LATEST NEWS
ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ  హరీష్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  సూర్యపేటకు చెందిన యువతి ఇన్ స్టాగ్రామ్ లో ఎస్ ఐతో  పరిచయమైంది. వీకెండ్స్ లో వీరిద్దరూ ఓ రిసార్ట్ లో గడిపేవారు. ఈ యువతి మరో ముగ్గురుతో రిలేషన్ లో ఉందని ఎస్ ఐ హరీశ్ కి తెలిసింది. ఈ యువతి హరీష్ ను పెళ్లి చేసుకోవాలని వేధించింది. పలుమార్లు గొడవపడింది. ఆత్మహత్య చేసుకున్న రోజు యువతి వాజేడుకు చేరుకుంది. ఉన్నతాధికారులకు చెబుతానని బెదిరించడంతో ఎస్ ఐ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు యువతితో ప్రేమాయణం వెలుగులోకి రావడంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు. 
తీగ లాగితే డొంక కదిలింది. అరకుకు చెందిన బాలుడి కిడ్నాప్ వెనక గంజాయి ముఠా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరకుకు చెందిన ప్రకాశ్, సుశీల్ కుమార్ పల్నాడుకు చెందిన   యాసిన్ , సంతోష్ మద్య గంజాయి డీల్ జరిగింది. ఈ డీల్ ప్రకారం ప్రకాశ్ సుశీల్ కుమార్ లు గంజాయి సప్లయ్ చేయాలి 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా యాసిన్, సంతోష్ చెల్లించారు. అయినప్పటికీ ప్రకాశ్ , సుశీల్ కుమార్ లు  ఎంతకూ గంజాయి సప్లయ్ చేయకపోవడంతో  ప్రకాశ్ బంధువుల అబ్బాయిని యాసిన్, సంతోష్ కిడ్నాప్  చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని కిడ్నాప్ నుంచి విముక్తి కల్పించి ప్రకాశ్, సుశీల్ కుమార్ లను అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట లభించింది.  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టు అతన్ని అరెస్ట్ చేయకూడదని  పోలీసులను ఆదేశించింది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయవద్దని కోరుతూ హరీష్ రావ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. హరీష్ రావుకు నోటీసులిచ్చి విచారణ జరపాలి తప్పితే అరెస్ట్ చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌ పీఎస్‌లో  ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్రపై కౌశిక్ రెడ్డి దురుసుగా వ్యవహరించాడు. దీంతో ఇన్స్పెక్ట్ ర్  ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు చేరుకున్నారు. బిఆర్ ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించినప్పటికీ పోలీసులు కౌశిక్ రెడ్డిను అరెస్ట్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.  
రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా గుంటూరు జీజీహెచ్ వైద్యులను విచారించారు.  రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఏ5గా ఉన్న సంగతి తెలిసిందే. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కు గురి కాలేందంటూ ఆమె వైద్యులపై ఒత్తిడి తెచ్చి మరీ నివేదిక ఇచ్చారంటూ ఆమెపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆమెను విచారించాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె కోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను విచారించడం కంటే ముందుగా నాడు రఘురామకృష్ణం రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన జీజీహెచ్ రెసిడెంట్ మెడికల్ అధికారి డాక్టర్ సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేందర్, ఈసీజీ టెక్నీషియన్ లను విచారించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
Deepak Saroj, who entertained the audience as a child actor in many films, became a hero with the film Siddharth Roy. The romantic cult love story genre film started with him as the hero. Sri Lakshmi Narasimha Arts Production No. 1 movie started grandly with pooja Ceremony today. Harish Gadagani is making his directorial debut with this film, and Thanniru Haribabu is turning producer with this film.    Deekshika and Anaira are playing the heroines in this film, while Raghu Babu, Hyper Aadi, Satya, YouTuber Punju, Yadamma Raju, Raccha Ravi are playing other key roles. Today, the film was grandly launched with pooja programs at the film office in the presence of BlockBuster Directors The chief guests for this event were directors Venu Udugula, Pradeep Maddali, committee boys fame Yadu Vamsi fame, Ka fame Sujith-Sandeep, Sandeep Saroj, Bharat Vadhana, Uday Sharma, Vamsi Chaganti, Hyper Adi, and Raccha Ravi. After the puja ceremony, the script of this film was presented by Pradeep Maddala and Yadu Vamsi and Venu Udugula clapped. Sujith switched on the camera and Sandeep directed the first shot.   After the puja, the director said, "This is my first film. As soon as the story was told, the producer said let's start immediately, and I will be indebted to him for the rest of my life. I thank both our hero Deepak and heroine Anaira for accepting this story. Many thanks to the guests who came here, Venu garu, Vamsi garu, Sandeep Sujith garu, and Pradeep garu. This is a complete love genre film. We are bringing this film to the audience as a romantic call to love story. We are planning to start in January and end in April. Many thanks to everyone who came to bless us."   Hero Deepak Saroj said, "My name is Deepak Saroj. Why do I always say the dialogue of the train? I have stuck in the minds of the Telugu audience through that dialogue. The director of this film, Harish, is coming up with a good love story. When I was looking for a good story, I heard this story and it felt like a story that I definitely had to tell. The team is also a very good team. Anoop Rubens is providing music. We know how good music Anoop Rubens has given so far. I am lucky that he has provided music for my film. Our producer Haribabu, although this is his first film, I felt that he will be here for a long time. It is very good to make a film with producers who are ready to do anything for the film. Cinematographer Suresh and editor Varaprasad are saying this, a good team has been set. Many thanks to the guests who came here today and the media. To our PRO Shiva Special thanks."    Heroine Anaira, "Greetings to everyone, I am very happy and in a way lucky to be a part of this project. I would like to express my special gratitude to our directors and producers. It is not a common thing for an outsider to get a film opportunity. But they recognized my talent and gave me an opportunity. Now I am getting goose bumps as I am talking about it because it has been my lifelong desire to appear in front of the camera. Since childhood, I have loved the camera and cinema. Cinema is a kind of madness for me, I would fall and die for cinema, I love cinema so much. I am very excited to work with Deepak garu. We are ready to give an entertaining dhamaka package film with our best team."   Producer Haribabu said,  "My name is Haribabu. I have been in the real estate sector of Hyderabad for 20 years. With the passion for cinema, I am preparing to establish a banner called Lakshmi Narasimha Arts and make films. I am making my debut as a producer with this film. I liked the story of this film as soon as I was told. I immediately said yes to Harish's story. I have been very interested in the film industry since childhood. That is why I became a film producer. I thank Anoop for providing music for our film and Suresh for providing cinematography. As soon as I told the story to the hero, he said yes, it was good, thank you to them. The heroine also said yes as soon as she heard the story. A special thank you to all the directors, other friends and media who came here to bless us today," he said.
