గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి.. పరువు పోగొట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ రెండు స్థానాలకు పోటీ చేయనుంది. ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికలలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక మరో స్థానానికి దాసుజు ప్రవీణ్ కుమార్ లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లను నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.   వాస్తవానికి ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి చూస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అయినా కూడా ఇద్దరిని నిలబెట్టాలని పార్టీ అధినేత వ్యూహాత్మకంగా నిర్ణయించారు. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలనూ కలుపుకుంటే బీఆర్ఎస్ కు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38.  ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తారా? లేక బీఆర్ఎస్ కా అన్న విషయంలో రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉందది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో వారు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధత, ఉత్కంఠా నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
వివేకాహత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా ఇంటి వాచ్ మన్ రంగన్నది సహజ మరణం కాదంటూ ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అనుమానాన్ని పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి కూడా వ్యక్తం చేశారు. అంతే కాకుండా వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణించడంపై లోతైన దర్యాప్తు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగన్న మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఈ రీపోస్టుమార్టం నిర్వహణలో పాల్టొన్నారు.   రంగన్న శరీరంపై  గాయాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.   ఇలా ఉండగా వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి విషయంలో అనుమానాలున్నాయంటూ స్వయంగా చంద్రబాబు కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. అంతే కాకుండా గతంలో పరిటాల హత్య కేసులో కూడా సాక్షులు ఇదే విధంగా అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయాన్ని గుర్తు చేశారు.  అలాగే రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించడంపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్యాబినెట్ లో చర్చించినట్లు వెల్లడించారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామనీ,  వివేకా హత్య కేసులో  సాక్షుల మరణాలు మిస్టరీగా మిగిలిపోవని చెప్పారు.  తలకిందులుగా తపస్సు చేసినా... తప్పు చేసిన వారు తప్పించుకోలేరనీ, చట్ట ప్రకారం శిక్ష తప్పదని అనిత స్పష్టం చేశారు.  రంగన్న మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించిన అనంతరం అన్ని  విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.  
జోగి రమేశ్ అదృష్టం ఏంటో కాని ఎన్నికల్లో ప్రతిసారి ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక నియోజకవర్గానికి వలస వెళ్లి పోటీ చేయాల్సి వచ్చేది ఆయనకి . అయితే వైసీపీ అధ్యక్షుడు కరుణించి ఈ సారి ఆ నాయకుడ్ని సొంత నియోజకవర్గానికే ఇన్చార్జ్‌గా ప్రకటించారు. అయినా కూడా పొలిటికల్‌గా యాక్టివ్ అవ్వలేదు సరి కదా అసలు కనిపించడమే మానేశారు. అధికారంలో ఉన్న అయిదేళ్లూ పలు వివాదాల్లో చిక్కుకున్న ఆ మాజీ అమాత్యుడు... కేసుల భయంతో టీడీపీలో చేరడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారంట. అయితే ఆయనకి టీడీపీ పెద్ద, చిన్న బాసులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంట.  ఏపిలో వైసిపి ఓటమి తరువాత మాజీ మంత్రి జోగి రమేష్ మౌనవ్రతం పట్టారు.  మూడు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ఒక్కటంటే ఒక్కసారే గెలిచి, జగన్ కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. 2014లో సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసిన ఆయన తన రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో ఇక మైలవరంలో జోగి రమేశ్ గెలుపు అసాధ్యమని భావించిన వైసీసీ అధ్యక్షుడు జగన్. 2019 ఎన్నికల నాటికి ఆయన్ని పెడనకు షిఫ్ట్ చేశారు. 2009లో జోగి రమేశ్ కాంగ్రెస్ తరపున అదే పెడన నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకోగలిగారు. ఇక 2024 ఎన్నికల్లో అటు మొదటి సారి వైసీపీ నుంచి పోటీ చేసిన మైలవరం,  రెండో సారి పోటీ చేసిన పెడన కాకుండా  జగన్ ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్  చేశారు.  అక్కడ ఓడిపోయిన జోగి రాజకీయ భవితవ్వం ఏంటనేది ఆయనకే అర్థం కాకుండా తయారైందంట . జగన్ ఆయనకు మూడు సార్లు మూడు చోట్ల నుంచి టికెట్ ఇచ్చినా ఒక్కసారే గెలిచిన ఆయన ఇప్పుడు పొలిటికల్‌గా క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డారు. ఓటమి తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జోగి అటు వైసీపీలో కొనసాగే పరిస్థితి లేక, ఇటు కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నెల్ రాక దిక్కులు చూడాల్సి వస్తుందంట ఏపిలో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడుకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ని అరెస్టు చేయడం జోగి రాజకీయ భవిష్యత్తున ఒక్క కుదుపు కుదిపింది. ఒక వైపు కుమారుడి అరెస్టు., మరో వైపు జోగి రమేష్ ను విచారణ పేరుతో స్టేషన్ల  చుట్టూ తిప్పడం లాంటి పరిమాణాలు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంట.  ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్నీ కావని, తనకు శనిపట్టిందని అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గరా మొత్తుకుంటున్నారట. పార్టీ అధికారంలో ఉన్నపుడు జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు తన కొంప ముంచిందని కన్నీరుమున్నీరవుతున్నారట. వాస్తవానికి నారా లోకేశ్ రెడ్ బుక్ లో టాప్ ఫైవ్ లో తన పేరు ఉందని, తనని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే భయంతో వణికిపోతున్నారంట. ఆల్రెడీ ఇప్పటికే.. ఆయన కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ చేశారు.. ఇంకా రాజకీయ అరంగేట్రం కూడా చేయని తన కొడుకుని ఇప్పటికే జైల్లో వేశారని, ఇక తన వంతేనని ఆ మాజీ మంత్రి బాధపడిపోతున్నారంట. గతంలో చంద్రబాబు ఇంటిపై మందీమార్భలంతో వెళ్లి దాడి చేసిన కేసులో తనని అరెస్ట్ చేసేస్తారని ఆయన డిసైడ్ అయిపోయారట. అప్పుడేదో మంత్రి పదవి వస్తుందన్న ఆశతో, జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి అలా చేశానని, కానీ చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయని కనిపించిన  తెలుగుదేశం వాళ్లందరితో చెబుతున్నారట. పైగా తాను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడినని, తనను అరెస్ట్ చేయకుండా వదిలేయమని బతిమలాడుకుంటున్నారట.  