LATEST NEWS
ఈ నెల 9వ తేదీన తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఆహ్వానం అందింది. మంత్రి పొన్నం  ప్రభాకర్ శనివారం మాజీ ముఖ్యమంత్రిని ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో  కల్సుకున్నారు. విగ్రహావిష్కరణకు రావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ తల్ల విగ్రహం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని  విగ్రహావిష్కరణ అడ్డుకోవాలని బిఆర్ఎస్ హైకోర్టు గడపదొక్కింది.   
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బిఆర్ఎస్ హైకోర్టు గడపదొక్కింది. ఆ పార్టీ నాయకుడు, జర్నలిస్ట్ జూలూరి గౌరిశంకర్  విగ్రహావిష్కరణ ఆపాలని హైకోర్టులో పిల్ వేశారు. ఈ నెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు రేవంత్ సర్కార్ చెప్పింది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసి రేవంత్ సర్కార్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేసి ప్రజల మనో భావాలను కించపరిచినట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు,మేధావులు,రచయితలు,కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కెసీఆర్ మీద కక్ష్యతో విగ్రహాన్ని మార్పులు చేసినట్టు జూలూరి వివరించారు. ఇటీవల ఎపిలో కూడా వైకాపా సోషల్ మీడియా వింగ్  కూటమి నేతలను టార్గెట్ చేసి  విష ప్రచారం చేసింది. కూటమి అధికారంలో రాగానే వారిపై కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణ మురళి, ఆర్జీవీ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వీరిపై కేసులు నమోదు కావడాన్నినిరసిస్తూ జర్నలిస్ట్, వైకాపా నేత  విజయబాబు హైకోర్టులో పిల్ వేసి అభాసుపాలయ్యారు. విజయబాబుపై 50 వేల జరిమానా విధించడమే గాక అక్షింతలు వేసింది. 
ఎపిలో రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు చేసిన కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది.  వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటయ్యింది.  రేషన్ మాఫియా, కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై విచారించనుంది. సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డిఎస్పీలు  అశోక్ వర్దన్, బాల సుందర్ రావు, గోవిందరావు, రత్తయ్య , సిట్ చీఫ్ తో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం దర్యాప్తు చేయనుంది.  పేద ప్రజలకు అందాల్సిన  రేషన్ బియ్యం అక్రమరవాణాను వ్యవస్థీకృత నేరంగా భావిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హాయంలో ప్రారంభమైన ఈ అక్రమరవాణా గుట్టు విప్పిన కూటమి ప్రభుత్వం 15 ఎఫ్ ఐ ఆర్ ల ఆధారంగా సిట్  దర్యాప్తు  చేయనుంది. ప్రతీ పదిహేను రోజులకు ఓ సారి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ఈ బియ్యం ఆఫ్రికాదేశాలకు సప్లయ్ అవుతోంది
వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్య సభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి  కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి  ఎపి హైకోర్టునాశ్రయించారు. డిసెంబర్ రెండో తేదీన మంగళగిరిలో  సిఐడి పోలీసులు   వైవి సుబ్బారెడ్డి  తనయుడు విక్రాంత్ రెడ్డి మీద  ఎ1గా  కేసు నమోదైంది. ఇదే కేసులో ముందస్తుబెయిల్ కోసం వైవి విక్రాంత్ రెడ్డి ఎపి హైకోర్టునాశ్రయించారు.  రాజకీయ దురుద్దేశ్యంతో తనపై కేసు నమోదైందని  విక్రాంత్ రెడ్డి కోర్టుకు విన్నవించుకున్నారు. తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన  సంగతి తెలిసిందే.
జాఫర్ బయ్ అర్ధాంగికి కలలో పాములు వస్తున్నాయి. నాకు ఎవరో చేతబడి చేస్తున్నారు అందుకే కలలో  పాములు వస్తున్నాయి అని అనుమానం వ్యక్తం చేసింది కుబ్రాబేగం. పరిష్కారం కోసం భార్య భర్తలు  ఇరువురు మౌలానా దగ్గరికి వచ్చారు.  జాఫర్ బయ్ దంపతులు: సలాం వాలేకూం మౌలానా సాబ్  మౌలానా: వ “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు”తశ్ రీప్ రఖియే. జాఫర్ బయ్: మౌలానా సాబ్ ఇంట్లో ఎవరికైనా కలలో పాములు వస్తే ఏమవుతుంది.  ఎవరైనా చేత బడి చేశారా ?  మౌలానా: కలలో పాములు రావడం సహజమే.   ఇస్లాం ప్రకారం కలలో పాము కనిపిస్తే  ప్రతీ ముస్లిం  కూడా భయపడాల్సిన పని లేదు. అల్లాకు మాత్రమే భయపడాలి. ధర్మ కార్యాలు నెరవేర్చాలి. పదే పదే కలలు వస్తే నమాజు విధిగా ఆచరించాలి.   ఉదయం నుంచి రాత్రి వరకు  జరిగే దిన చర్యే  రాత్రి పూట కలలకు కారణం. ప్రతీ రోజు  ఎవరికైనా తరచూ  పాము కలలోకి  వస్తే ఆ వ్యక్తికి శత్రువు ఉన్నట్టు. ఒక వేళ పామును చంపేసినట్టు కల వస్తే శత్రువు చనిపోయినట్టు అర్థం చేసుకోవాలి.  ఇంట్లో పాము కనిపిస్తే శత్రువు ఇంట్లోనే ఉన్నట్టు అర్థం. ఇంటి వెలుపల పాము కనిపిస్తే శత్రువు   ఇంటి వెలుపల  ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. పామును చంపేసి దాని మాంసాన్ని తిన్నట్లు కలలు వస్తే శత్రువు సంపదను పొందినట్టుగా భావించాలి.   కలలో చనిపోయిన పాము కనిపిస్తే ఆ వ్యక్తి బాధలు తొలగిపోయినట్టు అర్థం. పాము మంచం మీద చనిపోయినట్టు కల వస్తే ఆ వ్యక్తి భార్య చనిపోతుందని అర్థం                                                                                           బదనపల్లి శ్రీనివాసాచారి
ALSO ON TELUGUONE N E W S
Pushpa 2 The Rule has created huge records on opening day and second day as well. The Allu Arjun starrer has opened to Rs.294 crores gross worldwide on the first day and on second day it grossed Rs.155 crores. Totally, it grossed Rs.449 crores in two days and it is set to cross Rs.500 crores on Day 3.  Movie is getting huge collections in Hindi as the people of North India connected to it in a big way. The movie has collected Rs.131 crores Nett in two days in the circuits. The team has conducted success press meet in Hyderabad celebrating it.    Allu Arjun speaking at the event thanked everyone who worked behind the movie. He stated, "I cannot say anything but thank everyone. He personally thanked Deputy Chief Minister of AP, Pawan Kalyan, calling him, "Kalyan Babai ..." with a smile and said, "Thank you so much." He thanked every state government for helping them in conducting events.  Later, he stated that there will be success events all over India thanking audiences for such a huge positive reception. Earlier, director Sukumar called all his assistants to the stage and spoke about each one of their contribution and thanked them.  Further both of them addressed the family of the victim, who got killed in Sandhya theatre stampede. Allu Arjun apologised and stated that he did not knew about the incident till next morning. He stated that he and his team will take care of the family in future as well. He expressed his shock regarding the incident sharing that he had been to premieres from past 20 years and this is the first time, such unfortunate incident happened at his premiere.  Well, his "Kalyan Babai" reference will end to the feud between his fans and Pawan Kalyan fans, and even reported cold war between Mega and Allu families. 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)నిన్న డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే హిందీ లో కూడా భారీ ఎత్తున విడుదలై అక్కడి సినిమాలకి సవాలు విసురుతు రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. హిందీలో తొలి రోజు 72 కోట్ల రూపాయిల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాలీవుడ్ లోనే హయ్యస్ట్ కల్లెక్షన్ సాధించిన మొదటి మూవీగా నిలవగా ఇప్పుడు రెండవ రోజు యాభై తొమ్మిది కోట్ల రూపాయిల నెట్ కల్లెక్షన్స్ ని సాధించి  టోటల్  రెండు రోజులకి 131 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన ఫస్ట్ హిందీ మూవీ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెండు రోజులకి 449 కోట్ల గ్రాస్ ని సాధించి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ డే కూడా  294 కోట్లు సాధించి ఫస్ట్ ఇండియన్  మూవీగా నిలిచింది.అల్లు అర్జున్ నటన,సుకుమార్(sukumar)దర్శకత్వ ప్రతిభ,అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)నిర్మాణ విలువలు పుష్ప 2 విజయానికి కారణమనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్త మవుతుంది.  
