తెలుగు రాష్ట్రాల్లో  సెన్సేషనల్ అయిన కామారెడ్డి జిల్లాలో ట్రయాంగిల్ సుసైడ్ కేసులో మరో ట్విస్ట్ చేటుసుకుంది. వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి  సింధు శర్మ ఎదుట  పెద్ద పంచాయతీ జరిగినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ , శృతి పెళ్లి చేసుకోవాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.  కానీ ఎస్ ఐ సాయికుమార్ అడ్డుపడ్డాడు. ఎస్ఐ సాయికుమార్ తో శృతి అక్రమ సంబంధం కొనసాగించినట్లు ఆధారాలు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తన భర్త అక్రమ సంబంధంపై ఎస్ ఐ భార్య మహలక్ష్మి  ప్రతీరోజు గొడవపడేది. కానిస్టేబుల్ తో ఉన్న అక్రమ సంబంధాన్ని భర్తను నిలదీసేది మహలక్ష్మి.  నేను విడాకులు ఇవ్చవకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని పలుమార్లు హెచ్చరించింది మహలక్ష్మి.  చట్టబద్దంగా ఈ పెళ్లి చెల్లదు అయినా తనను  పెళ్లి చేసుకోవాలని శృతి  సాయికుమార్ పై వత్తి డి తెచ్చింది.  ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి    మూడేళ్ల కొడుకుతో మహలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం మహలక్ష్మి గర్బవతి. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో  మనస్థాపం చెందిన  ఎస్ ఐ సాయికుమార్ నిఖిల్, శృతితో గొడవపడ్డాడు. ఎస్ ఐ కంటే ముందే శృతికి నిఖిల్ తో ప్రేమ వ్యవహారం ఉంది.  పెళ్లి చేసుకోవాలనే సమయంలో ఎస్ఐ సాయికుమార్ విలన్ గా మారాడు. నాతో రిలేషన్ లో ఉన్నప్పుడు నిఖిల్ ను ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని నిలదీశాడు. ఎస్ ఐ ని పెళ్లి చేసుకోవడానికి శృతికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే సాయికుమార్ భార్య ఒప్పుకోకపోవడంతో వీరి ఫిజికల్ రిలేషన్ కు ఎండ్ కార్డ్ పడలేదు. దీంతో శృతి పెళ్లికాని నిఖిల్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. శృతికి పెళ్లయి విడాకులు కూడా తీసుకుంది. బీబీ పేటలో ఒంటరిగా ఉంటోంది. ఎస్ ఐ సాయికుమార్ టార్చర్ ఎక్కువ కావడంతో నిఖిల్ ఎస్పిని ఆశ్రయించాడు. సాయికుమార్ తరపున ఒక సిఐ , ఎస్ఐ మధ్యవర్తిగా ఉంటూ సమస్యను పరిష్కారం చేయాలనుకున్నారు.  కానీ ఎస్ఐ స్వయంగా రంగంలో దిగాడు. శృతి, నిఖిల్ ను పెద్ద చెరువు వద్దకు రమ్మన్నాడు. అర్దరాత్రి సమయంలో  ముగ్గురి మధ్యమాటామాటా పెరగడంతో శృతి చెరువులో దూకేసింది. శృతిని రక్షించడానికి నిఖిల్ , వీరిద్దరిని రక్షించడానికి సాయికుమర్ నీళ్లలో దూకాడు ఈత రాకపోవడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసు శాఖ పరువు పోతుందన్న భయంతో ఉన్నతాధికారులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. .  చట్టాన్ని రక్షించాల్సిన శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం డిపార్ట్ మెంట్ కే కళంకం తెచ్చింది.  
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో ఘనత సాధించారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ను విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా లాయకీ లేని నియోజకవర్గంగా ముద్రపడిన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి సారి పరాజయం పాలైన లోకేష్.. పార్టీ అధినేత కుమారుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండో సారి సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉండి కూడా.. పోయిన చోటే వెతుక్కుంటాను.. అపజయం ఎదురైన చోటే విజయ కేతనం ఎగురవేసి సత్తా చాటుతానని పట్టుబట్టి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  2019 ఎన్నికలలో మంగళగిరిలో ఎదురైన పరాభవాన్ని చాలెంజ్ గా తీసుకున్నారు. ఆ తరువాత ఐదేళ్ల పాటు మంగళగిరి నియోజకవర్గాన్నే తన నివాసంగా మార్చుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వినా మరెన్నడూ నియోజకవర్గాన్ని విడిచి పెట్టలేదు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై అందరివాడు అనిపించుకున్నారు. విజయం తరువాత కూడా ప్రజాదర్బార్ లతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని ఆయన చూరగొన్న ఫలితమే నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ సభ్వత్వాల సంఖ్య లక్ష దాటింది. అంతే కాకుండా తెలుగుదఏశం శాశ్వత సభ్వత్వాల విషయంలో కూడా మంగళగిరి నియోజకవర్గమే టాప్ లో నిలిచింది.   పార్టీ సభ్వత్వాలను నజరానాలతోనూ, ముడుపులతోనూ చేయించడం సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. ఎవరైనా పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఆ వ్యక్తికి పార్టీ పట్ల అపేక్ష, అభిమానం ఉండాలి. లోకేష్ జనంతో మమేకమై వారి విశ్వసనీయత పొందడం వల్లనే నియోజకవర్గంలో జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో అరవై ఆరు శాతం ఓట్లు లోకేష్‌కు పడ్డాయి. దాదాపుగా లక్షా డెభ్బై వేల ఓట్లు వచ్చాయి. ఓట్లు వేసిన వారంతా టీడీపీ సభ్యులు కాదు. కానీ వారిలో లక్ష మందికిపైగా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబంలో సభ్యులయ్యారు.  