కొత్త సినిమా వచ్చిందంటే.. హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర ఉండే సందడే వేరు. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఇక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని భారీ చిత్రాలను ఖచ్చితంగా ప్రసాద్స్ బిగ్ స్క్రీన్ లోనే చూడాలనుకునే వారు ఎందరో ఉంటారు. సినీ ప్రియుల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కి ఎంతో క్రేజ్ ఉంది. దీనిని కొందరు ఓ ఎమోషన్ లా ఫీలవుతుంటారు. అంతెందుకు పబ్లిక్ టాక్, రివ్యూలకు కూడా ప్రసాద్స్ కే ప్రధాన కేంద్రంగా ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్న ప్రసాద్స్ లో బిగ్గెస్ట్ మూవీ 'పుష్ప-2' ప్రదర్శన లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. (Pushpa 2 The Rule) 'పుష్ప-2' సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది. కానీ హైదరాబాద్ సినీ ప్రియులకు అడ్డా అయిన ప్రసాద్స్ లో మాత్రం స్క్రీనింగ్ కి నోచుకోలేదు. దానికి కారణం.. ఆ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి, పుష్ప-2 నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ కి మధ్య షేర్ పర్సెంటేజ్ మేటర్ తేలకపోవడం. ప్రసాద్ లో ఏదైనా సినిమాని ప్రదర్శిస్తే వచ్చిన వసూళ్ళలో 50 నుంచి 52 శాతం షేర్ నిర్మాతలకు ఇస్తారట. ఈ ఆనవాయితీ ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతూ వస్తుందట. కానీ మైత్రి మేకర్స్ మాత్రం, మిగతా మల్టీప్లెక్స్ లు అంగీకరించినట్లు 55 శాతం షేర్ ఇవ్వడానికి ఒప్పుకోవాలని పట్టుబట్టారట. ఒక్క సినిమా కోసం తమ ఇన్నేళ్ల పాలసీని మార్చుకోలేమని ప్రసాద్స్ చెప్పడం, మైత్రి కూడా 52 శాతం షేర్ తీసుకోవానికి ముందుకు రాకపోవడంతో.. ఇద్దరి మధ్య ఒప్పందం కుదరక 'పుష్ప-2' అక్కడ స్క్రీనింగ్ కి నోచుకోలేదు. నిజానికి పుష్ప-2 చిత్రాన్ని ప్రదర్శించాలన్న ఉద్దేశంతో ప్రసాద్స్ టీం అందుకు తగ్గ ఏర్పాట్లను ముందే చేసుకున్నారు. ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజు ఏకంగా 48 షోలతో రికార్డు క్రియేట్ చేయాలనుకున్నారు. పుష్పరాజ్ ఫొటోలతో ప్రత్యేకంగా పాప్ కార్న్ బౌల్స్ ని తయారు చేయించారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ, తమ పాలసీని విరుద్ధంగా మైత్రి ఎక్కువ షేర్ అడగటంతో, పుష్ప-2 ని ప్రదర్శించడానికి ముందుకు రాలేదు. ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా ప్రసాద్స్ యాజమాన్యం స్పందించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 'పుష్ప-2'ని ప్రదర్శించలేకపోతున్నామని తెలుపుతూ మూవీ లవర్స్ కి అపాలజీ చెప్పింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్.. మైత్రి నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. మీ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ పాలసీని ఎలా మార్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మూడు శాతం షేర్ కి ఆశపడి, హైదరాబాద్ కి గుండెకాయ లాంటి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో సినిమా విడుదల కాకుండా చేశారని మండిపడుతున్నారు. దీని వల్ల ఎందరో మూవీ లవర్స్ పుష్ప-2 మిస్ అవుతారని, అలాగే హైదరాబాద్ సిటీ ఓపెనింగ్ కల్లెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప-2 వంటి భారీ చిత్రాన్ని ప్రసాద్స్ లో స్క్రీనింగ్ చేయకుండా.. అటు మూవీ లవర్స్ ని, ఇటు బన్నీ ఫ్యాన్స్ ని ఎంతో డిజప్పాయింట్ చేశారని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదలవ్వగా  నిన్న అభిమానుల కోసం బెనిఫిట్ షో వెయ్యడం జరిగింది.అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో చూడటం కోసం వెళ్ళాడు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో థియేటర్ దగ్గర  తొక్కిసిలాట జరగగా అందులో ఒక మహిళ చనిపోయింది.ఆమె కొడుకు హాస్పిటల్ లో గాయాలతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఈ విషయంలో ఏం జరిగిందనేది చనిపోయిన మహిళ భర్త మాట్లాడుతు మా అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని కావడంతో సినిమా చూడటానికి సంధ్య థియేటర్ కి మా ఆవిడ నేను నైట్ తొమ్మిదిన్నరకి వెళ్ళాం. కానీ మాకు అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియదు. ఇక ఆ తర్వాత తెలియడంతో మా బాబు, భార్య అల్లు అర్జున్ రాగానే కొంచం ముందుకు వెళ్లారు.ఆ విధంగా  థియేటర్ లోపలకి వెళ్లడంతో  పెద్ద ఎత్తున అభిమానులు వలన తొక్కిసలాట జరిగి మా ఆవిడ చనిపోయింది. మా బాబు స్పృహ తప్పి పడిపోయింది కూడా తర్వాత తెలిసింది. ప్రస్తుతం మా బాబు హాస్పిటల్ లో క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. ఇంత వరకు అల్లు అర్జున్ గాని, ఆయన టీం గాని, ఫ్యాన్స్ గాని నన్ను సంప్రదించలేదని చెప్పుకొచ్చాడు. ఇక చనిపోయిన ఆవిడ మరిది కూడా మాట్లాడుతు మా వదిన చావుకి అల్లు అర్జున్ నే కారణం. ఆయన రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదు. మా అన్నయ్య కుటుంబానికి తగిన న్యాయం జరగాలని చెప్పుకొచ్చాడు.  
