బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు. బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతామన్న లోకేష్.. ఏపీలో బెట్టింగు యాప్‌ల నిషేధానికి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఈ విధారం దేశానికే ఆదర్శంగా ఉండేలా ఉంటుందని చెప్పారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. అనేక మంది బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై ఆర్దికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్‌లలో జూదం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని, ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని ట్వీట్ చేశారు.
ఏటీఎం లేని దేశం ఉంటుందంటే నమ్ముతారా? కానీ ఇంతకాలం ఏటీఎం లేని ఆ దేశంలో మొట్టమొదటి ఏటీఎం ఇప్పుడే ప్రారంభించారు. మన దేశంలో ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచి మేనేజరో, ఇతర అధికారో వెళ్తారు. కానీ, పసిఫిక్‌ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని  ప్రారంభోత్సవానికి..  ఏకంగా ప్రధానే హాజరయ్యారు. పెద్ద కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఆ దేశంలో అదే తొలి ఏటీఎం మరి. అదే తువాలు దేశం. ఇది ఆస్ట్రేలియా-హవాయి మధ్య తొమ్మిది ద్వీపాలతో కలిసి ఏర్పడింది. దాదాపు 11,200 మంది జనాభాతో 10 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇక్కడ ఏప్రిల్‌ 15న తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరయ్యారు. దేశ చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణించారు. ఇది దేశానికి గొప్ప విజయమని.. మార్పునకు అవసరమైన కీలక స్విచ్‌ అని వక్తలు అభివర్ణించారు. పసిఫిక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థ దీని తయారీకి నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ తువాలుకు సాయం చేసింది. ఇటీవల కాలంలో సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో తువాలు రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. భావి తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా డిజిటల్‌ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్‌ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేసుకుంది.
  గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం  గౌరవ వేతనం చెల్లించడానికి రూ.30 కోట్లు విడుదల చేసింది. పాస్టర్లకు ఏడు నెలల పాటు మే 2024 నుండి నవంబర్ 2024 వరకు నెలవారీ గౌరవ వేతనం చెల్లించాలని మైనారిటీల సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉత్తర్వు  జారీ చేసింది. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది. 2023 జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు ఆయన హామీ ఇచ్చారు.  ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది. రాష్ట్రంలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రతి నెలా గౌరవ వేతనం కోసం నిధులు విడుదల చేయాలని.. లేకపోతే కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. పాస్టర్లకు  గౌరవ వేతనం సీఎం చంద్రబాబు ప్రకటించటంతో ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వం కొట్టేసిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం రాష్ట్రంలో క్రిస్టియన్స్ కూటమి ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదన్ని హత్యగా చిత్రకరించి వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూసింది వారి ఆశలు అడియాశలయ్యాయి. ఏపీలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ వేతనం ప్రకటించడంతో కూటమి ప్రభుత్వన్నికి క్రైస్తవుల్లో సానుభూతి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు  ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లు వైఎస్ జగన్ వ్యూహానికి చెక్ పెట్టారు.
ALSO ON TELUGUONE N E W S
  Cast: Akshay Kumar, Simon Paiseley Day, R Madhavan, Ananya Panday, Regina Cassandra, Amit Sial, Alexx O’Nell, Steven Hartley, Krish Rao Crew:  Based on The Case That Shook The Empire by Raghu Palat and Pushpa Palat Written by Karan Singh Tyagi, Amritpal Singh Bindra, Sumit Saxena  Cinematography by Debojeet Ray Edited by Nitin Baid  Music by Shashwat Sachdev Directed by Karan Singh Tyagi Produced by Hiroo Yash Johar, Aruna Bhatia, Karan Johar, Adar Poonawalla, Apoorva Mehta, Amritpal Singh Bindra, Anand Tiwari  Akshay Kumar has made it normal in recent times to make films based on historical events in Indian history and biopics with real life incidents as story elements. Another such attempt and second one from a franchise that producers hope to see blossom, Kesari Chapter 2. The movie talks about Jalianwala Bagh massacre from a court room drama purview. Interestingly, Madhavan joined the forces with Akshay Kumar and let's discuss about the film, released on 18th April, in detail. Plot:  Sankaran Nair (Akshay Kumar) is a celebrated lawyer or barrister (appropriate for the time) rises to knighthood under British Regime in 1910's. The genius lawyer hailing from Kerala, is known to be ruthless and has zero losses to his name. He proves a poet Kartal Singh as a terrorist and due to the poet's 13-year old son, Prabat Singh (Krish Rao), a survivor of Jalianwala Bagh massacre, he decides to sue to the crown in legal battle.  Punjab Province Governor, Michael O'Dwyer,  who used to be his thick friend, decides to turn against him and brings in half-Indian half-British Advocate Neville McKinley (Madhavan). Triath Singh (Amit Sial), trusted associate of Governor, tries to save General Reginald Dryer (Simon Paisley Day) as a warrior of British. How Sankaran Nair with a rookie lawyer Dilreet Gill (Ananya Panday) as his co-counsel turned the tide against Dryer is the film.  Analysis:  Sardar Uddam Singh film depicted the Jalianwala Bagh massacre in a Heart-touching manner and even a film like Rang De Basanti, did it effectively. Director Karan Singh Tyagi trying to establish an emotional connect tries to go over melodramatic route and we end up feeling the incident being dragged rather than impactful. This extensively used troupe of melodrama for the sake of it dulls the momentum straight away.  When talking about a lesser known person from Indian history, there is a necessary to introduce the character without standard heroic lines and rather with utmost care and sincerity about the real person. By casting Akshay Kumar in a Malayalee native person's role itself, the makers have taken a flawed decision and this kind of commercial formulaic bumps are expected. Still, Mission Mangal kind of films tried to be grounded yet this one tries to force a connection with Kesari.  Randomly, we see popular Kesari song Teri Mitti playing and Akshay Kumar wearing "Kada". Sankaran Nair, as a character itself, never gets defined rather he feels like another tailor made Akshay Kumar biopic character. Even he performs in the similar way, we see Akshay more or less than Sankaran Nair. A more potent attempt like in Jolly LLB 2, to play a different character, could have at least brought out some novelty to Akshay alas that is not the case.  Madhavan again proves how good a performer he is, by giving some amount of depth to a rather caricaturish character. Ananya Panday made sincere efforts in this one but again writing is monotone for her too. In trying to showcase someone as negative, you don't have to make them caricatures. General Dryer, a complicated person, who did unthinkable gets a Hitler like caricaturish arc.  Even if film claims are true, a character cannot just be simply bland. The court room scenes seem to be inspired from "A Few Good Men" and many scenes look to have been written to just somehow make jingoistic sentiment work.  Akshay Kumar's performance has some merit along with good BGM and Production values but film ends up being another bland attempt by the lead actor.  In Conclusion:  Engaging in parts but sticks to commercial formula with less wit and conviction.  Rating: 2.25/5  Disclaimer: The views expressed in this review are reviewer's personal opinion. The organisation takes no responsibility and recommends viewer discretion.