జోగి రమేశ్ అరెస్ట్ తప్పించుకోవాలంటే తెలుగదేశంలో చేరితేనే మంచిదని ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌లను కలిసేందుకు అపాయిట్మెంట్ అడిగారట. గతంలో వైసీపీలో పని చేసి తర్వాత తెలుగుదేశంలో చేరి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పొజిషన్ లో ఉన్న కృష్ణాజిల్లాకే చెందిన బీసీ నేత, మంత్రి పార్థసారథితో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారంట. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పేశారంట. ఇటీవల నూజివీడులో టీడీపీ నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్న విషయంలో కూడా పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని తలపట్టుకున్నారట.  ఏం చేస్తే చంద్రబాబును కలవొచ్చో చెప్పాలని,  పార్టీలో చేరడానికి సాయం చేయండని టీడీపీ నేతలకు ఫోన్లు చేస్తున్నారట. ఆ క్రమంలో వైసీపీ  కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారాయన. ఆయన టీడీపీ లో చేరేందుకు ప్రయత్నిస్తున్న విషయం జగన్ కు కూడా తెలిసిందట. అయితే జగన్ పిలిపించి మాట్లాడతారేమోనని జోగి రమేష్ ఎక్స్ పెక్ట్ చేశారంట. అయితే పార్టీ నుంచి పోవాలనుకునేవాళ్లు ఎవరైనా, ఎంతమందైనా పోవొచ్చని అందువల్ల తమకేమీ నష్టం లేదని విజయసాయిరెడ్డి పార్టీ వీడినపుడు జగన్ స్పష్టం చేశారు. దాంతో విజయసాయిరెడ్డి పార్టీ వీడితేనే పట్టించుకోని జగన్ తననేం పట్టించుకుంటారని ఫీల్ అవుతున్నారంట. మొత్తానికి ఇప్పుడాయన పరిస్థితి ఎటు కాకుండా తయారైందిప్పుడు.
ALSO ON TELUGUONE N E W S
  హీరో రామ్ పోతినేని తన 22వ సినిమాని 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, 'RAPO 22' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఇందులో సాగర్ అనే పాత్ర పోషిస్తున్నాడు రామ్. దీంతో సాగర్ పేరు వచ్చేలా టైటిల్ ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఊహించని టైటిల్ ఒకటి తెరపైకి వచ్చింది. (Ram Pothineni)   'RAPO 22'కి 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకు రావడం సహజం. పవన్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 'డిప్యూటీ సీఎం తాలూకా' అనే మాట మారుమోగిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ సినిమాకి 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే టైటిల్ పెట్టారనే వార్త ఆసక్తికరంగా మారింది.   వరుస మాస్ సినిమాలు చేసి పరాజయాలు ఎదుర్కొన్న రామ్.. కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.  
Aditya Om has come up with a unique, strong content based and message-oriented film Bandi. Directed by Raghu Tirumala, the film was produced under the Galli Cinema banner. The movie received an excellent response from the audience in theatres. With Bandi achieving success, the film unit organized a success meet. Prasanna Kumar, General Secretary of the Telugu Film Chamber of Commerce, attended the event as the chief guest. Speaking at the event, Prasanna Kumar said, "Bandi is an amazing film. This movie, made with the intention of protecting the environment, has captivated everyone. That’s why it continues to get houseful shows. Aditya Om is a unique actor. He came from UP and is working with great passion here. The visuals and camera work in Bandi are exceptional. Raghu Tirumala has made the film with an excellent point. This film, which has captivated everyone, should go even further. It's great to see Bandi doing well commercially." Raghu Tirumala stated, "Aditya Om has greatly encouraged newcomers like us. It’s with his support that we could make this movie so well. Without him, this film wouldn't have been possible. Venkateshwara Rao Daggu watched this movie and was very excited. Everyone is praising the music and visuals of this film. Thanks to the audience for supporting this film in such a way." Aditya Om expressed, "Everyone is supporting Bandi. With more media support, it will reach even more people. It is well known how environmental imbalance is causing disasters. Thanks to the audience for supporting Bandi, which carries a strong message. If this support continues, I will try to impress the audience with many more good films. Thanks to the audience who made this film a success through their love and support."
  ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'ఛావా'. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్‌ ఊటేకర్‌ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా భాషలలో కాకుండా, కేవలం హిందీలోనే విడుదలైనప్పటికీ.. వరల్డ్ వైడ్ గా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇంతటి సంచలనాలు సృష్టిస్తోన్న 'ఛావా' చిత్రం.. తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Chhaava Telugu)   'ఛావా' తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. మార్చి 7న తెలుగు రాష్ట్రాల్లో 550 కి పైగా థియేటర్లలో తెలుగు వెర్షన్ విడుదలైంది. ఇప్పటికే పలువురు ప్రేక్షకులు హిందీ వెర్షన్ ను చూసినప్పటికీ, తెలుగు వెర్షన్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.3.03 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫస్ట్ డే వచ్చిన రెస్పాన్స్ ని బట్టి చూస్తే.. తెలుగులోనూ ఫుల్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.   మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన 'ఛావా' చిత్రంలో శంభాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించింది.     ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు.    