జబర్దస్త్‌ షో ద్వారా అందరికీ తెలిసిన ఆటో రాంప్రసాద్‌కి యాక్సిడెంట్‌ జరిగింది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతనికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. గురువారం షూటింగ్‌కి వెళుతుండగా తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్‌ కారుకు ముందుగా వెళుతున్న కారు సడన్‌ బ్రేక్‌ వేయడంతో అతని కారు ముందున్న కారును ఢీ కొట్టింది. అలాగే అతని వెను వస్తున్న ఆటో రాంప్రసాద్‌ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌ స్వల్పంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అతని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. రాంప్రసాద్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 
ఎట్టకేలకు 'పుష్ప-2' థియేటర్లలో అడుగుపెట్టింది. కొందరు సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే, మరికొందరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. మొత్తానికైతే ఇది సుకుమార్ తన లాజిక్ లను పక్కన పెట్టి తీసిన పక్కా కమర్షియల్ సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే 'పుష్ప-2' విషయంలో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. (Pushpa 2 The Rule) 'పుష్ప-2' మూవీపై అంచనాలు పెరగడానికి ఓ రకంగా పునాది వేసింది.. గతేడాది ఏప్రిల్ లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'Where is Pushpa?' పేరుతో విడుదలైన గ్లింప్స్ అని చెప్పవచ్చు. తిరుపతి జైలు నుంచి పుష్ప తప్పించుకున్నాడని.. అతనిపై పది రౌండ్ల కాల్పులు జరిగాయని, బ్రతికే అవకాశం లేదని వార్తల్లో చెబుతున్నట్టుగా గ్లింప్స్ లో చూపించారు. పుష్ప మరణించాడన్న వార్తలతో అతని మద్దతుదారులు చేసే విధ్వంసం, ప్రజలు నిరసన వ్యక్తం చేయడం, పోలీసులు 144 సెక్షన్ విధించడం వంటివి కూడా గ్లింప్స్ లో చూపించారు. ఇక అటవీప్రాంతంలో పులులు జాడ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పుష్ప ఆచూకీ తెలుస్తుంది. "అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం" అనే డైలాగ్ తో పుష్పరాజ్ పాత్రను రివీల్ చేసిన తీరు అదిరిపోయింది. ఈ ఒక్క గ్లింప్స్ తో 'పుష్ప-2'పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే విచిత్రం ఏంటంటే.. అసలు సినిమాలో ఆ గ్లింప్స్ లోని సన్నివేశాలే లేవు. 'పుష్ప-2' కోసం ముందుగా వేరే కథ అనుకొని, ఆ తర్వాత కథని మార్చారా? లేక ఈ సన్నివేశాలు 'పుష్ప పార్ట్-3'లో చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 'Where is Pushpa?' గ్లింప్స్ లోని సీన్స్ మాత్రమే కాదు, ట్రైలర్ లో చూపించిన కొన్ని షాట్స్ కూడా సినిమాలో కనిపించలేదు. పుష్ప-2 లో జపాన్ పోర్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ తో పుష్పరాజ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత సినిమాలో జపాన్ ఊసే ఉండదు. కానీ ట్రైలర్ లో మాత్రం జపాన్ తాలూకు ఇతర సన్నివేశాల విజువల్స్ కనిపిస్తాయి. అలాగే ట్రైలర్ లో జాలిరెడ్డి ఎవరికో గన్ గురి పెడతాడు. కానీ ఆ సీన్ సినిమాలో కనిపించదు. ట్రైలర్ లో పుష్ప శివమాలలో దర్శనమిచ్చిన విజువల్స్ కూడా.. సినిమాలో ఉండవు. అలాగే సినిమాలో రెండు పెద్ద బ్లాస్ట్ లు జరుగుతాయి. వాటిని ఎవరు చేశారనే ప్రశ్నలను అలాగే వదిలేశారు. వీటన్నంటికీ పుష్ప పార్ట్-3 లో సమాధానం దొరికే అవకాశముంది. అయితే అసలు సుకుమార్.. ఇలా పార్ట్-3 కోసం అన్నట్టుగా కథని డ్రాగ్ చేయకుండా, పార్ట్-2 తోనే ముగిస్తే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)రష్మిక,(rashmika)సుకుమార్(sukumar)మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)కాంబోలో  తెరకెక్కిన పుష్ప 2(pushpa 2)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే నాల్గవ తేదీ నుంచి ప్రీమియర్స్ షోస్ పడ్డాయో,యుఎస్ లో కూడా ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేయడం జరిగింది. దీంతో ప్రీసేల్స్ తోనే పుష్ప ఏకంగా 3 .2 మిలియన్ డాలర్ మార్క్ గ్రాస్ ని అందుకుంది.ఇలా రిలీజ్ కి ముందే ప్రీ సేల్స్ లో పుష్ప 2 యు ఎస్ లో 3.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటడం ఒక రికార్డు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ముందు ముందు పుష్ప 2 ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.ఇక ఈ రికార్డుపై పుష్పని యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రత్యంగిరా సినిమాస్ అధికారకంగా ఒక పోస్టర్ రిలీజ్ చెయ్యడమే కాకుండా బాక్స్ ఆఫీస్ కి కాపలా కాయండి. అల్లు అర్జున్ లాంటి శక్తీ సరిహద్దుల్ని విచ్చినం చేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.      
సాధారణంగా ఏ ఫంక్షన్‌కైనా ఒక హీరో హాజరవుతున్నారంటే అతన్ని చూసేందుకు వందలాదిగా జనం వస్తారు. ఇక సినిమా ఫంక్షన్స్‌కైతే చెప్పక్కర్లేదు. అలాంటిది ఒక స్టార్‌ హీరో తన సినిమా రిలీజ్‌ రోజు థియేటర్‌కి వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. కానీ, ఆ హీరోకి మాత్రం ఆపాటి అవగాహన లేదని అర్థమవుతోంది. ఆ హీరో ఎవరో కాదు.. అల్లు అర్జున్‌. అతని లేటెస్ట్‌ మూవీ ‘పుష్ప2’కి దేశవ్యాప్తంగా ఎంత హైప్‌ వచ్చిందో, సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటివరకు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, సలార్‌, కల్కి వంటి సినిమాలకు మించిన హైప్‌ ఈ సినిమాకి వచ్చింది. ఆ సినిమాలన్నింటి కంటే ఎక్కువ ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఈ సినిమాకి జరిగిందని అందరూ చెప్పుకుంటున్నారు. దీంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూశారు. డిసెంబర్‌ 5న ‘పుష్ప2’ రిలీజ్‌ అవుతున్నప్పటికీ డిసెంబర్‌ 4 రాత్రి గం.9.30ల నుంచే ప్రీమియర్‌ షోలు ప్రారంభించారు. టికెట్‌ రేట్లను ఎంత పెంచినా జనం ఎగబడి కొనుక్కున్నారు. అల్లు అర్జున్‌కి ఉన్న ఇమేజ్‌ దృష్ట్యా సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్‌ చేశారు.  ఇంతవరకు బాగానే ఉంది... డిసెంబర్‌ 4 రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన దుర్ఘటన అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న భాస్కర్‌, అతని భార్య రేవతి, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్‌, సన్వీక ‘పుష్ప2’ ప్రీమియర్‌ చూసేందుకు సంధ్య థియేటర్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. అదే సమయంలో అల్లు అర్జున్‌ ఆ థియేటర్‌కి వచ్చారు. అతన్ని చూసేందుకు ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. అక్కడి పరిస్థితి అదుపు తప్పడంతో జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి(39), ఆమె కుమారుడు శ్రీతేజ్‌(9), మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి.. ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె కుమారుణ్ని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు.  తమ అభిమాన హీరో సినిమాని మొదటి షో చూద్దామని వచ్చిన ఒక కుటుంబానికి ఇంతటి దారుణం జరగడం అందర్నీ కలచివేస్తోంది. ఒక సాధారణ హీరో థియేటర్‌కి వస్తేనే అతన్ని చూసేందుకు జనం ఎగబడతారు. అలాంటిది ఒక పాన్‌ ఇండియా హీరో థియేటర్‌కి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరైనా ఊహించగలరు. ఆ సమయంలో పోలీసులు లాఠీ చార్జి చేసి ఉండకపోతే మరిన్ని మరణాలు సంభవించేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తను థియేటర్‌కి వెళితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన అల్లు అర్జున్‌కి లేకుండా ఎలా ఉంటుంది అని అందరూ ప్రశ్నిస్తున్నారు. తనని తాను స్టార్‌ హీరో అనుకోవడం లేదా? లేక ఏం జరిగినా తనకేంటి? అనే నిర్లక్ష్యంతోనే అలా చేశాడా అనేది ఆలోచించాలి. మరో విషయం ఏమిటంటే.. తను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కి వస్తున్నట్టు తన అభిమానులకు ముందే ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చాడని, అందుకే థియేటర్‌ దగ్గర ఉండాల్సిన జనం కంటే ఎక్కువ ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రేక్షకుల, అభిమానుల క్షేమాన్ని కోరుకోవడం హీరోల బాధ్యత. అలాంటిది ఇలా బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొని ఆ పిల్లల నుంచి తల్లిని దూరం చేసిన అల్లు అర్జున్‌ దీనికి పూర్తి బాధ్యత వహించాలని ప్రేక్షకులు డిమాండ్‌ చేస్తున్నారు.
