LATEST NEWS
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులకు భూ కేటాయింపులు  గత నెల 25 వ తేదీన  సుప్రీం ధర్మాసనం రద్దు చేసిన నేపథ్యంలో జవహార్ హౌసింగ్ సొసైటీ మరో మారు కోర్టు  ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ నెల 21 నుంచి క్రిస్మస్ సెలవులు ఉండటంతో కొత్త సంవత్సరంలోనే కోర్టు  తెరచుకుంటుంది. కోర్టు తీర్పుపై క్లారిఫికేషన్ లేదా రివ్యూ పిటిషన్ వేయడానికి కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ చట్ట పరిధిలో పని చేయాల్సిన హౌజింగ్ సొసైటీ ఇంతవరకు ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు. తీర్పులో పొందుపరిచినట్లు  ముఖ్యమంత్రి విచక్షణకే వదిలేసినప్పటికీ హౌసింగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది.  ముఖ్యమంత్రి నుంచి నిర్దిష్టమైన హామీ తీసుకోవడంలో కమిటీ పెద్దలు వైఫల్యం చెందారు.  కమిటీ  సొసైటీ తీరు వెయ్యికుటుంబాలు రోడ్డున పడే విధంగా ఉంది.   రెండు దశాబ్దాల క్రితం వైఎస్ ఆర్ ప్రభుత్వ హాయంలో మార్కెట్ రేటు ప్రకారం పన్నెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి  కుత్బుల్లాపూర్ మండలంలోని  నిజాంపేట, పేట్ బషీర్ బాద్ గ్రామాల్లో జర్నలిస్ట్ లు  భూములు కొనుగోలు చేశారు. ప్రతీ పన్నెండేళ్లకు నదులకు పుష్కరాలు వస్తుంటాయి. 2008 నుంచి ఈ  భూములకు మోక్షం దొరకలేదు. స్వంతింటి కల  ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లుతో  ప్రత్యేక అనుబంధం ఉంటుంది.  ఎప్పుడెప్పుడు సొంత ఇంట్లోకి వెళదామా అని తాపత్రయపడుతుంటారు. అలాంటి ఈ భూములు ఏటికేడు అన్యాక్రాంతం అవుతున్నాయని  జర్నలిస్ట్ లు తల్లడిల్లిపోతున్నారు. భవిష్యత్‌లో  మా భూములు అంటూ ఒకటుండేదని పిల్లలకు కథలుగా చెప్పాల్సిన దుస్థితి వస్తుందేమోనని తలచుకుంటూ గుండెలు బరువెక్కేలా రోదిస్తున్నారు. ఇంతకీ ఆ భూముల వచ్చిన ముప్పేమిటీ? ఆ జర్నలిస్ట్ ల భూమి  ఎక్కడ ఉంది? వారికి  వచ్చిన కష్టమేమిటో ఇప్పుడు చూద్దాం. 2008లో వైఎస్ ప్రభుత్వం ఎంఎల్ఏల, ఎంపీలు, ఐఏఎస్ , జడ్జీలతో బాటు  జర్నలిస్ట్ లకు భూ కేటాయింపులు జరిపింది. ఈ భూటాయింపుల జీవోపై  విబిజె చెలికాని హైకోర్టులో పిల్ వేయడంతో  న్యాయవివాదం మొదలైంది.  హైదరాబాద్ లో స్వంత స్థలం లేదని అఫిడవిట్ ఇచ్చి స్థలాలు  తీసుకోవచ్చని దశాబ్దన్నరక్రితం  క్రితం హైకోర్టుతీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం  సొసైటీ కమిటీ  స్థలాలను స్వాధీనం చేసుకోవాలి. సభ్యుల ప్రమేయం లేకుండానే సుప్రీంకోర్టు కెక్కింది. బైలాస్ ప్రకారం కమిటీ సర్వ సభ్య సమావేశం ఆమోదంతో సుప్రీం కోర్టు గడపదొక్కాలి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు కెళ్లడం సొసైటీ  కమిటీ చేసిన అతి పెద్ద తప్పు అని సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 2017లో సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్  ఇంటెరిం ఆర్డర్ ప్రకారం 70 ఎకరాలను  డెవలప్ చేసుకోవచ్చు.  కానీ సొసైటీ  ఆ స్థలాలను స్వాధీనం చేసుకోకపోవడం సొసైటీ చేసిన రెండో తప్పు. 2019లో    సుప్రీం ప్రధాన న్యాయమూర్తి   జస్టిస్ ఎన్వి రమణ  తీర్పు ప్రకారం స్థలాలను స్వాధీనం చేసుకోకపోవడం సొసైటీ చేసిన మూడో తప్పు.  సోసైటీ చేసిన ఈ మూడు తప్పులే వెయ్యికుటుంబాలు రోడ్డున పడే విధంగా  చేశాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్  జర్నలిస్ట్ లకు భూములను అప్పగించడంలో విఫలమైంది. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్నజర్నలిస్ట్ ల  భూములను పంపిణీ చేస్తామని  కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది. కానీ సుప్రీం తీర్పుతో  జర్నలిస్ట్ లకు ఒక్కసారిగా పిడుగుపడ్డట్టయ్యింది.  ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం ప్రాతిపదికన ఆర్థికంగా చితికి పోయిన జర్నలిస్ట్ లను  ఎంఎల్ ఏ, ఎంపీలు, ఐఏఎస్ , జడ్జిలతో సమానంగా పరిగణించి భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా తీర్పు ఇవ్వడం శరాఘాతంగా మారింది.  రెండు దశాబ్దాలు ఎదురు చూసిన జర్నలిస్ట్ లకు  విషాదాన్ని మిగిల్చే పీడకల లాంటిది.
ఈ నెల 9వ తేదీన తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఆహ్వానం అందింది. మంత్రి పొన్నం  ప్రభాకర్ శనివారం మాజీ ముఖ్యమంత్రిని ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో  కల్సుకున్నారు. విగ్రహావిష్కరణకు రావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ తల్ల విగ్రహం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని  విగ్రహావిష్కరణ అడ్డుకోవాలని బిఆర్ఎస్ హైకోర్టు గడపదొక్కింది.   
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బిఆర్ఎస్ హైకోర్టు గడపదొక్కింది. ఆ పార్టీ నాయకుడు, జర్నలిస్ట్ జూలూరి గౌరిశంకర్  విగ్రహావిష్కరణ ఆపాలని హైకోర్టులో పిల్ వేశారు. ఈ నెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు రేవంత్ సర్కార్ చెప్పింది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసి రేవంత్ సర్కార్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేసి ప్రజల మనో భావాలను కించపరిచినట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు,మేధావులు,రచయితలు,కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కెసీఆర్ మీద కక్ష్యతో విగ్రహాన్ని మార్పులు చేసినట్టు జూలూరి వివరించారు. ఇటీవల ఎపిలో కూడా వైకాపా సోషల్ మీడియా వింగ్  కూటమి నేతలను టార్గెట్ చేసి  విష ప్రచారం చేసింది. కూటమి అధికారంలో రాగానే వారిపై కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణ మురళి, ఆర్జీవీ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వీరిపై కేసులు నమోదు కావడాన్నినిరసిస్తూ జర్నలిస్ట్, వైకాపా నేత  విజయబాబు హైకోర్టులో పిల్ వేసి అభాసుపాలయ్యారు. విజయబాబుపై 50 వేల జరిమానా విధించడమే గాక అక్షింతలు వేసింది. 