కార్యకర్తలకు లోకేష్ అండగా ఉంటారన్న భరోసా కలగడంతోనే ఈ స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా జరుగుతున్న చర్చ ఏదైనా ఉందంటే అది పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలు, తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల చర్చ అంశాలపైనే. కాగా ఈ అంశంపై తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఎలాంటి భేషజాలకూ పోకుండా ఈ సంఘటనపై ఆయన స్పందన చాలా ముక్కుసూటిగా ఉంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి ఆయన ఎవరినీ బాధ్యులను చేయలేదు. అదే సమయంలో ఎవరికీ మద్దతుగా మాట్లాడలేదు. కానీ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఈ విషయంలో అల్లు అర్జున్ తీరును ఆయన తప్పుపట్టారు. సరిగా స్పందించడంలో విఫలమై అల్లు అర్జున్ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొన్న పవన్ కల్యాణ్.. సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. అల్లు అర్జున్ లేదా ఆయన ప్రతినిథులు ఎవరో ఒకరు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి ఉండాల్సిందన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు వంటివి పరిశ్రమను ప్రోత్సహించడానికి దోహదపడతాయేమో కానీ.. అలా ప్రోత్సహించడం కోసం శాతి భద్రతల విషయంలో రాజీ పడటం సరైనది కాదనీ, అందుకే రేవంత్ వ్యవహరించిన తీరు నిష్పాక్షికంగా ఉందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదన్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కారని రేవంత్ చాటారనీ, హీరోలైనంత మాత్రాన వారేం పైనుంచి దిగి రాలేదని   రేవంత్ నిరూపించారని చెప్పారు.   చిరంజీవి కూడా అభిమానులతో కలిసి సినిమా ప్రదర్శనలు చూసేవారనీ, అయితే ఆయన చాలా సాదా సీదాగా, ఎవరి కంటా పడకుండా థియేటర్ కు వెళ్లేవారని వివరించిన పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్ ఆర్భాటంగా సంధ్యా థియేటర్ కు రోడ్ షో చేస్తూ వెళ్లడమే తొక్కిసలాటకు కారణంగా కనిపిస్తోందన్నారు. సంఘటన జరిగిన తరువాత  అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు సమస్యను పెద్దది చేసిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.  పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుపై చంద్రబాబు సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఒక్క సారిగా జోరందుకుంది. అలాగే నిర్మాత దిల్ రాజు ఆహ్వానం మేరకు ఆయన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెడతారా అన్న చర్చ కూడా మొదలైంది. ఒక సమయంలో ఆయన బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు వంటివి సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు దోహదపడతాయని, అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీ కూడదని అనడంతో కొన్ని షరతులతో ఏపీ సర్కార్ సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని పరిశీలకులు అంటున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
Lyca Productions have been going through a financial crisis as per the latest reports. The production house brought Ajith Kumar's Vidaamuyarchi to the fore front when his other film, Good Bad Ugly, has been gearing up for Pongal release. They released teaser announcing Pongal release but they did not lock release date.  Ajith Kumar fans have been patiently waiting for the production house to announce the release date. But they did not announce their date and this has been blocking other Tamil films to lock their dates as well. The Vidaamuyarchi team released "Sawadeeka" song but without any update on release date.  Only, ten to twelve days are left for release, whatever date they lock. They are taking their own time to even confirm if they have plans to release the film or not. Ajith Kumar completed dubbing works for the film and even completed pending song shoot. He even completed his commitment for Good Bad Ugly as well.  He would be joining racing season with his Ajith Kumar Racing team in Dubai and continue to concentrate on racing till July - September. Now, Vidaamuyarchi release depends on Lyca Productions team and hence, everyone in Tamil Cinema are eagerly waiting for their confirmation. 
ఎన్టీఆర్(ntr)రాజమౌళి(rajamouli)కాంబోలో తెరకెక్కిన 'స్టూడెంట్ నెంబర్ 1 'చిత్రంలో సత్య అనే నెగిటివ్ క్యారక్టర్ లో అత్యద్భుతంగా రాణించిన నటుడు రాజీవ్ కనకాల(rajeev kanakala)ఆ తర్వాత ఆది,నాగ,అడవి రాముడు,చంటి గాడు,సై, ఏ ఫిలిం బై అరవింద్, అతడు,అశోక్,అతిధి,జనతా గారేజ్,సామజవరగమన,వీరసింహ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 100 సినిమాల దాకా వివిధ రకాల క్యారక్టర్ ని పోషించి,అశేష ప్రేక్షాభిమాన్ని పొందాడు.సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న రాబోతున్న చరణ్ అప్ కమింగ్ మూవీ 'గేమ్ చేంజర్' లోను ఒక కీలక పాత్ర  ని పోషించాడు.  ఇక ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీలో ప్రసారమయ్యే 'సుమ అడ్డా'(suma adda)అనే ఎంటర్ టైన్ మెంట్ షో కి రాజీవ్ కనకాల రావడం జరిగింది.ఈ నెల 31 న 'దావత్' అనే టైటిల్ తో ఒక సరికొత్త  ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి రీసెంట్ గా రిలీజ్ కాగా, రాజీవ్ కనకాల తల్లి తండ్రులైన దేవదాస్ కనకాల,లక్షి కనకాల విగ్రహాలని షో లో ఆవిష్కారించడం జరిగింది.దాంతో రాజీవ్ ఎమోషనల్ కి గురయ్యి వెక్కెక్కి ఏడవడం జరిగింది.  తల్లి తండ్రులతో పాటు తోడబుట్టిన చెల్లిని కూడా పోగొట్టుకున్నానని రాజీవ్ చెప్పడం పలువుర్ని కంటతడిపెట్టిస్తుంది.ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది.  రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల(devadas kanakala)నటుడుగా చాలా సినిమాల్లో వివిధ రకాల పాత్రలని పోషించి మంచి పేరు సంపాదించాడు. డిఫరెంట్ మాడ్యులేషన్ కి పెట్టించి పేరైన ఆయన  ఎన్నో అవార్డుల్ని సైతం అందుకున్నాడు.నటన మీద మక్కువతో యాక్టింగ్ స్కూల్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మందికి నటనలో ఓనమాలుని నేర్పాడు.మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ స్కూల్ కి చెందిన వ్యక్తే.   