అల్లు అర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021 లో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 కాంబో తిరిగి రిపీట్ అవ్వడంతో సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. నిన్న మిడ్ నైట్ నుంచే ప్రీమియర్స్ ని కూడా జరుపుకున్న ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇక పుష్ప 2(pushpa 2)ప్రదర్శిస్తున్న తిరుపతి(tirupati)దగ్గరలోని పాకాల శ్రీ రామకృష్ణ థియేటర్ దగ్గరలో వైసీపీ కి చెందిన కొంతమంది కార్యకర్తలు మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలని ఏర్పాటు చేసి మంచి చేసి మోసపోయిన సిఎం, ఎంఎల్ఏ తాలూకా, 2029 కి సిద్ధం తగ్గేదేలే అంటూ ఫ్లెక్సి లని ఏర్పాటు చెయ్యడం జరిగింది.దీంతో ఈ వ్యాఖ్యలపై తెలుగు దేశం శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీసివేయాలని కోరగా వైసిపీ నేతలు అంగీకరించలేదు. ఆ తర్వాత టిడీపీ(tdp)నేతలు ఫ్లెక్సీలని తీసి వేయడం జరిగింది.దీంతో ముందుగానే ప్లాన్ చేసుకున్న వైసిపీ కార్యకర్తలు కర్రలు,సీసాలు,వేడి నీళ్లతో టిడిపీ కార్యకర్తలపై దాడి చెయ్యగా టిడీపీ కార్యకర్తలు కూడా అందుకు తగట్టుగాప్రతిఘటించడంతో థియేటర్ పరిసరాల్లో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది.దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలని చెదర గొట్టడంతో పాటుగా  వాళ్లపై కేసులు కూడా నమోదు చేసారు.  దీంతో పాకాల వెళ్లే దారిలో ట్రాఫిక్ పూర్తిగా సంభవించింది.  
2018లో అక్కినేని అఖిల్(akhil)హీరోగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన భామ నిధిఅగర్వాల్(nidhhi agerwal)ఆ తర్వాత 'ఇస్మార్ శంకర్' 'హీరో' వంటి సినిమాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రభాస్(prabhas)లాంటి స్టార్ హీరోల సరసన 'హరిహర వీరమల్లు'(hari hara veeramallu)'ది రాజాసాబ్'(the raja saab)లాంటి భారీ ప్రాజక్ట్స్ లో చేస్తుంది. నిధి లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడుతూ హరిహరవీరమల్లు లో పంచమి అనే క్యారక్టర్ ని చేస్తున్నాను.నటిగా నాలోని పలు కోణాల్ని ఆవిష్కరిస్తుంది.వీర,పంచమి లప్రేమకథ చాలా బాగుంటుంది.హరిహరవీరమల్లు 2 అందరు అనుకున్న దాని కన్నా ముందే వస్తుందని చెప్పింది.ఇప్పుడు ఈ మాటలు పవన్ ఫ్యాన్స్ లో జోష్ ని నింపుతున్నాయి ఇక  రాజాసాబ్ గురించి మాట్లాడుతు రాజాసాబ్ ఒక అదంటిక్ రొమాంటిక్ కామెడీ చిత్రం.కానీ అన్ని రకాల వాణిజ్య అంశాలు అందులో ఉంటాయి.పైగా ఈ సినిమా ద్వారా ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు అంటారో కూడా తెలిసొచ్చింది.త్వరలోనే నా నుంచి మరో క్రేజీ ప్రాజక్ట్ రానుందని కూడా చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్‌కి, మెగా ఫ్యామిలీకి మధ్య గత కొంతకాలంగా కోల్డ్‌ వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతూ వస్తోంది. ఆమధ్య జరిగిన ఎన్నికలల్లో పవన్‌కళ్యాణ్‌ని సపోర్ట్‌ చెయ్యకుండా, వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం ద్వారా వీరి మధ్య వున్న వివాదం మరింత పెరిగింది. బన్నీ ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య నిరంతరం సోషల్‌ మీడియాలో వార్‌ జరుగుతూనే ఉంది. ఒక దశలో అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ మూవీ పుష్ప2 రిలీజ్‌కి మెగా ఫ్యాన్స్‌ అడ్డుపడతారేమో అన్నంతగా వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. గురువారం ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో మెగా బ్రదర్‌ నాగబాబు ఫ్యాన్స్‌ని కంట్రోల్‌ చేసేందుకు ఒక ట్వీట్‌ చేశారు. సినిమా పేరు ప్రస్తావించకుండా మెగా అభిమానులను సంయమనం పాటించాలని కోరారు. ఓ పక్క సాయిధరమ్‌తేజ్‌ కూడా సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలని ట్వీట్‌ చేశాడు.  ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే ఈ వివాదానికి ముగింపు పలికేందుకు అల్లు అర్జున్‌ సిద్ధంగా ఉన్నాడని, మెగా ఫ్యామిలీతో కలిసిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ, అది నిజం కాదని ‘పుష్ప2’ రిలీజ్‌ అయిన తర్వాత తెలిసింది. ఈ సినిమాలోని ఒక డైలాగ్‌ వల్ల మెగా ఫ్యాన్స్‌ కోపంతో రగిలిపోతున్నారు. ఈ పరిణామంతో మెగా ఫ్యాన్స్‌ ప్రత్యక్ష యుద్ధానికి దిగినా ఆశ్చర్యం లేదు. ‘పుష్ప2’ సినిమా స్టార్టింగ్‌లో అల్లు అర్జున్‌ చెప్పిన ఆ డైలాగ్‌ ఏమిటంటే.. ‘ఎవడ్రా బాస్‌...? ఎవడికిరా బాస్‌? ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్‌’.. ఈ డైలాగ్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌, పవన్‌కళ్యాణ్‌లను ఉద్దేశించే పెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే సినిమా ఇండ్రస్టీలో మెగాస్టార్‌ చిరంజీవిని బాస్‌ అని పిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్‌తో చిరంజీవి ఫ్యామిలీని అల్లు అర్జున్‌ టార్గెట్‌ చేశారనేది వాస్తవం. సినిమాలో ఈ డైలాగ్‌ పెట్టడంపై మెగా అభిమానులు రగిలిపోతున్నారు. ఇక దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మెగా ఫ్యాన్స్‌ ఎలాంటి చర్యలకు దిగుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది.  