అల్లు అర్జున్‌, సుకుమార్‌ల ‘పుష్ప2’ రెండో రోజూ కలెక్షన్ల మోత మోగించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కలెక్ట్‌ చేయగా, రెండో రోజు రూ.449 కోట్లతో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించి తన స్టామినా ఏమిటో మరోసారి చూపించింది. మొదటి రోజు కలెక్షన్లలో రూ.65 కోట్లతో షారూక్‌ ఖాన్‌ జవాన్‌ బాలీవుడ్‌లో రికార్డు సృష్టించగా దాన్ని పుష్ప2 రూ.72 కోట్లతో క్రాస్‌ చేసేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డబ్బింగ్‌ సినిమా తమిళనాడులో మొదటి రోజు రూ.11 కోట్లు కలెక్ట్‌ చేయడం ఒక రికార్డుగానే చెప్పాలి. ఇక కేరళలో 2024 సంవత్సరానికి పుష్ప2 హయ్యస్ట్‌ కలెక్షన్‌ సాధించిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. అక్కడ మొదటి రోజున రూ.6.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మొదటిరోజే 8 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసి 2024లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన సినిమాగా పుష్ప2 నిలిచింది. ఇక నైజాం ఏరియాలో ఫస్ట్‌ డే రూ.30 కోట్లు కలెక్ట్‌ చేసి ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసుకుంది. అలాగే కృష్ణా జిల్లాలో రూ.4.42 కోట్లు వసూలు చేసి అక్కడ కూడా ఆల్‌టైమ్‌ రికార్డు సాధించింది. దానితోపాటు ఉత్తరాంధ్రలో కూడా మొదటి రోజు రూ.7.78 కోట్లతో ఆల్‌ టైం రికార్డ్‌ సృష్టించింది. సీడెడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రం కాకుండా సోలో హీరో నటించిన సినిమాగా ఫస్ట్‌ డే రూ.12.5 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది పుష్ప2.  మొదటి షో నుంచే ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొదటిరోజు రూ.294 కోట్లు ఫిగర్‌ చూసిన తర్వాత రెండో రోజు నుంచి అంత భారీ కలెక్షన్లు ఉండవు అని అంచనా వేశారు. కానీ, దాన్ని తారుమారు చేస్తూ రెండో రోజు దాదాపు రూ.150 కోట్లు సాధించడం విశేషం. ఇంకా శనివారం, ఆదివారం మిగిలే ఉన్న నేపథ్యంలో పుష్ప2కి తిరుగులేదని రెండో రోజు కలెక్షన్స్‌ ప్రూవ్‌ చేస్తున్నాయి. ఏది ఏమైనా లాంగ్‌ రన్‌లో కూడా ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్లు సాధించే దిశగానే ప్రయాణిస్తోంది. పుష్ప2 కలెక్షన్లు ఇంకా ఏ స్థాయికి వెళతాయో, పుష్పరాజ్‌ ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తాడో చూడాలి. 
తెలుగు ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి(venu swamy).ఆస్ట్రాలజర్ గా పలు సినీ,వ్యాపార, రాజకీయ రంగానికి చెందిన సెలబ్రిటీ లకి సంబంధించి వాళ్ల జాతకాల్లో ఏం జరగబోతుందో ముందే చెప్తూ  వివాదాస్పద జోతిష్యుడుగా కూడా పేరు సంపాదించాడు.పోలీసు కేసులు కూడా నమోదు కావడం జరిగింది. రీసెంట్ గా వేణు స్వామి మొన్న విడుదలైన పుష్ప 2(pushpa 2)గురించి మాట్లాడుతు పుష్ప 2 సినిమా చూసాను. అల్లు అర్జున్(allu arjun)గారు సూపర్ గా చేసారు. ముఖ్యంగా రాజా మాతంగి గెటప్ లో బ్లు కలర్ శారీలో జాతర సీన్ ఇరగదీశారు.2016 నుంచి అల్లు అర్జున్ గారి జాతకాన్ని కొన్ని ఛానల్స్ లో విశ్లేషించి చెప్పాను.వాటిల్లో అసలైన పాన్ ఇండియాస్టార్ అల్లుఅర్జున్,మాత్రమే,వచ్చే పది సంవత్సరాల దాకా అలాగే కొనసాగుతాడు.అల్లు అర్జున్ తో సినిమా చేస్తే ప్రొడ్యూసర్, బయ్యర్లు నష్ట పోరు.ఏ సినిమా చేసినా కూడా హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియోల్ని వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా మరోసారి ప్రేక్షకులకి గుర్తు చేస్తున్నాడు.  
2019 అక్టోబర్‌లో అల్లు అర్జున్‌, సుకుమార్‌ల ‘పుష్ప’ సిరీస్‌ ప్రారంభమైంది. 2024 నవంబర్‌ వరకు షూటింగ్‌ జరిగింది. అంటే ‘పుష్ప1’, ‘పుష్ప2’ కోసం చిత్ర యూనిట్‌లోని అందరూ 5 సంవత్సరాలు కష్టపడ్డారు. అందులో సుకుమార్‌ శ్రమ ఎంతో ఉంది. అయితే ఆ శ్రమకు తగ్గట్టుగానే ప్రేక్షకులు భారీ ఫలితాన్ని అందించారు. ‘పుష్ప’ సంచలన విజయం సాధించడమే కాకుండా, అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘పుష్ప2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు అందరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్న.. సుకుమార్‌ నెక్స్‌ట్‌ చెయ్యబోయే సినిమా ఏమిటి? దీని గురించి సోషల్‌ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.  రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప2’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ‘పుష్ప2’ షూటింగ్‌ బాగా డిలే కావడంతో బుచ్చిబాబు సానాతో ఓ సినిమా కమిట్‌ అయ్యారు చరణ్‌. అది పూర్తయితేనేగానీ సుకుమార్‌తో సినిమా చేసే అవకాశం లేదు. ప్రస్తుతం సుకుమార్‌ దగ్గర కథ కూడా సిద్ధంగా లేదని తెలుస్తోంది. బుచ్చిబాబు సినిమా పూర్తవ్వడానికి ఇంకా చాలా టైమ్‌ ఉంది కాబట్టి ఈలోగా సబ్జెక్ట్‌ రెడీ చేసుకోవచ్చు. అయితే ఈలోగా సుకుమార్‌ రైటింగ్స్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్స్‌లో నిర్మిస్తున్న ‘సెల్ఫిష్‌’ చిత్రానికి కొన్ని మరమ్మతులు చెయ్యాల్సిన అవసరం ఉందట. సెకండాఫ్‌ ఆశించిన స్థాయిలో లేదని, దాన్ని ఒకదారికి తీసుకు రావాల్సిన బాధ్యత సుకుమార్‌పైనే ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో దిల్‌రాజు మేనల్లుడు ఆశిష్‌రెడ్డి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సుకుమార్‌ రైటింగ్స్‌ బేనర్‌లో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయి. ఆ సినిమాలకు సంబంధించి కథలు కూడా సుకుమార్‌ ఓకే చెయ్యాల్సి ఉంది. వీటన్నింటినీ మించి సుకుమార్‌కి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతకాలంగా అతను బ్యాక్‌పెయిన్‌తో బాధపడుతున్నారు. ఇంతకాలం షూటింగులతో బిజీగా ఉన్న సుకుమార్‌ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బ్యాక్‌పెయిన్‌కి చికిత్స తప్పనిసరి. అందుకే త్వరలోనే అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్కడే కొన్ని నెలలు ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటారు. దీన్నిబట్టి 2025 మొత్తం సుకుమార్‌ సినిమాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. సుకుమార్‌ రైటింగ్స్‌లో సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ, సుకుమార్‌ డైరెక్ట్‌ చేసే సినిమా మాత్రం ఇప్పట్లో లేనట్టే.
