భద్రపరచాలంటున్న శివనాగిరెడ్డి హైదరాబాద్ శివారు  శామీర్ పేట మండలం, మందాయిపల్లి శివాలయం దగ్గర రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడి ఉన్న గణేష్ శిల్పం బాదామి చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. వారసత్వ సంపదను గుర్తించి, కాపాడుకోవడం పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించే 'ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టేరిటీ' కార్యక్రమంలో భాగంగా ఆయన మందాయిపల్లి గ్రామ పరిసరాల్లో ఉన్న పాత శివాలయం వద్ద ఈ విగ్రహాన్ని గుర్తించారు. ఒక అడుగు మూడు అంగుళాల ఎత్తు, పది అంగుళాల వెడల్పు, అంతే మందం గల గ్రానైట్ రాతిలో మలచిన గణేష ప్రతిమ, నాలుగు చేతులు, తొండం కలిగి, తలపై చిన్న కిరీటంతో, లలితాసనంలో కూర్చొని, నాగ యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడన్నారు. ప్రతిమా లక్షణం, శిల్ప శైలిని అనుసరించి ఈ గణేశ శిల్పం క్రీ.శ. 8వ శతాబ్దికి చెందినదన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాన్ని భద్రపరచాలని మందాయపల్లి గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
వైసీపీ పరిస్ధితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టు నాగంభోట్లుఅన్నట్లుగా తయారౌతోంది. ఏ నియోజకవర్గ ఇన్ చార్జిని ఎప్పుడు పీకేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. ఛాదస్తపు మొగుడు చెబితే వినడు తిడితే ఏడుస్తాడు అన్నట్లుగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని ఆ పార్టీ నేతలే తలలుపట్టుకుంటున్న పరిస్థితి. అధికారంలో ఉండగా కన్నూమిన్నూగనక.. ఇక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామన్న గుడ్డి విశ్వాసంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు వైసీపీ వినా మరో గత్యంతరం లేక ఆ పార్టీలోనే ఉంటున్నారు. అలా కాకుండా కొద్దో గొప్పో పార్టీలో తామరాకు మీద నీటిబొట్టులా ఉండి.. ప్రత్యర్థులపై నోరు పారేసుకోని నేతలు వైసీపీని వదిలేసి కూటమి పార్టీల్లోకి దూకేశారు. ఆ దారిలో ఇంకా చాలా మంది ఉన్నారని అంటున్నారు. సంక్రాంతి తరువాత వైసీపీ నుంచి వలసలు పెద్ద సంఖ్యలో ఉంటాయనీ చెబుతున్నారు. ఇక రోజా, అంబటి, బుగ్గన, పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, భూమనకరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కాకాణి వంటి వారు వారి తీరు కారణంగా మరో పార్టీలోకి ప్రవేశం లేక.. గత్యంతరం లేక వైసీపీనే పట్టుకు వేళాడుతున్నారు.  ఇక గత ఎన్నికల సమయంలో  పార్టీ టికెట్ల కేటాయింపును జగన్ మోహన్ రోడ్డి అపహాస్యం చేసి పారేశారు. ఎలాంటి కారణం, హేతువు అన్నదే లేకుండా అభ్యర్థులను మార్చి పారేశారు. తన ఫొటో చూసే ఓట్లు పడతాయి, అభ్యర్థులు నిమిత్త మాత్రులు అన్నట్లుగా వ్యవహరించారు. అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి నరసరావుపేటకు పంపేయడం, అలాగే రోజా, అంబటి వంటి వారికి అసలు ఎన్నికలలో పోటీకి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్న సస్పెన్స్ లో ముంచి చివరి నిముషంలో టికెట్ కేటాయించడం వంటి ఫీట్లు ఎన్నో చేశారు.  ఆయన ఏం చేసినా అప్పట్లో నేతలు నోరు మెపదకుండా ఉండడానికి మరోసారి జగన్ అధికారంలోకి వస్తారన్న విశ్వాసమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. తీరా గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి జగన్ అరాచక పాలనకు విసిగి వేసారిపోయిన ప్రజలు ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో వైసీపీ నేతలలో అత్యధికులు సైలెంటైపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా, మిగిలిన వారిలో అత్యధికులు అటు పార్టీకీ, ఇటు ప్రజలకూ ముఖం చాటేసి ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు ఈ కోవలోకి వస్తారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది.   