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు 'ఓజి'(og)అని పెద్దఎత్తున అరవడం ఆనవాయితీ అయిపోయింది.ఈ తంతు చాలా రోజుల నుంచి జరుగుతునే ఉంది.లేటెస్ట్ గా  పవన్ వైసిపీ వాళ్ళ దాడిలో గాయపడిన జవహర్ బాబు ని పరామర్శించడానికి కడప వెళ్ళినపుడు కూడా సేమ్ పరిస్థితి. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకొని 'ఓజి' అని అరవడం మొదలుపెట్టారు.దీంతో ఇదా సందర్భం అంటూ పవన్ అభిమానులపై  తన అసహనాన్ని వ్యక్తం చెయ్యడం జరిగింది.'ఓజి' ని నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ దానయ్య కూడా ఆ విధంగా అరుస్తు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ని ఇబ్బంది పెట్టవద్దని  ట్వీట్ కూడా చేసింది. మరి ఈ విషయాలన్నిటిపై ఫ్యాన్స్ హార్ట్ అయ్యారని పవన్ అనుకున్నాడేమో గాని, లేటెస్ట్ గా పవన్ ఓజి గురించి మాట్లాడటం జరిగింది.ఆయన మాట్లాడుతు ఓజి 1980,90 సంవత్సరాల మధ్య జరిగే కథ.ఓజి అంటే అర్ధం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.అభిమానులు ఎక్కడికి వెళ్లినా ఓజి  అని అరుస్తున్నారు.అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి.అన్ని సినిమాలకి నేను డేట్స్ ఇచ్చాను.ఆయా సినిమా వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదు.హరిహర వీరమల్లు ఇంకా  ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది. అన్ని సినిమాలు ఒక్కొక్క దానిని పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు.అల్లు అర్జున్ కేసు గురించి కూడా మాట్లాడుతు గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహించే పనిలో బిజీగా ఉన్నాడు.మరోపక్క 'హరిహరవీరమల్లు'(hari hara veera mallu)షూటింగ్ లోను  పాల్గొంటున్నాడు.పవన్ నుంచి రాబోయే అప్ కమింగ్ మూవీ కూడా ఇదే. 2025 ఉగాది సందర్భంగా మార్చి 28 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.దీని తర్వాతే 'ఓజి','ఉస్తాద్ భగత్ సింగ్' లు రిలీజ్ అవుతాయి.    
వెండితెరపైనే కాదు, బుల్లితెరపైనా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యగలనని నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రూవ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ‘అన్‌స్టాపబుల్‌’ షోను సూపర్‌ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. బాలయ్య. ఈ షోకి ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పటికే 3 సీజన్లు కంప్లీట్‌ చేసిన బాలయ్య ఇప్పుడు నాలుగో సీజన్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో వెంకటేష్‌ షోకి వచ్చి ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్‌ చేశారు. ఇప్పుడు తాజాగా ‘గేమ్‌ ఛేంజర్‌’ హీరో, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. అన్‌స్టాపబుల్‌ షోకి రాబోతున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతోంది. బాలకృష్ణ సహచర హీరో అయిన చిరంజీవి కుమారుడు చరణ్‌తో ఈ షో చేయడం ఆయనకు కూడా ఎక్సైటింగ్‌గానే ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ వార్త నిజమేనని తెలుస్తోంది.  ‘గేమ్‌ ఛేంజర్‌’ జనవరి 10న విడుదలవుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ 31 మధ్యాహ్నం 3 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో అన్‌స్టాపబుల్‌కి సంబంధించిన కొత్త ఎపిసోడ్‌ షూటింగ్‌ జరగనుంది. చరణ్‌తోపాటు యూనిట్‌ సభ్యులు కూడా ఈ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌పై ఆడియన్స్‌, మెగా అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. బాలయ్య, చరణ్‌ మధ్య సంభాషణ జరుగుతుంది, చరణ్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ సంక్రాంతికి బాలకృష్ణ, రామ్‌చరణ్‌ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ షోలో తప్పకుండా ప్రస్తావనకు వస్తాయి. ఇవి ఆడియన్స్‌కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తాయి. సాధారణంగా అన్‌స్టాపబుల్‌ షోలో ఒక సెలబ్రిటీ వచ్చిన తర్వాత షో మధ్యలో మరో సెలబ్రిటీని ఆహ్వానించడం, వారిని ఫన్‌ క్రియేట్‌ అయ్యే ప్రశ్నలు అడగడం మనం చూస్తున్నాం. మరి చరణ్‌ ఎపిసోడ్‌కి ఎవరిని పిలుస్తారు అనే చర్చ జరుగుతోంది. చరణ్‌కి బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన ఎన్టీఆర్‌ని పిలుస్తారా లేక ఫోన్‌లో మాట్లాడిస్తారా అనేది చూడాలి. అన్‌స్టాపబుల్‌ షోకి సంబంధించి ఇప్పటివరకు స్ట్రీమ్‌ అయిన ఎపిసోడ్స్‌ కంటే దీనికి ఎక్కువ ఆదరణ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
Sankrantiki Vasthunnam starring Venkatesh and directed by Anil Ravipudi has been highly self aware with their promotions. The movie is promising only a fun entertainer but not any new experience or an epic film. They are able to raise curiosity and positive anticipation for the film without over hyping it. Now, the makers have released Blockbuster Pongal song, sung by Venkatesh, himself. The song has a catchy vibe and infectious energy. Composer Bheems Ceciroleo with his instrumentation kept the song light-hearted. Venkatesh rhythmically delivered the lines rather than trying to sing like a trained one.  This worked for the song perfectly and even the steps by him along with Aishwarya Rajesh and Meenakshi Chaudhary are simple, effective and cool. In totality, we can say that without over hyping and trying to make it a big thing, the team delivered a cool vibe song that works in the context of Sankranti festival vibe.  Movie is directed by Anil Ravipudi and he is promising to deliver another blockbuster with Venkatesh in the leading role after F2 and F3. For now, among the three, Sankrantiki Vasthunnam is able to get buzz going while other two are lagging behind. 