అక్కినేని నాగచైతన్య(naga chaitanya)శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)వివాహం ఈ నెల 4 న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.ఆ తర్వాత నూతన జంట నాగార్జునతో  కలిసి శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునుడిని కూడా దర్శించుకోడం జరిగింది. ఇక చైతు రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వేదికగా టెలికాస్ట్ అవుతున్న 'రానా టాక్ షో'(rana talk show)అనే ప్రోగ్రాం  లో మాట్లాడుతు నాకు ఇద్దరు పిల్లలు చాలు.యాభై ఏళ్ళు వచ్చే సరికి వాళ్ళతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను.కొడుకు పుడితే వాడ్ని రేస్ ట్రాక్ కి తీసుకెళ్తాను.కూతురు పుడితే తనకున్న హాబీలని గుర్తించి ప్రోత్సహిస్తాను.వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతు మనం చిన్నప్పుడు పిల్లలుగా ఎంజాయ్ చేసిన క్షణాలని మళ్ళీ వాళ్ళతో కలిసి ఆస్వాదించాలని ఉందని తెలిపాడు.ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి   ఇక చైతు సినీ కెరీర్ విషయాన్ని వస్తే ప్రస్తుతం తండేల్ అనే మూవీ చేస్తున్నాడు.అందులో సాయిపల్లవి(sai pallavi)హీరోయిన్ కాగా ఇటీవలే కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ ని అందుకున్న చందు మొండేటి దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తండేల్ చైతు కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతుండగా  ఫిబ్రవరి 7 న  వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.  
Pragya Nagra, the model and upcoming actress, had to face a nightmare as her intimate video leaked. The video has been going viral on the internet and the actress took her time to react. She stated that the video is made up using AI and she never been part of such a video.  Pragya Nagra reacting about the leak, wrote, "Still in denial, and still hoping that it’s just a bad dream that I will wake up from. Technology was meant to help us and not make our lives miserable. Can just pity the evil minds who misuse it to create such AI content and the people who help spread it!" She continued to write, "Trying to stay strong through all of this, and grateful to all the people who are there for me in these moments. I hope and pray that no other woman has to go through such an ordeal, and that all of you stay safe!" While we cannot confirm about her video being real or fake, we can say that such leaks do rise concerns about privacy and security of people. The actress in her reaction did rise a concern about the ordeal she had to put up and every girl might have to, in such a condition.
Pushpa 2 The Rule has been one of the most awaited films of Indian Cinema. Movie starring Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil released on 5th December with premieres on 4th December. The movie collections have been huge for the first day with official producer number standing at Rs.294 crores and trade at 250-285 crores. Whomever we believe, the number is All Time Record for any Indian film. But the second day collections in South India did not really reach the same height. In Kerala, the movie did not get a positive feedback and Karnataka, Tamil Nadu markets saw drop due to Friday, working day.  But the home markets of Allu Arjun, director Sukumar - Telugu States have been disappointing for the second day. While the movie did collect close to 19 crores share, the movie collected way less than RRR, Kalki 2898 AD. This is a bit of a drawback for the makers as they anticipated the huge run to continue at least for first weekend. Even with low turnout on Day 2, the movie still holds the all-time high position with Rs.425 crores gross, worldwide.  The movie is making up for the lost ground in North India. From Hindi markets, movie collected Rs.59 crores Nett on the second day despite being a working day. Saturday and Sunday collections are expected to be huge as well. North American Box Office is trending the best among Overseas markets as well.  North American market has good Hindi speaking population and it seems like North Indians have latched up on to Pushpa Raj character more than Telugu people. With Pushpa The Rule being a sleeper hit in North India, the character seems to have more fans in the diaspora and hence, this huge reception.  Well, distributors and exhibitors in Telugu states have decided to decrease ticket rates to increase the turnout. We have to see how evening and night shows on Saturday will perform in Telugu States and on Sunday, the movie makers are hoping for families to turn up. 
ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. జయమాలిని, జ్యోతిలక్ష్మీ, సిల్క్‌ స్మిత, అనురాధ వంటి వారు ఐటమ్‌ సాంగ్స్‌కి వన్నె తెచ్చినవారిలో ముఖ్యులు. కాలం మారింది, ఐటమ్‌ సాంగ్స్‌ కూడా కొత్త పుంతలు తొక్కి స్పెషల్‌ సాంగ్స్‌గా అవతరించాయి. ఐటమ్‌ గాళ్స్‌ స్థానంలో హీరోయిన్లు వచ్చి చేరారు. హీరోయిన్లుగా నటిస్తూనే సైడ్‌ బిజినెస్‌గా అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌ చేసేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పద్ధతి నడుస్తోంది. ఈరోజుల్లో ఒక సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ ఉందీ అంటే ఎవరితో చేయించాలి అని జుట్టు పీక్కోవక్కర్లేదు. ఎందుకంటే హీరోయిన్లు దానికి అందుబాటులోనే ఉంటారు. కాకపోతే వారు డిమాండ్‌ చేసే రెమ్యునరేషన్‌ మాత్రం నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. వారు కోరింది ఇస్తే అందాలు ఆరబోస్తారు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది స్పెషల్‌ సాంగ్స్‌ చేసి కుర్రకారుకి మత్తెక్కించారు. తాజాగా వారి సరసన కుర్ర హీరోయిన్‌ శ్రీలీల కూడా చేరింది.  ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటా మావా..’ సాంగ్‌లో సమంత ఎంత రెచ్చిపోయి డాన్స్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి ఆ పాట పెద్ద ఎస్సెట్‌ అయింది. ‘పుష్ప2’లోని స్పెషల్‌ సాంగ్‌ దాన్ని మించి ఉండాలని భావించారు సుకుమార్‌. అందుకే ఎవరితో ఆ పాట చేయించాలి అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరికి శ్రీలీలను ఫైనల్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో స్టెప్పులు ఇరగదీసే హీరోయిన్‌ ఎవరు అంటే అందరూ శ్రీలీల పేరే చెబుతారు. అందుకే ‘కిస్సిక్‌’ సాంగ్‌ కోసం ఆమెను ఒప్పించారు. పాట పరంగా ‘ఊ అంటావా..’ కంటే ‘కిస్సిక్‌’ కాస్త నాసిరకంగా ఉన్నప్పటికీ డాన్స్‌ విషయంలో మాత్రం శ్రీలీల తగ్గేదేలే అంటూ స్టెప్స్‌ అదరగొట్టిందని చెప్పుకుంటున్నారు.  తాజా సమాచారం ఏమిటంటే.. శ్రీలీల ఇకపై స్పెషల్‌ సాంగ్స్‌ చేయదట. ఇదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ అంటోంది. శ్రీలీలలోని ప్లస్‌ పాయింట్స్‌లో డాన్స్‌ ప్రధానమైంది. అందుకే అంతకుముందు కూడా చాలా సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ ఆఫర్లు వచ్చాయి. కానీ, వాటిని తిరస్కరించింది. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో కూడా ఒక స్పెషల్‌ సాంగ్‌ ఉంది. దాని కోసం మొదట శ్రీలీలలే అప్రోచ్‌ అయ్యారు. కానీ, ఆమె నో చెప్పింది. ‘పుష్ప2’లో మాత్రం చెయ్యడానికి ప్రధాన కారణం ఆ సినిమాకి ఉన్న క్రేజ్‌, అలాగే అల్లు అర్జున్‌తో డాన్స్‌ చెయ్యాలని శ్రీలీలకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అందుకే ఆ పాట కోసం తనను సంప్రదించిన వెంటనే ఓకే చెప్పింది. అయితే ‘పుష్ప2’లోని సాంగ్‌ హిట్‌ అయినా, కాకపోయినా తను మాత్రం స్పెషల్‌ సాంగ్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అలాంటి పాటలు చేయడం వల్ల రెమ్యునరేషన్‌ భారీగానే వస్తుంది. కానీ, ఐటమ్‌ గాళ్‌ అనే ముద్రపడిపోతుందనేది శ్రీలీల భయం. అందుకే ‘పుష్ప2’ కోసం చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చెయ్యనని, అదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ అని చెబుతోంది. 