రాష్ట్రంలో దాదాపు 50కి పైగా నియోజకవర్గాలలో ఇప్పడు వైసీపీకి ఇన్ చార్జీలే లేరు. ఎవరినైనా నియమిద్దామని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నప్పటికీ ఆ పోస్టును చేపట్టేందుకు ముందుకు వచ్చే వారే కరవయ్యారు.  పోనీ కోరుకున్న వారికి ఆ పోస్టు ఇచ్చేయొచ్చు కదా అంటే అందుకు జగన్ అంగీకరించడం లేదు. కింద పడినా పై చేయి నాదే అంటున్న జగన్ తీరు చూసి నేతలు కూడా వెనక్కు తగ్గుతున్నారు. ఇన్ చార్జిలు ఉన్న నియోజకవర్గాలలో కూడా పార్టీ  కార్యక్రమాలు చేపట్టేందుకు క్యాడర్ ముందుకు రావడం లేదు.   ఓ వైపు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతూ కోటి సభ్యత్వాల ల్యాండ్ మార్క్ చేరుకుంది. ఆ పార్టీ కార్యకర్తల కోసం బీమా కూడా చేయించింది. మరో వైపు వైసీపీ ఉన్న క్యాడర్ ను చేజార్చుకుంటోంది. దీంతో రానున్న రోజులలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుస్తక ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో వెల్లడించారు. ఇటీవల అంటే ఈ నెల 2వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన పవన్ కల్యాణ్  ఆ సందర్భంగా పుస్తకపఠనం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎవరికైనా పెద్ద మొత్తంలో సొమ్ములు ఇవ్వడానికి క్షణం కూడా ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తానని ఆయనా సందర్భంగా చెప్పారు. అది పక్కన పెడితే పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 11) విజయవాడ బుక్ ఫెయిన్ ను సందర్శించారు. ఒక పుస్తక ప్రియుడిగా ఆయన బుక్ ఫెయిర్ అంతా కలయతిరిగారు. పలు స్టాల్స్ సందర్శించారు. పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు పది లక్షల రూపాయల విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఆ బిల్లును తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు.  అంతకు ముందు అంటే శుక్రవారం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించారు.  ఆసందర్బంగా ఆధునిక వసతులతో పిఠాపురంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కొన్న పుస్తకాలన్నీ ఆ లైబ్రరీ కోసమేనని తెలుస్తోంది.  ఆయన కొనుగోలు చేసన పుస్తకాలలో  అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాతిక సంబంధిత రచనలు ఉన్నాయి.
ALSO ON TELUGUONE N E W S
Ajith Kumar has been highly excited about his upcoming racing season and his first race for 24H Dubai series. But the actor had gone through a crash accident on the circuit during a practice session. Even though he is doing good, management has decided to not let him race for 901 Porsche car.  Because of concussion, he might not be at his 100 percent fitness and hence, they took this decision. Racing circuit needs him to be fit and available for 24 hours in this format and he would be slow due to the accident. Hence, they advised him to not participate in this one.  Ajith Kumar graciously accepted their request but he will be performing his duties as owner of his Ajith Kumar Racing team for 901. At the same time, he will be participating in different team that is, Razoon and his number is 414 Porsche. So, the fans can cheer him up and watch him racing.  In recent interviews, he did confirm that he will work as an actor between October to March and will race during the racing season going forward. He did say that he loves his fans unconditionally and will be entertaining them. His fans showed up in large numbers at Dubai circuit cheering him up. 