ఈ సినిమా రిలీజ్‌ ముందు వరకు జరిగిన పరిణామాలను చూస్తే చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్‌.. అల్లు అర్జున్‌ విషయాన్ని మొదట్లో సీరియస్‌గా తీసుకున్నా ఆ తర్వాత మనవాడే అనే ఉద్దేశంతోనే కూల్‌గా ఉన్నారని అర్థమవుతోంది. సమసిపోతుంది అనుకున్న సమస్యను సినిమాలోని తన డైలాగ్‌తో మెగా ఫ్యామిలీని, మెగా ఫాన్స్‌ని రెచ్చగొట్టినట్టయింది. మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో.. మెగా ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనం మట్టిని  భూమాత, నేలతల్లి అని పిలవటం దాని లక్షణానికి అచ్చంగా సరిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మ ఎలా అయితే తన పిల్లల్ని పెంచి, పోషించటానికి తనలోని శక్తి సన్నగిళ్లేవరకూ పాటుపడుతుందో, అలాగే ఈ నేల తనలోని సారమంతా సన్నగిళ్లేవరకూ మొక్కల్ని పెంచి, పోషించి ఈ భూమి మీద ఉన్న జీవజాల  మనుగడకి ఆధారమవుతుంది. అయితే శక్తి సన్నగిల్లిన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఎలా అయితే పిల్లలకి ఉంటుందో, అలాగే నేలతల్లి  అందించిన ఆహారం తింటున్న మనకి దాని గొప్పదనాన్ని గుర్తించి, దాని బాగోగులు కూడా చూసుకోవాల్సిన  బాధ్యత ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.  ప్రపంచ నేల  దినోత్సవం మన ఆహారంలో 95%కి పైగా నేలలోనుంచే ఉత్పత్తి అవుతోంది. కాబట్టి, ఈ సహజ వనరు ఆరోగ్యంగా ఉండటమనేది మనుషులకే కాదు, భూమి మీద ఉన్న  జీవజాలమంతటి  మనుగడకీ  అవసరమే. అందుకే భూమి మీద హాయిగా జీవించాలంటే   నేలకున్న  ప్రాముఖ్యతను తెలియజేస్తూ,  ప్రపంచ నేల దినోత్సవం ఆవిష్కరణను 2002లో ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్’ ప్రతిపాదించింది. దీన్ని 2013లో ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధికారికంగా ఆమోదించింది. ఆ తర్వాత, ‘సంయుక్త జాతుల సాధారణ అసెంబ్లీ’ ఈ దినోత్సవాన్ని 2013 డిసెంబర్‌లో ఆమోదించింది. కానీ ఈ దినోత్సవానికి డిసెంబర్ 5ని ఎంచుకోవడమన్నది   థాయ్‌లాండ్‌కు చెందిన భూమిబోల్ ఆదుల్యదేజ్ అనే రాజు గౌరవార్ధం జరిగింది. 2024కి గానూ ప్రపంచ నేల దినోత్సవ థీమ్: “నేలని సంరక్షించండి - కొలవడం, పర్యవేక్షించడం, నిర్వహించడం” ఈ సంవత్సరం ఎంచుకున్న థీమ్ అనేది  నేల ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ స్ధిరత్వం మధ్య అనుబంధాన్ని బలంగా చూపిస్తుంది. ఆహార భద్రతను, వాతావరణ మార్పులను ఎదుర్కోవడాన్ని, పర్యావరణ వ్యవస్థల స్ధిరత్వాన్ని అందించడంలో నేలకి సంబంధించిన  ఖచ్చితమైన డేటా అవసరమని చెప్తుంది.   భారత భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా ఒండ్రుమట్టి, నల్లరేగడి, బంకమట్టి, ఎర్రమట్టి నేలలు, ఎడారి నేలలు, కొండప్రాంతపు నేలలని వివిధ రకాల మట్టి పుడుతుంది. అయితే  ఒక్కో రకపు మట్టి కొన్నికొన్ని    ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి, రకరకాల   పంటలకు అనుకులంగా ఉంటుంది.  వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంలో, ఆహార భద్రతను కల్పించడంలో మట్టి మీద  అవగాహన ఉండటం చాలా ముఖ్యమైనది.  నేలకున్న సమస్యలు.. సవాళ్లు, ముప్పులు:  నేలకి  సహజ ప్రక్రియలవల్ల,  మానవ చర్యల ద్వారా కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు మట్టి ఆరోగ్యం, జీవవైవిధ్యం, ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ నేలని ముప్పులోకి నెట్టే ప్రధాన సవాళ్లుగా కొన్నింటిని చెప్పవచ్చు.    నేల దెబ్బతినడం:   నీరు, గాలి ద్వారా మట్టి కొట్టుకుపోతుంటుంది. అలాగే  అడవులని నరికేయటం, పంటల మార్పిడి లేకపోవడం, ఇంకా  మారుతున్న వ్యవసాయ పద్ధతులు మట్టిని త్వరగా దెబ్బతినేలా చేస్తాయి. పంటలకి  పోషక లోపం:   భారతదేశంలో ప్రాంతాలను బట్టి  చాలా భాగం నేలలు నత్రజని, ఫాస్ఫరస్ లోపంతో ఉన్నాయి.  అందువల్ల ఎరువు ఎంత వేయాలో అనే అవగాహన కూడా లేని రైతులు, సబ్సిడీలో తీసుకున్న రసాయన ఎరువులని  విపరీతంగా ఉపయోగించటం వల్ల నేల సారం మారిపోయి పంటలకి పోషణ అందట్లేదు.  ఎడారీకరణ:   పెరుగుతున్న జనాభా ఒత్తిడి కారణంగా అడవులని కొట్టేయటం వల్ల, పశువుల అధిక మేత వలన సారవంతమైన నేలలు సారం కోల్పోయి ఎడారిగా మారుతున్నాయి.   నీరు నిల్వ ఉండిపోవటం:   నీటిపారుదల సరైన విధంగా లేకపోవడం, నేలలో వాటర్ చానల్స్‌ నుంచి నీరు లీకేజీ అవ్వటం వల్ల లక్షల ఎకరాల భూములు నీటితో నిండిపోతున్నాయి. దీనివల్ల మట్టి నిర్మాణం దెబ్బతిని, ఉత్పాదకత తగ్గిపోతుంది.  ఉప్పదనం,  క్షారతనం:   నీటిపారుదల అధికంగా ఉండే ప్రదేశాల్లో   మట్టిలో ఉప్పు పేరుకు పోవడం వల్ల కూడా అక్కడ నేల పంటకి అనుకూలం కాకుండా పోతుంది.  పట్టణీకరణ,  పాడుబడిన భూములు:   పట్టణాలకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ స్థలానికి డిమాండ్ పెరిగి చుట్టుపక్కల మంచి పొలాలు కూడా లే-అవుట్లగా మార్చేస్తున్నారు. అలాగే  రసాయనాలు,  లోహాలతో  పరిశ్రమల వ్యర్థాలు నేలని కాలుష్యం చేస్తాయి.  పారిశ్రామీకరణ:   నేలని నాశనం చేసే ఓపెన్-కాస్ట్ మైనింగ్, పరిశ్రమల కోసం వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలని ఆక్రమించుకోవటం.  ప్రపంచ నేల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?  నేల సారాన్ని కాపాడటం: నేలలోని పైపొరల్లో  ఖనిజాలు, సేంద్రీయ పదార్థాలు, నీరు, గాలి ఉంటాయి.  ఇది మొక్కల పెరుగుదలకు బలంగా ఉండి, భూమిపై జీవం మద్దతు కోసం అవసరమైనది.  అందుకే ఈ నేల సారం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం:  ఆరోగ్యవంతమైన నేల  ఆహార భద్రతకు కీలకం. కాబట్టి నేల పాడవకుండా వ్యవసాయ విధానాలు పాటించేలా ప్రోత్సహించాలి.  