ఎపిలో రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు చేసిన కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది.  వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటయ్యింది.  రేషన్ మాఫియా, కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై విచారించనుంది. సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డిఎస్పీలు  అశోక్ వర్దన్, బాల సుందర్ రావు, గోవిందరావు, రత్తయ్య , సిట్ చీఫ్ తో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం దర్యాప్తు చేయనుంది.  పేద ప్రజలకు అందాల్సిన  రేషన్ బియ్యం అక్రమరవాణాను వ్యవస్థీకృత నేరంగా భావిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హాయంలో ప్రారంభమైన ఈ అక్రమరవాణా గుట్టు విప్పిన కూటమి ప్రభుత్వం 15 ఎఫ్ ఐ ఆర్ ల ఆధారంగా సిట్  దర్యాప్తు  చేయనుంది. ప్రతీ పదిహేను రోజులకు ఓ సారి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ఈ బియ్యం ఆఫ్రికాదేశాలకు సప్లయ్ అవుతోంది
వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్య సభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి  కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి  ఎపి హైకోర్టునాశ్రయించారు. డిసెంబర్ రెండో తేదీన మంగళగిరిలో  సిఐడి పోలీసులు   వైవి సుబ్బారెడ్డి  తనయుడు విక్రాంత్ రెడ్డి మీద  ఎ1గా  కేసు నమోదైంది. ఇదే కేసులో ముందస్తుబెయిల్ కోసం వైవి విక్రాంత్ రెడ్డి ఎపి హైకోర్టునాశ్రయించారు.  రాజకీయ దురుద్దేశ్యంతో తనపై కేసు నమోదైందని  విక్రాంత్ రెడ్డి కోర్టుకు విన్నవించుకున్నారు. తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన  సంగతి తెలిసిందే.
ALSO ON TELUGUONE N E W S
During a recent promotional event of Pushpa 2 The Rule, Icon Star Allu Arjun was asked about which Bollywood actor inspires him the most. The pan-Indian action hero chose Amitabh Bachchan, the legendary star.  "Amitabh ji inspires me the most. He has a long span of career. I absolutely adore the megastar of the country, Amitabh ji. We have all grown up watching his films. He has got a lot of impact on us in the growing years," Allu Arjun said, adding how Big B acts with so much grace even at this old age. Big B today learned about Bunny's words and shared his reaction on X. The iconic Bollywood hero said that he was so humbled by Allu Arjun's gracious words. "You give me more than I deserve. We are all such huge fans of your work and talent. May you continue to inspire us all. My prayers and wishes for your continued success!" Amitabh wrote. In response, Allu Arjun described Amitabh as a superhero. "And listening to words like this from you is surreal. Thank you for your kind words, generous compliments and heartfelt wishes… Humbled by your humility," Bunny wrote. The exchange between Amitabh Bachchan and the Icon Star comes at a time when 'Pushpa 2: The Rule' is ruling the audience's mindspace everywhere.
  రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నాడు. 'గర్ల్ ఫ్రెండ్' టీంని విజయ్ దేవరకొండ గిఫ్ట్ అందించాడు. టీజర్ ని వాయిస్ ఓవర్ అందించడం కాకుండా, టీజర్ ను తన చేతుల మీదుగా విడుదల చేశాడు. (The Girlfriend Teaser)   విజయ్ దేవరకొండ చేతుల మీదుగా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా టీజర్ రిలీజ్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, గర్ల్ ఫ్రెండ్ టీజర్ లోని ప్రతి విజువల్ ఆకట్టుకుంది. ఈ మూవీని చూసేందుకు వెయిట్ చేస్తున్నా. 8 ఏళ్ల క్రిితం రష్మికను సెట్ లో కలిశా. ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నా రష్మిక వ్యక్తిగతంగా ఇప్పటికీ అంతే హంబుల్ గా ఉంది. నటిగా ఆమెకు 'ది గర్ల్ ఫ్రెండ్' మరింత బాధ్యతను ఇచ్చింది. సక్సెస్ ఫుల్ గా రష్మిక ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నా. ప్రతి ప్రేక్షకుడినీ కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టర్ రాహుల్ చూపిస్తాడని నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నాడు.     "ది గర్ల్ ఫ్రెండ్" టీజర్ విషయానికొస్తే.. కాలేజ్ హాస్టల్ లోకి రష్మిక అడుగుపెడుతున్న సీన్ తో టీజర్ మొదలైంది. హీరో దీక్షిత్, రష్మిక క్యారెక్టర్స్ పరిచయం, వారి మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ ను చూపించారు. ఆ కాలేజ్ లో లీడ్ పెయిర్ చేసిన జర్నీ ఎంతో ఎమోషనల్ గా ఉంది. "నయనం నయనం కలిసే తరుణం, ఎదనం పరుగే పెరిగే వేగం.." అంటూ విజయ్ ఇచ్చిన వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా.. అస్సలు పడను" అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ తో టీజర్ ను ముగించారు. టీజర్ ని బట్టి ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ అనిపిస్తోంది.    "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా కృష్ణన్ వసంత్, ప్రొడక్షన్ డిజైనర్స్ గా ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి వ్యవహరిస్తున్నారు.
  కొన్నేళ్లుగా తెలుగు సినిమా, ఇండియన్ సినిమాని శాసిస్తోంది. ఇండియన్ సినిమాలలో ఫస్ట్ డే కలెక్షన్స్ చూసినా, ఫుల్ రన్ కలెక్షన్స్ చూసినా.. టాప్ సినిమాల లిస్టులో తెలుగు సినిమాలదే హవా. ఇక ఇటీవల విడుదలైన 'పుష్ప-2' ఈ హవాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్లకు గ్రాస్ రాబట్టి, ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా, ఫుల్ రన్ లో ఇండియన్ సినిమా చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అయితే, పుష్ప-2 ఇంతటి సంచలనాలు సృష్టిస్తుంటే టాలీవుడ్ టాప్ హీరోల నుంచి కనీసం విషెస్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. (Pushpa 2 The Rule)   చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను అండగా ఉండటంలో, మూవీ టీంలను అభినందించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అలాంటి చిరంజీవి తన మేనల్లుడు అల్లు అర్జున్ 'పుష్ప-2'తో ఇంతటి చరిత్ర సృష్టిస్తుంటే కనీసం ట్వీట్ చేయలేదు. పుష్ప నిర్మాతలు స్వయంగా వెళ్లి, చిరంజీవిని కూడా కలిశారు. అయినప్పటికీ ఆయన నుంచి ట్వీట్ రాలేదు. మెగా వర్సెస్ అల్లు వార్ దీనికి కారణమా? లేదా చిరంజీవి వ్యక్తిగతంగా బన్నీని విష్ చేశాడా? అనేది క్లారిటీ లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్నారు కాబట్టి.. ఆయన నుంచి సినిమా ట్వీట్ లు ఆశించడం కరెక్ట్ కాదు. అయితే రామ్ చరణ్ కూడా 'పుష్ప-2' గురించి స్పందించలేదు. ఒక వైపు తన బావ అల్లు అర్జున్ హీరో, మరోవైపు తనకు 'రంగస్థలం' వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ దర్శకుడు. అయినప్పటికీ 'పుష్ప-2' టీంకి చరణ్ నుంచి విషెస్ లేవు.   నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, ఇతర సినిమాలకు విషెస్ చెప్పడం చాలా తక్కువ. ముఖ్యంగా బాలకృష్ణ అయితే సోషల్ మీడియాను పెద్దగా ఉపయోగించరు. మరి వ్యక్తిగతంగా విష్ చేశారో లేదో తెలీదు. ఇక ఎన్టీఆర్ కి, బన్నీకి మధ్య మంచి అనుబంధముంది. ఒకరినొకరు బావ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. సోషల్ మీడియాలోనూ ఇద్దరూ విష్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎందుకనో 'పుష్ప-2' ప్రభంజనంపై మాత్రం ఎన్టీఆర్ నుంచి స్పందన లేదు.   చిరంజీవి మాదిరిగానే మహేష్ బాబు కూడా ఇతర చిత్రాలను ప్రశంసించడంలో ముందుంటాడు. కానీ అలాంటి మహేష్ నుంచి కూడా 'పుష్ప-2' టీంకి విషెస్ రాలేదు. ప్రభాస్ కూడా అంతే. తన వాళ్ళు అనుకుంటే చిన్న చిన్న సినిమాలకు తన వంతు సపోర్ట్ చేస్తుంటాడు. అలాంటి ప్రభాస్.. తన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరైన అల్లు అర్జున్ ఇంతటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే విషెస్ చెప్పలేదు.   అయితే ఇది పుష్ప-2 విషయంలో మాత్రమే కాదు. ఈ మధ్య ఇతర భారీ సినిమాల విషయంలోనూ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ సోలో హీరోగా 'దేవర'తో మంచి వసూళ్లు రాబట్టాడు. కానీ ఆ సక్సెస్ పై ఎవరూ స్పందించలేదు.   ఓ వైపు తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకి ఎదుగుతోంది. ఇలాంటి సమయంలో స్టార్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఫ్యాన్స్ ని ఏకం చేయాల్సింది పోయి.. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండటం.. వారికి మాత్రమే కాదు, టాలీవుడ్ కి కూడా మంచిది కాదు. మరి ఇది, హీరోలకు ఒకరిపై ఒకరికున్న అసూయ వల్ల జరుగుతుందా? లేక ఏవైనా వ్యక్తిగత కారణాల వల్ల.. పబ్లిక్ గా చెప్పకుండా, పర్సనల్ గా విష్ చేస్తున్నారా? అనేది అర్థంకావట్లేదు.