సుమారు రెండు వందల సినిమాలకి పైగా మలయాళ చిత్రసీమలో నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన నటుడు సిద్దిఖీ(siddique)తెలుగులో కూడా 2013 లో వచ్చిన 'నా బంగారు తల్లి' అనే మూవీలోప్రధాన పాత్ర పోషించి ఆ చిత్ర విజయంలో తను కూడా ఒక భాగస్వామి అయ్యాడు. ఆ మూవీకి నేషనల్ అవార్డ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ లు కూడా రాగా,సిద్దిఖీ అగ్ని నక్షత్రం అనే మరో తెలుగు మూవీతో పాటు పలు తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటాడు.  కొన్ని నెలల క్రితం మలయాళ ఇండస్ట్రీ లో నటీమణులు ఎదుర్కుంటున్న లైంగిక సమస్యలపై అక్కడి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందుకొచ్చి ఎంతో మంది నటీమణులు తాము ఎదురుకున్న సంఘటనల గురించి చెప్తున్నారు. ఈ క్రమంలోనే రేవతి సంపత్ అనే నటీమణి హేమ కమిటీ తో సిద్దిఖీ 2016 లో తిరువనంతపురం లోని ఒక హోటల్ లో తనపై అత్యాచారం చేసాడని కొన్ని రోజుల క్రితం హేమ కమిటీకి చెప్పడంతో సిద్దిఖీ శుక్రవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యాడు.నవంబర్ లో ఇచ్చిన బెయిల్ గడువు కూడా ముగియడంతో  సిద్దిఖీ ని అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా వెంటనే బెయిల్ వచ్చింది.ఈ ప్రాసెస్ అంత గంటల్లోనే జరగడం గమనార్హం.  ఇక తన విషయంలో రేవతి చెప్పేవన్నీ అబద్హాలే అని, తన గౌరవ మర్యాదలకి భంగం కలిగించడానికే రేవతి ఆ విధంగా ప్రవర్తిస్తుందని సిద్దిఖీ డిజీపీకి ఫిర్యాదు చెయ్యడం కూడా  జరిగింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సాయుధ దళాల జెండా దినోత్సవం 2024 మనం రోజూ అనుభవించే ఎన్నో సౌకర్యాలు, సుఖాలు  ఉండకపోయినా,  రాత్రనక, పగలనక  గడ్డ కట్టించే మంచుపర్వతాలలో, మండించే ఎడారిలో పనిచేస్తున్న ఆర్మీ,  తీరప్రాంతానికి ఏ ప్రమాదం చేరకుండా సముద్రం  మద్యలో అడ్డుగోడలా నిలబడి రక్షిస్తున్న నేవీ,  దేశ రక్షణ కోసం గగన మార్గంలో కూడా డేగ కళ్ళతో తిరుగుతూ ఏ ప్రమాదమూ మన దేశపునెత్తి మీద పడకుండా రక్షిస్తున్న ఎయిర్ఫోర్సుల్లో  ప్రతీ  సైనికుడు నిస్వార్ధంగా పనిచేస్తున్నాడు అంటే దానికి కారణం, వాళ్ళు ఈ దేశాన్ని ఒక తల్లిగా,  దేశంలోని పౌరులందరినీ  తమ కుటుంబంగా  భావించి,  మనల్ని  ఇంట్లో సుఖంగా పడుకోనిస్తూ,  వాళ్ళుమాత్రం  ఇంటి బయట అహర్నిశలు కాపు కాస్తున్నారు.      అలా నిస్వార్ధంగా, నిర్భయంగా  మనందరి కోసం ప్రతీ సైనికుడు అక్కడ పనిచేస్తున్నారు అంటే, వారి వెనుక త్యాగం చేసే ఒక కుటుంబం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం తన బిడ్డని సమర్పించింది. మరి అలాంటప్పుడు ఆ సైనికుడి మీదైనా, అతని కుటుంబం మీదైనా బాధ్యత  మనందరికీ  ఉంటుంది. ఒక సైనికుడికి  కష్టం వస్తే దేశమంతా ఏకమై కుటుంబంలా నిలబడుతుందన్న నమ్మకాన్ని  సైనికుల్లో కలిగించటానికి, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ,  ఒక కుటుంబంగా వారికి అండగా నిలబడటానికి ఈ సాయుధ దళ దినోత్సవం జరుపుకోవటం మొదలుపెట్టారు.  సాయుధ దళాల జెండా దినోత్సవం: చరిత్ర భారత సాయుధ దళాలయిన   ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో చేరి,  మన దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడుతున్న, పోరాడి అమరులయిన  సైనికులను  గౌరవించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరుపుకుంటారు. సైనిక సిబ్బంది, వారి కుటుంబ  సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరపటమనేది డిసెంబర్ 7, 1949 నుంచి మొదలైంది. ఈ రోజున  దేశంలోని శాంతి, స్వేచ్ఛ,  భద్రతను కాపాడడంలో సైనికులు చేసిన  త్యాగాలను, దేశ రక్షణలో  వారికున్న అంకితభావాన్ని గుర్తించి, గౌరవిస్తారు.  అదనంగా, వారి  సంక్షేమానికి నిధులను సమీకరించడం జరుగుతుంది.  సాయుధ దళాల జెండా దినోత్సవం ప్రాముఖ్యత:  ప్రత్యేకమైన ఈరోజున  పౌరులంతా,   రక్షణ దళాలు, వారి కుటుంబాల పట్ల తమకున్న  కృతజ్ఞతను వ్యక్తపరిచే అవకాశం పొందుతారు. ఈ రోజున అందించే దేశ పౌరులు వివిధ రూపాల్లో  అందించే విరాళాలను  మాజీ  సైనికులు, యుద్ధ వితంతువులు, వికలాంగులైన సైనికుల  పరిస్థితిని మెరుగుపర్చటానికి ఉపయోగిస్తారు. ఇలాంటి ఒక దినోత్సవం జరుపుకోవటం వల్ల  సైనిక సిబ్బందికి,  పౌరులకి  మధ్య ఉన్న బంధం  బలోపేతం అవుతుంది.   పౌరులందరిలోనూ  ఐక్యత, దేశభక్తి భావనలను ప్రోత్సహిస్తుంది.   సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు? భారత సైనిక సిబ్బంది సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఉత్సవాలు, ఇతర వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా రెడ్, బ్లూ, లైట్ బ్లూ  రంగులతో కూడిన త్రివర్ణ జెండాలు (భారత సైన్యం యొక్క మూడు విభాగాలను సూచిస్తూ) పంపిణీ చేస్తారు. పౌరులంతా  ఈ జెండాలను ధరించడం వీరులను గౌరవించడానికి ఒక  ప్రతీక అవుతుంది.  ప్రధాన లక్ష్యాలు: 1.    భారత సాయుధ దళాల అంకితభావం,  త్యాగాలను గుర్తించి, గౌరవించటం.  2.    అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు,  దివ్యాంగ సైనికుల సంక్షేమం కోసం నిధులను సమీకరించడం. 3.    దేశ రక్షణలో పాల్గొనే వారికి మద్దతు అందించడంలో పౌరుల బాధ్యతను ప్రేరేపించడం. సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి :   రక్షణ మంత్రిత్వ శాఖ కమిటీ,  1949లో సాయుధ దళాల జెండా దినోత్సవ నిధిని సృష్టించింది. 1993లో, యుద్ధ బలిదాన దాతల నిధి, కేంద్ర సైనిక్ బోర్డ్ నిధి, మాజీ సైనికుల సంక్షేమ నిధి, ఇతర విభాగాలకు సంబంధించిన నిధులన్నింటినీ కలిపి ఒకే నిధిగా, ‘సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి’గా మార్చింది.   