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)సుకుమార్(sukumar)కాంబోలో డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజయిన పుష్ప 2(pushpa 2)ఇండియా వైడ్ గా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే 1500 కోట్ల మైలు రాయిని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.హిందీలో అయితే అక్కడి హీరోలకి కూడా సాధ్యం కానీ రీతిలో ఇప్పటివరకు 753 కోట్ల షేర్ ని సాధించి స్టిల్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు  దూసుకుపోతుంది. పుష్ప 2 లో రేపు జనవరి 1 నుంచి కొత్త సీన్స్ యాడ్ అవ్వబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి.మూవీ స్టార్టింగ్ జపాన్ లో ఓపెన్ అవుతుంది.అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ తో పాటు  జపాన్ నటులతో ఒక భారీ ఫైట్ ని అక్కడ చిత్రీకరించారు.తనకి రావాల్సిన డబ్బు కోసం అల్లు అర్జున్ అక్కడకి వచ్చినట్టుగా చూపించగా,ఆ తర్వాత మాత్రం జపాన్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.కానీ ఇప్పడు యాడ్ చెయ్యబోయే చేసే సీన్స్ లో జపాన్ కి సంబంధించినవే అని తెలుస్తుంది.వాటికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయని, అల్లుఅర్జున్ కూడా డబ్బింగ్ పనుల్లో ఉన్నాడని అంటున్నారు.  ఇప్పటికే ఎన్నో రికార్డులని క్రియేట్ చేసిన పుష్ప ప్రభాస్(prabhas),రాజమౌళి(rajamoulli)ల బాహుబలి 2 1800 కోట్ల   రికార్డుని అందుకోవడానికి కొద్దిగా దూరంలోనే ఉంది.అదనపు సీన్స్ తో అయిన సరే ఆ రికార్డుని  దాటాలనే ఈ సీన్స్ ని కలుపుతున్నటుగా వార్తలు వస్తున్నాయి.   
Pawan Kalyan fans have been waiting for his next movies - Hari Hara Veera Mallu and OG. But both the movies have been delayed from their planned release dates. Now, the HHVM team has announced Part-1 release on 28th March 2025 and OG could release by June or July. But the latest reports state that both are delayed further.  Hari Hara Veera Mallu Part-1 movie has been stated to be delayed from March and could release later. But fans of the actor are hyped up for OG, post the movie teaser release. They are shouting "OG... OG.." slogans whenever they see him in public.  Pawan Kalyan speaking about it said, "OG means Original Gangster and the slogans are scaring me. I gave enough dates to both the film teams but they failed to use them appropriately. I have still 8 days work left for HHVM. Both the films will release one after another."  The actor-turned-politician has become busy with his duties after becoming AP Deputy Chief Minister. So, he is unable to finish the movies immediately as per the film teams. We have to wait and see, if the movies will be further delayed or will release this year, as per planned.
Srikanth Odela, after his Dasara, made a huge mark on TFI as a mass director with an eye for authenticity. The young director announced his next films with Nani - The Paradise and Chiranjeevi. The director is extremely excited about his association with Chiranjeevi as it marks his dream come true project.  But the young director is not promising a vintage Chiranjeevi entertainer. He stated that he wants to showcase the Megastar in an age appropriate role but in a bloody action entertainer in his style. He stated that while he is a big fan of the actor, he doesn't want to bring "vintage Chiranjeevi" back.  This could prove to be the breathe of fresh air that the actor needs immediately. He tried to showcase his vintage style in Bhola Shankar to much loud criticism. He also faced disaster with Acharya and Godfather did not become a hit as anticipated. So, he has been in confusion, what to attempt, with Waltair Veerayya becoming a hit.  If Srikanth Odela, can deliver the big blockbuster as he promises with an age appropriate role for the actor, that can be categorised as the big star's real comeback in tune to the changing times. With blood filled hands, the director has already showcased that he doesn't want to make a simple entertainer. So, let's hope he gives the action epic that he promises with the actor. 
