LATEST NEWS
గత రెండు  మూడు రోజులుగా మంచు ఫ్యామిలో ఆస్తి తగదాలు రచ్చకెక్కాయి.  ఫిల్మ్ ఇండస్ట్రీలో, సమాజంలో పెదరాయుడిగా చెలామణి అవుతున్న మోహన్ బాబు పరువు అమాంతం పడిపోయింది. అప్పట్లో  తనకు వ్యతిరేకంగా వార్త ప్రసారం చేసిన ప్రముఖ  టీవీ చానల్ లోకి  గూండాలతో జొరబడ్డ మోహన్ బాబు  తన సర్వీస్ రివాల్వర్ తో సిబ్బందిని భయపెట్టిన సంగతి తెలిసిందే. తనకు ప్రాణ హాని ఉందని మోహన్ బాబు  తాజాగా పోలీసులకు ఫిర్యా చేస్తే కొడుకు మనోజ్ కూడా తండ్రి మోహన్ బాబుపై , సోదరుడు మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం మోహన్‌బాబు, మనోజ్‌ల ఫిర్యాదులతో గొడవలు బహిర్గతమయ్యాయి. మొదట తండ్రి కొడుకుల మధ్య గొడవ  జరిగిందంటూ ఆదివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. దీన్ని  మోహన్‌బాబు , మంచు మనోజ్  ఖండించినప్పటికీ సోమవారం మరో మారు ఘర్షణ జరగడంతో మనోజ్ ఇల్లు వదిలేసి పారిపోయారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన   విష్ణు తమ్ముడిని మెడలు పట్టి గెంటేసినట్లు తెలుస్తోంది. . అయితే అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్‌కు  మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని మంచుటౌన్‌లో పదేళ్లుగా నివాసం ఉంటున్న చిన్నకుమారుడు మనోజ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయి  ఆస్తికోసం నాలుగు నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్‌బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  మనోజ్ తను  కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని, ఆ తర్వాత అతడి ఏడు నెలల శిశువుని పనిమనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని మోహన్‌బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటికి వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తుల్ని గమనించానన్నారు. మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది జల్‌పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు  మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా తండ్రి మోహన్ బాబుపై  మనోజ్ ఫిర్యాదు  చేయడం చూస్తే మోహన్ బాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది.  మోహన్ బాబు  చచ్చిన పాము  అని పలువురు చర్చించుకుంటున్నారు. షూటింగ్ కు ఆలస్యంగా వచ్చిన కారణంగా యాక్ట్రెస్ సాక్షి శివానంద్ చెల్లెలి చెంప చెల్లు మనిపించిన మోహన్ బాబు తనకు  చిన్నకొడుకు మనోజ్  నుంచి  ప్రాణ హాని ఉందని పోలీసులనాశ్రయించాడు.  నా  ఇంటి  నుంచి నన్నే శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని  మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.   మోహన్ బాబుకు  ఇద్దరు భార్యలు . మొదటి భార్య సంతానం మంచు విష్ణు, మంచు లక్ష్మి రెండో భార్య కుమారుడు మంచు మనోజ్.  కానీ ఇన్నాళ్లు ఒకే తల్లి పిల్లలు అని అందరూ అనుకున్నారు. ఈ గొడవలతో మోహన్ బాబు కుటుంబం పూర్తిగా బజారున పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం మంచు విష్ణు మంచుమనోజ్ ఆస్తి గొడవలు ప్రారంభం అయ్యాయి. అయితే అప్పట్లో వీరి గొడవ వీడియోల ద్వారా బయటకు వచ్చాయి. మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ ఇంటికి వచ్చి గొడవపడ్డాడు.  ఈ గొడవ పూర్తిగా సద్దుమణిగినట్లు అందరూ భావించారు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న గొడవతో  క్రమ శిక్షణకు మారు పేరుగా నిల్చిన మోహన్ బాబు ఇంట్లో నే క్రమ శిక్షణా రాహిత్యం బయటపడ్డట్టయ్యింది.  మోహన్ బాబుకు చెందిన విద్యాసంస్థల ఆదాయం పూర్తిగా మంచు  విష్ణు అనుభవిస్తున్నట్లు ఆరోపణలు  ఉన్నాయి.  మోహన్ బాబుకు చెందిన లక్మి ప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రాలు  ఎక్కువగా మంచు విష్ణు వే ఉండటం మంచు మనోజ్ కు నచ్చడం లేదు.  ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నాలుగు నెలలకు మంచు మనోజ్ తండ్రి ఇంటికి వచ్చాడు. అన్న విష్ణు దుబాయ్ లో  ఉన్న సమయంలో మనోజ్ రావడం తండ్రితో గొడవ పడటంతో మళ్లీ గొడవలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య, కుమారుడిని చుట్టుముట్టారని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు. ఈ నెల 8న తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నానన్నారు. కర్రలతో వచ్చిన 10 మంది జల్‌పల్లిలోని తన నివాసంలోకి ప్రవేశించారన్నారు. వాస్తవానికి చిత్రీకరణ కోసం వెళ్తాననే సమాచారంతో ఇంట్లోకి వచ్చి భార్య, పిల్లల్ని చుట్టుముట్టాలని చూశారన్నారు. మంచు మనోజ్ భార్య మౌనిక మోహన్ బాబు ఇంట్లో ఉన్న సమయంలో గొడవలు జరిగాయి. సీసీటీవీలో ఇవన్నీ రికార్డయ్యాయి. కానీ ఈ ఫుటేజి మాయమయ్యాయి.   నిజంగానే మంచు మనోజ్ కు అన్యాయం జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఎపి హోంమంత్రి అనితలకు మనోజ్ ట్వీట్ చేయడం చూస్తే ఈ వివాదం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు.   