Cast: Ibrahim Ali Khan, Khushi Kapoor, Mahima Chaudhry, Jugal Hansraj, Archana Puran Singh, Dia Mirza, Suniel Shetty  Crew:  Written by Riva Razdan Kapoor, Ishita Moitra, Jehan Handa Music by Sachin-Jigar, Tushar Lall Cinematography by Anuj Samtani Edited by Vaishnavi Bhate, Sidhanth Seth Directed by Shauna Gautam Produced by Karan Johar, Apoorva Mehta, Somen Mishra Runtime: 119 Minutes Language: Hindi  Genre: Romance Release Date: 07th March, 2025 Available on OTT Platform: Netflix Saif Ali Khan's son Ibrahim Ali Khan has debuted as an actor with the college romance, Nadaaniyan. Sridevi's second daughter Khushi Kapoor played leading lady role in the film. Suniel Shetty, Mahima Chaudhry, Jugal Hansraj, Dia Mirza and Archana Puran Singh are cast in the supporting roles in this candyfloss new-age romantic entertainer. Karan Johar produced the movie on Dharmatic Entertainment production house, the OTT wing of Dharma Productions. The movie released on 7th March and let's discuss about the film in detail.  Plot:  Arjun Mehta (Ibrahim Ali Khan) hails from a middle class family from Greater Noida. He aspires to be a successful lawyer. Whereas Pia Jaisingh (Khushi Kapoor) hails from a rich family from South Delhi. She is a social media influencer and sees herself as ‘a poster princess of privilege and entitlement'. As she faces peer pressure in her Falcon High School, she decides to hire Arjun as her fake boyfriend for Rs.25,000/- per month salary. He agrees for this arrangement as it helps him buy better clothes and books.  Arjun Mehta's parents are both working professionals while Pia Jaisingh's parents' relationship is under distress with her father (Suniel Shetty) having an affair and her mother (Mahima Chaudhry) is more pre-occupied with her parties. This class difference becomes an hindrance in both Pia and Arjun's mentalities and assessment of relationships. How these two fall in "real" love after starting a "fake" romance is the story.  Analysis:  Ibrahim Ali Khan looked uncomfortable and highly misplaced in the character. His performance is not impressive while his looks are dashing. He needs more work to brush up his skills or find those roles like his father Saif Ali Khan that he is comfortable with. Khushi Kapoor gives apt expressions yet her dialogue delivery is once again unimpressive. Both the young actors need loads of work to be done before they can pull off such characters.  Senior actors make the scenes work while writing for them is also just poor. A film that wants to showcase Gen-Z emotions and their dilemma needs a better premise and this story is too convoluted to start with. The class differences that the film wants to address along with Gen-Z understanding of emotions looks too outlandish. Kuch Kuch Hota Hai worked because of the emotional connect it provided glossing over the over-the-top portrayal of college life.  Even Student of the Year had strong core but this one lacks in such compelling emotion. Yes, love dramas and romances are necessary to be made but if there are no conflicts that filmmakers can think of then they should not be made. This kind of premise and such writing is a glaring wastage of time and nothing more than that. To soft launch kids of popular stars this kind of films won't be working. This is just a forgettable film other than few scenes where senior actors take over.    In Conclusion:  Nepotism done wrong trying to follow Student of The Year and Kuch Kuch Hota Hai formulae. Rating: 2.0/5 
Raa Raja impressed everyone with its unique promotional campaign and premise. It is India's first ever Horror Film without showing the character faces. The movie released Today, in theatres all over. Shri Padmini Cinemas have produced the film with Sugi Vijay and Mounika Helen in the lead roles.  Plot:  Raja ( Suji Vijay) and Rani (Mounika Helen) get married and lead their life happily. After a family gathering, all of a sudden, Raja attacks Rani and we are left baffled by the situations that follow. What could be the reason on the attack? How Raja faces the scary situations is rest of the story.   Performances:  Suji Vijay proved his acting prowess with a balanced performance throughout the film. Mounika Helen keeps us all hooked to the screens with a performance that haunts us even after walking out of the theatres after watching the film. Nagoor Khan's comedy in Charlie Bean character works while Madhukar as CI twists the tale in an interesting manner.    Analysis:  Shri Padmini Cinemas with lavish production values showcased their commitment to producing highly engaging and enthralling content. Director and Producer B Shiva Prasad's daring attempt is appreciable. He showcased lots of guts and conviction in making a movie without showing character faces throughout.  The other technical aspects like DOP Rahul Shrivastav's Camera work and editing by Uppu Maruthi are apt for the film. Music by Shekhar Chandra holds our interest and enhances the drama. Raa Raja movie has compelling visuals and apt BGM score that gives thrills and chills to the audiences.  The movie writing is highly relatable as every scene feels like taken from our life and presented on the screen, as is. Makers should be appreciated for attempting to narrate such a tale in this experimental manner showcasing their passion for the filmmaking.    Final Verdict:   Raa Raja has effecitve thrills for you to watch in a theatre near you.    Rating: 2.75/5