జీవ వైవిధ్యాన్ని కాపాడటం: నేడు రకరకాల రసాయనాల వినియోగం వల్ల సహజంగా నేల సారాన్ని పెంచటంలో సాయపడుతున్న జీవులు చనిపోతున్నాయి. అందుకే న్యూట్రియంట్ సైక్లింగ్,  కార్బన్ నిల్వల్లో  కీలక పాత్ర పోషించే జీవులను రక్షించాలి.  అవగాహన కలిగించడం:  భవిష్యత్ తరాలకు నేల  సంరక్షణ అనేది ఈ భూమి మీద మానవ మనుగడకి చాలా అవసరమనే  అవగాహన కలిగించాలి.  నేలని కాపాడుకోవటానికి ఏం చేయాలి?    మొక్కలు నాటటం:    మట్టి కొట్టుకుపోయే ప్రాంతాల్లో వృక్షాలు నాటడం దారా  మట్టిని దెబ్బతినకుండా కాపాడవచ్చు.  వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్:    ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IWDP) వంటి కార్యక్రమాలు ద్వారా నీటి పారుదలని సమర్ధవంతంగా  నిర్వహించాలి.  టెర్రేస్ వ్యవసాయం:  పర్వత ప్రాంతాల్లో నేలను మెట్లు లాగా  పైనుంచి కిందవరకూ చెక్కి ఉంచే విధానంలో  మట్టి నీటితో పాటూ కిందకి కొట్టుకుపోకుండా కాపాడుతుంది.   ఆర్గానిక్ వ్యవసాయం:  రసాయన ఎరువులు వినియోగం తగ్గించి ఆర్గానిక్  ఎరువులు ఉపయోగిస్తూ వ్యవసాయం చేస్తే నేల సారం పెరుగుతుంది.  నేలను  కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇలా చేస్తే మనవంతు మన నేల తల్లికి సేవ చేసిన వాళ్ళమవుతాం. అందుకే  మట్టిని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. "ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన గ్రహం!" “ ఆరోగ్యకరమైన గ్రహం, ఆహ్లాదకరమైన జీవితం”అనే విషయాన్ని మర్చిపోకూడదు.                                  *రూపశ్రీ.
  పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చట్టపరమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.  ఇదివరకు పెళ్లి అనేది పెద్దల నిర్ణయం తో ముడి పడి.. పలువురిని ఆహ్వానించి అందరి ఆశీర్వాదాల మధ్య జరిగేది.  ఇప్పుడు కూడా ఇలానే జరుగుతున్నా అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు వచ్చాయి.  పెళ్లికి చట్టపరమైన భద్రత ఏర్పరిచారు. పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తారు.  అయితే చాలామంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు.  అసలు మ్యారేజ్ సర్ఠిఫికేట్ వల్ల కలిగే లాభాలు ఏంటి? పెద్దల సమక్షంలో అందరి అంగీకారంతో పెళ్ళి జరిగినా, ప్రేమ వివాహాలు చేసుకున్నా ప్రతి జంట మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటారు ఎందుకు? దీని వెనుక గల కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. వివాహ ధృవీకరణ పత్రం.. పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందుకోసం వివాహ పత్రిక,  పెళ్లి సమయంలో తీయించుకున్న ఒక ఫొటో ప్రభుత్వానికి సమర్పించాలి.  ఇవన్నీ చూశాక ప్రభుత్వం ఆ జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తుంది.  ఇది పెళ్లి చేసుకున్న జంటలకు వివాహ బంధం గురించి భరోసా ఇస్తుంది.  ఇందులో ఎవరూ మోసపోయే అవకాశం లేకుండా చేస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల మరిన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయి. ఇప్పటి భార్యాభర్తలు భవిష్యత్తు మీద చాలా ప్లానింగ్ తో ఉంటున్నారు.  భార్యాభర్తలు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసే వారు అయితే వారు విదేశాలకు వెళ్లాలనే ప్లానింగ్ తో ఉంటే వారికి తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి.  మ్యారేజ్ సర్టిఫికెట్ లేని పక్షంలో వారికి వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ధృవీకరణ పత్రం లేకుండా బ్యాంకు డిపాజిట్లు,  జీవిత భీమా, భీమా సౌకర్యాలు,  బ్యాంకు లోన్లు తదితర ప్రభుత్వ,  ప్రైవేటు ప్రయోజనాలు పొందలేరు.  అది చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా నామినీ పేరు నమోదు కాకపోతే చాలా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మహిళలకు మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా అవసరం.  ఒకవేళ భర్త మరణిస్తే అతనికి సంబంధించిన ఆస్తులపై తన హక్కులను క్లెయిమ్ చేయాలని అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.  అది లేకపోతే భర్తకు సంబంధించిన ఆస్తులపై హక్కుల కోసం ఆమే చాలా పోరాడాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్న తరువాత విడాకులు లేదా వివాదాలు ఏర్పడితే.. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా దాన్ని గెలిపించుకోవడం కష్టం.  ఆ వివాహం చెల్లుబాటును సవాలు చేయవచ్చు.  రిజిస్ట్రేషన్ లేకుండా సరైన ఆధారాలు లేని వివాహాలను ప్రభుత్వం చట్టవిరుద్ధమైనవిగా సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది కూడా. కాబట్టి ఇప్పట్లో వివాహాల చెల్లుబాటుకు సరైన ఆధారాలు, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. కొన్ని సార్లు వివాహం పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మోసపోతుంటారు.  వివాహం అనంతరం మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా.. సరైన ఆధారాలు లేకుండా చేసి వారిని మోసం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి మోసాలలో ఎక్కువగా నష్టపోతుంటారు. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డు కట్ట వేయవచ్చు.                                                 *రూపశ్రీ.  