గత రెండు  మూడు రోజులుగా మంచు ఫ్యామిలో ఆస్తి తగదాలు రచ్చకెక్కాయి.  ఫిల్మ్ ఇండస్ట్రీలో, సమాజంలో పెదరాయుడిగా చెలామణి అవుతున్న మోహన్ బాబు పరువు అమాంతం పడిపోయింది. అప్పట్లో  తనకు వ్యతిరేకంగా వార్త ప్రసారం చేసిన ప్రముఖ  టీవీ చానల్ లోకి  గూండాలతో జొరబడ్డ మోహన్ బాబు  తన సర్వీస్ రివాల్వర్ తో సిబ్బందిని భయపెట్టిన సంగతి తెలిసిందే. తనకు ప్రాణ హాని ఉందని మోహన్ బాబు  తాజాగా పోలీసులకు ఫిర్యా చేస్తే కొడుకు మనోజ్ కూడా తండ్రి మోహన్ బాబుపై , సోదరుడు మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం మోహన్‌బాబు, మనోజ్‌ల ఫిర్యాదులతో గొడవలు బహిర్గతమయ్యాయి. మొదట తండ్రి కొడుకుల మధ్య గొడవ  జరిగిందంటూ ఆదివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. దీన్ని  మోహన్‌బాబు , మంచు మనోజ్  ఖండించినప్పటికీ సోమవారం మరో మారు ఘర్షణ జరగడంతో మనోజ్ ఇల్లు వదిలేసి పారిపోయారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన   విష్ణు తమ్ముడిని మెడలు పట్టి గెంటేసినట్లు తెలుస్తోంది. . అయితే అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్‌కు  మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని మంచుటౌన్‌లో పదేళ్లుగా నివాసం ఉంటున్న చిన్నకుమారుడు మనోజ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయి  ఆస్తికోసం నాలుగు నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్‌బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ తను  కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని, ఆ తర్వాత అతడి ఏడు నెలల శిశువుని పనిమనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని మోహన్‌బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటికి వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తుల్ని గమనించానన్నారు. మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది జల్‌పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు  మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా తండ్రి మోహన్ బాబుపై  మనోజ్ ఫిర్యాదు  చేయడం చూస్తే మోహన్ బాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది.  మోహన్ బాబు  చచ్చిన పాము  అని పలువురు చర్చించుకుంటున్నారు. షూటింగ్ కు ఆలస్యంగా వచ్చిన కారణంగా యాక్ట్రెస్ సాక్షి శివానంద్ చెల్లెలి చెంప చెల్లు మనిపించిన మోహన్ బాబు తనకు  చిన్నకొడుకు మనోజ్  నుంచి  ప్రాణ హాని ఉందని పోలీసులనాశ్రయించాడు.  నా  ఇంటి  నుంచి నన్నే శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని  మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.   మోహన్ బాబుకు  ఇద్దరు భార్యలు . మొదటి భార్య సంతానం మంచు విష్ణు, మంచు లక్ష్మి రెండో భార్య కుమారుడు మంచు మనోజ్.  కానీ ఇన్నాళ్లు ఒకే తల్లి పిల్లలు అని అందరూ అనుకున్నారు. ఈ గొడవలతో మోహన్ బాబు కుటుంబం పూర్తిగా బజారున పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం మంచు విష్ణు మంచుమనోజ్ ఆస్తి గొడవలు ప్రారంభం అయ్యాయి. అయితే అప్పట్లో వీరి గొడవ వీడియోల ద్వారా బయటకు వచ్చాయి. మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ ఇంటికి వచ్చి గొడవపడ్డాడు.  ఈ గొడవ పూర్తిగా సద్దుమణిగినట్లు అందరూ భావించారు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న గొడవతో  క్రమ శిక్షణకు మారు పేరుగా నిల్చిన మోహన్ బాబు ఇంట్లో నే క్రమ శిక్షణా రాహిత్యం బయటపడ్డట్టయ్యింది.  మోహన్ బాబుకు చెందిన విద్యాసంస్థల ఆదాయం పూర్తిగా మంచు  విష్ణు అనుభవిస్తున్నట్లు ఆరోపణలు  ఉన్నాయి.  మోహన్ బాబుకు చెందిన లక్మి ప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రాలు  ఎక్కువగా మంచు విష్ణు వే ఉండటం మంచు మనోజ్ కు నచ్చడం లేదు.  ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నాలుగు నెలలకు మంచు మనోజ్ తండ్రి ఇంటికి వచ్చాడు. అన్న విష్ణు దుబాయ్ లో  ఉన్న సమయంలో మనోజ్ రావడం తండ్రితో గొడవ పడటంతో మళ్లీ గొడవలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య, కుమారుడిని చుట్టుముట్టారని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు. ఈ నెల 8న తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నానన్నారు. కర్రలతో వచ్చిన 10 మంది జల్‌పల్లిలోని తన నివాసంలోకి ప్రవేశించారన్నారు. వాస్తవానికి చిత్రీకరణ కోసం వెళ్తాననే సమాచారంతో ఇంట్లోకి వచ్చి భార్య, పిల్లల్ని చుట్టుముట్టాలని చూశారన్నారు. మంచు మనోజ్ భార్య మౌనిక మోహన్ బాబు ఇంట్లో ఉన్న సమయంలో గొడవలు జరిగాయి. సీసీటీవీలో ఇవన్నీ రికార్డయ్యాయి. కానీ ఈ ఫుటేజి మాయమయ్యాయి.   నిజంగానే మంచు మనోజ్ కు అన్యాయం జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఎపి హోంమంత్రి అనితలకు మనోజ్ ట్వీట్ చేయడం చూస్తే ఈ వివాదం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు.   
ఎపిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులైన బీద మస్తాన్ రావ్   ఈ నెల 9న (సోమవారం) తెలుగుదేశం గూటికి చేరుతున్నారు.  ఇటీవల  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేతలు టిడిపి, జనసేన, బిజెపిలో చేరుతున్నారు. వారిలో ఆర్ కృష్ణయ్య ఒకరు. ఆయన వైసీపీ రాజ్యసభ సభ సిట్టింగ్ ఎంపీ. రెండోసారి కూడా వైసీపీ నుంచి టికెట్ వచ్చే అవకాశాలున్నప్పటికీ ఆయన బిజెపిలో చేరి   రాజ్యసభ సీటు  రెండో సారి దక్కించుకున్నారు.  బీద మస్తాన్ రావ్ కూడా వైసీపీ రాజ్య సభ సిట్టింగ్ ఎంపీ. ఈయనకు కూడా రెండోసారి కూడా ఆ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశమున్నప్పటికీ  స్వంత పార్టీ అయిన దేశం గూటికి చేరడం ఆసక్తికరం. ఈయన కూడా రెండో సారి రాజ్యసభ సీటు టిడిపి నుంచి దక్కించుకునే అవకాశం ఉంది. బీద మస్తాన్ రావ్ కు ఇంకా నాలుగేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన వైసీపీకి రాజీనామా చేసారు.  వైఎస్ ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ రాజ్య సభసభ్యులు మోపిదేవి వెంటరమణ  తన పదవికి ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ నవంబర్ 9న టిడిపిలో  చేరనున్నారు. 
త్వరలో జరగబోయే రాజ్యసభ  ఉప ఎన్నికలకు గానూ బిజెపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో ఎపి నుంచి మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను  ప్రకటించింది. గతంలో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా గెల్చిన బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైన ఆర్ కృష్ణయ్య బిజెపిలో చేరారు.    గత అసెంబ్లీ ఎన్నికల్లో     వైసీపీ ఓటమితో  బిజెపి పంచన చేరి  రాజ్యసభ టికెట్ దక్కించుకోవడంలో  ఆయన సక్సెస్ అయ్యారు. 
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.   ఈ నెల 9న (సోమవారం సాయంత్రం ఆరు గంటలకు)  సచివాలయ ఆవరణలో ఈ వేడుక ప్రారంభం కానుంది.  లక్ష మంది  మహిళల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  విగ్రహ రూపు రేఖలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపినట్టు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు విగ్రహాన్ని తయా చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించారు. గత బిఆర్ఎస్ రూపొందించిన విగ్రహాంలో మార్పులు చేర్పులు చేయడాన్నిఆ పార్టీ నేత, మాజీ సాంస్కృతిక శాఖ చైర్మెన్ జూలూరి గౌరిశంకర్ హైకోర్టులో పిల్ వేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఎర్రవెల్లి ఫాం హౌజ్ కు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు విగ్రహావిష్కరణ ఆహ్వానం అందించారు. 
ALSO ON TELUGUONE N E W S
రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే సానా బుచ్చిబాబు డైరెక్షన్‌లో చేస్తున్న ఆర్‌సి16 సెట్స్‌కి వెళ్లిపోయారు చరణ్‌. మైసూర్‌లో తొలి షెడ్యూల్‌ స్టార్ట్‌ అయింది. ఈ షెడ్యూల్‌లో చరణ్‌ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. అదేమిటంటే.. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్నాడనేదే ఆ వార్త. సల్మాన్‌ని ఈ సినిమాలో చూపించేందుకు యూనిట్‌ ప్రయత్నాలు చేస్తోంది.  సల్మాన్‌ఖాన్‌తో రామ్‌చరణ్‌కి మంచి రిలేషన్‌ ఉంది. ఆ స్నేహంతోనే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ నటించారు. ఇందులో నటించినందుకు సల్మాన్‌ రెమ్యునరేషన్‌ తీసుకోలేదని చిరంజీవి స్వయంగా తెలియజేశారు. అలాగే సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘కిసీకా భాయ్‌ కిసీకీ జాన్‌’ చిత్రంలోని ఓ పాటలో రామ్‌చరణ్‌తోపాటు వెంకటేష్‌ కూడా స్టెప్పులేశారు. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే ఇప్పుడు చరణ్‌ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ నటించేందుకు ఒప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ కాంబోకి సంబంధించి సంక్రాంతి లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్‌సి16 సినిమా కోసం ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ సినిమాకి సంగీతాన్నందిస్తున్నారు. చరణ్‌ సినిమాకి రెహమాన్‌ మ్యూజిక్‌ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 
Manchu Mohan Babu and Manchu Manoj have complained against each other to police asking for protection. The family feud has gone out of hands and many are wondering what could be the reason for their feud. The internal issues in the family have been known to few close sources but the new fight has brought them out in open.  A house staff revealed to media anonymously that Manchu Manoj has hit Prasad Babu, another staff member in the house, on Saturday. As Manoj was not listening to anyone in anger, Mohan Babu interfered. Mohan Babu asked Manoj to not handle his staff and he stated that he will take care of the situation.  Manoj did not listen to Mohan Babu's words and kept attacking Prasad Babu. Mohan Babu physically tried to stop Manoj and both of them pushed each other. So, the matter has gone out of hands. While Lakshmi Manchu tried to console them both after the matter came out in media, Manoj and Mohan Babu did not listen to her.  Now, Manchu Vishnu has flown down to Hyderabad to calm down both of them. So, according to the staff member, the issue seems to be more about trying to establish control over the house and the staff which propelled out of the hand due to unresolved previous issues. 