డిసెంబర్‌ 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీయం పవన్‌కళ్యాణ్‌ స్పందించలేదు. దీని గురించి ఆయన తొలిసారి స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘సంధ్య థియేటర్‌ ఘటనకు అల్లు అర్జున్‌నే బాధ్యుడ్ని చేశారు. అది కరెక్ట్‌ కాదు. ఇలాంటి విషయాల్లో యూనిట్‌లోని అందరూ ఒక టీమ్‌లా ఉండాలి. అలా కాకుండా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. రేవంత్‌రెడ్డిగారు సినిమా ఇండస్ట్రీకి మంచి తోడ్పాటు అందిస్తున్నారు. ఆయన చాలా డైనమిక్‌ లీడర్‌. ఆయన కాబట్టే ఒక హీరోని అరెస్ట్‌ చేయించారు. చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలా రేవంత్‌ ప్రభుత్వం లేదు. బెనిఫిట్‌ షోలకు, టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అందువల్లే పుష్ప2, సలార్‌ వంటి చిత్రాలకి అంతటి భారీ కలెక్షన్లు వచ్చాయి. సినిమాపై భారీ అంచనాలు ఉంటే ఫ్యాన్స్‌ ఎక్కువగా వస్తారు. మొదటిరోజు సినిమా చూసేందుకు ఈమధ్య నేను వెళ్లడం లేదు. మూడు సినిమాలకు మాత్రమే అలా వెళ్లాను. ఆ తర్వాత ఆగిపోయాను. థియేటర్‌ దగ్గర పరిస్థితి గురించి అల్లు అర్జున్‌ స్టాఫ్‌ అతనికి చెప్పి ఉండాల్సింది. ఆ తర్వాతి రోజైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించి మేం మీకు అండగా ఉన్నాం అని చెప్పాలి. మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది అని చెబితే ఎంతో గౌరవంగా ఉండేది. కానీ, అది జరగలేదు. అల్లు అర్జున్‌ వెళ్ళకపోయినా నిర్మాతలైనా, మరెవరో ఒకరు వెళ్లి ఉండాల్సింది. ఈ విషయంలో అడ్వకేట్లు ఏర్పాట్లు చేస్తే బాగుండేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసినపుడు ధరలు పెంచడం అనేది అనివార్యం. ఇక ప్రేక్షకుల గురించి చెప్పాలంటే సినిమా హీరోల పట్ల వారు ప్రేమ, ఆదరణ చూపిస్తారు. హీరో వస్తున్నారంటే అభిమానుల ఎగబడడం సహజం. అల్లు అర్జున్‌ విషయంలో ముందు, వెనక ఏం జరిగిందో నాకు తెలీదు. ఇలాంటి ఘటనల్లో నేను పోలీసులను తప్పుపట్టను. ఎందుకంటే వారు మొదట ఆలోచించేది ప్రజల భద్రత గురించే. మన సినిమాల ద్వారా మన సంస్కృతిని, మన కళలను ప్రజలకు చూపించే అవకాశం ఉంది. ఈరోజుల్లో ఊహ తెలిసిన దగ్గర నుంచే పిల్లలు టీవీలు చూస్తున్నారు. కొత్త వీడియోలు వస్తే ఫోన్లలో ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల ద్వారా ఎవరికి ఏది అందించాలి అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హీరోలు మొదటిరోజు సినిమా థియేటర్‌కి వెళ్ళడం అనేది సర్వసాధారణం. అయితే నేను అది ఎప్పుడో మానేశాను. చిరంజీవిగారు ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్‌కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నేను కూడా వెళ్లాను. ఈ విషయంలో అల్లు అర్జున్‌కి అతని స్టాఫ్‌ సలహా ఇచ్చి ఉండాల్సింది. థియేటర్‌ ఘటనలో రేవతి మరణం నన్ను కలచివేసింది. థియేటర్‌ ముందు హీరో అభిమానులకు అభివాదం చేశాడు. అలా చేయడం హీరోకి అవసరం. అలా చేయకపోతే అతనిపై ప్రేక్షకుల్లో మరో అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అతనికి పొగరు, బలుపు అంటూ చర్చ మొదలుపెడతారు. ఈ ఘటన వల్ల ఒక ప్రాణం పోయిందనే బాధ అర్జున్‌లోనూ ఉంటుంది. అతన్ని అరెస్ట్‌ చేయించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తి కనబరిచారని, ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. కానీ, అది కరెక్ట్‌ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డిగారు వీటన్నింటినీ మించిన నాయకుడు’ అంటూ సంధ్య థియేటర్‌ ఘటనపై, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై వ్యాఖ్యానించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌. 