  మంచు కుటుంబంలో వివాదాలు భగ్గుమన్నాయి. తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ఆయన అనుచరుడితో తనపై దాడి చేయించాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మనోజ్ పై దాడి జరిగిందని, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. జరగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మోహన్ బాబు పీఆర్ చెప్పుకొచ్చింది. కానీ మనోజ్ గాయాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాడు. దీంతో నిజంగానే దాడి జరిగి ఉంటుందని అర్థమైంది. అదే సమయంలో అసలు ఈ దాడికి కారణమేంటనే చర్చలు జరుగుతున్నాయి. (Manchu Manoj)   తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో.. మనోజ్ కి సత్సంబంధాలు లేవని కొంత కాలంగా ఆ కుటుంబంలో జరగుతున్న పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా, విష్ణు తన వాళ్లపై దాడి చేయడానికి వచ్చాడంటూ మనోజ్ చెప్పినట్టుగా ఉన్న వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. అప్పటినుంచి వీరి మధ్య ఏదో జరుగుతుందనేది అందరికీ క్లారిటీ వచ్చింది. పైగా మనోజ్ పెళ్లి టైంలో కూడా.. ఆయన సోదరి లక్ష్మి తప్ప, మిగతా కుటుంబ సభ్యులంతా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు.   అయితే మంచు కుటుంబంలో విభేదాలకు కారణం.. ఆస్తుల పంపకమే అని తెలుస్తోంది. మోహన్ బాబు ఇప్పటికే ఆస్తులు పంచేశారు. శంషాబాద్ సమీపంలో ఓ ఇల్లు కట్టుకున్న మోహన్ బాబు.. తన జూబ్లిహిల్స్ ఇంటిని కూతురు లక్ష్మికి ఇచ్చేసి వెళ్లిపోయారు. పెద్ద కొడుకు విష్ణు కూడా మోహన్ బాబుతో పాటే ఉంటున్నాడు. మనోజ్ మాత్రం వేరేగా ఉంటున్నాడు. అయితే ఆస్తుల పంపకం విషయంలో అసంతృప్తే.. మనోజ్ దూరంగా ఉండటానికి కారణంగా తెలుస్తోంది.    మోహన్ బాబు కుటుంబానికి ఎక్కువగా ఆదాయం తెచ్చి పెట్టేది విద్యా సంస్థలే. కానీ ఆ విద్యా సంస్థలను మనోజ్ కు కాకుండా చేశారని అంటున్నారు. ఈ క్రమంలో దానిలో హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారని చెబుతున్నారు.    మోహన్ బాబు యూనివర్శిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు.. మనోజ్ భిన్నంగా స్పందించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అండగా ఉంటానని చెప్పడమే కాకుండా.. యూనివర్సిటీ విషయంలో తనకూ బాధ్యత ఉందన్నట్లుగా మాట్లాడాడు. మోహన్ బాబు, విష్ణు మాత్రం.. యూనివర్సిటీతో మనోజ్ కి సంబంధం లేదని వాదిస్తూ ఉండటం వల్ల.. అసలు సమస్య ప్రారంభమయిందని అంటున్నారు.    ఈ అంశంపైనే మోహన్ బాబు నివాసంలో శనివారం రాత్రి సమావేశమయ్యారు. ఆ సమయంలో మాట మాట పెరగడంతో మోహన్ బాబు తన అనుచరుడు, యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ అనే వ్యక్తిని ప్రేరేపించి కుమారుడని కొట్టించారని చెబుతున్నారు. దీంతో మనోజ్ పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రావడంతో తమపైన కూడా మనోజ్ దాడి చేశాడని, మోహన్ బాబు వర్గం ఆరోపించిందట. ఆ తర్వాత ఈ విషయం పోలీస్ కేసుల వరకూ వెళ్తే, కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో.. మనమే మాట్లాడుకొని పరిష్కరించుకుందామని, మనోజ్ ను కన్విన్స్ చేశారట. కుటుంబ వివాదం కావడం, పైగా ఇరు పక్షాలు మాట్లాడుకొని పరిష్కరించుకుంటామని చెప్పడంతో.. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారట.    కానీ ఈ విషయం బయటకు పొక్కింది. మొదట ఈ వార్తలను మోహన్ బాబు వర్గం ఖండించింది. కానీ మనోజ్ గాయాలతో హాస్పిటల్ కి వెళ్లడంతో.. దాడి నిజమేనని అందరూ భావించారు. పైగా, మీడియాతో దాడి గురించి మాట్లాడేందుకు ఇష్టపడని మనోజ్.. మౌనం అర్థాంగీకారం అన్నట్టుగా.. దాడి జరగడం నిజమేనని క్లారిటీ వచ్చేలా చేశాడు.    మొత్తానికైతే యూనివర్శిటీలో భాగం విషయంలో మనోజ్ వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.   
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1' పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచనలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రూపొందిన 'పుష్ప 2' భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి.. భారతదేశ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. (Pushpa 2 The Rule)   'పుష్ప 2' చిత్రం, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టింది. భారత సినీ చరిత్రలో ఇప్పటిదాకా మొదటిరోజు రూ.250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా లేదు. అలాంటిది 'పుష్ప 2' ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ తో చరిత్ర సృష్టించింది. అలాగే రెండు రోజుల్లోనే రూ.449 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. మామూలుగా ఒక సినిమా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది పుష్ప-2 సినిమా మూడో రోజే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి, వేగంగా రూ.500 కోట్లు వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ఈ లెక్కన పుష్ప-2 మూవీ మొదటి వీకెండ్ లోనే రూ.800 కోట్ల క్లబ్ లో చేరి, సరికొత్త చరిత్ర సృష్టించనుంది. అలాగే మరో రెండు మూడు రోజుల్లో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల హీరోగా అవతరించే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలా కురుస్తున్న ఈ వసూళ్ల వర్షం చూస్తుంటే, త్వరలోనే భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప-2 నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.   సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా 'పుష్ప 2' ప్రభంజనం అన్ని చోట్లా కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ గడ్డ మీద ఈ సినిమా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును 'పుష్ప 2'తో అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీలో మొదటి రోజు వసూళ్ల పరంగా 65 కోట్ల నెట్ కలెక్షన్స్ తో జవాన్ సినిమా పేరిట రికార్డు ఉండగా, 72 కోట్లతో ఆ రికార్డును తిరగరాసింది పుష్ప-2. రెండవ రోజు 59 కోట్లు వసూలు చేయగా, మూడవరోజు 74 కోట్ల వసూళ్లతో తన మొదటిరోజు రికార్డుని మించి వసూలు చేసింది. హిందీ గడ్డపై ఇలా రెండు సార్లు హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన చేసిన ఏకైక సినిమాగా 'పుష్ప 2' కొత్త రికార్డు సృష్టించింది. కేవలం డబ్బింగ్ సినిమాతో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా అందరి రికార్డ్స్ ను అల్లు అర్జున్ తిరగరాస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే, ఎవరికి అందనంత ఉన్నత స్థాయికి అల్లు అర్జున్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది.  