సినిమా పేరు: రా రాజా  నటీనటులు:సుగి విజయ్,మౌనిక తదితరులు రచన, నిర్మాత, దర్శకత్వం:బూర్లె శివప్రసాద్  సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీ వాత్సవ్ ఎడిటర్: ఉప్పు మారుతీ  సంగీతం:శేఖర్ చంద్ర  బ్యానర్ :పద్మిని సినిమాస్  రిలీజ్ డేట్: 07- 03 -2025  భారతీయ సినీ చరిత్రలో మొట్టమొదటి సారి ఫేస్ చూపించకుండా కేవలం నటీనటుల డైలాగులని, ఎక్స్ ప్రెషన్స్ ని మాత్రమే చూపిస్తు తెరకెక్కిన మూవీ'రా రాజా'(Raa raja).ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ని కూడా సంపాదించుకోగా,ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ  రాజా (సుగి విజయ్) ఒక కన్ స్ట్రక్షన్స్  కంపెనీ లో జాబ్ చేస్తు తన భార్య రాణి (మౌనిక )తో కలిసి ఒక రిచ్ హౌస్ లో ఉంటుంటాడు.తన భార్య దెయ్యం అయ్యి తనని టార్చర్ చేస్తుందని చనిపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతుంటాయి.పోలీసు స్టేషన్ కి వెళ్లి కూడా తన భార్యని చంపానని చెప్తాడు.కానీ మౌనిక బతికే ఉంటుంది.మరి రాజా ఎందుకు తన భార్య చనిపోయి దెయ్యం అయ్యి వేధిస్తుందని పోలీసులకి చెప్పాడు? అసలు పోలీసులతో చెప్పినట్టుగా రాజా తన భార్యని చంపాడా? అలా జరిగితే రాణి బతికే ఉంది కదా? రాజా ని వేధిస్తున్న దెయ్యం ఎవరు? అసలు ఈ కథలో రాణి క్యారక్టర్  ఏంటి?  ఈ కథ యొక్క లక్ష్యం ఏంటనేదే ఈ చిత్ర కథ ఎనాలసిస్  ఇలాంటి లైన్ తో ఈ రోజుల్లో ఇలాంటి కథ రావడం చాలా అవసరం.ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట గాని,పాత జంటలు అయినా అక్రమ సంబంధం మోజులో పడి,ఒకరికొకరు చంపుకుంటున్నారు.అలాంటి కథతోనే ఈ సినిమా వచ్చింది.కానీ కధనంలో,సన్నివేశాల్లో మంచి ఇంట్రెస్ట్ ని పెట్టి ఉంటే సినిమా ఫలితం ఇంకొంచం బాగుండేది.ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఒకే పాయింట్ రావడం ప్రేక్షకుడికి అంతగా రుచించకపోవచ్చు.అలా కాకుండా రాణి క్యారెక్టర్ ని కూడా ఫస్ట్ హాఫ్ లో ఒక గదిలో భర్త గురించి ఆలోచిస్తు అతనికి నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా చూపించాల్సింది.లేదా మరింత క్యూరియాసిటీ కలిగించే విధంగా రాజా తన గర్ల్ ఫ్రెండ్ తో, రాణి  తన బాయ్ ఫ్రెండ్ తో వేరు వేరు గదుల్లో చాట్ చేస్తున్నట్టు చుపించాల్సింది.దీంతో ఎవరు ఎవర్ని చంపుకుంటారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉండేది.ఆ ఇద్దరకీ పారలాల్ గా ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్టుగా సస్పెన్సు ని మెయిన్ టైన్ చేస్తు ఇంటర్వెల్ టైంకి రాజా ఎప్పుడో రాణి ని చంపేశాడని చూపిస్తే ప్రేక్షకులు సరికొత్త థ్రిల్ గా ఫీల్ అయ్యే వాళ్ళు.ఇక సెకండ్ ఆఫ్ లో రాజాని, రాణి దెయ్యంలా వేధించడం, రాజా చనిపోవడానికి ట్రై చేస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వడం, చివరకి దర్శకుడు తను అనుకున్న కథ లక్ష్యానికి వస్తే బాగుండేది. నటీనటులు,సాంకేతిక నిపుణులపని తీరు నటీనటుల ఫేస్ కనపడదు కాబట్టి వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఏముండదు.పైగా మూవీలో కనపడేది రెండు క్యారక్టర్ లు మాత్రమే.దర్శకుడు,రచయిత శివప్రసాదే(Boorle Shivaprasad) కాబట్టి దర్శకుడిగా పర్లేదు గాని రచయిత గా మాత్రం ఇంకొంచం శ్రద్ధ పెట్టాల్సింది.ఇలాంటి సినిమాలకి డైలాగులు చాలా ముఖ్యం. కాబట్టి వాటి పై మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.కాకపోతే పోలీసు స్టేషన్ లో కామెడీ నటుడి డైలాగులు మాత్రం బాగా పేలాయి.శేఖర్ చంద్ర తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మూవీకి ఒక కొత్త లుక్ ని తీసుకొచ్చాడు.రాహుల్ శ్రీ వాత్సవ్ ఫొటోగ్రఫీ అయితే ప్రేక్షకులకి ఐ ఫీస్ట్ ని కలిగించింది. నిర్మాణ విలువలు, ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మూవీ చివర్లో వచ్చిన సాంగ్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే  'రారాజా' లాంటి మూవీ ప్రస్తుత జనరేషన్ కి అవసరమే.కానీ స్క్రీన్ ప్లే, డైలాగులు మరింత బలంగా ఉండుంటే 'రారాజా' మరింతగా ప్రేక్షకులకి నచ్చేదేమో  రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                                అరుణాచలం   
  'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగగా, రెండో షెడ్యూల్ ఒరిస్సాలో ప్రారంభమైంది. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న 'SSMB 29'లో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. మహేష్ తండ్రిగా నానా పటేకర్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న ఒక న్యూస్.. మహేష్ ఫ్యాన్స్ ని భయపెడుతోంది. (SSRMB)   'SSMB 29'లో మహేష్ పాత్ర పేరు రుద్ర అని ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమాల్లో ఆయన పోషించే పాత్రలు, ఆ పాత్రల పేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. పార్థు, పండుగాడు, అజయ్, సీతారామరాజు, రమణ ఇలా ఏ పాత్ర పోషించినా మహేష్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు రుద్ర పేరు కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. అయినప్పటికీ మహేష్ అభిమానుల్లో చిన్న భయం కనిపిస్తోంది. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'శక్తి' సినిమా అని చెప్పవచ్చు. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా అందులో ఒక పాత్ర పేరు రుద్ర. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలై, డిజాస్టర్ గా నిలిచింది. అందుకే రుద్ర పేరుని కొందరు మహేష్ ఫ్యాన్స్ నెగటివ్ గా ఫీలవుతున్నారు. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం.. అక్కడుంది దర్శకధీరుడు రాజమౌళి అని, ఒకవేళ క్యారెక్టర్ నేమ్ నిజంగానే రుద్ర అయినా అసలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అంటున్నారు. అయినా సినిమాలో విషయం ఉండాలి కానీ, పేరుది ఏముందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే 'కన్నప్ప'లో ప్రభాస్ పోషిస్తున్న అతిథి పాత్ర పేరు సైతం 'రుద్ర' కావడం విశేషం.  
అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ssmb 29 కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheh Babu) కంప్లీట్ గా తన మేకోవర్ స్టైల్ ని మార్చేసిన విషయం తెలిసిందే.మహేష్ లుక్ ని చిత్ర బృందం అధికారకంగా రిలీజ్ చేయకపోయినా,సోషల్ మీడియాలో మహేష్ పిక్స్ ఫుల్ వైరల్ అవుతు వస్తున్నాయి.దీంతో  ssmb 29 లో ఒక  కొత్త మహేష్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ తో ఉన్నారు.  మహేష్ రీసెంట్ గా ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాలో అడుగుపెట్టాడు.కోరాపుట్ జిల్లాలో ఉన్న 'తోలోమాలి',దేవ్ మాలి,మాచ్ ఖండ్ ఏరియాల్లో ssmb 29  షూటింగ్ జరుపుకోనుంది.'తోలోమాలి 'పర్వతంపైన అయితే చిత్ర యూనిట్ పెద్ద సెట్ నే వేసింది . ఈ సెట్ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కూడా కలిగించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.పైగా షూటింగ్ జరిగిన అన్ని రోజులు 'దేవ్ మాలి' పర్వతంపైనే మహేష్ ఉండనున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లని కూడా చిత్ర యూనిట్ రెడీ చేసింది. ఇక ఈ మూవీలో గత కొన్ని రోజుల నుంచి మలయాళ సూపర్ స్టార్స్ లో ఒకడైన పృథ్వీ రాజ్ సుకుమారన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.పృథ్వీ రాజ్ కూడా ఈ మధ్యనే ssmb 29 లో ఉన్నట్టుగా చిన్న హింట్ లాంటిది కూడా ఇస్తు సోషల్ మీడియా వేదికగా పోస్ట్  చేసాడు.ఇప్పుడు ఆ వార్త నిజమని తేలిపోయింది.ఎందుకంటే పృథ్వీ రాజ్ కూడా మహేష్ తో పాటే 'దేవ్ మాలి' పర్వతంపైన ఉన్నాడు. మిగతా నటీనటులు కూడా త్వరలోనే అక్కడకి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.దుర్గ ఆర్ట్స్ పతాకంపై గతంలో ఎన్నో హిట్ చిత్రాలని  నిర్మించిన కె ఎల్ నారాయణ(Kl Narayana) అత్యంత భారీ వ్యయంతో ssmb 29 ని నిర్మిస్తున్నాడు.మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తుండగా,కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.రాజమౌళి(Ss Rajamouli) తన గత చిత్రాలని మించి ఈ సినిమాని హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.   
  కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో  సినిమా టికెట్ ధరల విషయంలో కీలక ప్రకటన చేశారు. సినిమా టికెట్‌ ధరలను రూ.200 కి పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్‌లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని సీఎం తెలిపారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, సినీ పరిశ్రమ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.   కన్నడ సినిమాలను ప్రమోట్‌ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సిద్ధ రామయ్య ప్రకటించారు. అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్‌లో ఒక ఫిల్మ్‌సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీని నిర్మాణానికి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.  
Nani has become Natural Star of Telugu Cinema. He has been trying to increase his reach Pan-India with his recent films. The actor has decided to change his boy-next-door image for his Dasara. Director Srikanth Odela could create an ideal commercial film for it. Now, the duo is working for their next film, The Paradise.  The team has decided to take example of SS Rajamouli's RRR to take their film global. The Hollywood magazine, Variety, wrote about the film and the team have stated that they are making it as India's "Mad Max". It looks like Nani is looking to reach to global audiences with this film.  By placing it as "Mad Max", he is looking to attract global audiences to give this film, a try. The makers have even revealed the story and stated that the film story will happen in fictional Secunderabad. They have also revealed that the story will follow an downtrodden community who doesn't even have any recognition.  A "bastard" becomes their leader and the tale will be told in wild manner. Looks like the loud and wildness of the film will be crossing the normal decible level and makers are preparing us for it. In any case, we wish for Indian cinema to go global and attain its recoginition just like Chinese films, in recent past. Anirudh Ravichander is scoring music for the film. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
1979- శశిబాల ఒక అందమైన 20 ఏళ్ల యువతి. దిల్లీలోని ప్రఖ్యత లక్ష్మీబాయ్‌ కాలేజి నుంచి డిగ్రీని కూడా సాధించింది. శశిబాలకు పది నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు తను ఆర్నెళ్ల గర్భవతి కూడా! బయట నుంచి చూసేవారికి ఇదంతా ఓ అందమైన జీవితం తాలూకు వర్ణనగా తోచవచ్చు. కానీ శశిబాల వ్యక్తిగత జీవితం ఆ చిత్రానికి తలకిందులుగా కనిపిస్తుంది. పెళ్లయిన దగ్గర్నుంచి శశిబాల అత్తమామలు కట్నం కింద ఏదోఒక వస్తువుని తీసుకురమ్మంటూ గొడవచేస్తూనే ఉన్నారు. శశిబాల తన తల్లి సత్యరాణి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ, తల్లీకూతుళ్లు వారి కోరికను ఎలా తీర్చాలా అని మదన పడుతూనే ఉన్నారు. సత్యరాణి వితంతువు, పైగా శశిబాలతో పాటు ఆమె మీద మరికొందరి బిడ్డల భారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఓ రోజు సత్యరాణికి, శశిబాల అత్తగారింటి నుంచి వెంటనే రమ్మంటూ కబురు వచ్చింది.     పరుగుపరుగున వెళ్లిన ఆమెకు తన బంగారు కూతురు నల్లటి ముద్దగా ఓ మూల కనిపించింది. ‘నీ కూతురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ చెత్తని ఇక్కడి నుంచి పట్టుకుపో!’ అన్నారు శశిబాల అత్తగారు. కూతురి శవాన్ని కప్పేందుకు వాళ్లు ఒక దుప్పటిని అందించేందుకు కూడా సిద్ధపడలేదు. 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలానే వినిపించేవి. కిరసనాయిలు పోసుకునో, చీరకు నిప్పంటుకునో నిస్సహాయంగా ఎందరో ఆడవాళ్లు చనిపోయేవారు. అవన్నీ ప్రమాదాలో ఆత్మహత్యలో కాదనీ, వరకట్నపు హత్యలనీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. కానీ సత్యరాణి అలా నిశ్శబ్దంగా ఊరుకోదల్చుకోలేదు.   స్కూటరు కొనిపెట్టలేదన్న కారణంగా తన అల్లుడు ఆమెను చంపేశాడంటూ కేసుని నమోదు చేసింది. అయితే అప్పట్లో చట్టాలు ఇంత కఠినంగా ఉండేవి కాదు. పెళ్లి సమయంలో అందుకున్నవే కట్నకానుకల కిందకి వస్తాయన్న నిర్వచనం ఉండేది. పైగా చావుకి సంబంధించిన ఆరోపణలను నిరూపించే బాధ్యత మృతుల తరఫు న్యాయవాదులకే ఉండేది. సత్యరాణి ఒక పక్క తన కూతురి చావుకి సంబంధించిన కేసులను పోరాడుతూనే, మరో పక్క వరకట్నపు చావులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యుల కోసం గొంతు విప్పడం మొదలుపెట్టింది. తమ కూతురు వరకట్నం కారణంగా చావుని ఎదుర్కొందిని భావించిన ప్రతి ఒక్కరి పోరాటానికీ ఆసరాగా నిలిచేది.       