చియాన్ విక్రమ్(Vikram)తంగలాన్' లాంటి యాక్షన్ అడ్వెంచర్ మూవీ తర్వాత 'వీరధీరశూర పార్ట్ 2(Veera Dheera Soora)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27 న రిలీజ్ కాగా తెలుగుతో పాటు తమిళంలోను బాగుందనే టాక్ ని తెచ్చుకుంది. విక్రమ్ సరసన దుషారా విజయన్(Dushara Vijayan)జత కట్టగా ఎస్ జె సూర్య,(sj Surya)థర్టీ ఇయర్స్ పృథ్వీ, సూరజ్ వెంజరమోడు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కి సిద్దమయ్యింది. ఏప్రిల్ 24 నుంచి 'అమెజాన్ ప్రైమ్' వేదికగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారకంగా ప్రకటించడంతో ఓటిటి మూవీ లవర్స్ కి సరికొత్త పండుగ వచ్చినట్లయింది. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియాషిబు, షిబు తామీన్స్ 'వీరధీరశూర పార్ట్ 2 'ని   నిర్మించగా 'ఎస్ యు అరుణ్ కుమార్' దర్శకుడుగా వ్యవహరించాడు. సుమారు 55 కోట్లరూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 65 కోట్లు దాకా వసూలు చేసింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే రౌడీయిజాన్ని వదిలేసిన కాళీ తన భార్య బిడ్డలతో కలిసి ఒక చిన్న కిళ్ళీ షాప్ పెట్టుకొని ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కాని గతంలో ఎవరి దగ్గర అయితే పని చేసాడో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అరుణ గిరి ని చంపాలని చెప్తాడు. అందుకే కాళీ ఒప్పుకుంటాడు. పాత జీవితాన్ని వదిలేసిన కాళీ ఎందుకు అరుణ గిరి ని చంపటానికి ఒప్పుకున్నాడు?  నిజంగానే ఎస్ పి ని చంపుతాడా? లేదా? అనేదే ఈ కథ. కాళీ క్యారక్టర్ లో విక్రమ్ మరోసారి తన కెరీర్ లో అత్యుత్తమ నటన కనపర్చాడు. అరుణ గిరి గా ఎస్ జె సూర్య కూడా ఏ మాత్రం ఎనర్జి తగ్గకుండా నటించాడు. ఈ మూవీకి పార్ట్ 1 కూడా ఉంది. మేకర్స్ ముందుగా పార్ట్ 1 రిలీజ్ చెయ్యకుండా పార్ట్ 2 రిలీజ్ చేసారు.    
చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఎంతో సర్వసాధారణ విషయం. ఎప్పుడు ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకుంటారో.. పెళ్లి చేసుకున్న జంటలు ఎప్పుడు విడాకులు తీసుకుంటారో ఎవరికీ తెలీదు. నటీనటులు తమ సహచరుల్ని పెళ్లి చేసుకోవడం, కొంతకాలం వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడం మనం చూస్తున్నాం. ఇటీవలికాలంలో ఇలా విడిపోతున్న జంటల సంఖ్య పెరుగుతోంది. తాజాగా హీరోయిన్‌ నజ్రియా నజీమ్‌ కూడా భర్త ఫహద్‌ ఫాజిల్‌ నుంచి విడిపోతోందా అనే ప్రచారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది.  2014లో తన కంటే దాదాపు 12 సంవత్సరాలు వయసులో పెద్దవాడైన నటుడు ఫహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్నారు నజ్రియా. బెంగళూరు డేస్‌ చిత్రంతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె తమిళ్‌లో చేసిన రాజా రాణి చిత్రంతో మరింత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై ఘనవిజయం సాధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు అభిమానులు పెరిగారు. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి ఉంటే తెలుగులో కూడా బిజీ హీరోయిన్‌ అయి ఉండేది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నజ్రియా చివరి పోస్ట్‌ గత డిసెంబర్‌లో చేసింది. అప్పటి నుంచి ఎవరికీ అందుబాటులో లేదు. తను చేసిన చివరి సినిమా సూక్ష్మదర్శిని సూపర్‌హిట్‌ అయింది. దాంతో ఆమెకు ఇండస్ట్రీ నుంచి, సోషల్‌ మీడియాలో విపరీతంగా పోస్టులు, మెసేజ్‌లు వెళ్లాయి. కానీ, వేటికీ ఆమె స్పందించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే తన ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమలోని ఫ్రెండ్స్‌.. ఇలా ఎవరు కాల్‌ చేసినా ఆమె ఆన్సర్‌ చేయలేదట. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ తాజాగా ఒక ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసింది నజ్రియా.  ‘అందరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇన్నిరోజులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నాను. ఎవరి ఫోన్లూ లిఫ్ట్‌ చేయలేదు. ఇంత కాలం నేను కొంత డిప్రెషన్‌లో ఉన్నాను. కొన్ని కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఎవరికీ అందుబాటులో లేను. నేను చేసిన సూక్ష్మదర్శిని సినిమా సూపర్‌హిట్‌ అని టాక్‌ వచ్చిన తర్వాత నన్ను అభినందించేందుకు ఎంతో మంది ఫోన్లు చేశారు. కానీ, ఎవ్వరి ఫోన్లూ లిఫ్ట్‌ చెయ్యలేదు. నా 30వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అన్నీ మిస్‌ చేసుకున్నాను. ఎవరికీ అందుబాటులో లేకుండా ఉండడం నన్ను బాధించింది. అందుకే అందరికీ సారీ చెప్పేందుకు మీ ముందుకు వచ్చాను. ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌, ఫాలోవర్లు, అభిమానులు.. అందరికీ సారీ’ అంటూ పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ చూసిన వారంతా రకరకాలుగా ఆమె గురించి, ఆమె భర్త ఫహద్‌ గురించి చెప్పుకుంటున్నారు. వారి మధ్య విడాకుల ఇష్యూ ఏదైనా నడుస్తుందా అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆమె పెట్టిన పోస్ట్‌ చివరలో నజ్రియా నజీమ్‌ ఫహాద్‌ అని తన పేరును మెన్షన్‌ చెయ్యడంతో అలాంటివి ఏమీ లేవు అంటున్నారు. ఆమె పోస్ట్‌ పెట్టిన తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వారి విడాకుల వార్త గురించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. 
యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)అప్ కమింగ్ మూవీ 'థగ్ లైఫ్'(Thug Life). ప్రీవియస్ మూవీ భారతీయుడు 2 పరాజయం చెందటంతో కమల్ అభిమానుల ఆశలన్నీ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'థగ్ లైఫ్' పైనే ఉన్నాయి. పైగా భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మణిరత్నం(Mani Ratnam)దర్శకుడు కావడంతో పాన్ ఇండియా స్థాయిలోనే భారీ  అంచనాలు ఉన్నాయి. శింబు(Silambarasan TR)త్రిష(Trisha Krishnan)అభిరామి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, తనికెళ్ల భరణి, నాజర్ కీలక పాత్రలు పోషించగా లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ 'ఏఆర్ రెహ్మాన్' సంగీతాన్ని అందించాడు.  రీసెంట్ గా 'జింగుచా' అనే లిరిక్ తో కూడిన సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో థగ్ లైఫ్ చిత్ర బృందం పాల్గొని మూవీ కి సంబంధించిన పలు విషయాల్ని ప్రేక్షకులతో పంచుకుంది. కమల్ హాసన్ మాట్లాడుతు ప్రతి రోజు ఈ మూవీ షూటింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే ప్రారంభమయ్యేది. 37 ఏళ్ళ క్రితం మణిరత్నం గారి దర్శకత్వంలో 'నాయగన్' లో చేశాను. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. మేమిద్దరం కథ గురించి చర్చించుకుంటే 25 శాతం సినిమా పూర్తయినట్టే. త్రిష, అభిరామి ఇద్దరు హీరోయిన్లు ఉన్నా కూడా నాకు 'ఐ లవ్ యు' ఎవరు చెప్పలేదు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం ఎప్పుడు నా మనసుకు దగ్గరగా ఉంటుంది. శింబు లాంటి వ్యక్తి నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని చెప్పుకొచ్చాడు. కమల్ కెరీర్ లోనే హై బడ్జెట్ తో తెరకెక్కిన 'థగ్ లైఫ్' ని మణిరత్నం, కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్, శివ అన్నత్ సంయుక్తంగా నిర్మించగా రవి. కె చంద్రన్ ఫొటోగ్రఫీ ని అందించాడు. జూన్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా  ఇప్పటికే రిలీజైన టీజర్ అయితే మూవీ పై అంచనాల్ని పెంచిందని చెప్పవచ్చు.    
ఒకప్పుడు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న సాధనం సినిమా ఒక్కటే. కాలం మారుతున్న కొద్దీ వారికి వినోదాన్ని అందించేందుకు వివిధ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో సినిమా ప్రాధాన్యం సహజంగానే తగ్గింది. పాతతరం హీరోలు ఒక సినిమా చెయ్యాలంటే వంద రకాలుగా ఆలోచించేవారు. ఎలాంటి కథ నచ్చుతుంది, థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాలి అనే అంశాల గురించి ఆలోచించేవారు. తాము చేసే సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలి తప్ప వారిని డిజప్పాయింట్‌ చేసేలా ఉండకూడదని కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఇదంతా 80వ దశకానికి ముందు మాట. ఆ తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడం, కొత తరహా కథలను, యాక్షన్‌తో కూడిన సినిమాలను కోరుకోవడం మొదలైంది. దానికి తగ్గట్టుగానే హీరోలు కూడా తమని తాము మార్చుకొని యాక్షన్‌పై దృష్టి సారించారు. 80వ దశకం నుంచి ఈ యాక్షన్‌ సినిమాలు ఊపందుకున్నాయి. ఆ సమయంలో వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి హీరోలు యాక్షన్‌తో, తమ డాన్సులతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు. ఆ జోనర్‌లోనే సూపర్‌హిట్‌ సినిమాలు చేసి స్టార్‌ హీరోలుగా ఎదిగారు.  ఈ తరహా సినిమాల తీరు 2010 వరకు బాగానే సాగింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో యాక్షన్‌ పాళ్లు కాస్త పెంచడంతో మన సినిమాలు హింసాత్మక ధోరణిలోకి వెళ్లిపోయాయి. ఇటీవలి కాలంలో ఆ తరహా సినిమాలు లెక్కకు మించి వస్తున్నాయి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. సినిమాలో బలమైన కథ, కథనాలు ఉండాలి, మంచి డైలాగ్స్‌ ఉండాలి అనేది ఆలోచించకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఎలా ఉండాలి, మన హీరో ఎంత మందిని నరకాలి, ఎంత బీభత్సం సృష్టించాలి అనే దానిపైనే దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు యాక్షన్‌ సీక్వెన్స్‌లు అంటే అందరూ చూడదగ్గవిగానే ఉండేవి. సినిమాల్లో రక్తం కనిపించడం అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడలా కాదు. ప్రతి సినిమా రక్తసిక్తంగా కనిపిస్తోంది. హీరో ఎంతమందిని నరికితే అంత గొప్ప అనే ఫీలింగ్‌ ఆయా హీరోలకే ఉంది. కానీ, ప్రేక్షకులు ఆ విధంగా ఆలోచించడం లేదనేది వాస్తవం. ఇలాంటి భయానక సినిమాల నడుమ మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇటీవలి కాలంలో మంచి కాన్సెప్ట్స్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు ఘనవిజయం సాధించాయి.  స్టార్‌ హీరోలు మాత్రం ఆ తరహా సినిమాల జోలికి వెళ్ళకుండా మూసధోరణిలోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈమధ్యకాలంలో వచ్చిన అలాంటి సినిమాలు ఎన్ని విజయం సాధించాయి అని అడిగితే చెప్పడానికి సమాధానం ఉండదు. ఫ్యామిలీ హీరోలుగా పేరు తెచ్చుకున్న నటులు కూడా ఆ జోనర్‌లో సినిమాలు చేసేందుకే ఆసక్తి చూపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు సినిమాలు రిలీజ్‌ అయితే కటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమాలను ఎంజాయ్‌ చేసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి ఉంది. కోట్లల్లో పారితోషికాలు తీసుకునే హీరోలతోనే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించే బడా నిర్మాతలు.. అలాంటి సినిమాలు చేసి భారీగా నష్టపోయిన సందర్భాలు కోకొల్లలు. సినిమాలో కథ ముఖ్యం కాదని, హీరో చేసే విన్యాసాలు, హీరో చేసే హత్యలే ప్రధానమని ప్రేక్షకులు భావించడం లేదు. వారికి కావాల్సింది వినోదం. ఆరోగ్యకరమైన హాస్యాన్ని, సందర్భోచితంగా వచ్చే డైలాగులను ఎంజాయ్‌ చేసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే ఈ విషయంలో హీరోల ధోరణి మారాలి. తమ అభిరుచికి తగిన సినిమాలు కాకుండా ప్రేక్షకులు కోరుకునే తరహా సినిమాలు చేస్తే అందరికీ ఆరోగ్యం.  గత కొన్ని నెలలుగా ప్రతి వారం పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్‌ అవ్వడం, మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్‌ అనిపించుకోవడం మనం చూస్తున్నాం. అయినా హీరోల ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మించి, వేల థియేటర్లలో రిలీజ్‌ చేసేసి మొదటి వారమే డబ్బు దండుకోవాలని చూసే నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం హీరోల ఆలోచనలో మార్పు రాదని ఇటీవలికాలంలో విడుదలైన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. గతంలో తెలుగు సినిమా ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలాంటి దుస్థితికి దిగజారింది అనేది ప్రతి వారం రిలీజ్‌ అవుతున్న సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అనవసరమైన డైలాగులతో, భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు హీరోలు. ఈ దారుణాలు ఇంకెన్నాళ్లు చూడాలి అని ప్రేక్షకులు మొర పెట్టుకుంటున్నా.. వారి బాధను అర్థం చేసుకునే స్థితిలో స్టార్‌ హీరోలు, నిర్మాతలు లేరు. ఈ తరహా సినిమాల నుంచి ప్రేక్షకుల్ని కాపాడాలని, మంచి సినిమాలు అందించాలని కొందరు హీరోలు, దర్శకనిర్మాతలు ప్రయత్నం చేయడం అభినందించదగిన విషయమే. అయితే యాక్షన్‌ సినిమాలు చేస్తేనే తమ ఇమేజ్‌, స్టార్‌ డమ్‌ పెరుగుతుందని ఆలోచిస్తున్న హీరోలు ఇప్పటికైనా ఆ భ్రమ నుంచి బయటికి వచ్చి ఆరోగ్యకరమైన సినిమాలు చేస్తారని ఆశిద్దాం.  