మంచు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.  తండ్రి తనని కొట్టాడంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. గాయాలతో పోలీస్ స్టేషన్ కి వచ్చిన మనోజ్.. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా తన కుమారుడిపై ఫిర్యాదు చేయడం విశేషం. ఇలా తండ్రీకొడుకుల పరస్పర ఫిర్యాదులు సంచలనంగా మారాయి. ఆస్తుల వ్యవహారమే ఈ గొడవకు కారణమని సమాచారం.  అయితే మోహన్ బాబు పీఆర్ టీం మాత్రం ఈ వార్తలను ఖండించింది. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదని తెలిపింది. మరి ఈ వార్తలపై మనోజ్ స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. మనోజ్ కూడా ఈ వార్తలను ఖండిస్తాడో లేక దాడి నిజమేనని చెప్తాడో చూడాలి. కాగా, గతంలో సోదరులు విష్ణు, మనోజ్ మధ్య కూడా ఇటువంటి ఘటనే జరిగింది. విష్ణు తన వాళ్లపై దాడి చేయడానికి వచ్చాడంటూ మనోజ్ చెప్పినట్టుగా ఉన్న వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది.
  Pushpa 2: The Rule has been making history right from the start. By raking in a staggering Rs 294 crores worldwide on its opening day, it held the record for being the biggest ever opening-day grosser in the history of Indian cinema.   And now, the action extravaganza from Icon Star Allu Arjun and Sensational Director Sukumar is the fastest one in the history of Indian cinema to reach Rs 500 Cr mark at the worldwide box office. The film was released in theaters on December 5th. It minted Rs 500 Cr by the end of its third day.    This unprecedented run of the movie across languages is stunning everyone.    "THE BIGGEST INDIAN FILM is a WILDFIRE AT THE BOX OFFICE and is SHATTERING RECORDS. Pushpa 2: The Rule is now THE FASTEST INDIAN FILM to collect a gross of 500 CRORES WORLDWIDE," Mythri Movie Makers and Sukumar Writings proudly stated.   Pushpa 2 is an iconic blockbuster. The stature of Telugu cinema has been raised like anything.    
Pushpa 2 The Rule has created huge records on opening day and second day as well. The Allu Arjun starrer has opened to Rs.294 crores gross worldwide on the first day and on second day it grossed Rs.155 crores. Totally, it grossed Rs.449 crores in two days and it is set to cross Rs.500 crores on Day 3.  Movie is getting huge collections in Hindi as the people of North India connected to it in a big way. The movie has collected Rs.131 crores Nett in two days in the circuits. The team has conducted success press meet in Hyderabad celebrating it.    Allu Arjun speaking at the event thanked everyone who worked behind the movie. He stated, "I cannot say anything but thank everyone. He personally thanked Deputy Chief Minister of AP, Pawan Kalyan, calling him, "Kalyan Babai ..." with a smile and said, "Thank you so much." He thanked every state government for helping them in conducting events.  Later, he stated that there will be success events all over India thanking audiences for such a huge positive reception. Earlier, director Sukumar called all his assistants to the stage and spoke about each one of their contribution and thanked them.  Further both of them addressed the family of the victim, who got killed in Sandhya theatre stampede. Allu Arjun apologised and stated that he did not knew about the incident till next morning. He stated that he and his team will take care of the family in future as well. He expressed his shock regarding the incident sharing that he had been to premieres from past 20 years and this is the first time, such unfortunate incident happened at his premiere.  Well, his "Kalyan Babai" reference will end to the feud between his fans and Pawan Kalyan fans, and even reported cold war between Mega and Allu families. 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)నిన్న డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే హిందీ లో కూడా భారీ ఎత్తున విడుదలై అక్కడి సినిమాలకి సవాలు విసురుతు రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. హిందీలో తొలి రోజు 72 కోట్ల రూపాయిల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాలీవుడ్ లోనే హయ్యస్ట్ కల్లెక్షన్ సాధించిన మొదటి మూవీగా నిలవగా ఇప్పుడు రెండవ రోజు యాభై తొమ్మిది కోట్ల రూపాయిల నెట్ కల్లెక్షన్స్ ని సాధించి  టోటల్  రెండు రోజులకి 131 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన ఫస్ట్ హిందీ మూవీ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెండు రోజులకి 449 కోట్ల గ్రాస్ ని సాధించి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ డే కూడా  294 కోట్లు సాధించి ఫస్ట్ ఇండియన్  మూవీగా నిలిచింది.అల్లు అర్జున్ నటన,సుకుమార్(sukumar)దర్శకత్వ ప్రతిభ,అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)నిర్మాణ విలువలు పుష్ప 2 విజయానికి కారణమనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్త మవుతుంది.  