Victory Venkatesh starrer Sankrantiki Vasthunnam is gearing up for a wide release on 14th January. Blockbuster director Anil Ravipudi has written and directed the film. Movie team has been carrying great buzz and hype with creative promotions by the team. Leading star Venkatesh interacted with media about the film.  He stated that he loves working with Anil Ravipudi and wished to continue working with him. After F2, F3 and Seethamma Vakitlo Srimalle Chettu, he stated that he and producers Dil Raju, Shirish have formed a great bond. He wished Sankrantiki Vasthunnam to be another big blockbuster in their combination.  Venkatesh expressing confidence on the film stated that he loved concept of the film - "Ex Cop, Ex Girlfriend and Excellent Wife" in the first meeting and thought the movie will be a huge success, immediately. He further expressed his happiness for being able finish the movie within time and for everything going as per plan.  He stated that the movie climax will surprise everyone and he is expecting everyone to fall in love with the film. Talking about the film, he classified it as a thorough entertainer and complete clean family film that everyone will enjoy big time during Sankranti festival.  He complimented Meenakshi Chaudhary and Aishwarya Rajesh for playing their characters well. The senior star actor stated that he loved the energy in the Blockbuster Pongal song in first hearing and hence, he wanted to sing. Also, he praised composer Bheems Ceciroleo for giving huge chartbusters. He concluded by stating that Sankrantiki Vasthunnam will be memorable for Sankranti festival. 
తమిళ అగ్ర హీరో అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అనే విషయం తెలిసిందే. పలు రేసింగ్ ఛాంపియన్ షిప్స్ లో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే జనవరి 11, 12 తేదీల్లో జరగనున్న 24H Dubai 2025 కోసం సన్నద్ధమవుతున్నారు.రీసెంట్ గా ఈ రేసింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా  అజిత్ నడుపుతున్న రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది.కారు వేగంగా వెళ్లి సైడ్ వాల్ కి ఢీ కొట్టింది.గోడను ఢీ కొనడంతో ట్రాక్ పై కారు గిర్రున తిరిగింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అజిత్  దుబాయ్‌ కార్‌ రేస్‌ నుంచి వైదొలుగుతునట్టుగా ఒక ప్రకటన జారీ చేసాడు.కాకపోతే రేస్ లో  తన టీమ్‌ పాల్గొంటుందని  తెలియచేసాడు.నేటి నుంచి దుబాయ్‌లో జరగనున్న కార్‌ రేస్‌ జరగనుంది.అజిత్ సినిమాల విషయానికి వస్తే 'విడా మయుర్చి' మూవీ చేస్తున్నాడు.ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ సంక్రాంతి నుంచి ఏప్రిల్ నెలకి వాయిదా పడింది.
  తమిళనాట ఉన్న అగ్ర హీరోల్లో విశాల్(Vishal)కూడా ఒకడు.2004 లో సినీ రంగ ప్రవేశం చేసిన విశాల్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని సంపాదించుకున్నాడు.ఆ సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యి కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని పొందాడు.అలాంటి విశాల్ రీసెంట్ గా జరిగిన తన అప్ కమింగ్ మూవీ 'మదగజరాజ' మూవీ ఫంక్షన్ కి హాజరయ్యాడు.అందులో విశాల్ బాగా సన్నబడి ఉండటంతో పాటుగా బాగా వణుకుతూ కనిపించాడు.దీంతో అయన హెల్త్ పై రకరకాల వార్తలు వచ్చాయి.కొంత మంది సినిమా వాళ్ళు మాత్రం విశాల్ కి వైరల్ ఫీవర్ రావడం వలన అలా ఉన్నాడని స్పందించడం జరిగింది. ఇప్పడు లేటెస్ట్ గా విశాల్ ఆరోగ్యంపై ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi sarathkumar)స్పందిస్తు విశాల్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు చూసాను.ఆయన త్వరగా కోలుకోవాలని,మంచి ఆరోగ్యంతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.గతంలో విశాల్,వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం నడిచినట్టుగా పలు కధనాలు వచ్చిన నేపథ్యంలో విశాల్ ఆరోగ్యంపై వరలక్ష్మి మాట్లాడిన మాటలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.ఇక 'మదగజరాజ' లో వరలక్ష్మి కూడా నటించింది.ఈ సందర్భంగా సినిమా గురించి కూడా ప్రస్తావిస్తు విశాల్ ఈ సినిమాలో చాలా కష్టపడి నటించాడు.8 ప్యాక్ బాడీతో కనిపిస్తాడు.పైగా ఈ మూవీ నా సినీ కెరీర్ లో రెండవ చిత్రం అని కూడా చెప్పుకొచ్చింది.    