  Cast: Nandamuri Kalyanram, Vijayashanti, Sohail Khan, Saiee Manjrekar, Srikanth, Babloo Prithviraj  Crew:  Written by Hari Krishna, Pradeep Chilukuri, Srikanth Vissa Editing by Tammiraju  Cinematography by C. Ram Prasad  Directed by Pradeep Chilukuri  Produced by Ashok Vardhan Muppa, Sunil Balusu  Released by 18th April 2025.   Nandamuri Kalyanram and legendary star actress Vijayashanti have come together for the first time for Arjun S/O Vyjayanthi. The movie directed by Pradeep Chilukuri and produced by Ashok Vardhan Muppa and Sunil Balusu released today. The movie has been promoted widely and let's discuss about it in detail.    Plot:  Arjun (Nandamuri Kalyanram) is the biggest gangster in Vizag and he stops any sort of violence happening in the city. His mother, ex-IPS officer Vyjayanthi (Vijayashanti) is the only person, who dares to go against him in the city. But he keeps growing his influence and waits for her to understand him. Commisioner Prakash (Srikanth) takes charge and targets Arjun, immediately.  But Arjun is after Mahamkali (Avinash), who killed his father, a costal guard. He finds out that Red Line Pharma is behind Mahamkali spreading Liquid Ecstasy drug. On the other hand, a Mumbai cruel don, Pathan (Sohail Khan) is after Vyjayanthi. What is his connection with Vyjayanthi and how will Arjun find connections between Red Line Pharma and Pathan? Watch the movie to know more.    Analysis:  Nandamuri Kalyanram did try his best to infuse life to each and every shot. His screen presence is commendable and he did try to carry the film on his shoulders well. Vijayashanti, even though she returned after a gap, her agility and acting prowess are stunning. She did a huge action sequence and stuns us with her commitment.  Sadly, there ends the positives of this routine commercial template film and it starts to frustrate us with its writing. The character arcs of the leads are also underdeveloped and each scene looks like it has been "inspired" from another film of same type. Even at that level, the film fails to engage us with a gripping narrative.  An IPS pass out that too, a top rank holder, turning into a criminal needed to have lot more conviction. The action episodes are also dragged to death, especially, the climax. Each and every scene looks dated and old. The writing needed even better inspiration and depth to really engage us with such a tried and tested tale.  On the whole, the director Pradeep Chilukuri tried to showcase an ideological battle between a mother and a son but he couldn't convince us. Ajaneesh Lokanath's BGM and Production values are good but really nothing worked to make us sit and take a note. It is time to reinvent commercial formula for Telugu Cinema has this sort of packaging is getting old and tedious.    In Conclusion: Arjun fails to impress us even though he tries a little bit too hard.    Rating: 2/5    Disclaimer: The views expressed in this review are reviewer's personal opinion. The organisation takes no responsibility and recommends viewer discretion.  
  తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్ తదితరులు సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ డీఓపీ: రామ్ ప్రసాద్ ఎడిటర్: తమ్మిరాజు రచన, దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు బ్యానర్స్: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ విడుదల తేదీ: ఏప్రిల్ 18, 2025   జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్.. తన గత రెండు చిత్రాలు 'అమిగోస్', 'డెవిల్'తో సక్సెస్ చూడలేకపోయాడు. ఇప్పుడు 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి నటించడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కళ్యాణ్ రామ్ కి విజయాన్ని అందించేలా ఉందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Arjun Son Of Vyjayanthi Movie Review)   కథ: వైజయంతి(విజయశాంతి) సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆమెకు డ్యూటీ అన్నా, కొడుకు అర్జున్(కళ్యాణ్ రామ్) అన్నా ప్రాణం. అర్జున్ కూడా తల్లిని ప్రాణంగా ప్రేమిస్తాడు. తల్లి స్ఫూర్తితో ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటాడు. ఆ కలని సాకారం చేసుకోవడానికి కష్టపడి చదువుతాడు. త్వరలో ఒంటిమీద యూనిఫామ్ వేసుకుంటాడు అనుకునే టైంకి అర్జున్.. ఓ క్రిమినల్ లా మారిపోతాడు. వైజాగ్ సిటీ మొత్తాన్ని తన కంట్రోల్ లో తెచ్చుకొని, సమాంతరంగా ఒక ప్రభుత్వాన్నే నడుపుతుంటాడు. ఐపీఎస్ కావాల్సిన అర్జున్, క్రిమినల్ ఎందుకయ్యాడు? ప్రాణంగా ప్రేమించిన కొడుకుని జైలుకి పంపించాలని వైజయంతి ఎందుకు అనుకుంది? వైజయంతిని చంపాలనుకున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పఠాన్(సోహైల్ ఖాన్) ఎవరు? అతని నుంచి తన తల్లి వైజయంతిని కాపాడి, అర్జున్ మళ్ళీ ఆమెకు దగ్గరయ్యాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: ఈ మధ్య రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు పెద్దగా రావట్లేదు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను చూడటానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. అయితే కాసేపు సరదాగా నవ్వుకునే కామెడీ సినిమాలు చూస్తున్నారు, లేదంటే విజువల్ వండర్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కళ్యాణ్ రామ్ వస్తున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఇలా యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుతో వచ్చిన కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో కూడా 'అతనొక్కడే' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. దీంతో వింటేజ్ వైబ్స్ ఉంటాయని ఎక్కడో చిన్న ఆశ. కానీ, అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. అప్పుడు 'అతనొక్కడే' సినిమా వర్కౌట్ అయిందంటే.. అందులో బలమైన కథాకథనాలు ఉన్నాయి. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరాయి. అందుకే ఇప్పటికీ ఆ సినిమా చూడగలం. కానీ, అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతిలో అవేవీ లేవు. కథాకథనాల్లో బలం లేదు. ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? అనే ఐడియా పాతదే. పైగా దానిని డెవలప్ చేసినా విధానం మరింత పాతగా ఉంది. ఒక చిన్న ఐడియాని, యాక్షన్ సన్నివేశాలను నమ్ముకొని ఈ సినిమా తీసినట్టుగా ఉంది. తల్లీకొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ ని కూడా ఎఫెక్టివ్ గా రాసుకోలేకపోయారు. విజయశాంతి ఇంట్రో ఫైట్, విలన్ ఇంట్రో ఫైట్, హీరో ఇంట్రో ఫైట్.. ఇలా వరుసగా మూడు యాక్షన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక సాంగ్. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. సినిమా ఎంత ఓల్డ్ టెంప్లేట్ లో సాగి ఉంటుందో. తెలిసిన కథని కూడా ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించేలా చేయవచ్చు. కానీ, రైటింగ్ లో అలాంటి మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. తల్లీకొడుకుల మధ్య బాండింగ్ ఎక్కువగా మాటలకే పరిమితమైంది. హత్తుకునే సన్నివేశాలు పడలేదు. విలన్ పాత్రను కూడా సరిగా రాసుకోలేదు. ఓ రేంజ్ లో ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత మాటలకే పరిమితం చేసి, క్లైమాక్స్ కి తీసుకొచ్చారు. విజయశాంతి-విలన్ మధ్య కానీ, కళ్యాణ్ రామ్-విలన్ మధ్య కానీ బలమైన సీన్స్ రాసుకోలేదు. సినిమా అంతా ప్రేక్షకుల ఊహకి తగ్గట్టుగానే సాగుతుంది. క్లైమాక్స్ విషయంలో కళ్యాణ్ రామ్ కాస్త ధైర్యం చేశాడనే చెప్పవచ్చు. కానీ, అది కూడా సినిమాని సేవ్ చేసే అవకాశం లేదు .   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో చక్కగా రాణించాడు. అయితే రౌద్ర రసం పలికిస్తూ డైలాగ్ లు చెప్పడంలో మాత్రం సహజత్వం కొరవడింది. విజయశాంతి విషయానికొస్తే, తనని లేడీ సూపర్ స్టార్ అని ఎందుకంటారో వైజయంతి పాత్రతో మరోసారి రుజువు చేశారు. తన స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫామెన్స్ తో ఆ పాత్రను నిలబెట్టారు. సాయి మంజ్రేకర్ ఉన్నంతలో ఓకే అనిపించుకుంది. సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. రచయితగా, దర్శకుడిగా ప్రదీప్‌ చిలుకూరి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సంభాషణలు కూడా నేటి తరానికి తగ్గట్టుగా లేవు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. రామ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగానే ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ తేలిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో కత్తెర తడబడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.    ఫైనల్ గా.. తల్లీకొడుకుల కథగా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందిన ఈ మూవీ మెప్పించలేకపోయింది. నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి ఎన్నో ఏళ్ళ దూరంలో ఆగిపోయిన ఈ చిత్రం.. ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం కష్టమే.    రేటింగ్: 2/5  
హిట్ చిత్రాల దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(LOkesh Kanagaraj)ప్రస్తుతం సూపర్ స్టార్ 'రజినీకాంత్'(Rajinikanth)తో 'కూలీ'(Coolie)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna)కూడా ఒక కీలక పాత్ర చేస్తుండటంతో 'కూలీ'పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకుడుగా పరిచయమైన తొలి చిత్రం 'మా నగరం'. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీనటరాజన్(Sri natarajan)సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితం 'శ్రీ నటరాజన్' సోషల్ మీడియా వేదికగా కొన్ని అభ్యంతరకర వీడియోలు షేర్ చేసాడు. పైగా గుర్తుపట్టలేని విధంగా రూపురేఖలు మొత్తం మారిపోయాయి. దీంతో శ్రీ నటరాజన్  మానసిక పరిస్థితి సరిగా లేదంటు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఇప్పుడు వాటిపై నటరాజన్ కుటుంబ సభ్యులు విడుదల చేసిన స్టేట్ మెంట్ ని  లోకేష్ కనగరాజ్ తన 'ఎక్స్ 'వేదికగా పంచుకున్నాడు. నటరాజన్ కుటుంబ సభ్యులు సదరు స్టేట్ మెంట్ లో 'నటరాజన్ ప్రస్తుతం వైదుల పర్యవేక్షణలో ఉండటం వలన కొన్ని రోజుల పాటు సామాజిక మధ్యమాలకి  దూరంగా ఉంటాడు. దయచేసి మా బాబు వ్యక్తిగత గోప్యానికి భంగం కలిగించవద్దు. నటరాజన్ ఆరోగ్య పరిస్థితి పై వస్తున్న వార్తలు కూడా మమ్మల్ని ఎంతగానో బాధపెడుతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరైనా మా అబ్బాయి గురించి అభ్యంతకర వీడియోలు చేస్తే తొలిగించెయ్యండని విన్నపం చేస్తున్నామని పేర్కొన్నారు.   2012 లో విడుదలైన వజక్కు ఎన్ 18 /9  చిత్రం ద్వారా పరిచయమైన  శ్రీనటరాజన్ ఆ తర్వాత 'ఓనా యుమ్ ఆట్టుక్కుట్టియుమ్', సన్ పాపడి, విల్ అంబు లాంటి చిత్రాల్లో హీరోగా చేసాడు. చివరిగా 2023 లో  విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కిన 'ఇరుగుపట్రు' లో కీలక పాత్ర పోషించాడు.    
ఒక భాషలో సూపర్‌హిట్‌ అయిన సినిమా భారతదేశంలోని వివిధ భాషల్లో రీమేక్‌ అయి ప్రతి చోటా అదే స్థాయి విజయాన్ని అందుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో రూపొందిన ‘దృశ్యం’ చిత్రం వల్లే సాధ్యమైంది. 2013లో విడుదలైన ఈ సినిమాను తెలుగులో వెంకటేష్‌, తమిళ్‌లో కమల్‌హాసన్‌,  కన్నడలో రవిచంద్రన్‌, హిందీలో అజయ్‌ దేవ్‌గన్‌ రీమేక్‌ చేసి సాలిడ్‌ హిట్‌ సాధించారు. ఇండియాలోనే కాదు, శ్రీలంక, ఇండోనేషియా, చైనా, కొరియా భాషల్లో రీమేక్‌ అయింది. అలాగే ఇంగ్లీష్‌ భాషలో అమెరికాలో రీమేక్‌ అయింది. ఇలా ఒక ఇండియన్‌ సినిమా ఇన్ని భాషల్లో రీమేక్‌ అవ్వడం అనేది అరుదైన విషయం.  ఆ తర్వాత ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా 2021లో ‘దృశ్యం2’ పేరుతో నిర్మించారు. ఇది కూడా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్‌ అయి సూపర్‌హిట్‌గా నిలిచింది. గత కొంత కాలంగా ‘దృశ్యం3’కి సంబంధించిన వార్తలు మీడియాలో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయింది. మేలో షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యధావిధిగా వివిధ భాషల్లో రీమేక్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ, దానికి భిన్నంగా ‘దృశ్యం3’ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చెయ్యాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మోహన్‌లాల్‌ కూడా పార్ట్‌ 3ని ఇండియాలోని వివిధ భాషల్లో విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలకు చెప్పినట్టు సమాచారం. దర్శకుడు జీతు జోసఫ్‌, నిర్మాత ఆంటోని పెరువంబూర్‌ దీనిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘దృశ్యం3 ది కంక్లుజన్‌’ పేరుతో మూడో భాగాన్ని రూపొందిస్తారట.  