Baahubali series has opened up Pan-India markets to Telugu Films, especially, Hindi markets. Saaho, Salaar, RRR, Kalki 2898 AD films collected heavily in Hindi markets. RRR has been able to collect over Rs.1200 crores and even Kalki 2898 AD crossed Rs.1100 crores gross with the help of Hindi diaspora. Salaar and Saaho collected profitable amounts in Hindi market while they did not collect as expected in other South Indian markets.  Even Pushpa The Rise, achieved huge cult status in Hindi heartland but did not attain same level in South Indian markets. Kerala and Tamil Nadu states did not really warm up to the character or the film. Even in Telugu states, movie did not live up to the expectations of the movie-goers from Allu Arjun and Sukumar combination.  So, when the Pushpa 2: The Rise has been announced, many anticipated it to be better than first film. In Hindi markets, the movie opened to 334 crores Nett collections in just 5 days. The gross would be close to Rs.500 crores from just Hindi markets. Worldwide gross in 5 days is close to Rs.885 crores with official figures yet to be announced.  But then, Pushpa 2 The Rule is not getting the same kind of appreciation from Industry like RRR, Baahubali-2 did. Even Pushpa The Rise received positive appreciation starting from Mahesh Babu to many stars, actors. Now, Pushpa 2 has been able to topple SRK's Jawan records with Highest ever Single Day and Opening day collections.  Such a huge achievement is not at all being considered or mentioned by TFI stars. In fact, Siddharth openly commented with sarcasm that Patna people assemble even when JCBs are brought to their place, so Pushpa 2 crowd is not a big surprise for him. Rajendra Prasad, commented that Hero's definition as changed as a sandal wood smuggler is being projected as a leading protagonist.  What changed now? If Allu Arjun's supposed feud with Mega Family is a reason, then Arjun openly thanked Deputy CM Pawan Kalyan, by calling him, "Kalyan Babai". At  the same time, Megastar Chiranjeevi and Ram Charan did not wish Allu Arjun, their Bunny, on such a huge achievement.  There is a huge silence among everyone even though Pushpa 2 is on track to become fastest Rs.1000 crores grosser. Will the wishes pour in after it touches 1000 crores landmark or will it just be ignored? Even in Telugu markets, the hikes and over pricing of the tickets has shown huge impact on the film's performance. The film is underperforming and in Kerala, Tamil Nadu movie could end up with losses. Even AP markets could see some sort of losses, mainly in Godavari basin.  So, Pushpa seems to be once again ruling the roost in Hindi but falling short in Telugu. Maybe this is the reason for open bashing of the film and this silence from all stars even though it achieved such a feat. Some even say that Allu Arjun has never been vocal in supporting others' films and hence, he is getting same treatment back. Whatever maybe the reason, this silence is weird and unfathomable for the movie-goers. 
మంచు మోహన్ బాబు(mohan babu)ఆయన కుటుంబం మధ్య జరుగుతున్న ఆస్తుల గొడవ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.రీసెంట్ గా మోహన్ బాబు తన రెండవ కుమారుడు మనోజ్(manoj)వల్ల తన ప్రాణాలకి ముప్పు ఉందని,రక్షణ కావాలంటూ మోహన్ బాబు రాచకొండ పోలీష్ కమీషనర్ కు ఒక లేఖ ని కూడా రాయడం జరిగింది. దీంతో ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతు నేను ఆస్తుల కోసం ఎప్పుడు ప్రాకులాడ లేదు. ఆస్తులు కావాలని ఇబ్బంది కూడా పెట్టలేదు.డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం కూడా చేయటం లేదు.నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం.విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతుండటంతో బాధితులకు నేను అండగా ఉన్నాను.ఆ విధంగా బాధితుల పక్షాన నిలబడ్డందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను.పోలీసులు ఏకపక్షంగా  వ్యవహరిస్తు నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయిందనే పోరాటం చేస్తున్నాను.కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను.ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరం.కొన్నాళ్ల నుంచి నేను, మౌనిక మా ఇంటి నుంచి దూరంగానే ఉంటున్నాం.నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు. ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయి.నా అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసు.విష్ణు(manchu vishnu)అనుచరులు విజయ రెడ్డి ,కిరణ్ రెడ్డి సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కూడా కోరతానని మనోజ్ చెప్పాడు.   
సిడ్నీ స్వీని.. 2009లో హాలీవుడ్‌లో ఎంటర్‌ అయిన ఈమె చాలా సినిమాల్లో తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అలాగే టెలివిజన్‌ షోలు, పాడ్‌కాస్ట్‌లు, వెబ్‌ సిరీస్‌లు, మ్యూజిక్‌ వీడియోస్‌.. ఇలా ప్రేక్షకులకు రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఇప్పుడీ బ్యూటీ ఓ తమిళ్‌ హీరోతో కలిసి నటిస్తుందన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ హీరో ఎవరో కాదు ధనుష్‌. ఇటీవల స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘రాయన్‌’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు ధనుష్‌. ఇది కాకుండా తన దర్శకత్వంలోనే తమిళ్‌లో ‘ఇడ్లీ కడాయ్‌’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్‌ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది.  ఇదిలా ఉంటే.. హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సిడ్నీ స్వీనితో ధనుష్‌ టీమ్‌ చర్చలు జరుపుతోంది. ధనుష్‌తో కలిసి ఈ బ్యూటీ నటించబోతోంది అనేది వార్త. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. వివిధ దేశాలకు సంబంధించిన మూవీ మేకర్స్‌ ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అంత పాపులారిటీ వున్న హీరోయిన్‌ని ఓ తమిళ్‌ సినిమా కోసం తీసుకురావడం అంటే సాహసమనే చెప్పాలి. గతంలో ధనుష్‌ బాలీవుడ్‌ సినిమాలతోపాటు హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. అతను ఓ కీలక పాత్రలో నటించిన ది గ్రే మ్యాన్‌ మంచి హిట్‌ అయింది. అందులో ధనుష్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా బాగుంటాయి. ఇప్పుడు సిడ్నీతో జరుపుతున్న చర్చలు తమిళ్‌ సినిమా కోసమా లేక హాలీవుడ్‌ సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.  ధనుష్‌ చేసే సినిమాల్లోని కథ, కథనాలు అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ విషయంలో సిడ్నీకి కూడా అవగాహన ఉందని తెలుస్తోంది. అందుకే ధనుష్‌ టీమ్‌తో చర్చలకు సిద్ధమైంది. ఇంతకుముందు ధనుష్‌ హాలీవుడ్‌ సినిమాల్లో నటించినా అవి అందరికీ రీచ్‌ అవ్వలేదన్న లోటు ధనుష్‌కి ఉంది. అందుకే ఈసారి హాలీవుడ్‌లో ఒక రేంజ్‌ సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. సిడ్నీతో దాని గురించే చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇప్పటికే తన సినిమాలతో ఇండియాలో పాపులర్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్‌ ఇప్పుడు హాలీవుడ్‌పై కన్నేశారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. 