అల్లు అర్జున్‌, సుకుమార్‌ల ‘పుష్ప2’ రెండో రోజూ కలెక్షన్ల మోత మోగించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కలెక్ట్‌ చేయగా, రెండో రోజు రూ.449 కోట్లతో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించి తన స్టామినా ఏమిటో మరోసారి చూపించింది. మొదటి రోజు కలెక్షన్లలో రూ.65 కోట్లతో షారూక్‌ ఖాన్‌ జవాన్‌ బాలీవుడ్‌లో రికార్డు సృష్టించగా దాన్ని పుష్ప2 రూ.72 కోట్లతో క్రాస్‌ చేసేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డబ్బింగ్‌ సినిమా తమిళనాడులో మొదటి రోజు రూ.11 కోట్లు కలెక్ట్‌ చేయడం ఒక రికార్డుగానే చెప్పాలి. ఇక కేరళలో 2024 సంవత్సరానికి పుష్ప2 హయ్యస్ట్‌ కలెక్షన్‌ సాధించిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. అక్కడ మొదటి రోజున రూ.6.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మొదటిరోజే 8 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసి 2024లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన సినిమాగా పుష్ప2 నిలిచింది. ఇక నైజాం ఏరియాలో ఫస్ట్‌ డే రూ.30 కోట్లు కలెక్ట్‌ చేసి ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసుకుంది. అలాగే కృష్ణా జిల్లాలో రూ.4.42 కోట్లు వసూలు చేసి అక్కడ కూడా ఆల్‌టైమ్‌ రికార్డు సాధించింది. దానితోపాటు ఉత్తరాంధ్రలో కూడా మొదటి రోజు రూ.7.78 కోట్లతో ఆల్‌ టైం రికార్డ్‌ సృష్టించింది. సీడెడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రం కాకుండా సోలో హీరో నటించిన సినిమాగా ఫస్ట్‌ డే రూ.12.5 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది పుష్ప2.  మొదటి షో నుంచే ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొదటిరోజు రూ.294 కోట్లు ఫిగర్‌ చూసిన తర్వాత రెండో రోజు నుంచి అంత భారీ కలెక్షన్లు ఉండవు అని అంచనా వేశారు. కానీ, దాన్ని తారుమారు చేస్తూ రెండో రోజు దాదాపు రూ.150 కోట్లు సాధించడం విశేషం. ఇంకా శనివారం, ఆదివారం మిగిలే ఉన్న నేపథ్యంలో పుష్ప2కి తిరుగులేదని రెండో రోజు కలెక్షన్స్‌ ప్రూవ్‌ చేస్తున్నాయి. ఏది ఏమైనా లాంగ్‌ రన్‌లో కూడా ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్లు సాధించే దిశగానే ప్రయాణిస్తోంది. పుష్ప2 కలెక్షన్లు ఇంకా ఏ స్థాయికి వెళతాయో, పుష్పరాజ్‌ ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తాడో చూడాలి. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  బాధ్యతగా చేయమని అప్పగించిన అధికారాన్ని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్నే అవినీతి అంటారు. ‘అవినీతి తిమింగలాలు’ అనే  మాట చాలా సార్లు పేపర్లలో రావటం చదువుతూనే ఉంటాము. మన సమాజంలో చాప కింద నీరులా అల్లుకుపోయిన అవినీతిని నిర్మూలించటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని అరికట్టటం వీలు పడట్లేదు. ఎందుకంటే ఈ అవినీతి అనేది  వ్యవస్థలో కింది నుంచి పై స్థాయివరకూ ఉంది. ఒక సాధారణ క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని ఉన్నత స్థాయి ఉద్యోగులు, నాయకులు,  సంస్థల వరకూ చాలా మటుకు ఈ అవినీతిలో భాగమైపోతున్నారు. "దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు" అన్న చందాన తయారయింది నేటి సమాజం. ఇది ఎంత స్థాయివరకూ ఉందంటే, ఏదైనా వ్యవస్థలో మన పని జరగటానికి, అవినీతిలో మనమూ భాగమైతేనే సాధ్యమవుతుందనే  ఆలోచనా విధానానికి ప్రజలు వచ్చేశారు. అంతలా అవినీతి వ్యవస్థలోకి చొరబడిపోయి  ఇది సర్వసాధారణమే అన్నట్టు మారిపోయింది.   అవినీతి జరగటం వల్ల అర్హులైనవాళ్లు అన్నీ కోల్పోతారు, అనర్హులైనవాళ్లు అవినీతి సాయంతో  అందలమెక్కుతారు. ఇలా అవినీతి  ఎంతోమంది జీవితాలని ఛిన్నాభిన్నం చేసింది, చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న అవినీతిని అరికట్టాలనే ఉద్దేశ్యంతో అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీన జరుపుకుంటున్నారు.  దీని గురించి మరికాస్త విస్తృతంగా తెలుసుకుంటే.. అవినీతి వల్ల కలిగే దుష్ప్రభావాలు.. ప్రజలకి  వ్యవస్థలపై నమ్మకం తగ్గిపోతుంది. న్యాయపాలనను దెబ్బతీసి, పౌరుల స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారుతుంది. సమాజంలో అసమానతలను పెంచుతుంది. ప్రజాస్వామ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ హక్కుల రక్షణలో ఆటంకం ఏర్పడుతుంది,  పేదలకు అవసరమైన సేవలు అందకుండా పోతాయి. ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు తగ్గి, జీవనంలో నాణ్యత తగ్గిపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన సందర్భాలు అరకొర ఉన్నప్పటికీ, అవి సమాజం నుంచి అవినీతిని దూరం చేయలేకపోతున్నాయి. వేళ్లూనుకుపోయిన అవినీతిని మూలాల నుంచి పెకిలిస్తే తప్ప దాన్ని నాశనం చేయలేము. అవినీతి అనేది సాధారణంగా తీసుకోవాల్సిన విషయం కాదని, దాని వల్ల సమాజానికి ఎంత నష్టమో, నైతికత, న్యాయం ద్వారా చట్టబద్దంగా అవినీతిపై పోరాడటం ఎలాగానే  విషయాన్ని  ప్రజలకి అర్ధమయ్యేలా చెప్పాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అవినీతి గురించి అవగాహన పెంచడం, నిజాయితీ, బాధ్యత అనే నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించి, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే  లక్ష్యంగా  ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  రిజల్యూషన్ 58/4 ద్వారా,  2003వ సంవత్సరం నుంచి డిసెంబర్ 9వ తేదీని ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా’ ప్రకటించింది. ఈ దినోత్సవం, అవినీతి సమస్యలపై అవగాహన పెంచడంలో, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. 2024.. థీమ్.. 2024వ సంవత్సరానికిగానూ  "అవినీతి వ్యతిరేక పోరాటంలో  యువతతో ఐక్యం కావటం,  రేపటి నైతికతను నిర్మించడం".అనే థీమ్ లక్ష్యంగా ఉంది.  అవినీతి వల్ల జరిగే చెడు  ప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించి, వారిని  అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తారు.  యువతను నిర్ణయాలు తీసుకునే అధికారులతో చర్చలు జరిపేలా ప్రోత్సహిస్తారు. యువత భాగస్వామ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జరిగే అవినీతిని నిర్మూలించే లక్ష్యంగా పనిచేస్తారు. భారతదేశంలో అవినీతి వ్యతిరేక చర్యలు: భారతదేశంలో అవినీతి నియంత్రణ కోసం వివిధ చట్టాలు, సంస్థలు అమల్లో ఉన్నాయి.  ఉదాహరణకు లోక్‌పాల్, సి‌వి‌సి,  సీబీఐ వంటి సంస్థలు అవినీతికి పాల్పడినవారికి తగిన శిక్ష పడేలా చేస్తాయి.  