  సతీష్ నీనాసం కథానాయకుడిగా నటించిన చిత్రం 'ది రైజ్ ఆఫ్ అశోక'. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వృద్ధి క్రియేషన్‌, సతీష్‌ పిక్చర్స్‌ హౌస్‌ బ్యానర్‌ల మీద వర్ధన్‌ నరహరి, జైష్ణవి, సతీష్‌ నీనాసం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది.   ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే ఆ పాట, బీజీఎం, హీరోని చూపించిన విధానం, ఆ రక్తపాతం చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అనే ఎక్స్ పీరియెన్స్‌ను ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది.     ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టాకీ సీక్వెన్స్‌లు, పాటల్ని త్వరితగతిన షూట్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌లో సతీష్ నీనాసం బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. కత్తులు పట్టుకుని ఊచకోత కోస్తున్న హీరో లుక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.    ఫిబ్ర‌వ‌రి 15న షూటింగ్‌ని పునఃప్రారంభించ‌డానికి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ది రైజ్ ఆఫ్ అశోక మూవీ సతీష్ నీనాసం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతోందని టీం ఎంతో నమ్మకంగా ఉంది. సతీష్ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ ప్రయోగం అని చెబుతున్నారు. ఈ సినిమాలో బి. సురేష్‌, అచ్యుత్‌ కుమార్‌, గోపాల్‌ కృష్ణ దేశ్‌పాండే, సంపత్‌ మైత్రేయ, యశ్‌ శెట్టి తదితరులు నటిస్తున్నారు.   ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా లవిత్, ఆర్ట్ డైరెక్టర్‌గా వరదరాజ్ కామత్, సంగీత దర్శకుడిగా పూర్చంద్ర తేజస్వి SV పని చేస్తున్నారు.  డా. రవివర్మ, విక్రమ్ మోర్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను మను షెడ్గర్‌ నిర్వర్తిస్తున్నారు.  
  తక్కువ సమయంలోనే వరుసగా స్టార్స్ తో సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్న దర్శకులలో బాబీ కొల్లి ఒకరు. పలు చిత్రాలకు రచయితగా పని చేసి మంచి గుర్తింపు పొందిన బాబీ, 2014 లో రవితేజ హీరోగా వచ్చిన 'పవర్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. దర్శకుడిగా మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న బాబీ.. ఆ తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' రూపంలో రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కానీ ఆ మూవీ దారుణంగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. అదే జోష్ లో వెంకటేష్ తో 'వెంకీ మామ', చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' చేసి విజయాలు అందుకొని హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా 'డాకు మహారాజ్'ను రూపొందించాడు. (Daaku Maharaaj)   టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా బాబీకి మంచి పేరు ఉంది. 'డాకు మహారాజ్'కి ముందు ఐదు సినిమాలు డైరెక్ట్ చేయగా, అందులో 'సర్దార్ గబ్బర్ సింగ్' తప్ప మిగతా నాలుగు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు 'డాకు మహారాజ్'పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా విజువల్స్ అదిరిపోయాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగా చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే.. దర్శకుడు బాబీ మరో భారీ విజయాన్ని అందుకున్నట్లే.   'డాకు మహారాజ్' అనేది హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాబీ డైరెక్ట్ చేసిన సినిమా మాత్రమే కాదు. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా కూడా. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి మూడు భారీ విజయాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రమిది. మరి హ్యాట్రిక్ హీరో బాలకృష్ణతో హ్యాట్రిక్ డైరెక్టర్ బాబీ చేసిన ఈ మూవీ వరుసగా నాలుగో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.  
