శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు,  సహజ చక్కెరలు ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే, చెరకు రసం అందరికీ ప్రయోజనకరంగా ఉండదు  కొంతమంది దీనిని తాగకుండా ఉండటమే మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. చెరకు రసం ఎవరు తాగకూడదో.. ఎందుకు తాగకూడదో..  తెలుసుకుంటే.. డయాబెటిస్ రోగులు.. చెరకు రసంలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది . డయాబెటిస్ ఉన్న రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతారు. అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. అయితే.. డయాబెటిస్ ఉన్న రోగులు చెరకు రసం తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి చాలా తక్కువ పరిమాణంలో తాగాలి. ఊబకాయం.. చెరకు రసంలో కేలరీలు,  చక్కెర పుష్కలంగా ఉంటాయి.  బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా లేదా ఊబకాయంతో ఉన్నా, చెరకు రసం  తాగడం సరైనది కాదు. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగవచ్చు.  అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  మధుమేహం వంటి ఊబకాయం సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది . దంత సమస్యలు.. చెరకు రసంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది, ఇది దంతాలకు హానికరం.  బలహీనమైన దంతాలు లేదా కుహరం సమస్యలు ఉంటే చెరకు రసం తాగడం మానుకోవాలి. చక్కెర దంతాలలో బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఇది దంత సమస్యలను మరింత పెంచుతుంది. జీర్ణ సమస్యలు.. చెరకు రసం చల్లగా ఉంటుంది. ఇది కొంతమంది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  గ్యాస్, అసిడిటీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి కడుపు సమస్యలు ఉంటే, చెరకు రసం తాగడం మానుకోవాలి. ఇది కడుపులో చల్లదనాన్ని కలిగిస్తుంది,  జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఇది సమస్యలను పెంచుతుంది. మూత్రపిండ వ్యాధి.. చెరకు రసంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులు పొటాషియంను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి, ఎందుకంటే  మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను తొలగించలేవు.  అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.                                               *రూపశ్రీ.
  విటమిన్ సి మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలోని యాంటీఆక్సిడెంట్ల లోపాన్ని తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది  ప్రజలు నారింజ పండ్లను విటమిన్ సి కి ఉత్తమ వనరుగా భావిస్తారు. కానీ కొన్ని పండ్లు నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ని అందిస్తాయి. విటమిన్ సి స్థాయిలో నారింజను కూడా అధిగమించే ఆ 4 పండ్లు  అయిన సహజ విటమిన్ సి ఆహారాల గురించి తెలుసుకుంటే.. ఉసిరి.. ఉసిరి విటమిన్ సి  ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. ఒక నారింజ పండు కంటే ఒక ఉసిరిలో దాదాపు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల ఉసిరికాయలో దాదాపు 600-700 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. అయితే నారింజలో ఈ పరిమాణం 50-60 మి.గ్రా మాత్రమే. ఉసిరిలో  విటమిన్ సి మాత్రమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్,  ఇతర పోషకాలు కూడా ఉంటాయి.  ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉసిరిని పచ్చిగా, జ్యూస్, చట్నీ లేదా పొడి రూపంలో తినవచ్చు. కెవి.. కివి ఒక చిన్న పండు. కానీ దాని పోషక విలువలు చాలా ఎక్కువ. ఒక కివిలో నారింజ పండులో ఉండే విటమిన్ సి దాదాపు రెండు రెట్లు ఎక్కువ. 100 గ్రాముల కివిలో దాదాపు 90-100 మి.గ్రా. విటమిన్ సి లభిస్తుంది. కివిలో ఫైబర్, పొటాషియం,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.  ఇవి గుండె ఆరోగ్యానికి,  జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి . కివిని నేరుగా తినవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్‌లో కలపవచ్చు. స్ట్రాబెర్రీ.. స్ట్రాబెర్రీలు రుచికరమైనవి మాత్రమే కాదు, అవి విటమిన్ సి కి గొప్ప మూలం కూడా. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో 60-70 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజ కంటే కొంచెం ఎక్కువ. స్ట్రాబెర్రీలలో మాంగనీస్, ఫోలేట్,  పొటాషియం కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి,  ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి . స్ట్రాబెర్రీలను తాజా పండ్లు, స్మూతీలు లేదా డెజర్ట్‌గా తినవచ్చు. బొప్పాయి.. బొప్పాయి జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా విటమిన్ సి అధికంగా ఉండే పండు. 100 గ్రాముల బొప్పాయిలో దాదాపు 60-70 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. ఇది నారింజ కంటే ఎక్కువ. బొప్పాయిలో విటమిన్ ఎ, ఫైబర్,  ఎంజైమ్‌లు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బొప్పాయిని పచ్చిగా,  పండిన తరువాత రెండు విధాలుగా కూడా  తినవచ్చు.                                   *రూపశ్రీ.