సత్యరాణి తనలాంటి దుస్థితిలో ఉన్న మరికొందరితో కలిసి శక్తిశాలిని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేవారికి ఈ సంస్థ నిలువనీడను కల్పించేది. సత్యరాణికి చదువు లేదు. వయసు పైబడుతోంది. పైగా చెట్టంత కూతురిని పోగొట్టుకుంది. అయినా వరకట్నానికి వ్యతిరేకంగా తన పోరులో రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. రానురానూ సత్యరాణి ఉద్యమం ఫలితాలనివ్వసాగింది. వరకట్న వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మరింత పెట్టాల్సి వచ్చింది. వరకట్నం అంటే కేవలం డబ్బే కాదు, వస్తువుని కోరడం కూడా వరకట్న పరిధిలోనే వస్తాయంటూ చట్టాన్ని మార్చింది కేంద్రం. పెళ్లైన ఏడేళ్ల లోపు స్త్రీ ఆత్మహత్య చేసుకున్నా కూడా, అందుకు కారణం అత్తవారింటి ఆరళ్లు కూడా కావచ్చునంటూ మరో సవరణ కూడా చేసింది.   ఒక పక్క సమాజంలో మార్పు రావడం, మరో పక్క చట్టాలకు పదునెక్కించడంతో... వరకట్న హత్యలు కొంతమేరకన్నా తగ్గాయి. ముఖ్యంగా ‘వంటగదిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు’ చాలామేరకు తగ్గాయి. నేరాల తగ్గుదలను చాలామంది గమనించారు కానీ, అందుకు కారణమైన సత్యరాణి వంటి తల్లుల పోరాటాన్ని పెద్దగా గమనించింది లేదు. వరకట్న చావులను తగ్గించడంలోనే సత్యరాణి విజయం సాధించడమే కాదు, మారిన చట్టాలకు అనుగుణంగా తన అల్లుడికి శిక్షపడేలా కూడా విజయం సాధించింది. 2014లో సత్యరాణి తన 85వ ఏట ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ ఆమె జీవితం ఏనాడూ వృధాగా పోలేదు. ఒక తల్లిగా తాను పొందిన గర్భశోకాం, మరో తల్లికి కలుగకుండా ఉండేందుకే అనుక్షణం పోరాడింది. ఎందరో కూతుళ్లకి న్యాయాన్ని సాధించింది. మరెందరో వధువులు వరకట్నపు కోరల్లో చిక్కుకోకుండా తన జీవితాన్ని అడ్డు వేసింది.   - నిర్జర.
మహిళలు భార్యగా, తల్లిగా నిర్వహించే బాధ్యతలు ఎంతో విలువైనవి.. బాలచంద్రునికి వీరతిలకం దిద్దిన మగువ మాంచాలను, భరతజాతికి ఛత్రపతిని ప్రసాదించిన మహారాజ్ఞి జిజాబాయిని చరిత్ర ఎన్నటికీ మరచిపోదు. కుటుంబానికి కేంద్రబిందువుగా భర్తపై, బిడ్డలపై స్త్రీ ప్రభావం గణనీయమైనది. "నా జీవితంలో ఇద్దరు దయామయుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అనురాగాన్ని, ఆదర్శాల్ని గోరుముద్దలుగా కలిపి తినిపించిన మా అమ్మ ఒకరు; చేతి బంగారు గాజుల్ని అమ్మి నా పై చదువులకు డబ్బు కట్టిన మా అక్క ఒకరు... నేను సాధించిన విజయాలన్నీ వారి పాదాల వద్ద వినమ్రంగా అర్పిస్తాను" అంటారు భారతరత్న అబ్ధుల్కలామ్. అందుకే ఇంటిని నందనంగా తీర్చిదిద్దినా, నరకంలా మార్చినా కారణం ఇల్లాలే.  మగవారూ మారాలి... ఇంటినీ, ఇంటి పేరునూ వదలి అర్థాంగిగా తమ ఇంట అడుగుపెట్టిన మగువ పట్ల మగవారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సహధర్మచారిణిగా ఆదరించాలి. భార్య అంటే తమ అసహనాన్ని, ఆవేశాన్ని భరించే బానిసగా భావించటం తగదు. సంపాదన ఒక్కటే గొప్పతనానికి గీటురాయి కాదు. కుటుంబ నిర్వహణ, ఆలనాపాలనా... ఇవన్నీ నిజంగా స్త్రీమూర్తి కార్యపటిమకు ప్రతీకలే. అతివలు చేసే ఇంటి పనులను చులకనగా చూడటం పురుషులు మానుకోవాలి. తనభార్య సీతలా ఉండాలని, పరాయి స్త్రీ మాత్రం సినిమాతారలా పలకరించాలనుకునే వికృత స్వభావాల నుంచి పురుషులు సంస్కారవంతులుగా ఎదగాలి. సప్తపది నడిచిన భర్తే భార్యను గౌరవించకపోతే ఇక సంతానం ఏం గౌరవిస్తుంది!  మేడిపండు మన సమాజం...  ఇటీవల ప్రపంచవ్యాప్తంగా స్త్రీని గౌరవించే విధానంపై పరిశోధనలు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచం మొత్తంలో మహిళలను గౌరవించడంలో స్కాండినేవియన్ దేశాలు భౌగోళికంగా చిన్నవైనా ముందువరుసలో ఉన్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా వెనుకవరుసలో నిలిచాయి. ఇక 'యత్రనార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః' అంటూ ఉపదేశాలు వల్లించే భారతీయులు కూడా చివరిస్థానంలో ఉన్నారు. మేడిపండు మనస్తత్వం గల వ్యక్తులతో నిండివున్న మన సమాజం తలదించుకోవాల్సిన కఠోర వాస్తవమిది. భారతీయ మహిళే ఫస్టు.. భారతనారీమణుల సాంప్రదాయిక జీవనశైలికి ప్రపంచదేశాలే నీరాజనాలు పలుకుతున్నాయి. అస్తిత్వానికి, అపరిమిత స్వాతంత్ర్యానికి భేదం తెలియని పాశ్చాత్య మహిళాలోకం స్త్రీవాదం పేరుతో నేలవిడిచి సాముచేసింది. ఏకంగా సామాజిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసుకుంది. భారతీయ మహిళలు మాత్రం తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటూ సాగుతున్నారు.  భారతీయ మహిళలకు గుర్తింపు కాదు గౌరవం కావాలిప్పుడు. అది కూడా బయటకు పొగుడుతూ వెన్నుపోటు పొడిచేది కాదు.. మహిళను తనను తానుగా గుర్తించే గౌరవం కావాలి.                                        ◆నిశ్శబ్ద.