  ఇటీవల థియేటర్లలో అడుగుపెట్టిన 'పుష్ప-2' సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, రూ.1000 కోట్లకు చేరువైంది. అయితే 'పుష్ప-2'తో అల్లు అర్జున్ ఇన్ని సంచలనాలు సృష్టిస్తుంటే, ఇతర హీరోల నుంచి కనీస స్పందన లేదు. ఎవరూ బన్నీకి కానీ, పుష్ప-2 టీంకి కానీ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పట్లేదు. ఇంకా కొందరైతే విష్ చేయకపోగా.. 'పుష్ప-2'ని టార్గెట్ చేస్తున్నారు. (Pushpa 2 The Rule)   విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా, ప్రమోషన్స్ పరంగా పుష్ప-2 ఎన్నో సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్ కి ఏకంగా రెండు లక్షల మంది హాజరవ్వడం అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. అయితే తాజాగా ఈ వేడుకపై హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన తాజా చిత్రం 'మిస్ యూ' ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. పుష్ప-2 పాట్నా ఈవెంట్ ప్రస్తావన వచ్చింది. దీనికి సిద్ధార్థ్ బదులిస్తూ.. "అదంతా మార్కెటింగ్ అంతే. కన్‌స్ట్రక్షన్‌ లో జేసీబీలు వర్క్ చేస్తున్నా చూడటానికి జనాలు వస్తారు. ఇండియాలో మీటింగ్ లకు జనాలను తీసుకురావడం పెద్ద విషయం కాదు." అంటూ దారుణ వ్యాఖ్యలు చేశాడు. సిద్ధార్థ్ కామెంట్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. "నువ్వెళ్ళి పాట్నాలో ఈవెంట్ పెట్టు.. ఎంతమంది వస్తారో చూద్దాం", "నార్త్ లో పుష్ప-2 కి వస్తున్న కలెక్షన్స్ చూశావా?.. నీ సినిమా వస్తున్న విషయం, కనీసం సౌత్ లో అయినా తెలుసా?" అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.   ఇక సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ సైతం 'పుష్ప-2'పై ఊహించని కామెంట్స్ చేశారు. తాజాగా 'హరికథ' వెబ్ సిరీస్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. "ఇప్పుడు కథలు మారిపోయాయి. నిన్న గాక మొన్న చూశాం. వాడెవడో చందనం దొంగ.. వాడు హీరో. ఇప్పుడసలు హీరో అంటే మీనింగ్ లు మారిపోయాయి." అని అన్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ అప్పటి హీరో పాత్రలకు, ఇప్పటి హీరో పాత్రలకు మధ్య వ్యత్యాసాన్ని చెబుతూ అటువంటి కామెంట్స్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం ఇలా ప్రత్యేకంగా 'పుష్ప' ప్రస్తావన మాత్రమే తీసుకురావడం అవసరమా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.   ఏది ఏమైనా, 'పుష్ప-2' సక్సెస్ ని చూసి విష్ చేయకపోగా.. ఇలా కొందరు హీరోలు కావాలని టార్గెట్ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.  
చియాన్ విక్రమ్(vikram)హీరోగా పా రంజిత్(pa ranjith)దర్శకత్వంలో అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదలైన మూవీ 'తంగలాన్'(thangalaan).స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు, డానియల్,ప్రీతి కరణ్,పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నిఅందించాడు. 'తంగలాన్'ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చెయ్యడం జరిగింది.ఈ విషయాన్నీ'తంగలాన్' టీం అధికారకంగా ప్రకటించడమే కాకుండా ఒప్పందం ప్రకారం మూవీ రిలీజ్ రోజు టైటిల్స్ లో చెప్పడం జరిగింది.దీంతో థియేటర్ రిలీజ్ తర్వాత జరిగే ఓటిటి రిలీజ్ కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల సదరు సంస్థ ఓటిటి లో స్ట్రీమింగ్ చెయ్యలేదు.దీంతో ఒక దశలో తంగలాన్ ఓటిటి లో ఉండదేమో అనే టాక్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు అందరి అంచనాలని తలకిందులు చేస్తు ఈ రోజు నుంచి 'తంగలాన్' ఓటిటి వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారకంగా వెల్లడి చేయడమే కాకుండా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ,  భాషల్లో అందుబాటులోకి రానుందని వెల్లడి చెయ్యడం జరిగింది.   బ్రిటిష్ పరిపాలనాకాలంలో కొంత మంది బ్రిటిష్ వాళ్ళు'కోలార్ గోల్డ్' లో ఉన్నబంగారం కోసం ఒక గిరిజన తెగ కి చెందిన వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళకి నాయకుడు గా విక్రమ్ కనిపించగా, బంగారాన్ని కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి సంపాదించగలిగారా లేదా? ఆ ప్రయాణంలో ఎదురైన కష్టాలేంటి అనే పాయింట్ తో తంగలాన్ తెరకెక్కింది.విక్రమ్ తో పాటు చాలా మంది తమ పాత్రల కోసం ఎన్నో కష్టాలని  ఎదుర్కొని ఈ సినిమాలో నటించడం జరిగింది.  
సినిమా పరిశ్రమలో మెగాబ్రదర్ నాగబాబు(nagababu)కి ఉన్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపుని పొందాడు. ప్రస్తుతం తన సోదరుడు పవన్ కళ్యాణ్(pawan kalyan)స్థాపించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతలని సమర్దవంతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)రీసెంట్ గా ఒక లేఖని విడుదల చేస్తు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా వెల్లడి చెయ్యడం జరిగింది.దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. నాగబాబుకి ఏ శాఖ కేటాయిస్తారనే ఆసక్తి  ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది.  
Manchu Manoj and Manchu Vishnu are step-brothers as their father Manchu Mohan Babu re-married after his first wife passed away. While the brothers have never stated out any sort of dispute in public before, the sources close to Manchu Family have been indicating tensions between the brothers.  Vishnu and Manoj both have tried to establish themselves as leading actors with minimal success. Still, Manoj has been able to find appreciation for his acting skills and dedication. Eldest of Mohan Babu children, Lakshmi Manchu, also openly supported Manoj's journey into films.  The issues became more prominent after Manchu Vishnu has been handed over Mohan Babu University management. Mohan Babu wanted both his sons to amicably resolve their issues but Manoj marrying Mounika, distanced the brothers even further, say sources.  Now, Mohan Babu in his letter to Police Commissioner stated that his younger son, Manoj and his wife Mounika, have been harassing them for money. But Manoj countered that by stating that he never wanted anything from family assets and is only opposing the problems raised by students about Mohan Babu University management.  The main issue between the brothers is said to be more personal than just financial. While we could not really confirm about it, the matter seems to be more about choices of Manoj and his lifestyle that doesn't coincide with Vishnu's ideology.    There are speculations about respective wives of brothers are being at loggerheads. Vishnu moved to Dubai with his wife not wanting to share the same roof with his brother, as his wife felt uncomfortable, recently, stated sources. But no one thought Mohan Babu will be dragged into the fight and it goes this public, as well.  Now, Manchu Vishnu has flew down from Dubai to resolve the issue. He looked calm and stated that the internal family issues will be resolved amicably. On the other hand, Lakshmi Manchu flew away from Hyderabad, without involving herself in the issue.  It looks like Manchu Vishnu has to play bigger part in resolving the issue as sources claim that it all started with him. Currently, Manoj is nursing his injuries and he is gravely upset about Mohan Babu's complaint. On the other hand, Mohan Babu is expecting Manoj to apologise to him and Vishnu, as well. 