నిధి ఉపయోగాలు: •    అమరవీరుల కుటుంబాలకి, యుద్ధంలో గాయపడి  వికలాంగులైన   సైనికులకు మద్దతు ఇస్తారు.  •    మాజీ సైనికుల జీవన పరిస్థితి మెరుగుపర్చటానికి  ఆర్థిక సహాయం అందిస్తారు. •    సైనికుల పిల్లల విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం చేసి, వారి భవిష్యత్తుకి భరోసా ఇస్తారు.    అయితే ఈ ‘సాయుధ దళాల జెండా దినోత్సవం’ అనేది కేవలం ఆర్థిక మద్దతు ఇవ్వడానికి మాత్రమే కాదు,   ఇది ఐక్యత, గౌరవం, జాతీయ గర్వానికి ప్రతీక. ఈ రోజున పౌరులు సైనికుల సంక్షేమంలో అందరూ చురుకుగా పాల్గొని, దేశం కోసం  త్యాగాలు చేసిన వీరుల పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేయటం గొప్ప విషయం. మనల్ని తమ కుటుంబంగా భావించి కాపాడుతున్న ప్రతీ వీర సైనికుడిని, మనం కూడా  మన ఇంటి బిడ్డగా భావించి వారి కష్ట, నష్టాల్లో పాలుపంచుకుని, అందరం ఐకమత్యంగా ఉందాం. అప్పుడే మన భారతదేశానికున్న   వసుదైక కుటుంబ భావనని నిలబెట్టినవాళ్ళమవుతాం.                                           *రూపశ్రీ .  
సామాజిక  వివక్ష బలంగా ఉన్న రోజుల్లో ఒక వెనుకబడిన వర్గంలో పుట్టి, పెరిగిన ఒక సాధారణ వ్యక్తి  అప్పటికే    మహావృక్షపు వేర్లలా  సమాజమంతా  అల్లుకుపోయిన అంటరానితనం, కుల వివక్షల మీద పోరాటం మొదలుపెట్టి, అందులో విజయం సాధించటం అంత సులువయిన విషయమేమీ కాదు. ఆ విజయం వెనుక ఎన్నో అవమానాలున్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, మరెన్నో విమర్శలున్నాయి. కానీ అవన్నీ దాటుకుని  వెనుకబడిన వర్గాల జీవితాలు బాగుపడటానికి అవకాశం కల్పించిన ఆ మహానుబావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఇంకెవరో కాదు…. ఒక దళితునిగా పుట్టి, పెరగటంలో ఒక మనిషి ఎదుర్కొనే కష్ట నష్టాలన్నీ స్వయంగా అనుభవించి, వాటిపై న్యాయ పోరాటం చేసి, దళితుల పాలిట దేవుడిగా పేరు పొందిన  డా.భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారు.  అంబేద్కర్ గారి జీవితం ప్రతీ ఒక్కరికీ ప్రేరణ కలిగించే కథ.  అంబేద్కర్ గారు సామాజిక-రాజకీయ సంస్కరణలు  చేసిన వ్యక్తిగా తన ముద్రను భారతదేశ చరిత్రపై విడిచారు.  ఆయన అనేక సామాజిక వివక్షలు, అణచివేతలను ఎదుర్కొన్నప్పటికీ, విద్య ద్వారా విజయం సాధించారు.  సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడారు. అందుకే ఆయన మరణించిన డిశంబర్ 6వ తేదీన, అంబేద్కర్ వర్ధంతిగా దేశమంతా జరుపుకుని, ఆయనకి నివాళులర్పిస్తారు.  ఆయన పశ్చిమ భారతదేశంలో దళిత మహార్ కుటుంబంలో జన్మించారు.  ఆయన తండ్రి  భారత సైన్యంలో అధికారి. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచే పాఠశాలలోని  ఉన్నత కులానికి చెందిన తోటి విధ్యార్ధుల చేత అవమానించబడేవారు. అప్పట్లో స్కూల్లో వెనకబడిన వర్గాలవారిని గది బయటనే కూర్చోబెట్టేవారు, అలాగే వారికి నీళ్లు కూడా నేరుగా తీసుకునే హక్కు ఉండేది కాదు. ప్యూన్ లాంటి వారెవరొకరు పైనుంచి పోస్తే కిందనుంచి తాగాల్సిన పరిస్థితి. ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ ఆయన రాసిన పుస్తకంలో “నో ప్యూన్, నో వాటర్” అని రాశారు. అంటే ప్యూన్ రానిరోజున నీళ్ళు కూడా తాగకుండా వుండేవారని రాశారు.    ఆయన బరోడా గాయకవార్(రాజు) అందించిన స్కాలర్‌షిప్ సహాయంతో  అమెరికా, బ్రిటన్, జర్మనీలోని విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. గాయకవార్ అభ్యర్థన మేరకు బరోడా పబ్లిక్ సర్వీస్‌లో చేరినప్పటికీ, అక్కడ కూడా వెనుకబడిన వర్గం నుంచి వచ్చినవాడిగా, ఉన్నత కులానికి చెందిన  సహచరుల చేత అవమానాలు ఎదుర్కొనటంతో,  తన దృష్టిని న్యాయవాద వృత్తి, బోధనవైపు మళ్లించారు. అంటరానితనం మీద పోరాటం మొదలుపెట్టారు.    దళితులలో ప్రముఖ నాయకుడిగా ఎదిగి, వారి హక్కుల కోసం పత్రికలను స్థాపించి, ప్రభుత్వ శాసన మండలిలో ప్రత్యేక ప్రాతినిధ్యం పొందడంలో విజయం సాధించారు. విద్య అనే ఆయుధంతో,  న్యాయమనే నిప్పుతో ఆయన పోరాటం సాగింది. 1947వ సంవత్సరంలో  అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు.   రాజ్యాంగ రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు.  అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన సమాజంలో అణచివేతకు గురైన వర్గాల హక్కులను కాపాడటానికి న్యాయబద్ధమైన మార్గాలను ప్రవేశపెట్టారు. అలాగే, కుల వివక్ష నిర్మూలన, అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పని చేశారు. జనవరి 26, 1950న రాజ్యాంగం స్వీకరించటంలో  ప్రముఖ పాత్ర పోషించారు. ఈ జనవరి 26నే గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రభుత్వ విధానాల మీద  నిరాశ చెందడంతో,  1951లో ఆయన మంత్రి పదవి నుంచి రాజీనామా చేశారు. ఆయన తన జీవితంలో ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన  వ్యక్తిగత స్వేచ్ఛపై ధృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండేవారు. కుల వ్యవస్థని  తీవ్రంగా విమర్శించారు. కులవ్యవస్థకు హిందూ ధర్మం ఆధారంగా ఉందని ఆయన చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారి, హిందువులలో ఆగ్రహం కలిగించాయి.  