  చాలామంది గతంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉంటారు. వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ తమలో తాము కుమిలిపోతుంటారు. స్ఫూర్తివంతమైన విషయాలు చదివినంత సేపు వారికి ఎంతో ధైర్యం వస్తుంది. కానీ తరువాత అంతా మామూలే! ఇలాంటి వారికి తమ బాధలను స్నేహితులతో చెప్పుకోవాలంటే  ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. అలాంటి సమయంలో ఈ పరిస్థితుల నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.. మన సమస్యలన్నింటికీ ముఖ్యకారణం మనస్సు వర్తమానంలో ఉండక పోవడమే! గతాన్ని తలుచుకుంటూ బాధపడడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మనస్సు స్వభావం. గతంలోని చేదు అనుభవాలను పూడ్చిపెట్టి, భవిష్యత్తు గురించి ఆలోచనల్ని అరికట్టినప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్ని తీర్చిదిద్దుకోవడం సాధ్యమవుతుంది. ఈ సమస్యను మూడు మార్గాలను అనుసరించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. భగవంతునితో మొరపెట్టుకోవడం :  ఒక్కసారి భగవద్భక్తుల జీవితాల్ని తరచి చూస్తే వారంతా ఎన్ని కష్టాల్ని అనుభవించారో మనకు అర్థమవుతుంది. ఆ మహాభక్తులు అనుభవించిన కష్టాలు మేరు పర్వతమంతైతే మన కష్టాల్ని ఆవగింజతో పోల్చవచ్చు. కానీ మనకు కలిగిన ఆవగింజంత కష్టానికే అవధుల్లేని అశాంతికి లోనవుతుంటాం. మరి వారు మేరుపర్వతమంత కష్టాల్ని సైతం అవలీలగా ఎలా దాటగలిగారు? తమ బాధలను భగవంతునితో మొరపెట్టుకోవడం వల్లనే అది సాధ్యమయిందని నిరూపించారు సఖుబాయి, జనాబాయి, మీరాబాయి, ముక్తాబాయి, కాన్హోపాత్ర లాంటి అనేక మంది భక్త శిరోమణులు. It is difficult to live without someone to whom we can open our hearts. But to whom can we better dis- close them than to God! - Thomas A. Kempis ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించే తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి అన్నీ ఆ భగవంతుడు మాత్రమే! కాబట్టి మన బాధలను భగవంతుని వద్ద విలపిస్తూ విన్నవించుకుంటే మేరు పర్వతమంత కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోతుంది. 'వ్యాకుల మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనల్ని తప్పక వింటాడు'. ఈ మార్గాన్ని అనుసరించడం కష్టమైనప్పటికీ ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు! స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం: మనోవ్యధలను తొలగించేందుకు ఔషధంలా ఉపయోగపడే వారు మంచి స్నేహితులు. No medicine is more valuable, none more. efficacious, none better suited to be cure of all our miseries than a friend - St. Aleredx మన బాధలను స్నేహితులతో చెప్పుకోవడానికి ఆత్మాభిమానం అడ్డువస్తోందని అనుకోవడానికి కారణం స్నేహితుడు, మనం వేర్వేరు అనే భేద భావం ఉండడం వల్లనే! 'నిజమైన స్నేహితుడు ఇద్దరిలో ఉన్న ఒకే ఆత్మ'  A true friend is one soul in two bodies - Aristotle కాబట్టి బాధలను తలచుకుంటూ కుమిలి పోవడం కన్నా స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం వల్ల మనస్సు తేలికపడుతుంది. కార్యకలాపాల్లో మనస్సును నిమగ్నం చేయడం :  వీలైనంత వరకూ ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసిమెలిసి ఉండడం, ఏదో ఒక పనిలో మనస్సును నిమగ్నం చేయడం వల్ల గతాన్ని మరిచిపోవడం సాధ్యమవుతుంది. స్వామి వివేకానందుని పాశ్చాత్య శిష్యురాలైన మేడం ఈ. కాల్వే మనోవేదనకు గురైనప్పుడు ఆమెను ఓదారుస్తూ స్వామీజీ! ఇలా అన్నారు : "నువ్వు గతాన్ని మరిచిపో. నీ దుఃఖాలను గురించి మౌనంగా తలపోస్తూ కూర్చోవద్దు. నీలోని భావోద్వేగాలను ఏదో ఒక బాహ్యరూపంలో సృజనాత్మకంగా వ్యక్తీకరించే ప్రయత్నం చెయ్యి" అన్నారు.  స్వామీజీ సలహాను పాటించిన ఆమె జీవితం ప్రశాంతమయమైంది. ఈ మూడు మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్ని అవలంబించినా.. మనస్సు గతంలోనికి అడుగుపెట్టదు. పట్టుదలతో ప్రయత్నిస్తేనే ఏదైనా సాధ్యమవుతుందన్న విషయాన్ని మాత్రం మరువకూడదు.                                     *నిశ్శబ్ద.
  విటమిన్ సి మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలోని యాంటీఆక్సిడెంట్ల లోపాన్ని తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది  ప్రజలు నారింజ పండ్లను విటమిన్ సి కి ఉత్తమ వనరుగా భావిస్తారు. కానీ కొన్ని పండ్లు నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ని అందిస్తాయి. విటమిన్ సి స్థాయిలో నారింజను కూడా అధిగమించే ఆ 4 పండ్లు  అయిన సహజ విటమిన్ సి ఆహారాల గురించి తెలుసుకుంటే.. ఉసిరి.. ఉసిరి విటమిన్ సి  ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. ఒక నారింజ పండు కంటే ఒక ఉసిరిలో దాదాపు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల ఉసిరికాయలో దాదాపు 600-700 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. అయితే నారింజలో ఈ పరిమాణం 50-60 మి.గ్రా మాత్రమే. ఉసిరిలో  విటమిన్ సి మాత్రమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్,  ఇతర పోషకాలు కూడా ఉంటాయి.  ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉసిరిని పచ్చిగా, జ్యూస్, చట్నీ లేదా పొడి రూపంలో తినవచ్చు. కెవి.. కివి ఒక చిన్న పండు. కానీ దాని పోషక విలువలు చాలా ఎక్కువ. ఒక కివిలో నారింజ పండులో ఉండే విటమిన్ సి దాదాపు రెండు రెట్లు ఎక్కువ. 100 గ్రాముల కివిలో దాదాపు 90-100 మి.గ్రా. విటమిన్ సి లభిస్తుంది. కివిలో ఫైబర్, పొటాషియం,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.  ఇవి గుండె ఆరోగ్యానికి,  జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి . కివిని నేరుగా తినవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్‌లో కలపవచ్చు. స్ట్రాబెర్రీ.. స్ట్రాబెర్రీలు రుచికరమైనవి మాత్రమే కాదు, అవి విటమిన్ సి కి గొప్ప మూలం కూడా. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో 60-70 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజ కంటే కొంచెం ఎక్కువ. స్ట్రాబెర్రీలలో మాంగనీస్, ఫోలేట్,  పొటాషియం కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి,  ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి . స్ట్రాబెర్రీలను తాజా పండ్లు, స్మూతీలు లేదా డెజర్ట్‌గా తినవచ్చు. బొప్పాయి.. బొప్పాయి జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా విటమిన్ సి అధికంగా ఉండే పండు. 100 గ్రాముల బొప్పాయిలో దాదాపు 60-70 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. ఇది నారింజ కంటే ఎక్కువ. బొప్పాయిలో విటమిన్ ఎ, ఫైబర్,  ఎంజైమ్‌లు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బొప్పాయిని పచ్చిగా,  పండిన తరువాత రెండు విధాలుగా కూడా  తినవచ్చు.                                   *రూపశ్రీ.