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్(sandhya theater)లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్  తీవ్ర గాయాలతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్న విషయం తెలిసిందే.  రీసెంట్ గా శ్రీతేజ్  ఆరోగ్యం గురించి డాక్టర్స్ మాట్లాడుతు బాబు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే   మెరుగువుతుంది.వెంటిలేటర్ పైనే ఉన్నా కూడా ట్యూబ్ ద్వారా ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నాడు.శరీరంలో కుడి వైపు స్పర్శ తక్కువ ఉండటంవలన పూర్తి  స్పృహ లోకి రావడానికి సమయం పడుతుందని వెల్లడించడం జరిగింది. ఇక శ్రీతేజ్ కి అయ్యే వైద్య ఖర్చులు మొత్తాన్ని అల్లు అర్జున్(allu arjun)నే భరిస్తు మెరుగైన వైద్యాన్నిచేయిస్తున్నాడు.జరిగిన సంఘటనపై తన విచారాన్ని వ్యక్తం చేస్తు ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి మొదట విడతగా పాతిక లక్షలు ఇచ్చాడు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  విజయం.. ప్రతి వ్యక్తి కల. ముఖ్యంగా యువత విజయం అనే ఒక లక్ష్యం కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు. జీవితంలో విజయం సాధించాలంటే దానికంటూ కొన్ని కమిట్‌మెంట్స్ ఉండాలి. కొన్ని త్యాగాలు చేయాలి,  మరికొన్ని ఇష్టంగా మార్చుకోవాలి.  జీవితంలో సంతోషంగా గడిచిపోయే దారిలో విజయం ఎప్పటికీ లభించదు.  కష్టమైన దారిని దాటితేనే విజయాన్ని అందుకోగలుగుతారు.  కొందరికి ఈ విషయం తెలిసినా దాన్ని చేరుకునే మార్గం, జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు,  మార్చుకోవాల్సిన ఆలోచనా విధానం మొదలైనవి మాత్రం తెలియకుండా ఉంటాయి.  అయితే విజేతలు కావాలంటే కొన్ని విషయాలు తప్పక తెలుసుకుని పాటించాలి. రోజును ఎలా ప్రారంభించినా సరే.. సాయంత్రం ఉండే అలవాట్లలో కొన్ని జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయట.  ఈ అలవాట్లే జీవితంలో విజయాన్ని,  విజయ శిఖరాల వైపు వ్యక్తులను తీసుకెళ్తాయి.  అందుకే ప్రతిరోజూ సాయంత్రం కొన్ని పనులు తప్పక చేయాలి. ప్రతిరోజూ సాయంత్రం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం చేయాలి.  ధ్యానం చేయడం ద్వారా మనస్సును శాంతంగా ఉంచుకోవచ్చు.  మనస్సును సంతోషంగా ఉంచుకోవచ్చు.  దీని వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజంతా అనుభవించిన ఒత్తిడి కూడా సాయంత్రం ధ్యానం చేయడం వల్ల మాయమవుతుంది. ధ్యానం చేయడంతో పాటు యోగ కూడా చేయాలి.  తేలికపాటి యోగ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.  శరీరం ఫిట్ గా కూడా ఉంటుంది.  ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే శారీరకంగా ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు లక్ష్యాలు సాధించడంలో ముందుంటారు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో కాసింత వాకింగ్,  యోగ,  ధ్యానం చేయగానే వెచ్చని నీటితో స్నానం చేయాలి.  ఇది శరీరానికి చాలా రిలాక్సింగ్ ను ఇస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.  మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడానికి కారణమవుతుంది. ప్రణాళిక ఒక వ్యక్తి కార్యాచరణను సులభతరం చేస్తుంది. రేపటి రోజు చేయాల్సిన కార్యాచరణను ముందు రోజే రెఢీ చేసి పెట్టుకోవడం వల్ల పనులకు తగ్గట్టు సన్నద్ధం కావచ్చు. ఇది సమయాన్ని కూడా పర్పెక్ట్ గా వినియోగించుకునేలా చేస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఏదైనా మంచి పుస్తకంలో కొన్ని పేజీలను తప్పక చదవాలి. దీని వల్ల రాత్రి పడుకునే ముందు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.  ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. సాయంత్రం సమయంలో కొన్ని నిమిషాలు రోజును రివిజన్ చేసుకోవడం ఎంతో సహాయపడుతుంది.  ఆ రోజు ఉదయం లేచిన నుండి సాయంత్రం ఏ పనులు చేయగలిగాం,  ఏవి చేయలేకపోయాం అనే విషయం గమనించుకోవచ్చు.  ఒక వేళ ఏదైనా పని చేయలేకపోతే అలా పనులు మిగుల్చకుండా ఎలా పూర్తీ చేయాలో కూడా తెలుస్తుంది. రాత్రి సమయంలో తీసుకునే భోజనం చాలా తేలికగా ఉండాలి.  ఆహారం చాలా భారీగా తీసుకుంటే అది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.  అదే తేలికగా ఉన్న ఆహారం తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. అలాగని అస్సలు తినకుండా ఉండటం కూడా మంచిది కాదు.. ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం రెండు నుండి మూడు గంటల ముందే భోజనం ముగించాలి. ఫోన్ కు వ్యసనపరులుగా ఉండటం అంటే లక్ష్యాలను లైట్ గా తీసుకున్నట్టే.. ఫోన్ ను కూడా లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడే వస్తువుగా వినియోగించడం మంచిది.  టీవీ, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్.. ఇతర గ్యాడ్జెట్స్ ను లక్ష్యాల కోసం,  కమ్యూనికేషన్ కోసం మాత్రమే వినియోగించాలి.  అనవసరమైన కాలయాపన కోసం వినియోగించకూడదు. నిద్రపోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించుకోవాలి.  ప్రతిరోజూ ఎన్నిపనులు ఉన్నా ఒకే సమయానికి నిద్రపోవాలి. దీని వల్ల మరుసటి రోజు ఉదయం కూడా ఖచ్చితమైన సమయానికి నిద్ర లేవడం పనులను క్రమశిక్షణగా పూర్తీ చేసుకోవడం సాధ్యమవుతుంది.                                                  *రూపశ్రీ.