మోహన్‌లాల్‌తోపాటు దర్శకనిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ ఎఫెక్ట్‌ అయ్యేది వెంకటేష్‌, అజయ్‌ దేవ్‌గణ్‌. ఎందుకంటే ఈ రెండు భాషల్లో దృశ్యం చిత్రానికి ఎక్కువ అప్లాజ్‌ వచ్చింది. ముఖ్యంగా వెంకటేష్‌ పోషించిన రాంబాబు తెలుగు వారికి బాగా కనెక్ట్‌ అయింది. రెండు భాగాల్లోనూ వెంకటేష్‌ని చూసిన తెలుగు ప్రేక్షకులు అదే క్యారెక్టర్‌లో మోహన్‌లాల్‌ కనిపిస్తే యాక్సెప్ట్‌ చేస్తారా అనేది పెద్ద సందేహంగా మారింది. పార్ట్‌ 3 వెంకటేష్‌ చేస్తే బిజినెస్‌ పరంగా కూడా బాగా ప్లస్‌ అవుతుంది. మోహన్‌లాల్‌ నటించిన వెర్షన్‌నే తెలుగులో రిలీజ్‌ చేస్తే దాన్ని డబ్బింగ్‌ సినిమాగానే చూస్తారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే.. ‘దృశ్యం3’ పేరుతో అజయ్‌ దేవ్‌గణ్‌ తన సొంత బేనర్‌లో ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని దృశ్యం సిరీస్‌లో భాగంగా కాకుండా వేరే కథతో చేసే ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు ఎవరు అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. తెలుగులో రీమేక్‌ అయిన ‘దృశ్యం2’కి కూడా జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో పార్ట్‌ 3కి సంబంధించి వెంకటేష్‌, జీతుల మధ్య ఎలాంటి డిస్కషన్‌ జరగలేదని తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ హిట్‌ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో వెంకటేష్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. అందుకే ‘దృశ్యం3’ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్‌ చేసినా, మలయాళంలో రిలీజ్‌ చేసి అన్ని భాషల్లో రీమేక్‌ చేసుకునే అవకాశం ఇచ్చినా ఫర్వాలేదు అనే ధోరణిలోనే వెంకటేష్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ఆలోచన ప్రకారం ప్రస్తుతం పార్ట్‌ 3ని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నారు. అలా చెయ్యడం వల్ల వివిధ భాషల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దానిపై కూడా మేకర్స్‌ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పార్ట్‌ 3 తెలుగులో రీమేక్‌ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ‘దృశ్యం’ పార్ట్‌ 3 విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాచారం.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)'డాకుమహారాజ్' సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే. ఈ మూవీ ద్వారా స్పెషల్ సాంగ్స్ లోనే కాదు, నటిగాను సత్తా చాటగలనని నిరూపించుకున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi rautela). 'డాకు మహారాజ్' కంటే ముందు వాల్తేరు వీరయ్య, ఏజెంట్, స్కంద, బ్రో వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో చేసింది. కానీ డాకు మహారాజ్ మాత్రం 'ఊర్వశి రౌతేలా' ని సరికొత్తగా ప్రెజెంట్ చేసి పాన్ ఇండియా లెవల్లో ఆమె సినీ కెరీర్ కి సరికొత్త జోష్ ని తీసుకొచ్చింది. రీసెంట్ గా ఊర్వశి రౌతేలా ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతు 'ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో నా పేరుపై ఒక ఆలయం ఉంది. మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే నా ఆలయాన్ని సందర్శించండి. ఢిల్లీ విశ్వ విద్యాలయంలోను నన్ను' దండమమాయి' పేరుతో పిలుస్తు నా ఫోటోకి పూలమాలలు వేస్తారు. నాకు కూడా మొదట్లో ఈ విషయం తెలియదు.  కానీ ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయాను. దీనిపై వార్తా కథనాలు కూడా వచ్చాయి. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాను. అక్కడ కూడా నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. దక్షిణ భారత దేశంలో నాకు రెండో ఆలయాన్ని కట్టాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 2003 లో సన్నీడియోల్ హీరోగా వచ్చిన 'సింగ్ సాబ్ ది గ్రేట్' తో తెరంగ్రేటం చేసిన ఊర్వశి రౌతేలా ఇప్పటి వరకు తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో కలిపి సుమారు 19 సినిమాల దాకా చేసింది. వీటిల్లో ఎక్కువ భాగం స్పెషల్ సాంగ్సే. ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన' జాట్' మూవీలోని 'టచ్ కియా' సాంగ్ లో కూడా ఊర్వశి అద్భుతంగా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  గుడ్ ఫ్రైడే క్రైస్తవ ప్రజలకు ముఖ్యమైన రోజు. క్రైస్తవ మతంలోని ప్రజలు ఈ రోజును ప్రభువైన యేసు త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే నాడు, యేసుక్రీస్తును శారీరకంగా,  మానసికంగా హింసించిన తర్వాత యూదు పాలకులు సిలువ వేశారు. అలా సిలువ వేసిన  రోజు శుక్రవారం. అందుకే దీనిని గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. దీనిని బ్లాక్ ఫ్రైడే అని కూడా అంటారు. ఈ రోజున క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తును స్మరించుకుంటారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఈస్టర్ ఆదివారం కంటే రెండు రోజుల ముందు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ రోజున చర్చిలలో ప్రత్యేక ప్రార్థన సమావేశాలు నిర్వహిస్తారు. భక్తులు ఉపవాసం ఉండి శాంతి, కరుణ,  సేవ  సందేశాలను గ్రహిస్తారు. ప్రేమ, క్షమ,  త్యాగం వంటి యేసుక్రీస్తు జీవితం,  బోధనలు ఈ రోజున ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటారు. శుక్రవారం నాడు ప్రభువైన యేసు చెప్పిన చివరి ఏడు మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రత్యేక ఆరాధన సేవలు ఉంటాయి. ప్రధాన ఆరాధన సేవ మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య జరుగుతుంది - ఇది యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించిన సమయం అని నమ్ముతారు.  దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు యూదు మత నాయకులు యేసును దైవదూషణకు ఖండించారు. వారు ఆయనను రోమన్ల వద్దకు తీసుకువచ్చారు.  వారి నాయకుడు పొంటియస్ పిలాతు యేసును సిలువ వేయమని శిక్ష విధించాడు. బైబిల్ ప్రకారం యేసును బహిరంగంగా కొట్టారని,  జనసమూహం ఎగతాళి చేస్తున్నప్పుడు వీధుల గుండా బరువైన చెక్క సిలువను మోసుకెళ్ళమని బలవంతం చేశారని చెబుతున్నాయి. చివరికి ఆయన మణికట్టు,  పాదాలతో సిలువకు మేకులు కొట్టారు. ఆయన చనిపోయే వరకు అక్కడే సిలువపై వేలాడుతూనే ఉన్నాడు. ఆయన మరణం మానవాళి పాపాలను మన్నించడానికి,  తన తండ్రి అయిన దేవునితో తిరిగి ఏకం కావడానికి మార్గం చూపిస్తుందని నమ్ముతారు.           *రూపశ్రీ.