అవినీతి వ్యతిరేక ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు కూడా  దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతమున్న అవినీతి వ్యతిరేక చట్టాలు, విధానాలు: అవినీతి నిరోధక చట్టం, 1988: అవినీతి నిర్వచనాలు, దోషులకు శిక్షలు ఇందులో ఉంటాయి. భారతీయ న్యాయ సంహిత, 2023: అవినీతి,  లంచాలపై నూతన నిబంధనలు ఉన్న చట్టమిది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013: అవినీతి నిర్మూలనపై ప్రజా బాధ్యతను పెంచటానికి చేసిన చట్టం. విశిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ చట్టం, 2014: అవినీతి విషయాలను బట్టబయలు చేసిన వారిని రక్షించే చట్టం.   ఇతర చట్టాలు: మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002,  బెనామీ లావాదేవీలు చట్టం,1988,  బ్లాక్ మనీ, పన్ను విధానం చట్టం,2015. చట్టాలు అమలు చేసే సంస్థలు: * కేంద్ర విజిలెన్స్ కమిషన్: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి నివారణ,  పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. * సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్: అవినీతి సంబంధించిన ప్రధాన కేసులు విచారణ చేస్తాయి. * స్టేట్ ఏంటీ కరప్షన్ బ్యూరోలు: రాష్ట్ర స్థాయి కేసుల పరిశీలన చేస్తాయి. అవినీతి అవగాహన సూచిక:  ‘ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ సంస్థ, ప్రతి సంవత్సరం అవినీతి అవగాహన సూచికను ప్రచురిస్తుంది.  ఇందులో ఒక  సూచీ ప్రకారం ఒక దేశానికి సున్నా నుండి వంద  వరకు కొన్ని పాయింట్లను ఇస్తారు. వాటి ఆధారంగా ఒక దేశ స్థానం నిర్ణయిస్తారు. [సున్న(అతి ఎక్కువ అవినీతి), వంద(అతి తక్కువ అవినీతి)]  2023లో భారతదేశానికి  మొత్తం 180 దేశాలలో 93వ స్థానం లభించింది.   మన దేశానికి దక్కిన ఈ స్థానం, మన దేశంలో  అవినీతి నిర్మూలనకి మరింత బలమైన చట్టాలు, విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని  సూచిస్తోంది. అవినీతి నిర్మూలన కోసం ఏం చేయాలి? యువత ప్రోత్సాహం:  అవినీతి రహిత భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్రను గుర్తించాలి. గ్లోబల్ ఐక్యత:  అంతర్జాతీయంగా దేశాల మధ్య అవినీతి నిర్మూలనలో సహకారాన్ని పెంపొందించాలి. చట్టపరమైన సంస్కరణలు: అవినీతి అవగాహనా సూచికలో వెనుకబడిన దేశాలన్నీ  మరింత కఠినమైన చట్టాలను ఆమోదించేలా కృషి చేయాలి. పాలనా వ్యవస్థ మెరుగుదల:  ప్రభుత్వ ఆచరణాత్మకతను పెంపొందించాలి. ప్రజలకి వ్యవస్థలపై నమ్మకం కలగాలన్నా, శాంతి, భద్రతలకి ఆటంకం కలగకుండా,   సమాజ అభివృద్ధి లక్ష్యాలు నెరవేరాలన్నా, అవినీతి రహిత సమాజం కోసం అందరం కలసికట్టుగా  పని చేయాలి.  అప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రతీ పౌరుడు తన అవసరం కోసమో, స్వార్ధ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అవినీతికి పాల్పడకుండా ఉంటూ, అలా పాల్పడేవారిని నివారించటం చేస్తే మనం కలలు కంటున్న అవినీతి రహిత సమాజాన్ని తొందరలోనే చూడగలమని ఆశిద్దాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఆశ చూపించినా నైతికతని  కోల్పోకుండా, అధికార దుర్వినియోగం చేయకుండా, తమ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ,  సమాజ శ్రేయస్సు కోసం తన శక్తికి మించి శ్రమిస్తున్న ప్రతీ వ్యక్తిని ఈ సమాజం గౌరవించి, ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే అవినీతిని అంతం చేయడం సాధ్యమవుతుంది.                                                  *రూపశ్రీ.
  విదురుడు ధృతరాష్ట్రునికి తమ్ముడు.  ఈయన దాసికి జన్మించిన వాడు కావడంతో రాజు కాలేకపోయాడు. అయితేనేం ధృతరాష్ట్రుని వద్ద మంత్రిగా ఉండేవాడు. విదురుడు న్యాయశాస్త్రాలు అవపోశన పట్టాడు. నీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు.  మహారాజు ధృతరాష్ట్రుడికి,  విదురుడికి మహా భారత యుద్దం ముందు కొన్ని చర్చలు సాగాయి.అందులో భాగంగా విదురుడు చెప్పిన కొన్ని నీతి వాక్యాలు, విషయాలు విదుర నీతి పేరుతో ప్రసిద్ధి కాంచాయి.  చాణక్య నీతి లాగా విదుర నీతిని పాటించిన వారు జీవితంలో ఉత్తములుగా ఉంటారట. విదురుడు చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే  విజేతలు కావడం తథ్యం అంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. జ్ఞానం.. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు. తన సామర్థ్యం ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకుని తన జ్ఞానాన్ని గుర్తించి దాన్ని సరైన సమయంలో సరైన స్థలంలో  ఉపయోగించుకునే వాడే నిజమైన జ్ఞాని అని విదురుడు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి తను ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని చేరుకుని కచ్చితంగా విజేత అవుతాడట. మూర్ఖుడు.. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తితో పాటు మూర్ఖులు కూడా ఉంటారు.  అసలు మూర్ఖుడు అనే విషయాన్ని నిజమైన మూర్ఖుడు కూడా ఒప్పుకోడు.  ప్రతి ఒక్కరూ తాము చాలా జ్ఞానవంతులం అనే అంటారు.  కానీ విదురుడు చెప్పాడు నిజమైన మూర్ఖుడు అంటే ఎవరో.. పిలవకుండానే లోపలికి వచ్చేవాడు.. అడగకుండానే మాట్లాడేవాడు  మూర్ఖుడు అని విదురుడు అన్నాడు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలట. పనులు.. ఏ పనులు చెయ్యాలి.. ఏ పనులు చెయ్యకూడదు అనే విషయంలో కొంత స్పష్టత ఉండటం అవసరం. వ్యక్తి చేసే పనే ఆ వ్యక్తిని ఉత్తముడిగా నిలబెడుతుంది.  మనసుకు, శరీరానికి బాధ కలిగించే డబ్బు సంపాదన,  లేదా మతాన్ని ఉల్లంఘించే పని చేయడం ఎప్పుడూ తప్పు పని కిందే లెక్క వస్తుందట.  అంతే కాదు.. ఏదైనా బెనిఫిట్ కలుగుతుంది అంటే శుత్రువు ముందు అయినా సరే..  తల వంచే పనులు ఎప్పటికీ చేయకూడదు అని విదురుడు చెప్పాడు.   తెలివి.. తెలివైన వ్యక్తులు ఎవరు అంటే అందరూ మేమంటే మేము అని అనుకుంటారు. కానీ తెలివైన వ్యక్తులు అంటే జ్ఞానం కలిగిన వారు.. ఇలాంటి వ్యక్తులు ఏ పనిని అయినా, ఏ విషయాన్ని అయినా తొందరగా అర్థం చేసుకుంటారు. అవతలి వ్యక్తి మాటలను ఎంతో శ్రద్దతో,  ఓర్పుతో వెంటాడు.  ఏ ఉద్దేశ్యం లేకుండా మాట్లాడని వారు తెలివైన వారు.  ముఖ్యంగా తమ సమయాన్ని వృధా చేసే విషయాల పట్ల దూరంగా ఉండేవాడు నిజమైన తెలివిగల వాడు అని విదురుడు చెప్పాడు.  ప్రతి వ్యక్తి ఈ పనులన్నీ అలవాటు చేసుకుని పైన చెప్పుకున్నట్టు ఉంటే.. ఆ వ్యక్తులు జీవితంలో    తలపెట్టిన ఏ పనిలో అయినా విజయం సాధించడం ఖాయం అంట.                                              *రూపశ్రీ.  