  ఏ దేశానికయినా అన్నివైపుల నుంచి రక్షణ కల్పించటానికి భద్రతా దళాల పాత్ర చాలా ఉంటుంది. అయితే మారుతున్న ప్రపంచ దేశాల స్థితిగతులు, విధివిధానాల వల్ల  మన దేశ భద్రత పరంగా, ఆర్ధికపరంగా  భారత నేవీ పాత్ర ముఖ్యమైనదిగా  మారింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటంలో సముద్రమార్గాల ద్వారా  జరిగే వాణిజ్య రవాణా  కీలకమవుతుంది. ఒక పక్క రవాణా  సజావుగా సాగేలా చేస్తూ,  ఇంకో పక్క విదేశీ శక్తులనుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన  నేవీ ఎంతో గొప్పది.      1971లో భారతదేశానికి, పాకిస్థానుకి  మధ్య  జరిగిన యుద్ధంలో  డిసెంబర్ నాలుగో తేదీన   ట్రైడెంట్ ఆపరేషన్లో  వీరోచితంగా పొరాడి, భారత నేవీ గొప్ప విజయాన్ని  సాదించింది. ఆ యుద్ధంలో  భారత నేవీ  పాకిస్థాన్ ప్రధాన పోర్ట్ నగరమైన  కరాచీపై ధైర్యంగా దాడి చేసింది. ఇది ఒక ప్రధాన సైనిక విజయమే కాకుండా, భారత నేవీకి ఉన్న  శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. అందుకే దేశ రక్షణలో వారి పాత్రను, త్యాగాలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. మన దేశ  భద్రత కోసం ప్రాణత్యాగాలు చేసి, దేశ రక్షణ కోసం  సముద్ర సరిహద్దులను అహర్నిశలు కాపుకాసి మన నౌకాదళం చేస్తున్న కృషిని, వారు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవటానికి జరుపుకునే  నేవీ డే చాలా ప్రత్యేకమైనది.  నౌకాదళ ప్రాముఖ్యత -పాత్ర: భారత దేశం  విస్తృతమైన తీరప్రాంతం కలిగి ఉంది. ఇంత పొడవైన  తీరప్రాంతాన్ని రక్షించటంలోనూ,   మన దేశానికి చెందిన సముద్ర ప్రాంతంలో  శాంతిని  కాపాడడంలోనూ,  సముద్ర మార్గాలను పర్యవేక్షించి,   వాణిజ్య  మార్గాలకి  భద్రత కల్పించటంలోనూ,  ప్రకృతి పరంగా సంభవించే విపత్తుల సమయంలో సహాయం అందించడంలోనూ, అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని ప్రోత్సహించడంలోనూ  భారత నౌకాదళం కీలక పాత్ర పోషిస్తుంది.  ప్రతి సంవత్సరం, భారత నౌకాదళం తన వ్యూహాత్మక లక్ష్యాలను ప్రతిబింబించేలా ఓ థీమ్‌ను ఎంచుకుంటుంది. వీటిలో.. రక్షణ, సాంకేతిక అభివృద్ధి, సముద్ర భద్రత వంటి అంశాలపై అవి కేంద్రీకృతమవుతాయి. 2024 సంవత్సరానికి "ఆవిష్కరణ, స్వదేశీకరణ ద్వారా  నౌకాదళ శక్తిని, బలాన్ని పెంచుకోవటం." అనే థీమ్‌ను ఎంచుకోబడింది.  ఇప్పటి నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను కలిగిన మిస్సైల్స్, ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలను కలిగి ఉంది. భారత నావికాదళంలో INS విక్రాంత్, INS అరిహంత్ వంటి సమర్థవంతమైన  యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇవి మన దేశ భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి నేవీ డే వేడుకలు:  నేవీ డే సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.  వేడుకల్లో భాగంగా సీనియర్ అధికారులు నౌకాదళానికి నివాళులు అర్పిస్తారు.  గౌరవనీయులంతా  జెండా ఎగరవేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సముద్రతీర రక్షణలో  కీలకమైన నౌకాదళ అధికారులను గౌరవించడమే కాకుండా, దేశ భద్రత కోసం సముద్రంలో  ఎన్నో కష్టాలకోర్చి పని చేసిన, పనిచేస్తున్న వీర  సైనికులని గుర్తించి, గౌరవిస్తారు. మాజీ నావికుల సేవలను గౌరవించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భారత నౌకాదళ  సైనికుల త్యాగాలను, నిబద్ధతను గుర్తించే ప్రత్యేక కార్యక్రమాలతో  నేవీ డే ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ రోజు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు ప్రజలకు ప్రదర్శనకు అందుబాటులో ఉంటాయి. నేటి విద్యార్థులు, యువతకి భారత నౌకాదళ గొప్పతనం గురించి, దేశ రక్షణలో దాని ప్రాముఖ్యత గురించి  అవగాహన కల్పించటం ద్వారా  నేవీ పట్ల ఆసక్తి కలిగేలా చేయటానికి ఇదొక అవకాశం.  భారత నౌకాదళానికి లాల్ సలామ్..!!                                         *రూపశ్రీ.  