    వేసవి వేడి చాలా ఇబ్బందికరమైనది. వేసవి కాలంలో అన్నీ చల్లగా ఉండాలని అనుకుంటాం.  ముఖ్యంగా ఇంట్లో కుళాయి ఆన్ చేయగానే వచ్చే నీరు చల్లగా ఉంటే బాగుంటుందని అనుకుంటాం.  కానీ వాటర్ ట్యాంకులు మేడ మీద ఉండటంతో  ఎండకు ట్యాంక్ లో నీరు చాలా వేడిగా మారుతుంది.  కుళాయి నుండి కూడా బాగా వేడిగా ఉన్న నీరే వస్తుంది.  బాత్రూమ్ కు వెళ్ళినా,  ఇంట్లో సామాన్లు కడుక్కోవాలన్నా, రోజువారి పనుల కోసం వేడిగా ఉన్న నీరు వాడాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఎంత ఎండలో అయినా వాటర్ ట్యాంక్ లో నీరు చల్లగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.  వీటి వల్ల వాటర్ ట్యాంక్ లో నీరు సాధారణ రోజుల్లో ఉన్నట్టు ఉంటుంది.  దీని గురించి తెలుసుకుంటే.. కావలసిన వస్తువులు.. ధర్మకోల్ షీట్స్ సిజర్స్ టేప్ జనపనార సంచులు ప్లాస్టిక్ తాడు ఎలా చేయాలంటే.. మొదట వాటర్ ట్యాంక్ వేసవి ఎండలకు దెబ్బతినకుండా ఉండాలన్నా, వాటర్  ట్యాంక్ సురక్షితంగా ఉండాలన్నా ఇంటి పై భాగంలో వాటర్ ట్యాంక్ ఉంచిన చోట ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్ కింద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది వాటర్ ట్యాంక్ దెబ్బతినకుండా కాపాడుతుంది. ధర్మకోల్ షీట్స్.. ధర్మకోల్ షీట్స్ పలుచగా ఉన్నవి తీసుకోవాలి. ఈ షీట్స్ ను ట్యాంక్ చుట్టూ టేప్ సహాయంతో ఎక్కడా గ్యాప్ లేకుండా అతికించాలి. ట్యాంక్ మూతకు కూడా దీన్ని అతికించవచ్చు. ధర్మకోల్ షీట్ మంచి ఇన్సులేటర్ గా పనిచేస్తుంది.  బయటి ఉష్ణోగ్రతను లోపలికి రాకుండా నిరోధిస్తుంది. జనపనార సంచులు.. ధర్మకోల్ షీట్స్ ను ట్యాంక్ చుట్టూ అతికించిన తరువాత జనపనార సంచులను ధర్మకోల్ షీట్స్ మీద చుట్టూ కట్టాలి.  ఈ సంచులు జారిపోకుండా ప్లాస్టిక్ తాడు సహాయంతో గట్టిగా బిగించాలి.  ట్యాంక్ మూతకు కూడా ఇలా చేయవచ్చు. ఇలా చేసిన తరువాత ప్రతి రోజూ ఉదయం ట్యాంక్ ను కాస్త నీటితో తడపాలి.  జనపనార తడి కారణంగా ట్యాంక్ లోని నీరు చల్లగా ఉంటాయి.  వేసవిలో ట్యాంక్ లో నీరు చాలా వేడిగా ఉంటాయి అనే సమస్య ఎదురుకాదు.                             *రూపశ్రీ.
  గత కొన్ని సంవత్సరాల నుండి గమనిస్తే ఆడవాళ్లు వంటింటి కుందేళ్ల స్థానం నుండి మల్టీ టాస్కర్లు గా ఎదిగారు.  ఇంటి పని,  వంటి పని, ఉద్యోగంతో పాటు ఆర్థిక విషయాలు కూడా చూసుకుంటున్నారు. అయినా సరే పెళ్లి తర్వాత ఆడవాళ్ల పాత్ర చాలా వరకు తగ్గించాలని చూస్తారు మగవారు. ఇంటి విషయాలలో మగవారు తమ మాటే నెగ్గాలని అనుకుంటూ ఆడవారి మాటను లెక్కచేయరు. కానీ మహిళల గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలను అధ్యయనాలు బయటపెట్టాయి. ఆడవారికి ఏమీ తెలియదు.. వారికి ఏమీ చెప్పక్కర్లేదు అనుకోవడం మాత్రమే కాదు.. ఆడవారి మాట వినకుండా విస్మిరించే మగవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఒక అధ్యయనం వెలువరించిన వివరాల ప్రకారం.. మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందట.  మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడుతుందని,  తప్పులు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే పురుషులు స్త్రీల మాట వినాలని అంటారు. మహిళల విషయానికి వస్తే.. మహిళలు  చాలా కోణాలను   పరిగణలోకి తీసుకుంటారు, సహకారాన్ని ఇష్టపడతారు . మహిళల ఆలోచనలు  పురుషుల కంటే సమతుల్య దృక్పథాన్ని అందిస్తాయి, ఇది ఎక్కువ  విజయావకాశాలకు దారితీస్తుంది. వారి ఆలోచనా విధానం పురుషుల ఆలోచనా విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వారు అంచనా వేయగలరు. పురుషులు ఇంట్లో,  కార్యాలయంలో మరింత సవాలుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు.  ఇంట్లో,  కార్యాలయంలో మహిళల దృక్పథం  ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. తన సలహా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక విజయమే కాకుండా, మానసిక ఆరోగ్యం,  ఇరువురి మధ్య  ఆనందం కూడా మెరుగవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే వారి ముందు భార్యాభర్తలు  ఒక జట్టులా ఉంటారు. తరచుగా పిల్లల ముందు పురుషులు తమ భార్యలను తిడతారు.  ఇది వారి ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది. అయితే  సమస్యలను ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలి.  భార్య గృహిణి అయినప్పటికీ, ఆర్థిక నిర్ణయాల కోసం  ఎల్లప్పుడూ ఆమె దగ్గరికి వెళ్లాలి. అది పొదుపు అయినా లేదా పెట్టుబడుల గురించి అయినా. ఆమె దాని సాంకేతిక అంశాలలోకి వెళ్ళలేకపోయినా, దానిని ఎలా చేయాలో,  మీరిద్దరూ కుటుంబంగా ప్రతి నెలా ఎంత ఆదా చేయాలో ఆమె మీకు చెప్పగలదు. పిల్లల ముందు ఒక జట్టుగా ఉండాలంటే, అది కిరాణా సామాను కొనడం లాంటి చిన్నదైనా లేదా కారు కొనడం లాంటి పెద్దదైనా  కలిసి మాట్లాడుకోవాలి.  ప్రతిదానిపైనా ఆమె అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. దీని వలన    జీవితంలోని ప్రతి అంశంలోనూ తాను కూడా ఉన్నానని భార్య భావిస్తుంది. ఇది ఆడవారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం.                                            *రూపశ్రీ.