మహిళలకు 30 ఏళ్ల వయస్సు దాటగానే  కొత్త ప్రయాణం మొదలైనట్టే ఉంటుంది. కెరీర్, కుటుంబం,  వ్యక్తిగత జీవితంలో కొత్త విషయాలు వచ్చి చేరే సమయం ఇదే.  30 ఏళ్ళ తరువాత మహిళల జీవనశైలి మారడమే కాకుండా, శరీరం లోపల కూడా చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా దీని ప్రభావం చర్మ ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత, శరీరంలో కొల్లాజెన్ స్థాయి క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు, కీళ్లు లూజ్ కావడం,  దృఢత్వం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.  అయితే దీని వల్ల   ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆహారంలో కొన్ని పదార్థాలు  చేర్చుకుంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.   చర్మం,  కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలు.. నారింజ, నిమ్మ, ఆమ్లా, కివి, స్ట్రాబెర్రీ, బొప్పాయి,  క్యాప్సికమ్ వంటివి  ఆహారంలో భాగంగా చేసుకోవాలి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు చర్మ కాంతిని కాపాడుతుంది.  ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం.. గుడ్డు, చేపలు, చికెన్, కాటేజ్ చీజ్, పెరుగు,  పప్పులు ప్రోటీన్ కు అద్భుతమైన వనరులు. అవి కొల్లాజెన్ ఏర్పడటానికి,  శరీర బలాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. గింజలు, విత్తానాలు.. బాదం, వాల్‌నట్స్, చియా గింజలు,  అవిసె గింజలు వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి . వీటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆకుకూరలు.. పాలకూర, మెంతులు, బ్రోకలీ,  క్యాబేజీ వంటి కూరగాయలు  శరీరంలో క్లోరోఫిల్ మొత్తాన్ని పెంచడం ద్వారా కొల్లాజెన్ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.                                *రూపశ్రీ.
  ఎముకలు శరీర ఫిట్‌నెస్ లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అయితే ఎముకల ఆరోగ్యం మీద శ్రద్ద చూపే వారు తక్కువే.  ఏవైనా టెస్ట్ లు చేయించుకున్నప్పుడు తప్పితే ఎముకలు బలంగా ఉన్నాయా లేదా బలహీనంగా ఉన్నాయా అనే విషయం తెలుసుకోలేరు.  అయితే చాలా వరకు ఎముకలు బలహీనంగా మారడానికి ఆహారం,  జీవనశైలి కారణం అవుతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు శరీరానికి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. వెంటనే ఈ ఆహారపు అలవాట్లు మానేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు అంటున్నారు. ఉప్పు.. ఉప్పు లేని కూర తినలేము అనే విషయం తెలిసిందే. అయితే అసలు ఉప్పు లేకపోయినా ఆరోగ్యానికి ముప్పే.. అలాగే ఉప్పు ఎక్కువ తిన్నా ఆరోగ్యానికి ముప్పే.. ముఖ్యంగా ఎముకలకు చాలా ముప్పు వాటిల్లుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది.  దీని కారణం ఎముకలు బలహీనం అవుతాయి. ధూమపానం, మద్యపానం.. ధూమపానం,  మద్యపానం అలవాట్లు శరీరంలో కాల్షియం, విటమిన్-డి స్థాయిలను తగ్గిస్తాయి.  ఇవి ఎముకలను దెబ్బతీస్తాయి.  ఈ  అలవాట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే ఎముకల బలహీనత, ఎముకలు దెబ్బతినడం,  కీళ్లు  బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి. చక్కెర.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల కాల్షియం,  మెగ్నీషియం శోషణ దెబ్బతింటుంది.  అంటే కాల్షియం,  మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా సరే.. వాటిని శరీరం గ్రహించలేదు.  ఈ కారణంగా ఎముకలు బలహీనం అవుతాయి. వ్యాయామం.. శరీరం దృఢంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా మారాలన్నా శరీరానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం చేయకపోతే ఎముకల చలనం తగ్గుతుంది.  ఈ కారణంగా  ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారే అవకాశం ఉంటుంది. శీతల పానీయాలు.. శీతల పానీయాలు చాలా మందికి చాలా ఇష్టమైన ఎంపిక.  ఎర్రటి ఎండలో చల్లగా కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ కార్బోనేటెడ్ పానీయాలలో ఉండే ఫాస్పోరిక్  ఆమ్లం ఎముకల నుండి కాల్షియం ను గ్రహిస్తుంది. వాటిని బలహీనపరుస్తుంది. జీవనశైలి.. మంచి జీవనశైలి ఎప్పుడూ శరీరాన్ని, ఎముకలను దృఢంగా ఉంచుతుంది.  సరైన ఆహారం ఎంపిక జీవనశైలిలో ప్రధానం.  అలాగే వ్యాయామం కూడా మంచి ఎంపికగా ఉంటుంది. ఇవి రెండూ శరీరాన్ని,  ఎముకలను బలంగా మార్చుతాయి.                                    *రూపశ్రీ.