హిందూ సిద్ధాంతంలో తాననుకుంటున్న స్పష్టమైన మార్పులు  లేవని భావించి, 1956లో ఆయన హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో ఆయనతో పాటు 2 లక్షలమందికిపైగా దళితులు కూడా బౌద్ధమతంలో చేరారు. ఈ రోజు అతడి సేవలు, ఆలోచనలు, ఈ   సమాజానికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని స్మరించుకునే రోజుగా నిలుస్తుంది. ప్రత్యేకంగా దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం,  సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు ఆయన చేసిన కృషి  చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. అంబేద్కర్‌ గారి మరణానంతరం 1990వ సంవత్సరంలో  భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన  భారతరత్నను ప్రదానం చేశారు. ఆయనని  గౌరవిస్తూ అనుచరులు  జై భీమ్ అనే నినాదం పలుకుతారు. ఆయన  గౌరవప్రదంగా  బాబాసాహెబ్ అని  కూడా పిలవబడ్డారు    దీని అర్థం "గౌరవనీయమైన తండ్రి". అని. ఆ మహానుభావుడు సమాజం కోసం చేసిన కృషికి నేడు ఆయన విగ్రహం లేని ఊరు ఉండదనటం  అతిశయోక్తి కాదేమో...అలాగే  'స్టాచ్యూ  ఆఫ్ సోషల్ జస్టిస్' పేరుతో విజయవాడలో  కాంస్య విగ్రహం నిర్మించారు. ఇది దేశంలోనే రెండో ఎత్తయిన విగ్రహం కావటం విశేషం.అలాగే తెలంగాణలో కూడా  నిర్మించారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుని మనమేం చేయాలి?  డా. అంబేద్కర్ గారు  ఆశించిన సమానత్వం, సామాజిక న్యాయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆయన జీవితం మనకు సంఘర్షణ, ధైర్యం, సేవాస్ఫూర్తికి ప్రతీక. ఈ రోజున ఆయన ఆశయాలను గౌరవిస్తూ, సామాజిక విభేదాలను తొలగించేందుకు కృషి చేయడం మన బాధ్యత. డా. అంబేద్కర్ గారి మరణ దినం మనకు ఆయన ఆశయాలను గుర్తుచేసే రోజు మాత్రమే కాకుండా, ఈ రోజుకీ పూర్తిగా మన సమాజాన్ని విడిచిపెట్టకుండా పట్టి పీడిస్తున్న కుల వివక్ష, అంటరానితనం రూపుమాపటానికి మనం చేయాల్సిన కృషిని గుర్తు చేయాలి.  సామాజిక సమానత్వం కోసం మనందరం కలిసి పని చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతుంది.                                   *రూపశ్రీ 
  మనం మట్టిని  భూమాత, నేలతల్లి అని పిలవటం దాని లక్షణానికి అచ్చంగా సరిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మ ఎలా అయితే తన పిల్లల్ని పెంచి, పోషించటానికి తనలోని శక్తి సన్నగిళ్లేవరకూ పాటుపడుతుందో, అలాగే ఈ నేల తనలోని సారమంతా సన్నగిళ్లేవరకూ మొక్కల్ని పెంచి, పోషించి ఈ భూమి మీద ఉన్న జీవజాల  మనుగడకి ఆధారమవుతుంది. అయితే శక్తి సన్నగిల్లిన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఎలా అయితే పిల్లలకి ఉంటుందో, అలాగే నేలతల్లి  అందించిన ఆహారం తింటున్న మనకి దాని గొప్పదనాన్ని గుర్తించి, దాని బాగోగులు కూడా చూసుకోవాల్సిన  బాధ్యత ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.  ప్రపంచ నేల  దినోత్సవం మన ఆహారంలో 95%కి పైగా నేలలోనుంచే ఉత్పత్తి అవుతోంది. కాబట్టి, ఈ సహజ వనరు ఆరోగ్యంగా ఉండటమనేది మనుషులకే కాదు, భూమి మీద ఉన్న  జీవజాలమంతటి  మనుగడకీ  అవసరమే. అందుకే భూమి మీద హాయిగా జీవించాలంటే   నేలకున్న  ప్రాముఖ్యతను తెలియజేస్తూ,  ప్రపంచ నేల దినోత్సవం ఆవిష్కరణను 2002లో ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్’ ప్రతిపాదించింది. దీన్ని 2013లో ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధికారికంగా ఆమోదించింది. ఆ తర్వాత, ‘సంయుక్త జాతుల సాధారణ అసెంబ్లీ’ ఈ దినోత్సవాన్ని 2013 డిసెంబర్‌లో ఆమోదించింది. కానీ ఈ దినోత్సవానికి డిసెంబర్ 5ని ఎంచుకోవడమన్నది   థాయ్‌లాండ్‌కు చెందిన భూమిబోల్ ఆదుల్యదేజ్ అనే రాజు గౌరవార్ధం జరిగింది. 2024కి గానూ ప్రపంచ నేల దినోత్సవ థీమ్: “నేలని సంరక్షించండి - కొలవడం, పర్యవేక్షించడం, నిర్వహించడం” ఈ సంవత్సరం ఎంచుకున్న థీమ్ అనేది  నేల ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ స్ధిరత్వం మధ్య అనుబంధాన్ని బలంగా చూపిస్తుంది. ఆహార భద్రతను, వాతావరణ మార్పులను ఎదుర్కోవడాన్ని, పర్యావరణ వ్యవస్థల స్ధిరత్వాన్ని అందించడంలో నేలకి సంబంధించిన  ఖచ్చితమైన డేటా అవసరమని చెప్తుంది.   భారత భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా ఒండ్రుమట్టి, నల్లరేగడి, బంకమట్టి, ఎర్రమట్టి నేలలు, ఎడారి నేలలు, కొండప్రాంతపు నేలలని వివిధ రకాల మట్టి పుడుతుంది. అయితే  ఒక్కో రకపు మట్టి కొన్నికొన్ని    ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి, రకరకాల   పంటలకు అనుకులంగా ఉంటుంది.  వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంలో, ఆహార భద్రతను కల్పించడంలో మట్టి మీద  అవగాహన ఉండటం చాలా ముఖ్యమైనది.  నేలకున్న సమస్యలు.. సవాళ్లు, ముప్పులు:  నేలకి  సహజ ప్రక్రియలవల్ల,  మానవ చర్యల ద్వారా కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు మట్టి ఆరోగ్యం, జీవవైవిధ్యం, ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ నేలని ముప్పులోకి నెట్టే ప్రధాన సవాళ్లుగా కొన్నింటిని చెప్పవచ్చు.    నేల దెబ్బతినడం:   నీరు, గాలి ద్వారా మట్టి కొట్టుకుపోతుంటుంది. అలాగే  అడవులని నరికేయటం, పంటల మార్పిడి లేకపోవడం, ఇంకా  మారుతున్న వ్యవసాయ పద్ధతులు మట్టిని త్వరగా దెబ్బతినేలా చేస్తాయి. పంటలకి  పోషక లోపం:   భారతదేశంలో ప్రాంతాలను బట్టి  చాలా భాగం నేలలు నత్రజని, ఫాస్ఫరస్ లోపంతో ఉన్నాయి.  అందువల్ల ఎరువు ఎంత వేయాలో అనే అవగాహన కూడా లేని రైతులు, సబ్సిడీలో తీసుకున్న రసాయన ఎరువులని  విపరీతంగా ఉపయోగించటం వల్ల నేల సారం మారిపోయి పంటలకి పోషణ అందట్లేదు.  ఎడారీకరణ:   పెరుగుతున్న జనాభా ఒత్తిడి కారణంగా అడవులని కొట్టేయటం వల్ల, పశువుల అధిక మేత వలన సారవంతమైన నేలలు సారం కోల్పోయి ఎడారిగా మారుతున్నాయి.   