సాయుధ దళాల జెండా దినోత్సవం 2024 మనం రోజూ అనుభవించే ఎన్నో సౌకర్యాలు, సుఖాలు  ఉండకపోయినా,  రాత్రనక, పగలనక  గడ్డ కట్టించే మంచుపర్వతాలలో, మండించే ఎడారిలో పనిచేస్తున్న ఆర్మీ,  తీరప్రాంతానికి ఏ ప్రమాదం చేరకుండా సముద్రం  మద్యలో అడ్డుగోడలా నిలబడి రక్షిస్తున్న నేవీ,  దేశ రక్షణ కోసం గగన మార్గంలో కూడా డేగ కళ్ళతో తిరుగుతూ ఏ ప్రమాదమూ మన దేశపునెత్తి మీద పడకుండా రక్షిస్తున్న ఎయిర్ఫోర్సుల్లో  ప్రతీ  సైనికుడు నిస్వార్ధంగా పనిచేస్తున్నాడు అంటే దానికి కారణం, వాళ్ళు ఈ దేశాన్ని ఒక తల్లిగా,  దేశంలోని పౌరులందరినీ  తమ కుటుంబంగా  భావించి,  మనల్ని  ఇంట్లో సుఖంగా పడుకోనిస్తూ,  వాళ్ళుమాత్రం  ఇంటి బయట అహర్నిశలు కాపు కాస్తున్నారు.      అలా నిస్వార్ధంగా, నిర్భయంగా  మనందరి కోసం ప్రతీ సైనికుడు అక్కడ పనిచేస్తున్నారు అంటే, వారి వెనుక త్యాగం చేసే ఒక కుటుంబం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం తన బిడ్డని సమర్పించింది. మరి అలాంటప్పుడు ఆ సైనికుడి మీదైనా, అతని కుటుంబం మీదైనా బాధ్యత  మనందరికీ  ఉంటుంది. ఒక సైనికుడికి  కష్టం వస్తే దేశమంతా ఏకమై కుటుంబంలా నిలబడుతుందన్న నమ్మకాన్ని  సైనికుల్లో కలిగించటానికి, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ,  ఒక కుటుంబంగా వారికి అండగా నిలబడటానికి ఈ సాయుధ దళ దినోత్సవం జరుపుకోవటం మొదలుపెట్టారు.  సాయుధ దళాల జెండా దినోత్సవం: చరిత్ర భారత సాయుధ దళాలయిన   ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో చేరి,  మన దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడుతున్న, పోరాడి అమరులయిన  సైనికులను  గౌరవించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరుపుకుంటారు. సైనిక సిబ్బంది, వారి కుటుంబ  సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరపటమనేది డిసెంబర్ 7, 1949 నుంచి మొదలైంది. ఈ రోజున  దేశంలోని శాంతి, స్వేచ్ఛ,  భద్రతను కాపాడడంలో సైనికులు చేసిన  త్యాగాలను, దేశ రక్షణలో  వారికున్న అంకితభావాన్ని గుర్తించి, గౌరవిస్తారు.  అదనంగా, వారి  సంక్షేమానికి నిధులను సమీకరించడం జరుగుతుంది.  సాయుధ దళాల జెండా దినోత్సవం ప్రాముఖ్యత:  ప్రత్యేకమైన ఈరోజున  పౌరులంతా,   రక్షణ దళాలు, వారి కుటుంబాల పట్ల తమకున్న  కృతజ్ఞతను వ్యక్తపరిచే అవకాశం పొందుతారు. ఈ రోజున అందించే దేశ పౌరులు వివిధ రూపాల్లో  అందించే విరాళాలను  మాజీ  సైనికులు, యుద్ధ వితంతువులు, వికలాంగులైన సైనికుల  పరిస్థితిని మెరుగుపర్చటానికి ఉపయోగిస్తారు. ఇలాంటి ఒక దినోత్సవం జరుపుకోవటం వల్ల  సైనిక సిబ్బందికి,  పౌరులకి  మధ్య ఉన్న బంధం  బలోపేతం అవుతుంది.   పౌరులందరిలోనూ  ఐక్యత, దేశభక్తి భావనలను ప్రోత్సహిస్తుంది.   సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు? భారత సైనిక సిబ్బంది సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఉత్సవాలు, ఇతర వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా రెడ్, బ్లూ, లైట్ బ్లూ  రంగులతో కూడిన త్రివర్ణ జెండాలు (భారత సైన్యం యొక్క మూడు విభాగాలను సూచిస్తూ) పంపిణీ చేస్తారు. పౌరులంతా  ఈ జెండాలను ధరించడం వీరులను గౌరవించడానికి ఒక  ప్రతీక అవుతుంది.  ప్రధాన లక్ష్యాలు: 1.    భారత సాయుధ దళాల అంకితభావం,  త్యాగాలను గుర్తించి, గౌరవించటం.  2.    అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు,  దివ్యాంగ సైనికుల సంక్షేమం కోసం నిధులను సమీకరించడం. 3.    దేశ రక్షణలో పాల్గొనే వారికి మద్దతు అందించడంలో పౌరుల బాధ్యతను ప్రేరేపించడం. సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి :   రక్షణ మంత్రిత్వ శాఖ కమిటీ,  1949లో సాయుధ దళాల జెండా దినోత్సవ నిధిని సృష్టించింది. 1993లో, యుద్ధ బలిదాన దాతల నిధి, కేంద్ర సైనిక్ బోర్డ్ నిధి, మాజీ సైనికుల సంక్షేమ నిధి, ఇతర విభాగాలకు సంబంధించిన నిధులన్నింటినీ కలిపి ఒకే నిధిగా, ‘సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి’గా మార్చింది.   నిధి ఉపయోగాలు: •    అమరవీరుల కుటుంబాలకి, యుద్ధంలో గాయపడి  వికలాంగులైన   సైనికులకు మద్దతు ఇస్తారు.  •    మాజీ సైనికుల జీవన పరిస్థితి మెరుగుపర్చటానికి  ఆర్థిక సహాయం అందిస్తారు. •    సైనికుల పిల్లల విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం చేసి, వారి భవిష్యత్తుకి భరోసా ఇస్తారు.    అయితే ఈ ‘సాయుధ దళాల జెండా దినోత్సవం’ అనేది కేవలం ఆర్థిక మద్దతు ఇవ్వడానికి మాత్రమే కాదు,   ఇది ఐక్యత, గౌరవం, జాతీయ గర్వానికి ప్రతీక. ఈ రోజున పౌరులు సైనికుల సంక్షేమంలో అందరూ చురుకుగా పాల్గొని, దేశం కోసం  త్యాగాలు చేసిన వీరుల పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేయటం గొప్ప విషయం. మనల్ని తమ కుటుంబంగా భావించి కాపాడుతున్న ప్రతీ వీర సైనికుడిని, మనం కూడా  మన ఇంటి బిడ్డగా భావించి వారి కష్ట, నష్టాల్లో పాలుపంచుకుని, అందరం ఐకమత్యంగా ఉందాం. అప్పుడే మన భారతదేశానికున్న   వసుదైక కుటుంబ భావనని నిలబెట్టినవాళ్ళమవుతాం.                                           *రూపశ్రీ .  
ప్రతి సీజన్ శారీరంగా కొన్ని సవాళ్లను వెంట బెట్టుకుని వస్తుంది. వేసవి కాలం రాగానే ఎక్కడ వడదెబ్బ కొడుతుందో.. ఎక్కడ శరీరం నీరస పడిపోతుందో అని అల్లాడిపోతారు ప్రజలు.  ముఖ్యంగా శరీరానికి తగినంత నీటి అవసరాన్ని తీర్చడానికి నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీరు.. నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు.. ఇలా చాలా తీసుకుంటారు. కానీ చలికాలం దగ్గరకు వచ్చే సరికి సీన్ మారిపోతుంది.  నీరు తాగాలన్నా,  నీరు అధికంగా ఉన్నపండ్లు తినాలన్నా అస్సలు ఇష్టపడరు.  దీని వల్ల కొంప కొల్లేరు అవుతుందని చాలా మంది తెలుసుకోరు.  వేసవి కాలంలో కంటే చలికాలంలోనే నీరు తాగడం తగ్గుతుంది.  ఇది చాలా ప్రమాదరమైన పరిస్థితి. చలికాలంలో కూడా కనీసం 2 నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు వైద్యులు. చల్లటి వాతావరణంలో కూడా శరీరాన్ని ఎనర్జిటిక్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. శరీరం డీహైడ్రేట్ అయితే.. శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మూత్రం ముదురు రంగులో ఉంటుంది.  కళ్లు తిరగడం, చర్మం పొడిబారడం, తలనొప్పి, అలసట, బలహీనత,  పెదవులు పగిలిపోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. వేసవిలో మాత్రమే కాకుండా శీతాకాలంలో కూడా హైడ్రేట్ గా ఉండటం,  శరీరానికి  శక్తి అధికంగా ఇచ్చే ఆహారాలు తినడం చేయాలి. చలికాలంలోనే కాదు వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే  ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది  హైడ్రేటెడ్‌గా అనిపిస్తుంది,  శరీరం శక్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల  జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇందులో నిమ్మ, పుదీనా, తేనె వంటి సహజసిద్ధమైన పదార్థాలను కలుపుకుని కూడా తాగవచ్చు. హైడ్రేటెడ్ గా ఉండటానికి ఆహారంలో నీరు మాత్రమే కాకుండా నీరు అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలను కూడా చేర్చుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి.  రోజువారీ ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, నారింజ, ఆకుకూరలు  టమోటాలు తీసుకోవాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఎల్లప్పుడూ వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి.  ఎక్కడికైనా బయటకు వెళ్లినా..  బ్యాగ్‌లో లేదా కారులో బాటిల్ ఉంచుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు నీరు త్రాగడానికి  గుర్తు చేస్తు ఉంటుంది. ప్రతిసారీ నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా వ్యాయామం తర్వాత వాటర్ బాటిల్‌లో ఎలక్ట్రోలైట్స్ కలిపి తాగడం వల్ల ఎఫెక్టివ్ హైడ్రేషన్ లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొంచెం నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రాత్రంతా  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీరు త్రాగవద్దు. లేకుంటే  నిద్రలో పదేపదే బాత్రూమ్‌కు వెళ్లవలసి ఉంటుంది, దీని కారణంగా  నిద్రకు భంగం కలగవచ్చు. అదే సమయంలో ఆహారం తీసుకునే ముందు 1 గ్లాసు నీరు త్రాగాలి. ఇలా నీరు తాగుతుంటే శరీరం చలికాలంలో కూడా హైడ్రేట్ గా ఉంటుంది.                                                              *రూపశ్రీ.  