  మనమంతా ఒప్పుకోవాల్సిన, గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఈ భూమి మీద ఉండే ప్రతీ జీవికి కొన్ని హక్కులు ఉంటాయి.  జీవించే హక్కు, స్వేచ్చ సమానంగానే ఉంటాయి. ఈ విశాల ప్రపంచంలో ప్రతీ జీవికి దానికంటూ ఓ గుర్తింపు, ప్రత్యేకత కూడా ఉంటాయి. ఈ భూమి మీదున్న జీవజాలమంతా ఒకటి ఇంకోదానిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకృతిలో దేని విలువ దానికి ఉంటుంది. మనుషుల విషయంలో కూడా అంతే.   నేటి ప్రపంచం లింగం, జాతి, వర్గం, మతం వంటి విభాగాలుగా, వివక్షలతో విభజించబడింది. ఇది చాలా సాధారణం అనిపించవచ్చు కానీ అలా విభజించబడిన వారికి మాత్రం నరకప్రాయంగా ఉంటుంది. ఈ క్రూరత్వానికి  బలవుతున్న వారిలో అమాయక పిల్లలు కూడా ప్రధానంగా ఉన్నారు. ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తి  కులం, మతం,  రంగు,  ఆర్థిక స్థితి  వంటి విషయాలు పరిగణలోకి తీసుకోబడకుండా అందరిలో సమానంగా   ఉండే ప్రపంచం కనిపించడం లేదు. ఈ వివక్ష ప్రజలను వేరు చేస్తోంది.  ఈ బేధాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి వారికున్న మౌలిక హక్కుల్ని,  స్వేచ్ఛను ప్రపంచానికి గుర్తు చేయడానికి డిసెంబర్ 10వ తేదీన ప్రతీ సంవత్సరం మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్(UDHR) ని  ఆమోదించిన జ్ఞాపకార్థంగా జరుపుకునే ఈ రోజున  సమాజంలోని వ్యక్తులు, సంస్థలు,  ప్రభుత్వాలన్నీ   కలిసి ఈ హక్కులను కాపాడేందుకు, హక్కుల పరిరక్షణని ప్రోత్సహించేందుకు కృషి చేయాలని పిలుపునిస్తుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR): మానవ హక్కులపై కీలక పత్రమైన  యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR) అనేది 1948లో ఆమోదించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల హక్కులు,  స్వేచ్ఛలను రక్షించడమే  ప్రధాన కారణంగా  ఐక్యరాజ్యసమితి స్థాపన జరిగింది.  అన్ని దేశాల ప్రజల హక్కుల సాధనకు ఒక "సామాన్య ప్రమాణం"గా  ఇది  రూపొందించబడింది. ఈ ప్రామాణిక పత్రం 500కి పైగా భాషలలోకి అనువాదమైంది. ఇది గౌరవం, స్వేచ్చ, సమానత్వం, సోదరతత్వం అనే నాలుగు స్థంబాల మీద  నిర్మితమైంది. ఇందులో 30 కీలకమైన అంశాలు ఉన్నాయి. సాధాలణంగా ప్రజలకు ఉన్న హక్కులలో  స్వేచ్ఛగా జీవించే హక్కు,  భద్రత, వివక్ష లేకుండా సమానత్వం సాధించటం.  సమ న్యాయం. ఆలోచన, మత స్వేచ్ఛ.  విద్య,  పనికి సంబంధించిన హక్కులు.. మొదలైనవి ప్రధానంగా ఉంటాయి. మానవ హక్కుల దినోత్సవం 2024 : థీమ్ సంవత్సరానికి ఒక ముఖ్య అంశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించే దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ చేపడతాయి. 2024కు గానూ.. "మన  హక్కులు, మన  భవిష్యత్తు, తక్షణమే". అనే థీమ్ రూపొందించబడింది.  దీనికి తగినట్టే..  మానవ హక్కులనేవి ప్రతీరోజూ, ప్రతీ చోటా ప్రజలని ఎంతలా  ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. మానవ హక్కుల్ని  కాపాడుకోవటం వల్ల సమాజం మీద స్పష్టమైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం చెప్తుంది. మానవ హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే..  మానవ హక్కుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా  హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేసిన,  పోరాడిన వ్యక్తులను, వారి కృషిని గుర్తుచేస్తుంది. వారు చేపట్టిన  ఉద్యమాల స్ఫూర్తిని ప్రజలలో కూడా రగిలించి న్యాయపరంగా మన హక్కుల సాధన సాధ్యమేననే నమ్మకాన్ని కలిగిస్తుంది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా  సమానత్వం, స్వేచ్ఛ,  వ్యక్తిగత గౌరవం యొక్క ప్రాముఖ్యతను పౌరులందరికీ  గుర్తుచేస్తుంది. ప్రతి ఒక్కరు సురక్షితంగా, వివక్షకు గురి కాకుండా ఉండే   ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రజలందరూ  కలిసి పనిచేసే దిశగా ప్రజలను  ప్రోత్సహిస్తుంది. రోజువారీ జీవితాల్లో మానవ హక్కుల కోసం నిలబడటంలో,  న్యాయం జరిగే సమాజాన్ని నిర్మించడంలో సహకరించడానికి ప్రజల  పాత్రన ఎంత అవసరమో గుర్తుచేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏం చేయాలి? మానవ హక్కుల దినోత్సవంలో ప్రజలు  భాగమై వాటి పరిరక్షణ కోసం తమ  వంతు ప్రయత్నం   చేయాలనుకుంటే   మానవ హక్కులని ప్రోత్సహిస్తూ, అవగాహన పెంపొందిస్తూ, సామాజిక న్యాయం కోసం కృషి చేసే సంస్థలకు మద్దతు ఇవ్వవచ్చు.  మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. మానవ హక్కుల ప్రాధాన్యత, వాటి వల్ల ప్రజలకు చేకూరే మేలు,  సమాజంలో ఏర్పడే మార్పుల గురించి చెప్పాలి.  వివక్ష,  అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి.  మానవ హక్కుల సాధన, సమాజిక న్యాయం అనేది  ప్రతి వ్యక్తి తనతోనే మొదలవ్వాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమానత్వం, స్వేచ్ఛ కోసం జరుపుతున్న సమాజ  పోరాటంలో ఎవరూ వెనుకబడకుండా చూసుకోవడం అందరి బాధ్యత. అందుకు తగిన విధానాలను, విలువలని పాటించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణలో ప్రతి వ్యక్తి తన పాత్రను తాను సమర్థవంతంగా  నెరవేర్చవచ్చు.  వ్యక్తిగత హక్కులు కాపాడుకుంటూ, ఇతర హక్కుల్ని గౌరవిస్తూ ముందుకెళ్తే, ఒక మెరుగైన భవిష్యత్తును సృష్టించగలమనీ, సానుకూల మార్పును తీసుకురాగలమని స్పష్టంగా చెప్పవచ్చు.                                                *రూపశ్రీ.  
  బాధ్యతగా చేయమని అప్పగించిన అధికారాన్ని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్నే అవినీతి అంటారు. ‘అవినీతి తిమింగలాలు’ అనే  మాట చాలా సార్లు పేపర్లలో రావటం చదువుతూనే ఉంటాము. మన సమాజంలో చాప కింద నీరులా అల్లుకుపోయిన అవినీతిని నిర్మూలించటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని అరికట్టటం వీలు పడట్లేదు. ఎందుకంటే ఈ అవినీతి అనేది  వ్యవస్థలో కింది నుంచి పై స్థాయివరకూ ఉంది. ఒక సాధారణ క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని ఉన్నత స్థాయి ఉద్యోగులు, నాయకులు,  సంస్థల వరకూ చాలా మటుకు ఈ అవినీతిలో భాగమైపోతున్నారు. "దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు" అన్న చందాన తయారయింది నేటి సమాజం. ఇది ఎంత స్థాయివరకూ ఉందంటే, ఏదైనా వ్యవస్థలో మన పని జరగటానికి, అవినీతిలో మనమూ భాగమైతేనే సాధ్యమవుతుందనే  ఆలోచనా విధానానికి ప్రజలు వచ్చేశారు. అంతలా అవినీతి వ్యవస్థలోకి చొరబడిపోయి  ఇది సర్వసాధారణమే అన్నట్టు మారిపోయింది.   అవినీతి జరగటం వల్ల అర్హులైనవాళ్లు అన్నీ కోల్పోతారు, అనర్హులైనవాళ్లు అవినీతి సాయంతో  అందలమెక్కుతారు. ఇలా అవినీతి  ఎంతోమంది జీవితాలని ఛిన్నాభిన్నం చేసింది, చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న అవినీతిని అరికట్టాలనే ఉద్దేశ్యంతో అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీన జరుపుకుంటున్నారు.  దీని గురించి మరికాస్త విస్తృతంగా తెలుసుకుంటే.. అవినీతి వల్ల కలిగే దుష్ప్రభావాలు.. ప్రజలకి  వ్యవస్థలపై నమ్మకం తగ్గిపోతుంది. న్యాయపాలనను దెబ్బతీసి, పౌరుల స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారుతుంది. సమాజంలో అసమానతలను పెంచుతుంది. ప్రజాస్వామ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ హక్కుల రక్షణలో ఆటంకం ఏర్పడుతుంది,  పేదలకు అవసరమైన సేవలు అందకుండా పోతాయి. ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు తగ్గి, జీవనంలో నాణ్యత తగ్గిపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన సందర్భాలు అరకొర ఉన్నప్పటికీ, అవి సమాజం నుంచి అవినీతిని దూరం చేయలేకపోతున్నాయి. వేళ్లూనుకుపోయిన అవినీతిని మూలాల నుంచి పెకిలిస్తే తప్ప దాన్ని నాశనం చేయలేము. అవినీతి అనేది సాధారణంగా తీసుకోవాల్సిన విషయం కాదని, దాని వల్ల సమాజానికి ఎంత నష్టమో, నైతికత, న్యాయం ద్వారా చట్టబద్దంగా అవినీతిపై పోరాడటం ఎలాగానే  విషయాన్ని  ప్రజలకి అర్ధమయ్యేలా చెప్పాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అవినీతి గురించి అవగాహన పెంచడం, నిజాయితీ, బాధ్యత అనే నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించి, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే  లక్ష్యంగా  ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  రిజల్యూషన్ 58/4 ద్వారా,  2003వ సంవత్సరం నుంచి డిసెంబర్ 9వ తేదీని ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా’ ప్రకటించింది. ఈ దినోత్సవం, అవినీతి సమస్యలపై అవగాహన పెంచడంలో, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. 