నీరు నిల్వ ఉండిపోవటం:   నీటిపారుదల సరైన విధంగా లేకపోవడం, నేలలో వాటర్ చానల్స్‌ నుంచి నీరు లీకేజీ అవ్వటం వల్ల లక్షల ఎకరాల భూములు నీటితో నిండిపోతున్నాయి. దీనివల్ల మట్టి నిర్మాణం దెబ్బతిని, ఉత్పాదకత తగ్గిపోతుంది.  ఉప్పదనం,  క్షారతనం:   నీటిపారుదల అధికంగా ఉండే ప్రదేశాల్లో   మట్టిలో ఉప్పు పేరుకు పోవడం వల్ల కూడా అక్కడ నేల పంటకి అనుకూలం కాకుండా పోతుంది.  పట్టణీకరణ,  పాడుబడిన భూములు:   పట్టణాలకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ స్థలానికి డిమాండ్ పెరిగి చుట్టుపక్కల మంచి పొలాలు కూడా లే-అవుట్లగా మార్చేస్తున్నారు. అలాగే  రసాయనాలు,  లోహాలతో  పరిశ్రమల వ్యర్థాలు నేలని కాలుష్యం చేస్తాయి.  పారిశ్రామీకరణ:   నేలని నాశనం చేసే ఓపెన్-కాస్ట్ మైనింగ్, పరిశ్రమల కోసం వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలని ఆక్రమించుకోవటం.  ప్రపంచ నేల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?  నేల సారాన్ని కాపాడటం: నేలలోని పైపొరల్లో  ఖనిజాలు, సేంద్రీయ పదార్థాలు, నీరు, గాలి ఉంటాయి.  ఇది మొక్కల పెరుగుదలకు బలంగా ఉండి, భూమిపై జీవం మద్దతు కోసం అవసరమైనది.  అందుకే ఈ నేల సారం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం:  ఆరోగ్యవంతమైన నేల  ఆహార భద్రతకు కీలకం. కాబట్టి నేల పాడవకుండా వ్యవసాయ విధానాలు పాటించేలా ప్రోత్సహించాలి.  జీవ వైవిధ్యాన్ని కాపాడటం: నేడు రకరకాల రసాయనాల వినియోగం వల్ల సహజంగా నేల సారాన్ని పెంచటంలో సాయపడుతున్న జీవులు చనిపోతున్నాయి. అందుకే న్యూట్రియంట్ సైక్లింగ్,  కార్బన్ నిల్వల్లో  కీలక పాత్ర పోషించే జీవులను రక్షించాలి.  అవగాహన కలిగించడం:  భవిష్యత్ తరాలకు నేల  సంరక్షణ అనేది ఈ భూమి మీద మానవ మనుగడకి చాలా అవసరమనే  అవగాహన కలిగించాలి.  నేలని కాపాడుకోవటానికి ఏం చేయాలి?    మొక్కలు నాటటం:    మట్టి కొట్టుకుపోయే ప్రాంతాల్లో వృక్షాలు నాటడం దారా  మట్టిని దెబ్బతినకుండా కాపాడవచ్చు.  వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్:    ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IWDP) వంటి కార్యక్రమాలు ద్వారా నీటి పారుదలని సమర్ధవంతంగా  నిర్వహించాలి.  టెర్రేస్ వ్యవసాయం:  పర్వత ప్రాంతాల్లో నేలను మెట్లు లాగా  పైనుంచి కిందవరకూ చెక్కి ఉంచే విధానంలో  మట్టి నీటితో పాటూ కిందకి కొట్టుకుపోకుండా కాపాడుతుంది.   ఆర్గానిక్ వ్యవసాయం:  రసాయన ఎరువులు వినియోగం తగ్గించి ఆర్గానిక్  ఎరువులు ఉపయోగిస్తూ వ్యవసాయం చేస్తే నేల సారం పెరుగుతుంది.  నేలను  కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇలా చేస్తే మనవంతు మన నేల తల్లికి సేవ చేసిన వాళ్ళమవుతాం. అందుకే  మట్టిని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. "ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన గ్రహం!" “ ఆరోగ్యకరమైన గ్రహం, ఆహ్లాదకరమైన జీవితం”అనే విషయాన్ని మర్చిపోకూడదు.                                  *రూపశ్రీ.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు.  ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు పండ్లు లేదా పండ్ల రసం ఇస్తుంటే చాలా తొందరగా కోలుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.  మంచి ఆరోగ్యం కోసం పండ్లు, పండ్ల రసాలు తీసుకోమని వైద్యులు కూడా చెబుతారు. చాలా మంది పండ్ల రసాలు తాగాలని అనిపిస్తే  సింపుల్ గా ఫ్రూట్ జ్యూస్ షాప్ కు వెళ్లి తాగేస్తుంటారు.  మరికొందరు ఓపికగా ఇంట్లోనే జ్యూస్ చేసుకుంటారు. అయితే జ్యూస్ తాగే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పండ్ల రసం చాలా వరకు బయట తాగడం చాలామంది అలవాటు.  అయితే పండ్ల రసం తాగే దుకాణం శుభ్రతగా ఉందా లేదా గమనించాలి. శుభ్రత లేని చోట  పండ్ల రసాలు తాగితే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. కేవలం ఆ దుకాణం మాత్రమే కాదు.. చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా శుభ్రతగా లేకుంటే  ఆ దుకాణాలలో జ్యూస్ లు తాగడం మంచిది కాదు. జ్యూస్ తాగేముందు అక్కడే అప్పటికప్పుడు తాజాగా తయారు చేసిన జ్యూస్ ను మాత్రమే తాగడం మంచిది. ముందే జ్యూస్ జార్ లేదా గిన్నెలలో నిల్వ ఉంచిన జ్యూస్ ను అస్సలు తాగకూడదు. అలాంటి జ్యూస్ లో  బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ తాజా పండ్ల జ్యూస్ ను మాత్రమే రికమెండ్ చేయాలి. పండ్ల జ్యూస్ లు అమ్మే షాపులలో  కొన్నిసార్లు ముందే పండ్లను కట్ చేసి ఉంటారు. అలాంటి పండ్ల నుండి జ్యూస్ ను తయారు చేయించుకోకూడదు. తాజాగా కట్ చేసిన పండ్ల నుండే జ్యూస్ ను చేయించుకోవాలి.  ముందే కట్ చేసిన పండ్లలో కొన్ని సార్లు చెడి పోయిన పండ్లను కొంత భాగం కట్ చేసి పెట్టుకుని ఉంటారు.  ఇది బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పండ్ల రసం తయారు చేసేవారు జ్యూస్ మరింత రుచిగా,  తాజాగా ఉండటం కోసం జ్యూస్ లో ఏదైనా రసాయనాలు లేదా పౌడర్ లేదా లిక్విడ్స్ మిక్స్ చేస్తుంటారు.  కొన్నిసార్లు రంగు కూడా జోడిస్తూ ఉంటారు. అలాంటి చోట జ్యూస్ అస్సలు తాగకూడదు. వాడిపోయిన,   పాతబడిన కాయలతో ఫ్రూట్ జ్యూస్ లు తయారు చేసి అమ్ముతుంటారు. అలాంటివి నివారించాలి. వీటిలో నీటి శాతం ఏమీ ఉండదు. పై పెచ్చు కార్బోహేడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి.  వీటిలో పోషకాలు ఏమీ ఉండవు.  ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి కావు.                                                 *రూపశ్రీ.