AP Deputy CM Pawan Kalyan finally reacted on Allu Arjun's arrest in Pushpa 2 Premiere stampede case. The stampede occurred at Pushpa 2 premiere in Sandhya Theatre. He opined that entire blame has been transferred to Allu Arjun in this incident. He stated that someone from film team, if not Arjun, should have gone to console Revathi's family and visited Sri Tej in hospital and the issue would not have been dragged too much.  Pawan Kalyan further opined that an issue that could have been, should have been dealt in a very amicable way has been dragged on too much to become a huge issue. He also stated that Allu Arjun's staff should have advised him to not to go for the premiere. He remarked that he stopped going after his first three films looking at the crowds.  He also revealed that Megastar Chiranjeevi used to go wearing a disguise to avoid any public nuisance. He opined that someone should have advised in this matter to Allu Arjun to follow such careful steps. He also remarked that Allu Arjun cannot be solely responsible for the incident and film team should have been quick to react.  Pawan Kalyan also stated that he doesn't blame Telangana Police in this issue and stated that he believes in leadership of CM Revanth Reddy, who is not like YSRCP Leader and ex-CM YS Jagan. He remarked that Revanth Reddy allowed for hikes and benefit shows which helped Salaar and Pushpa 2 to put such huge collections.  About the arrest, he stated that because of the arrest Allu Arjun is feeling alone and taking full responsibility of the incident upon himself, which is not good. He opined that his staff, advisors, producers, director or film team someone could have reacted fast and controlled the damage before it ruptured so much.  Finally, he stated that his heart goes out to Revathi and her family who got affected in this incident so much. He stated that their family should be taken care of and stated that Dil Raju has promised about the same. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  విజయం అంత సులువుగా ఎవరినీ వరించదు. జీవితంలో సక్సెస్ సాధించడం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా వరకు సొంతంగా ఎదిగి లక్షాధికారులు,  కోటిశ్వరులు అయిన వారి జీవితాలను పరిశీలిస్తే వారు సమయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ పర్సన్స్ ను ఇతరుల కంటే భిన్నంగా ఉంచేది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుణమే..  ఇంతకీ సక్సెస్ ఫుల్ పర్సన్స్ ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించుకుంటారంటే.. సక్సెస్ ఫుల్ పర్సన్స్ తమకు లభించే ఖాళీ సమయాన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం ఎంచుకుంటారు.  స్నేహితులు,  కుటుంబ సభ్యులు,  ఆత్మీయులతో మాట్లాడటం చర్చలు చేయడం,  ఆలోచనాత్మకంగా మాట్లాడటం ద్వారా సక్సెస్ ఫుల్ పర్సన్స్ కొత్త ఆలోచనలకు, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీని వల్ల వారు ఎదుగుతూనే ఉంటారు. పుస్తకాలు చదవడం,  కొత్త విషయాల గురించి అణ్వేషించడం, అధ్యయనం చేయడం,  తమకు ఉన్న ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించడం,  గొప్ప వ్యక్తుల మాటలు, ఇంటర్వ్యూలు చదవడం, చూడటం మొదలైనవి చేయడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. వాటిని అవసరమైన మెరకు తమ జీవితంలో వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. అయితే సక్సెస్ ఫుల్ పర్సన్స్ మాత్రం పెయింటింగ్,  సంగీతం,  గార్డెనింగ్, వంట వంటి వాటిని ఇష్టమైన అభిరుచులుగా మార్చుకుంటారు. వీటిలో సమయం గడుపుతారు.  ఇలా వారు గడిపే సమయంలో వారికి కొత్త ఆలోచనలు పుడతాయట.  మెరుగైన ప్రణాళికలకు బీజం పడుతుందట. ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో మంచి స్థాయికి వెళ్లినా దాన్ని అస్వాదించగలగరు. అందుకే యోగ,  జాగింగ్.  స్విమ్మింగ్ వంటి కార్యాచరణలతో పాటు జిమ్ చేయడం ఇంట్లోనే వ్యాయామం చేయడం వంటివి తమ రోజులో బాగం చేసుకుంటారు. కళల పట్ల ఆసక్తి ఉన్నవారు,  ఏదైనా కళలో ప్రవేశం ఉన్నవారి ఆలోచనలు చాలా మెరుగ్గా ఉంటాయి.  వీరి ఆలోచనా పరిధి విస్తృతంగా ఉంటుంది. సామాజిక విషయాల పట్ల ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.  సామాజిక కార్యకలాపాలలో భాగస్వాములు అవుతుంటారు. వ్యక్తి వేగంగా విజయం వైపు నడవడానికి ఇవి చాలా సహాయపడతాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలామంది అలవాటు.   ఇది చాలా మందికి కొత్త ఆలోచనలను,  కొత్త అనుభవాలను ఇస్తుంది.  ఈ అనుభవాల నుండి కొన్ని కార్యాచరణలు రూపుదిద్దుకుంటాయి.                                                   *రూపశ్రీ.
  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
    డ్రైవింగ్ నేర్చుకున్న వారికి చాలా సింపుల్ విషయం. కానీ  డ్రైవింగ్ రాని వారికి అది పెద్ద టాస్క్.  ఈ కాలంలో డ్రైవింగ్ ను చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ నేర్చేసుకుంటున్నారు. కార్, బైక్, స్కూటీ ఇతర వాహనాలు ఏవైనా వాటిని ఎలా మెయింటైన్ చేయాలి? అందులో బటన్స్ కానీ,  బ్రేకులు కానీ ఎలాంటి సమయంలో ఎలా ఉపయోగించాలి? ఇవి తెలియడం,  వాహానాల రద్దీలో చాకచక్యంగా వాటిని వినియోగిస్తూ వెహికల్ ను ముందుకు నడపడం  తెలియాలి.  వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా   యాక్సిడెంట్లు జరగడం,  ప్రాణాల మీదకు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.. ఫోన్.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదం.  ఈ విషయంలో ప్రభుత్వం నిషేధం విధించినా సరే.. చాలామంది ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. ఈ అలవాటు కేవలం డ్రైవింగ్ చేసే వారినే కాకుండా ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. వేగం.. వేగంగా ప్రయాణించడం సురక్షితం కాదు.. ఈ హెచ్చరిక బోర్డ్ చాలా చోట్ల రాసి ఉంటుంది. కానీ చాలామంది రాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా వేగంగా నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.  ముఖ్యంగా డ్రైవింగ్ చేయడం అనేది తనకే కాదు.. ఎదుటి ప్రాణాలను ప్రమాదంలో నెట్టకుండా ఉండే చర్య అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సీటు బెల్టు.. ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవడం, బైక్ లో ప్రయాణిస్తున్నట్టైతే హెల్మెట్ వాడకం తప్పనిసరి.  ఇవి చేయనివారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాగి డ్రైవ్ చేయవద్దు.. మద్యం సేవించి వాహనాలు నడపరాదు అనే హెచ్చరిక అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా దీన్ని ప్రభుత్వాలే నిషేధించాయి కూడా.  అయినా సరే చాలామంది  అలాగే డ్రైవ్ చేస్తుంటారు. దీని వల్ల కొన్ని పరిస్థితుతులలో ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. అలసట.. అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు.  అలసిపోయినప్పుడు చాలామంది నిద్ర ఫీల్ అవుతారు.  డ్రైవ్ చేస్తుండగా నిద్రలోకి జారుకునే వారు కూడా ఉంటారు. ఇది చాలాపెద్ద ప్రమాదాలకు కారణం అవుతుంది. ట్రాఫిక్.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించి డ్రైవ్ చేయాలి.  ఈ నియమాలు ఉల్లంఘిస్తే  చట్టపరంగా డ్రైవింగ్ చేసే వారు సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా ఇతరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం, ఇతర వాహన చోదకులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెడ్ లైట్.. హెడ్ లైట్లు ప్రతి వాహనాలకు ఉంటాయి. అయితే వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేవారు చాలా తక్కువ.  హెడ్ లైట్ లు కేవలం వాహనానికి దారి చూపడానికే కాదు.. ముందు వెళుతున్న వాహనాలకు,  వెనుక వస్తున్న వాహనాలకు సరైన దిశానిర్దేశం చెయ్యడంలో కూడా సహాయపడతాయి.                                             *రూపశ్రీ.