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు.  ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు పండ్లు లేదా పండ్ల రసం ఇస్తుంటే చాలా తొందరగా కోలుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.  మంచి ఆరోగ్యం కోసం పండ్లు, పండ్ల రసాలు తీసుకోమని వైద్యులు కూడా చెబుతారు. చాలా మంది పండ్ల రసాలు తాగాలని అనిపిస్తే  సింపుల్ గా ఫ్రూట్ జ్యూస్ షాప్ కు వెళ్లి తాగేస్తుంటారు.  మరికొందరు ఓపికగా ఇంట్లోనే జ్యూస్ చేసుకుంటారు. అయితే జ్యూస్ తాగే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పండ్ల రసం చాలా వరకు బయట తాగడం చాలామంది అలవాటు.  అయితే పండ్ల రసం తాగే దుకాణం శుభ్రతగా ఉందా లేదా గమనించాలి. శుభ్రత లేని చోట  పండ్ల రసాలు తాగితే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. కేవలం ఆ దుకాణం మాత్రమే కాదు.. చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా శుభ్రతగా లేకుంటే  ఆ దుకాణాలలో జ్యూస్ లు తాగడం మంచిది కాదు. జ్యూస్ తాగేముందు అక్కడే అప్పటికప్పుడు తాజాగా తయారు చేసిన జ్యూస్ ను మాత్రమే తాగడం మంచిది. ముందే జ్యూస్ జార్ లేదా గిన్నెలలో నిల్వ ఉంచిన జ్యూస్ ను అస్సలు తాగకూడదు. అలాంటి జ్యూస్ లో  బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ తాజా పండ్ల జ్యూస్ ను మాత్రమే రికమెండ్ చేయాలి. పండ్ల జ్యూస్ లు అమ్మే షాపులలో  కొన్నిసార్లు ముందే పండ్లను కట్ చేసి ఉంటారు. అలాంటి పండ్ల నుండి జ్యూస్ ను తయారు చేయించుకోకూడదు. తాజాగా కట్ చేసిన పండ్ల నుండే జ్యూస్ ను చేయించుకోవాలి.  ముందే కట్ చేసిన పండ్లలో కొన్ని సార్లు చెడి పోయిన పండ్లను కొంత భాగం కట్ చేసి పెట్టుకుని ఉంటారు.  ఇది బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పండ్ల రసం తయారు చేసేవారు జ్యూస్ మరింత రుచిగా,  తాజాగా ఉండటం కోసం జ్యూస్ లో ఏదైనా రసాయనాలు లేదా పౌడర్ లేదా లిక్విడ్స్ మిక్స్ చేస్తుంటారు.  కొన్నిసార్లు రంగు కూడా జోడిస్తూ ఉంటారు. అలాంటి చోట జ్యూస్ అస్సలు తాగకూడదు. వాడిపోయిన,   పాతబడిన కాయలతో ఫ్రూట్ జ్యూస్ లు తయారు చేసి అమ్ముతుంటారు. అలాంటివి నివారించాలి. వీటిలో నీటి శాతం ఏమీ ఉండదు. పై పెచ్చు కార్బోహేడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి.  వీటిలో పోషకాలు ఏమీ ఉండవు.  ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి కావు.                                                 *రూపశ్రీ.
  చేపలు చాలా శక్తి వంతమైన ఆహారం.  సమతుల ఆహారంలో చేపలకు కూడా స్థానం ఉంది. చేపలను తీసుకుంటే శరీరానికి ప్రోటీన్, విటమిన్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి.  వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెబుతారు. అయితే చేపల కంటే ఎక్కువ పోషకాలు ఉన్న గింజలు ఉన్నాయి. ఈ గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే 10 రెట్ల పోషకాలు లభిస్తాయట. ఇంతకీ ఇవేం గింజలు.  వీటి ప్రయోజనాలేంటి తెలుసుకుంటే.. గుమ్మడి.. గుమ్మడి కాయ వినియోగం భారతదేశంలో ఎక్కువ.  గుమ్మడి కాయను కట్ చేసిన తరువాత చాలా మంది అందులో విత్తనాలు పడేస్తుంటారు. అయితే గుమ్మడి గింజలు పోషకాల నిధి.  గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే అధిక శక్తి,  శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయట. 100 అత్యంత శక్తివంతమైన ఆహారాల జాబితాలో గుమ్మడి గింజలు ఆరవ స్థానం పొందాయి.  ఇక ఎంతో మేలు అని చెప్పుకునే చేపలు 77వ స్థానంలో నిలిచాయి. గుమ్మడికాయ గింజలలో పోషకాల విలువ 84 అయితే.. చేపలలో ఎంతో మంచిదని చెప్పుకునే సాల్మన్ చేపల పోషక విలువ 52 మాత్రమే. అందుకే గుమ్మడికాయ గింజలను అస్సలు మిస్ చేసుకోకుండా తినమని చెబుతున్నారు. పోషకాలు.. గుమ్మడికాయ గింజలలో ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలో ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. గుమ్మడి గింజలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్ట్ బీట్ ను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజలలో ఉండే ఒమేగా-3,  ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు మంటను తగ్గించి,  చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.  మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరానికి  ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. విటమిన్ ఇ వాపును తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్,  విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. మెగ్నీషియం, భాస్వరం,  జింక్ ఎముకల సాంద్రతను పెంచడానికి,  బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి చాలా అవసరం. ఈ మూడు మూలకాలు గుమ్మడి గింజల్లో మంచి పరిమాణంలో ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. గుమ్మడికాయ గింజలు ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి.   డయాబెటిస్ సమస్యలను నివారిస్తాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్,  ఫైబర్ ఆకలిని నియంత్రిస్తాయి, తద్వారా బరువును నియంత్రిస్తాయి. ముఖ్యమైన  విషయం ఏమిటంటే 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 164 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంటే ఇందులో కేలరీలు తక్కువ.                                             *రూపశ్రీ.