  చేపలు చాలా శక్తి వంతమైన ఆహారం.  సమతుల ఆహారంలో చేపలకు కూడా స్థానం ఉంది. చేపలను తీసుకుంటే శరీరానికి ప్రోటీన్, విటమిన్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి.  వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెబుతారు. అయితే చేపల కంటే ఎక్కువ పోషకాలు ఉన్న గింజలు ఉన్నాయి. ఈ గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే 10 రెట్ల పోషకాలు లభిస్తాయట. ఇంతకీ ఇవేం గింజలు.  వీటి ప్రయోజనాలేంటి తెలుసుకుంటే.. గుమ్మడి.. గుమ్మడి కాయ వినియోగం భారతదేశంలో ఎక్కువ.  గుమ్మడి కాయను కట్ చేసిన తరువాత చాలా మంది అందులో విత్తనాలు పడేస్తుంటారు. అయితే గుమ్మడి గింజలు పోషకాల నిధి.  గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే అధిక శక్తి,  శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయట. 100 అత్యంత శక్తివంతమైన ఆహారాల జాబితాలో గుమ్మడి గింజలు ఆరవ స్థానం పొందాయి.  ఇక ఎంతో మేలు అని చెప్పుకునే చేపలు 77వ స్థానంలో నిలిచాయి. గుమ్మడికాయ గింజలలో పోషకాల విలువ 84 అయితే.. చేపలలో ఎంతో మంచిదని చెప్పుకునే సాల్మన్ చేపల పోషక విలువ 52 మాత్రమే. అందుకే గుమ్మడికాయ గింజలను అస్సలు మిస్ చేసుకోకుండా తినమని చెబుతున్నారు. పోషకాలు.. గుమ్మడికాయ గింజలలో ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలో ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. గుమ్మడి గింజలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్ట్ బీట్ ను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజలలో ఉండే ఒమేగా-3,  ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు మంటను తగ్గించి,  చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.  మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరానికి  ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. విటమిన్ ఇ వాపును తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్,  విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. మెగ్నీషియం, భాస్వరం,  జింక్ ఎముకల సాంద్రతను పెంచడానికి,  బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి చాలా అవసరం. ఈ మూడు మూలకాలు గుమ్మడి గింజల్లో మంచి పరిమాణంలో ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. గుమ్మడికాయ గింజలు ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి.   డయాబెటిస్ సమస్యలను నివారిస్తాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్,  ఫైబర్ ఆకలిని నియంత్రిస్తాయి, తద్వారా బరువును నియంత్రిస్తాయి. ముఖ్యమైన  విషయం ఏమిటంటే 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 164 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంటే ఇందులో కేలరీలు తక్కువ.                                             *రూపశ్రీ.
  పెరుగుతున్న వయస్సుతో  రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం అనేది ఒక సహజంగా జరిగేదే. దీనిని ఇమ్యునోసెన్సెన్స్ అంటారు. 50 తర్వాత దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా, శరీరం వైరస్లు,  బ్యాక్టీరియాతో పోరాడడంలో విఫలమవుతుంది. ఇది ఫ్లూ, షింగిల్స్,  న్యుమోనియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే  కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా  రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఇందుకోసం వైద్యులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు.   వీటిని పాటిస్తే  50 ఏళ్ల తర్వాత కూడా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. నీరు.. తగినంత నీరు త్రాగడం అనేది చాలామంది  పట్టించుకోని విషయం.  కానీ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు నీరు పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం లోపిస్తే  శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాలను పడతాయి.  ఎందుకంటే ఇది రోగనిరోధక కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది.   శరీరం యొక్క రక్షణ యంత్రాంగాన్ని బలహీనపరుస్తుంది. వయసు పెరిగే కొద్దీ మన దాహం తగ్గుతుంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి  నీరు, హెర్బల్ టీలు  పండ్లు,  కూరగాయలతో సహా రోజంతా తగినంత ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా పోషకాలను గ్రహించడం, వ్యర్థాలను తొలగించడం,  మొత్తం రోగనిరోధక వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది. ఆహారం.. మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడానికి పోషకాహారం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ మన శరీరం పోషకాలను గ్రహించలేకపోతుంది. కాబట్టి  పండ్లు, కూరగాయలు, ధాన్యాలు,  లీన్ ప్రోటీన్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోబయోటిక్స్ కూడా సహాయపడతాయి. విటమిన్లు సి,  ఇ, జింక్,  సెలీనియం వంటి పోషకాలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.  శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వ్యాక్సిన్లు.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి లేదా పెరుగుతున్న వయస్సుతో సంభవించే ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి వ్యాక్సిన్  అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. కాలక్రమేణా మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా వృద్ధులలో షింగిల్స్, న్యుమోనియా,  ఫ్లూ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. వ్యాక్సిన్‌లు మన శరీరం ఈ ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలను తయారు చేయడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, షింగిల్స్ వ్యాక్సిన్ 50 ఏళ్లు పైబడిన వారికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే చిన్ననాటి చికెన్ పాక్స్ మళ్లీ చురుకుగా మారవచ్చు.  ఇది  షింగిల్స్ వంటి బాధాకరమైన ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. నిద్ర.. మంచి నిద్ర మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది మన శరీరాన్ని రిపేర్ చేయడం మరియు పునరుత్పత్తి చేయడమే కాకుండా, మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల, మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, దాని కారణంగా మనం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతాము. నిజానికి, నిద్రలో మన శరీరం సైటోకిన్స్ అనే ప్రత్యేకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇన్‌ఫెక్షన్ మరియు ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. తక్కువ నిద్ర కారణంగా, సైటోకిన్‌ల ఉత్పత్తి మందగిస్తుంది, దీని వల్ల వ్యాధులతో పోరాడే మన సామర్థ్యం బలహీనపడుతుందని మీకు చెప్పండి. అందువల్ల, ప్రతి రాత్రి 7-9 గంటలు మంచి నిద్ర పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి, తద్వారా మన రోగనిరోధక శక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. చురుకుదనం.. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామం చేయడం వల్ల  బరువు అదుపులో ఉండటమే కాకుండా కండరాలు బలపడతాయి.  వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది.  నిత్యం వ్యాయామం చేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రక్తంలో మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడే కొన్ని ప్రత్యేక కణాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడినప్పుడు ఈ కణాలు శరీరం అంతటా సులభంగా కదలగలవు.  ఏదైనా సూక్ష్మక్రిములతో పోరాడటానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో వాపులు కూడా తగ్గుతాయి.  ఇన్ఫ్లమేషన్ వయసు పెరిగే కొద్దీ వ్యాధులతో పోరాడే మన శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మనం  వాపును తగ్గించి ఆరోగ్యంగా ఉండవచ్చు.                                          *రూపశ్రీ.