  వేసవికాలంలో శరీరం చల్లగా శక్తివంతంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే వేసవి వేడి దెబ్బకు చాలా తొందరగా నీరసం వస్తుంది.  అదే విధంగా ఎంత చల్లగా ఉన్న పానీయాలు తాగితే కొద్దిసేపు మాత్రమే శరీరానికి ఊరట లభిస్తుంది.  అదే శరీరానికి రోజంతా మంచి శక్తిని ఇస్తూ మరొకవైపు శరీరాన్ని చల్లగా ఉంచే పానీయం తాగితే భలే ఉంటుంది.  ఇలాంటి పానీయాల కోవకు చెందినదే సత్తు పానీయం. ఇది ప్రధానంగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఫేమస్ పానీయం. అయినా సరే దీని శక్తి,  దీని ప్రయోజనాలు తెలిసి దేశ వ్యాప్తంగా విస్తృతంగా తాగుతారు.  బయట మార్కెట్లో కూడా సత్తు పొడి లభిస్తుంది. కానీ ఇందులో కల్తీ ఉండవచ్చు. అందుకే ఇంట్లోనే సత్తు పొడిని ఈజీగా చేసుకుని తాగవచ్చు.  అదెలాగో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. వేయించిన శనగపప్పు( లేదా సాధారణ శనగపప్పు).. 500గ్రాములు. బార్లీ.. 500 గ్రాములు. వాము.. 1 టీస్పూన్ నల్ల ఉప్పు.. 1 టీస్పూన్. తయారు విధానం.. సాధారణ శనగపప్పును తీసుకుని బాగా కడగాలి.  కడిగిన శనగపప్పును 2 గంటల సేపు నీటిలో నానబెట్టాలి. తరువాత నీటి నుండి తీసివేసి శుభ్రమైన గుడ్డ మీద తడి పోయేవరకు ఆరబెట్టాలి. తేమ పోయిన తరువాత ఈ శనగలను ఒక పాన్ లో వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి.  ఇవి మాడిపోకుండా జాగ్రత్త పడాలి.  వేయించిన శనగలను చల్లారిన తరువాత మిక్సీ లో పిండి పట్టుకోవాలి.  ఈ ప్రాసెస్ అంతా వద్దు చేయలేము అనుకుంటే మార్కెట్ లో దొరికే వేయించిన శనగపప్పు ను తీసుకుని పిండి చేసుకోవచ్చు. ఈ పిండిలోనే వాము,  నల్ల ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బార్లీ గింజలను కూడా బాగా వేయించి వాటిని పొడి  చేసుకుని సత్తు పొడిలో మిక్స్ చేసుకోవాలి.  ఈ సత్తు పొడిని ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకునే ఈ సత్తు పొడి  2-3 నెలలు సులభంగా ఉపయోగించవచ్చు. దీన్ని కేవలం సత్తు పానీయంలోకి మాత్రమే కాకుండా.. సత్తు షర్బత్,  పరాఠాలు,  సమోసా వంటి వాటిలో స్ఠఫింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు.  ఈ వేసవి కాలంలో సత్తు పానీయాన్ని తాగి బయటకు వెళితే శరీరానికి వడదెబ్బ తగలకుండా రక్షణగా ఉంటుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నరాల ఉబ్బరం అనేది ప్రతిరోజూ ఎవరో ఒకరు బాధపడే ఒక సాధారణ సమస్య. నరాల ఉబ్బరం నరాల సమస్య కాదు కానీ కండరాల తిమ్మిరి వల్ల వస్తుందట. ఈ సమస్య క్రమంగా నయమవుతుంది. చాలా మంది రాత్రిపూట ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. దీనిలో కండరాలు అకస్మాత్తుగా బిగుతుగా  మారడం లేదా సాగదీయడం జరుగుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సమస్య తరచుగా కాళ్ళు, చేతులు లేదా వీపులో సంభవిస్తుంది.  కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. సాధారణంగా ఇది తీవ్రమైన సమస్య కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే, అది  దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వెరికోస్ వెయిన్స్ కు చికిత్స ఏమిటి? కొంచెం శ్రద్ధ, సరైన జీవనశైలి,  సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. వెరికోస్ వెయిన్స్  కారణాలు,  దానిని నివారించే మార్గాలను తెలుసుకుంటే.. నీటి కొరత.. నీరు లేకపోవడం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.   రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగకపోతే రాత్రిపూట ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుందట. గర్భధారణ సమయంలో.. గర్భధారణ సమయంలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.   దీనితో పాటు డయాలసిస్ రోగులకు కండరాల తిమ్మిరి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందట. డయాలసిస్ రోగులలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అధిక హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య సంభవిస్తుందట. విటమిన్లు లేకపోవడం.. విటమిన్ లోపాలు ఉన్నవారు.. ముఖ్యంగా విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ఐరన్,  మెగ్నీషియం లోపాలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. ఉపశమనం ఎలా.. ఎవరికైనా ఈ సమస్య ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా రాత్రిపూట ఈ సమస్య  ఎక్కువగా బాధపెడితే, పైన పేర్కొన్న కారణాలపై  శ్రద్ధ వహించాలని డాక్టర్లు చెబుతున్నారు.   వీటిలో ఏవైనా ఉంటే, పరీక్షించుకోవాలి.  శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, దానిని ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తీర్చుకోవాలి.  శరీరంలో విటమిన్ల లోపం ఉంటే ఆహారంపై శ్రద్ధ వహించాలని డాక్టర్లు  చెబుతున్నారు.  ఆహారంలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ఐరన్,  మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి. ఇది కాకుండా రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగాలి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  శరీరం,  మెదడు తో పాటు మిగిలిన భాగాలకు నిద్ర అవసరమని చాలా మందికి తెలుసు. కానీ నిద్ర  బరువును, ఆలోచనా శక్తి, రోగనిరోధక శక్తితో పాటు  అనేక రకాల హార్మోన్లు మొదలైన వాటిని కూడా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు.  తక్కువ నిద్రపోతే లేదా నాణ్యత లేని నిద్ర వస్తే, అది  మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటిలో మధుమేహం, ఊబకాయం, నిరాశ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయి. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. మంచి నిద్రకు ఆటంకం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుని అధిగమిస్తే.. నాణ్యమైన నిద్రను పొందడం సాధ్యమవుతుంది. టీ, కాఫీలు తాగే సమయం.. భారతదేశంలో ప్రతి వీధిలో టీ ప్రియులు, కాఫీ ప్రియులు బోలెడు కనిపిస్తారు. ఇంట్లో కూడా రోజుకు కప్పుల కొద్ది కాఫీ, టీ తాగే వారు ఉంటారు.  కానీ ఈ రెండు పానీయాల వినియోగ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కాఫీ, సాయంత్రం 5 గంటల తర్వాత టీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది నిద్ర మీద చాలా దారుణ ప్రభావం చూపిస్తుందట. మద్యం.. మద్యం తాగడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగడం వల్ల బాగా నిద్రపడుతుందని  చాలా మంది నమ్ముతారు. కానీ మద్యం తాగడం వల్ల త్వరగా నిద్ర వదిలిపోతుందట. నిద్ర నాణ్యత తగ్గిపోతుందట.  నిద్ర.. తరచుగా ఉదయం చాలా త్వరగా నిద్రలేవడం వల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో నిద్ర పోవడం కొందరి అలవాటు.  దీని కారణంగా చాలా మంది 1 లేదా 1.5 గంటలు నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి మద్యాహ్నం పడుకుంటే కేవలం అరగంట లోపే ఈ సమయాన్ని పరిమితం చేయాలట. 7-9 గంటల నిద్ర.. నిద్ర అవసరం వయస్సు మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి 7-9 గంటలు నిద్రపోవడం మంచిదట.  6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే అది చిరాకును పెంచుతుందని అంటున్నారు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...