2024.. థీమ్.. 2024వ సంవత్సరానికిగానూ  "అవినీతి వ్యతిరేక పోరాటంలో  యువతతో ఐక్యం కావటం,  రేపటి నైతికతను నిర్మించడం".అనే థీమ్ లక్ష్యంగా ఉంది.  అవినీతి వల్ల జరిగే చెడు  ప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించి, వారిని  అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తారు.  యువతను నిర్ణయాలు తీసుకునే అధికారులతో చర్చలు జరిపేలా ప్రోత్సహిస్తారు. యువత భాగస్వామ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జరిగే అవినీతిని నిర్మూలించే లక్ష్యంగా పనిచేస్తారు. భారతదేశంలో అవినీతి వ్యతిరేక చర్యలు: భారతదేశంలో అవినీతి నియంత్రణ కోసం వివిధ చట్టాలు, సంస్థలు అమల్లో ఉన్నాయి.  ఉదాహరణకు లోక్‌పాల్, సి‌వి‌సి,  సీబీఐ వంటి సంస్థలు అవినీతికి పాల్పడినవారికి తగిన శిక్ష పడేలా చేస్తాయి.  అవినీతి వ్యతిరేక ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు కూడా  దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతమున్న అవినీతి వ్యతిరేక చట్టాలు, విధానాలు: అవినీతి నిరోధక చట్టం, 1988: అవినీతి నిర్వచనాలు, దోషులకు శిక్షలు ఇందులో ఉంటాయి. భారతీయ న్యాయ సంహిత, 2023: అవినీతి,  లంచాలపై నూతన నిబంధనలు ఉన్న చట్టమిది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013: అవినీతి నిర్మూలనపై ప్రజా బాధ్యతను పెంచటానికి చేసిన చట్టం. విశిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ చట్టం, 2014: అవినీతి విషయాలను బట్టబయలు చేసిన వారిని రక్షించే చట్టం.   ఇతర చట్టాలు: మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002,  బెనామీ లావాదేవీలు చట్టం,1988,  బ్లాక్ మనీ, పన్ను విధానం చట్టం,2015. చట్టాలు అమలు చేసే సంస్థలు: * కేంద్ర విజిలెన్స్ కమిషన్: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి నివారణ,  పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. * సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్: అవినీతి సంబంధించిన ప్రధాన కేసులు విచారణ చేస్తాయి. * స్టేట్ ఏంటీ కరప్షన్ బ్యూరోలు: రాష్ట్ర స్థాయి కేసుల పరిశీలన చేస్తాయి. అవినీతి అవగాహన సూచిక:  ‘ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ సంస్థ, ప్రతి సంవత్సరం అవినీతి అవగాహన సూచికను ప్రచురిస్తుంది.  ఇందులో ఒక  సూచీ ప్రకారం ఒక దేశానికి సున్నా నుండి వంద  వరకు కొన్ని పాయింట్లను ఇస్తారు. వాటి ఆధారంగా ఒక దేశ స్థానం నిర్ణయిస్తారు. [సున్న(అతి ఎక్కువ అవినీతి), వంద(అతి తక్కువ అవినీతి)]  2023లో భారతదేశానికి  మొత్తం 180 దేశాలలో 93వ స్థానం లభించింది.   మన దేశానికి దక్కిన ఈ స్థానం, మన దేశంలో  అవినీతి నిర్మూలనకి మరింత బలమైన చట్టాలు, విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని  సూచిస్తోంది. అవినీతి నిర్మూలన కోసం ఏం చేయాలి? యువత ప్రోత్సాహం:  అవినీతి రహిత భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్రను గుర్తించాలి. గ్లోబల్ ఐక్యత:  అంతర్జాతీయంగా దేశాల మధ్య అవినీతి నిర్మూలనలో సహకారాన్ని పెంపొందించాలి. చట్టపరమైన సంస్కరణలు: అవినీతి అవగాహనా సూచికలో వెనుకబడిన దేశాలన్నీ  మరింత కఠినమైన చట్టాలను ఆమోదించేలా కృషి చేయాలి. పాలనా వ్యవస్థ మెరుగుదల:  ప్రభుత్వ ఆచరణాత్మకతను పెంపొందించాలి. ప్రజలకి వ్యవస్థలపై నమ్మకం కలగాలన్నా, శాంతి, భద్రతలకి ఆటంకం కలగకుండా,   సమాజ అభివృద్ధి లక్ష్యాలు నెరవేరాలన్నా, అవినీతి రహిత సమాజం కోసం అందరం కలసికట్టుగా  పని చేయాలి.  అప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రతీ పౌరుడు తన అవసరం కోసమో, స్వార్ధ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అవినీతికి పాల్పడకుండా ఉంటూ, అలా పాల్పడేవారిని నివారించటం చేస్తే మనం కలలు కంటున్న అవినీతి రహిత సమాజాన్ని తొందరలోనే చూడగలమని ఆశిద్దాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఆశ చూపించినా నైతికతని  కోల్పోకుండా, అధికార దుర్వినియోగం చేయకుండా, తమ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ,  సమాజ శ్రేయస్సు కోసం తన శక్తికి మించి శ్రమిస్తున్న ప్రతీ వ్యక్తిని ఈ సమాజం గౌరవించి, ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే అవినీతిని అంతం చేయడం సాధ్యమవుతుంది.                                                  *రూపశ్రీ.
చాలామందికి ఆహారం, అలవాట్ల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి  ఈ సమస్య వంశపార్యపరంగా కూడా వస్తుంది. అయితే ఈ మద్యకాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య అధికంగా మారింది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను తెలుగులో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడ్డాయని చెబుతారు.  పిత్తాశయం లివర్ కు కొంచెం దిగువ భాగంలో ఉంటుంది.   చాలా వరకు ఆపరేషన్ చేసి పిత్తాశయాన్ని తొలగిస్తుంటారు. దీని వల్ల వచ్చే సమస్య ఏమీ లేదని కూడా అంటారు. కానీ పిత్తాశయాన్ని తొలగించకుండా పిత్తాశయంలో రాళ్లు తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు.  ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. యాపిల్ సైడర్ వెనిగర్.. వెనిగర్ గురించి చాలామంది వినే ఉంటారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్లలో మిక్స్ చేసుకుని తాగుతుంటారు.  దీన్ని తాగడం వల్ల పిత్తాశయం రాళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది.  అంతేకాదు ఈ రాళ్లను కరిగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. పియర్.. పియర్ పండ్లలో పెక్టిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది.  పియర్ పండ్లు అందుబాటులో ఉన్నప్పుడు వీటిని తప్పనిసరిగా తినాలి.  ఇది మధుమేహ రోగులకు కూడా చాలా మంచిది. జ్యూస్.. జ్యూస్ లు శరీరాన్ని శుద్ది చేయడంలో, శరీరంలో టాక్సన్లు బయటకు పంపడంలో సహాయపడతాయి.  బిట్ రూట్, క్యారెట్,  కీర దోసకాయ.. ఈ మూడు కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి,  ఇది సులభంగా జీర్ణం అవుతుంది.  గాల్ బ్లాడర్ లో రాళ్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తంగేడు.. తంగేడు ఆకులు పల్లె ప్రాంతాలలో విరివిగా లభిస్తాయి.  ఈ తంగేడు ఆకులను కూడా పిత్తాశయం రాళ్లు వదిలించుకోవడంలో ఉపయోగించవచ్చు. ఇందుకోసం తంగేడు ఆకులను తేనెతో కలిపి తీసుకోవాలి.  దీని వల్ల రాళ్ల నొప్పి కూడా తగ్గిపోతుంది. పుదీనా.. పుదీనా రాళ్లను తగ్గించడంలో సహాయపుడుతుంది. కేవలం గాల్ బ్లాడర్ సమస్యకే కాదు.. కిడ్నీ రాళ్లకు కూడా ఇది సహాయపడుతుంది.  పుదీనాలో టెర్పెన్ అనే మూలకం ఉంటుంది.  ఇది రాళ్లను నెమ్మదిగా తొలగిస్తుంది. పుదీనాను వీలైనంత ఆహారంలో తీసుకోవాలి.  పుదీనా జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. విటమిన్-సి.. విటమిన్-సి పుష్కలంగా తీసుకోవాలి.  ఎరుపు రంగు క్యాప్సికం లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  ఇది రాళ్ల సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది.   తృణధాన్యాలు.. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు తినడం వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య, దాని ప్రమాదం కూడా దూరం అవుతుంది. పసుపు.. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  పసుపు తినడం వల్ల పిత్తాశయం రాళ్లు క్రమంగా విరిగిపోయి అవి బయటకు వచ్చేస్తాయి.                                                *రూపశ్రీ.  