Versatile actor Aditya Om’s upcoming film Bandi which is inspired by the urgent and timely issue of climate change is all set for a theatrical release soon. Directed by Raghu Tirumala, under the banner Gully Cinema, the film has already made waves on the international film circuit, earning numerous accolades and awards at prestigious film festivals worldwide. It was recently selected to be screened at the esteemed Rajasthan International Film Festival. Touted as India’s first completely environment-themed thriller, Aditya Om portrays a character fighting for survival in the face of rapidly changing and unpredictable environments. The film has been shot in multiple forests across India and abroad, capturing the beauty and danger of these natural landscapes throughout all seasons. The trailer has already generated significant buzz and positive feedback, building anticipation among film lovers and environmentalists alike. Aditya Om, known for his dedication to his craft, has gone above and beyond in Bandi, performing all of his own stunts and taking considerable risks. He spent extended periods in remote, alien forests to create an authentic, raw portrayal of survival. His commitment to realism and immersion into the harsh conditions of nature brings an extra layer of intensity to the film. Bandi is poised to redefine survival thrillers in Indian cinema, with the makers confident that it will set a new benchmark for films in this genre. The film’s theatrical release will be accompanied by a unique distribution strategy, as outlined by producers Venkateshwar Rao Daggu and Raghu Tirumala. After several years of meticulous production, Bandi is finally ready to captivate audiences and bring its compelling message to the big screen. Aditya Om, who put his best efforts into this project, is hopeful that Bandi will not only leave an indelible mark on Indian cinema but also serve as a career milestone. With its unique premise, powerful performances, and breathtaking visuals, Bandi is set to make a lasting impact on both audiences and critics alike.
సంక్రాంతి కానుకగా జనవరి 10 న థియేటర్స్ లోకి వచ్చిన రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో మూవీ గేమ్ చేంజర్(Game Changer)శంకర్(Shankar)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు(Dil Raju)సుమారు 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాడు.డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ ప్రదర్శించిన నటనకి ప్రతి ఒక్కరు జేజేలు పలుకుతున్నారు.ఇక తొలి రోజు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా చిత్ర బృందం ఒక పోస్టర్ రిలీజ్ చేస్తు అధికారంగా ప్రకటించింది.  ఇక గేమ్ చేంజర్ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj)అందించిన కథతో తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రీసెంట్ గా 'ఎక్స్' వేదికగా గేమ్ చేంజర్ పై స్పందిస్తు గేమ్ ఛేంజర్ వింటేజ్ శంకర్ గారి పొలిటికల్ పంచెస్ తో గ్రాండ్ గా మాస్ యాక్షన్ వైబ్స్ తో సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రామ్ చరణ్,ఎస్ జె సూర్యల పెర్ఫామెన్స్  అదిరిపోయింది. తిరు సినిమాటోగ్రఫీ కూడా ఎక్స్ లెంట్. ఇతర టీంకి కూడా శుభాకాంక్షలు.సినిమాలో నాకు కూడా చిన్న భాగం ఇచ్చినందుకు శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ 'ఎక్స్' వేదికగా తెలియచేసాడు.ఇప్పడు ఈ ట్వీట్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. శంకర్ కూడా  ధన్యవాదాలు అంటు రిప్లై  ఇవ్వడం జరిగింది.  కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం సూర్య తో మూవీ చేస్తున్నాడు.ఇక గేమ్ చేంజర్ లో చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించగా,కియారా అద్వానీ,అంజలి హీరోయిన్లుగా చేసారు.ఎస్ జె సూర్య,శ్రీకాంత్, సముద్ర ఖని,సునీల్,రాజీవ్ కనకాల,జయరాం కీలక పాత్రలు పోషించారు.  