  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి,  అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువు మధుమేహం, గుండె జబ్బులు,  జీవక్రియకు సంబంధించిన అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గడం  అంత సులభం కాదని అనుకుంటారు. బరువు తగ్గడానికి జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టించడం దగ్గర్నుంచి డైటింగ్, రకరకాల డైట్ ప్లాన్‌లు పాటించడం వరకు చాలా ఫాలో అవుతారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ  ప్రయోజనాలు లభించకపోతే బరువు తగ్గడానికి డైటింగ్ లేదా వ్యాయామం మాత్రమే పనికిరావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం రోజువారీ దినచర్యలో కొన్ని ప్రత్యేక మార్పులు అవసరం. ముఖ్యంగా నాలుగు పనులు చేయడం ద్వారా బరువు తగ్గవచ్చట.  ఈ నాలుగు ఫాలో అయితే బరువు తగ్గడం ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు. నిద్ర.. చాలామంది  బరువు తగ్గడానికి జిమ్ చేయడం, వ్యాయామాలు చేయడం, ఆహారం తక్కువ తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇలాంటివి  కొనసాగించడం సరికాదు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి విశ్రాంతి,  తగినంత నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి 7-9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.   మంచి రాత్రి నిద్ర బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. విశ్రాంతి..  వ్యాయామం చేయడం లేదా పరుగు వంటి మార్గాల  ద్వారా బరువు తగ్గుతారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వ్యాయామం అవసరమే కానీ  దానితో పాటు కండరాలు తిరిగి రిపేర్ కావడానికి ,  అవి శక్తివంతంగా తయారవ్వడానికి  వారానికి 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి.  శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. సాధారణ వాకింగ్ లేదా యోగాతో పాటు పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. కేలరీలు.. ఫిట్‌గా ఉండటానికి సులభమైన సూత్రం  రోజువారీ తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడం. చాలా మంది వారాంతాల్లో ఆహారం విషయంలో తరచుగా  తమను తాము మోసం చేసుకుంటారు.  ఈ సమయంలో కేలరీలు తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిప్స్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన పాప్‌కార్న్.. డెజర్ట్‌కు బదులుగా డార్క్ చాక్లెట్..  చక్కెర పానీయాలకు బదులుగా పండ్ల రసాలను ప్రయత్నించండి. ప్రోటీన్-రిచ్ అల్పాహారం కోసం, కాల్చిన మఖానా లేదా పనీర్ తినాలి. బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. స్ట్రెస్.. ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వ్యక్తులు  బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం రోజువారీ వాకింగ్ చేయాలి.  లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి.  ఆహారంలో గ్రీన్ టీ, బచ్చలికూర, వాల్‌నట్స్,  గుమ్మడి గింజలు వంటి ఒత్తిడిని తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి.  ఒత్తిడిని తగ్గించడానికి, కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి.   మనస్సును ప్రశాంతపరిచే విషయాలపై దృష్టి పెట్టాలి.                                         *రూపశ్రీ.