ప్రతి సీజన్ శారీరంగా కొన్ని సవాళ్లను వెంట బెట్టుకుని వస్తుంది. వేసవి కాలం రాగానే ఎక్కడ వడదెబ్బ కొడుతుందో.. ఎక్కడ శరీరం నీరస పడిపోతుందో అని అల్లాడిపోతారు ప్రజలు.  ముఖ్యంగా శరీరానికి తగినంత నీటి అవసరాన్ని తీర్చడానికి నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీరు.. నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు.. ఇలా చాలా తీసుకుంటారు. కానీ చలికాలం దగ్గరకు వచ్చే సరికి సీన్ మారిపోతుంది.  నీరు తాగాలన్నా,  నీరు అధికంగా ఉన్నపండ్లు తినాలన్నా అస్సలు ఇష్టపడరు.  దీని వల్ల కొంప కొల్లేరు అవుతుందని చాలా మంది తెలుసుకోరు.  వేసవి కాలంలో కంటే చలికాలంలోనే నీరు తాగడం తగ్గుతుంది.  ఇది చాలా ప్రమాదరమైన పరిస్థితి. చలికాలంలో కూడా కనీసం 2 నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు వైద్యులు. చల్లటి వాతావరణంలో కూడా శరీరాన్ని ఎనర్జిటిక్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. శరీరం డీహైడ్రేట్ అయితే.. శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మూత్రం ముదురు రంగులో ఉంటుంది.  కళ్లు తిరగడం, చర్మం పొడిబారడం, తలనొప్పి, అలసట, బలహీనత,  పెదవులు పగిలిపోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. వేసవిలో మాత్రమే కాకుండా శీతాకాలంలో కూడా హైడ్రేట్ గా ఉండటం,  శరీరానికి  శక్తి అధికంగా ఇచ్చే ఆహారాలు తినడం చేయాలి. చలికాలంలోనే కాదు వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే  ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది  హైడ్రేటెడ్‌గా అనిపిస్తుంది,  శరీరం శక్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల  జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇందులో నిమ్మ, పుదీనా, తేనె వంటి సహజసిద్ధమైన పదార్థాలను కలుపుకుని కూడా తాగవచ్చు. హైడ్రేటెడ్ గా ఉండటానికి ఆహారంలో నీరు మాత్రమే కాకుండా నీరు అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలను కూడా చేర్చుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి.  రోజువారీ ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, నారింజ, ఆకుకూరలు  టమోటాలు తీసుకోవాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఎల్లప్పుడూ వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి.  ఎక్కడికైనా బయటకు వెళ్లినా..  బ్యాగ్‌లో లేదా కారులో బాటిల్ ఉంచుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు నీరు త్రాగడానికి  గుర్తు చేస్తు ఉంటుంది. ప్రతిసారీ నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా వ్యాయామం తర్వాత వాటర్ బాటిల్‌లో ఎలక్ట్రోలైట్స్ కలిపి తాగడం వల్ల ఎఫెక్టివ్ హైడ్రేషన్ లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొంచెం నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రాత్రంతా  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీరు త్రాగవద్దు. లేకుంటే  నిద్రలో పదేపదే బాత్రూమ్‌కు వెళ్లవలసి ఉంటుంది, దీని కారణంగా  నిద్రకు భంగం కలగవచ్చు. అదే సమయంలో ఆహారం తీసుకునే ముందు 1 గ్లాసు నీరు త్రాగాలి. ఇలా నీరు తాగుతుంటే శరీరం చలికాలంలో కూడా హైడ్రేట్ గా ఉంటుంది.                                                              *రూపశ్రీ.  
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు.  ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు పండ్లు లేదా పండ్ల రసం ఇస్తుంటే చాలా తొందరగా కోలుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.  మంచి ఆరోగ్యం కోసం పండ్లు, పండ్ల రసాలు తీసుకోమని వైద్యులు కూడా చెబుతారు. చాలా మంది పండ్ల రసాలు తాగాలని అనిపిస్తే  సింపుల్ గా ఫ్రూట్ జ్యూస్ షాప్ కు వెళ్లి తాగేస్తుంటారు.  మరికొందరు ఓపికగా ఇంట్లోనే జ్యూస్ చేసుకుంటారు. అయితే జ్యూస్ తాగే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పండ్ల రసం చాలా వరకు బయట తాగడం చాలామంది అలవాటు.  అయితే పండ్ల రసం తాగే దుకాణం శుభ్రతగా ఉందా లేదా గమనించాలి. శుభ్రత లేని చోట  పండ్ల రసాలు తాగితే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. కేవలం ఆ దుకాణం మాత్రమే కాదు.. చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా శుభ్రతగా లేకుంటే  ఆ దుకాణాలలో జ్యూస్ లు తాగడం మంచిది కాదు. జ్యూస్ తాగేముందు అక్కడే అప్పటికప్పుడు తాజాగా తయారు చేసిన జ్యూస్ ను మాత్రమే తాగడం మంచిది. ముందే జ్యూస్ జార్ లేదా గిన్నెలలో నిల్వ ఉంచిన జ్యూస్ ను అస్సలు తాగకూడదు. అలాంటి జ్యూస్ లో  బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ తాజా పండ్ల జ్యూస్ ను మాత్రమే రికమెండ్ చేయాలి. పండ్ల జ్యూస్ లు అమ్మే షాపులలో  కొన్నిసార్లు ముందే పండ్లను కట్ చేసి ఉంటారు. అలాంటి పండ్ల నుండి జ్యూస్ ను తయారు చేయించుకోకూడదు. తాజాగా కట్ చేసిన పండ్ల నుండే జ్యూస్ ను చేయించుకోవాలి.  ముందే కట్ చేసిన పండ్లలో కొన్ని సార్లు చెడి పోయిన పండ్లను కొంత భాగం కట్ చేసి పెట్టుకుని ఉంటారు.  ఇది బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పండ్ల రసం తయారు చేసేవారు జ్యూస్ మరింత రుచిగా,  తాజాగా ఉండటం కోసం జ్యూస్ లో ఏదైనా రసాయనాలు లేదా పౌడర్ లేదా లిక్విడ్స్ మిక్స్ చేస్తుంటారు.  కొన్నిసార్లు రంగు కూడా జోడిస్తూ ఉంటారు. అలాంటి చోట జ్యూస్ అస్సలు తాగకూడదు. వాడిపోయిన,   పాతబడిన కాయలతో ఫ్రూట్ జ్యూస్ లు తయారు చేసి అమ్ముతుంటారు. అలాంటివి నివారించాలి. వీటిలో నీటి శాతం ఏమీ ఉండదు. పై పెచ్చు కార్బోహేడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి.  వీటిలో పోషకాలు ఏమీ ఉండవు.  ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి కావు.                                                 *రూపశ్రీ.