  పెరుగుతున్న వయస్సుతో  రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం అనేది ఒక సహజంగా జరిగేదే. దీనిని ఇమ్యునోసెన్సెన్స్ అంటారు. 50 తర్వాత దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా, శరీరం వైరస్లు,  బ్యాక్టీరియాతో పోరాడడంలో విఫలమవుతుంది. ఇది ఫ్లూ, షింగిల్స్,  న్యుమోనియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే  కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా  రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఇందుకోసం వైద్యులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు.   వీటిని పాటిస్తే  50 ఏళ్ల తర్వాత కూడా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. నీరు.. తగినంత నీరు త్రాగడం అనేది చాలామంది  పట్టించుకోని విషయం.  కానీ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు నీరు పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం లోపిస్తే  శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాలను పడతాయి.  ఎందుకంటే ఇది రోగనిరోధక కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది.   శరీరం యొక్క రక్షణ యంత్రాంగాన్ని బలహీనపరుస్తుంది. వయసు పెరిగే కొద్దీ మన దాహం తగ్గుతుంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి  నీరు, హెర్బల్ టీలు  పండ్లు,  కూరగాయలతో సహా రోజంతా తగినంత ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా పోషకాలను గ్రహించడం, వ్యర్థాలను తొలగించడం,  మొత్తం రోగనిరోధక వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది. ఆహారం.. మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడానికి పోషకాహారం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ మన శరీరం పోషకాలను గ్రహించలేకపోతుంది. కాబట్టి  పండ్లు, కూరగాయలు, ధాన్యాలు,  లీన్ ప్రోటీన్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోబయోటిక్స్ కూడా సహాయపడతాయి. విటమిన్లు సి,  ఇ, జింక్,  సెలీనియం వంటి పోషకాలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.  శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వ్యాక్సిన్లు.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి లేదా పెరుగుతున్న వయస్సుతో సంభవించే ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి వ్యాక్సిన్  అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. కాలక్రమేణా మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా వృద్ధులలో షింగిల్స్, న్యుమోనియా,  ఫ్లూ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. వ్యాక్సిన్‌లు మన శరీరం ఈ ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలను తయారు చేయడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, షింగిల్స్ వ్యాక్సిన్ 50 ఏళ్లు పైబడిన వారికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే చిన్ననాటి చికెన్ పాక్స్ మళ్లీ చురుకుగా మారవచ్చు.  ఇది  షింగిల్స్ వంటి బాధాకరమైన ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. నిద్ర.. మంచి నిద్ర మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది మన శరీరాన్ని రిపేర్ చేయడం మరియు పునరుత్పత్తి చేయడమే కాకుండా, మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల, మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, దాని కారణంగా మనం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతాము. నిజానికి, నిద్రలో మన శరీరం సైటోకిన్స్ అనే ప్రత్యేకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇన్‌ఫెక్షన్ మరియు ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. తక్కువ నిద్ర కారణంగా, సైటోకిన్‌ల ఉత్పత్తి మందగిస్తుంది, దీని వల్ల వ్యాధులతో పోరాడే మన సామర్థ్యం బలహీనపడుతుందని మీకు చెప్పండి. అందువల్ల, ప్రతి రాత్రి 7-9 గంటలు మంచి నిద్ర పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి, తద్వారా మన రోగనిరోధక శక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. చురుకుదనం.. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామం చేయడం వల్ల  బరువు అదుపులో ఉండటమే కాకుండా కండరాలు బలపడతాయి.  వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది.  నిత్యం వ్యాయామం చేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రక్తంలో మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడే కొన్ని ప్రత్యేక కణాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడినప్పుడు ఈ కణాలు శరీరం అంతటా సులభంగా కదలగలవు.  ఏదైనా సూక్ష్మక్రిములతో పోరాడటానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో వాపులు కూడా తగ్గుతాయి.  ఇన్ఫ్లమేషన్ వయసు పెరిగే కొద్దీ వ్యాధులతో పోరాడే మన శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మనం  వాపును తగ్గించి ఆరోగ్యంగా ఉండవచ్చు.                                          *రూపశ్రీ.
  సీజన్ ను బట్టి శరీరానికి ఆహారం అందించాలి. అలా అందించినప్పుడే  శరీరం వాతావరణానికి తగినట్టు బలంగా ఉంటుంది.  ముఖ్యంగా ఇప్పుడు చలికాలం మొదలైంది.  ఈ చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలి. ఇందుకోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలి.   అదే విధంగా పోషకాలు అధికంగా ఉన్న ఆహారం కూడా తీసుకోవాలి.  ఇలాంటి ఆహారాలలో నువ్వులు  ముఖ్యమైనవి. నువ్వులలో రెండు రకాలు ఉంటాయి.  వాటిలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఉన్నాయి.  కానీ చలికాలంలో తెల్ల నువ్వులు తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.  అవేంటో తెలుసుకుంటే.. నువ్వులు వేడి గుణం కలిగి ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తెల్ల నువ్వులను తీసుకోవాలి. తెల్ల నువ్వులను రోజూ కనీసం ఒక స్పూన్ మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  చలికాలంలో వచ్చే జలుబు,  దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడలో ఇది సహాయపడుతుంది. తెల్ల నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  చలికాలంలో జీర్ణక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది.  ఈ జీర్ణక్రియను ఆరోగ్యంగాను,  వేగంగా చేయడంలో తెల్ల నువ్వులు సహాయపడతాయి.  దీని కారణంగా మలబద్దకం సమస్య కూడా దరిచేరదు. తెల్ల నువ్వులలో లిగ్నాన్స్,  ఫైటూస్టెరాల్స్ ఉంటాయి.  ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ఇది తగ్గిస్తుంది. నువ్వులలో కాల్షియం,  మెగ్నీషియం, మాంగనీస్,  ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.  ఇవి ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి.  ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలోనూ,  ఆరోగ్య సమస్యలను నివారించడంలోనూ సహాయపడతాయి. చలికాలంలో ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్,  కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కానీ తెల్ల నువ్వులు తీసుకోవడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి.                                                       *రూపశ్రీ.
శరీరానికి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి.  ఆరోగ్యం బాగా లేనప్పుడు పండ్లను బాగా తీసుకుంటే తొందరగా అనారోగ్యం నుండి బయటపడతారు.  అయితే పండ్లు కూడా సీజన్ ను బట్టి తీసుకుంటే శరీరానికి ఎక్కువ లాభం కలుగుతుంది.  ప్రస్తుతం చలికాలం సాగుతున్న తరుణంలో చలికాలంలో బొప్పాయి తింటే మంచిదని అంటున్నారు.  బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో కాస్త వేడి గుణం కలిగిన ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.  చలి కారణంగా శరీరం డిస్టర్బ్ అవ్వదు. బొప్పాయిలో కూడా వేడి గుణం కలిగి ఉంటుంది.  చలికాలంలో వీలైనపుడల్లా బొప్పాయిని తినాలి. చలికాలంలో బొప్పాయిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  బొప్పాయిలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చలికాలంలో వచ్చే సీజన్ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  దగ్గు, జలుబు, చలికారణంగా ఎదురయ్యే తలనొప్పి, ఫ్లూ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. బొప్పాయి పండులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో ఎంజైమ్ లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి.  ఇవన్నీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.  మలబద్దకం,  మోషన్ కావడంలో ఇబ్బందులు,  అజీర్తి వంటి సమస్యలు బొప్పాయి తినడం వల్ల అధిగమించవచ్చు. బొప్పాయిలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది.  ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.  గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తాయి. కఠినమైన  వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె యవ్వనంగా ఉండాలన్నా,  ఎంత వయసు పెరిగినా ఇంకా యవ్వనంగా ఉన్నవారిలా గుండె పనిచేయాలని కోరుకుంటున్నా బొప్పాయిని తినమని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయికి చాలా మేలు చేస్తుంది.  ఇందులో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.  విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు చలికాలంలో కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.  కేవలం ఆహారంగానే కాకుండా  చర్మ సంరక్షణలో కూడా బొప్పాయిని చేర్చుకోవచ్చు.  బొప్పాయి ఫేస్ వాష్,  బొప్పాయి ఫేస్ ప్యాక్ ట్రై చేయచ్చు. చలికాలంలో వేడి ఆహారాల మీద అందకీ కన్ను ఉంటుంది.  ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసే పకోడీలు,    వడలు,  సమోసా వంటి స్నాక్స్ ను ఇష్టపడతారు.  వీటి వల్ల బరువు వేగంగా పెరుగుతారు.  కానీ బొప్పాయి తీసుకుంటే ఆకలి ఎక్కువగా కాదు.  ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.  కాబట్టి దీన్ని తింటే బరువు పెరగకపోవడమే కాకుండా.. బరువు తగ్గడం కూడా సులువు.                                                    *రూపశ్రీ.