శరీర బరువు మొత్తం కాళ్లే మోస్తాయి.  ఎండలో నడవడం, వానలో తడవడం.. క్లిష్టమైన దారిలో వెళ్లడం చేసినప్పుడు కాళ్లే మొదట బాధితులుగా మారతాయి. ఇక పరిగెత్తడం, వేగంగా నడవడం,   రోజువారి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం మొదలైన వాటికి కాళ్లు ఆరోగ్యంగా ఉండాలి.  కాళ్లు బలహీనంగా ఉన్నా, కాళ్ల ఎముకలు,  కండరాలు బలహీనంగా ఉన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు,  కండరాల నొప్పులు, ఎముకలు బలహీన పడటం వంటి సమస్యలు ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాళ్లు బలంగా ఉండటానికి ఆహారం బాగా సహాయపడుతుంది.   ఏ ఆహారాలు తింటే కాళ్లు బలంగా ఉంటాయో తెలుసుకుంటే.. పాలకూర, బచ్చలికూర.. పాలకూర, బచ్చలికూరలో ఐరన్, కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి.  ఇవి కండరాలకు మేలు చేస్తాయి.  శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి.  ఆహారంలో బచ్చలికూర, పాలకూరను విరివిగా తీసుకుంటే కాళ్లు బలంగా ఉంటాయి. సాల్మన్ ఫిష్.. సాల్మన్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి కండరాల పునరుద్దరణలో సహాయపడతాయి.  కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడతాయి. ఎముకలను బలంగా మార్చి కాళ్లు బలంగా ఉండేందుకు  సాల్మన్ ఫిష్ తీసుకోవాలి. చిలకడదుంపలు.. చిలకడదుంపలలో సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి.  ఇవి శరీరానికి శక్తి అందించడంతో పాటు ఎక్కువ సేపు ఆ శక్తిని నిలిపి ఉంచుతాయి. చిలకడదుంపలను ఆహారంలో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఎంతో మంచిది. కోడిగుడ్లు.. ప్రోటీన్,  ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు పుష్కంలగా ఉండే ఆహారంల గుడ్లు కూడా  ఒకటి.  ఇవి కండరాల పెరుగుదలకు సహాయపడతాయి.  కండరాల మరమ్మత్తుకు కూడా సహాయపడతాయి. రోజుకు ఒక గుడ్డు తింటూ ఉంటే  కాళ్ల కండరాలు చాలా తొందరగా గట్టి పడతాయి.  బలంగా మారతాయి. బాదం.. బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు,  విటమిన్-ఇ ఉంటాయి.  ఇవి కండరాలను బలంగా మారుస్తాయి.  కండరాల ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.  కాళ్లు బలంగా ఉండటంలో సహాయపడతాయి. క్వినోవా.. క్వినోవాలో అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.  ఇది చాలా గొప్ప ప్రోటీన్ మూలం ఉన్న ఆహారం.  కండరాల బలాన్ని పెంచడానికి, కండరాలు తొందరగా కోలుకోవడానికి క్వినోవా బాగా సహాయపడుతుంది.                                                 *రూపశ్రీ.
   చాలా మంది తరచుగా తలనొప్పి, సాధారణ జ్వరం వంటి సమస్యలను చాలా లైట్ గా తీసుకుంటారు.  కానీ కొన్ని సందర్భాల్లో వీటి వల్ల  తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటాయని తెలుసా..? అకారణంగా  జ్వరం రావడం,  తలనొప్పి రావడం.. ఉన్నట్టుండి సుస్తీ చేయడం వంటి సమస్యలు  అంతర్లీన వ్యాధుల సంకేతాలు కావచ్చు.  కొన్నిసార్లు  ఇది ప్రాణాంతకమైన సమస్య కూడా కావచ్చు. అలాంటి సమస్యలలో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి.  బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ వల్ల రెండున్నర లక్షల మందికి పైగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకుంటే.. 2020లో బ్రెయిన్‌ ట్యూమర్‌ క్యాన్సర్‌ కారణంగా 2.46 లక్షల మంది చనిపోయారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నప్పటికీ.. చాలా ఏళ్ల వరకు దాని గురించి ఎవరికీ  తెలియదని,  ఆ సమస్య అంత సులువుగా గుర్తించలేమని  వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో మెదడులో కణితి చాలా నెమ్మదిగా పెరుగుతుంది.  ఈ కారణంగా  దాని లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితిలోకొన్ని సాధారణ సంకేతాలను తెలుసుకోవడం,  వీటిని గుర్తించడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం! మెదడు కణితులు మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు అభివృద్ధి చెందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఇది కాకుండా ప్లాస్టిక్,  రసాయన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రమాదంలో పడవచ్చు. జన్యుశాస్త్రం, జీవనశైలి-ఆహారం మొదలైనవాటితో  పాటు అనేక రకాల పర్యావరణ పరిస్థితుల కారణంగా బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారే అవకాశం ఉంది. తలనొప్పి.. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు.  తలనొప్పి  దాని అత్యంత సాధారణ లక్షణం. ఉదయం వేళలో తలలో నొప్పి లేదా ఒత్తిడి పెరగడం లేదా నిరంతర తలనొప్పి చాలా సందర్భాలలో బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మెదడు కణితి లక్షణాలు దాని పరిమాణం, అది పెరిగే  ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అనేక సందర్భాల్లో మెదడు కణితి ఎంత వేగంగా పెరుగుతుందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తలనొప్పి దాని ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుంది.  అందుకే దానిని విస్మరించవద్దు. ఈ లక్షణాలు కూడా.. మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు.  ఇది అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయం సమయంలో తలనొప్పి లేదా ఒత్తిడి చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కువసార్లు చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది.   వికారం లేదా వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది.   కంటిచూపు సరిగా లేకపోవడం,   ఒక వస్తువు రెండుగా కనిపిండం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చేతులు లేదా కాళ్ళలో సంచలనం లేదా కదలిక తగ్గడం జరుగుతుంది. శారీరక సమతుల్యత,  మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాలక్రమేణా జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నాయ తరచుగా తల తిరగడం లేదా ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అనుమాలు వద్దు.. సకాలంలో చికిత్స తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్  తీవ్రమైన సమస్యగా మారే  ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  పెద్దవారు,  స్థూలకాయులు లేదా రసాయనాలకు ఎక్కువగా గురయ్యేవారు మెదడు కణితి  సంకేతాలపై తీవ్రమైన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే, దాని చికిత్స,  కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.   అయితే మెదడులో పెరిగే అన్ని కణుతులు బ్రెయిన్ క్యాన్సర్ కాదని గుర్తుపెట్టుకోవాలి.                                 *రూపశ్రీ