అల్లుఅర్జున్(Allu Arjun)హీరోగా తెరకెక్కిన 'ఆర్య' మూవీ ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యాడు దర్శకుడు సుకుమార్(Sukumar).ఎవ్వరు టచ్ చెయ్యని ఒక కొత్త రకమైన లవ్ జోనర్ ని ఆ మూవీ ద్వారా తెరకెక్కించి మొదటి సినిమాతోనే క్రియేటివ్ దర్శకుడుగా తన సత్తా చాటాడు.ఆ తర్వాత 100 %లవ్, జగడం,ఆర్య 2 ,1 నేనొక్కడినే,నాన్నకు ప్రేమతో,రంగస్థలం,పుష్ప పార్ట్ 1 ,పార్ట్ 2 తో అగ్ర దర్శకుడుగా మారాడు. గతంలో సుకుమార్ మాట్లాడుతు నాకు హీరో రాజశేఖర్(Rajashekar)గారంటే పిచ్చి అభిమానం.ఒక రకంగా చెప్పాలంటే వీరాభిమానిని కూడా.అంకుశం,ఆహుతి,ఆగ్రహం,మగాడు,తలంబ్రాలు వంటి చిత్రాలు నన్నెంతగానో ప్రభావితం చేసాయి. చిన్నతనంలో ఆయన్ని ఇమిటేట్ కూడా చేసేవాడ్ని.దాంతో అందరు ఒన్స్ మోర్ అంటు విజిల్స్ వేసేవాళ్ళు.ఆ విధంగానే  నేను ఫేమస్ అయ్యాను.సినిమాల్లోకి వెళ్లి ఏదైనా సాధించగలననే నమ్మకం కూడా రాజశేఖర్ గారి  వల్లే కలిగిందని చెప్పుకొచ్చాడు.ఈ రోజు సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని మరో సారి చెప్పడం జరిగింది  సుకుమార్ లేటెస్ట్ గా పుష్ప 2(Pushpa 2)తో ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించాడు.ఇప్పటీకే బాహుబలి 2 రికార్డులని కూడా పుష్ప 2 దాటింది.ఇక సుకుమార్ తన నెక్స్ట్ మూవీ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో చెయ్యబోతున్నాడు.దీంతో ఆ మూవీ పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబోలోరంగస్థలం వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.    
  పెద్ద సినిమాల విషయంలో మేకర్స్ వాస్తవంగా వచ్చిన కలెక్షన్స్ ని కాస్త పెంచి ప్రమోట్ చేసుకోవడం చూస్తుంటాం. సాధారణంగా వచ్చిన కలెక్షన్స్ కంటే అదనంగా రూ.10-15 కోట్లు జత చేసి పోస్టర్లు విడుదల చేస్తుంటారు మేకర్స్. అయితే ఇది 'గేమ్ ఛేంజర్' విషయంలో మరీ దారుణంగా ఉందని, ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ని ఏకంగా డబుల్ చేసి పోస్టర్లు రిలీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. (Game Changer)   రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ కి అటు ఇటుగా రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ మూవీ టీం రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్స్ లో ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ప్రకటించారు. దీంతో యాంటీ ఫ్యాన్స్ 'గేమ్ ఛేంజర్' టీంని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరీ ఇంతలా ఫేక్ చేసి, టాలీవుడ్ పరువు తీస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కేవలం 'దేవర' డే-1 కలెక్షన్ ని క్రాస్ చేశామని చెప్పుకోవడం కోసమే, ఇలా ఫేక్ పోస్టర్ రిలీజ్ చేశారని ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విమర్శలను రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా తిప్పి కొడుతున్నారు. మీ హీరోల సినిమా పోస్టర్లు ఫేక్ కానప్పుడు, మా హీరో సినిమా పోస్టర్ ఎలా ఫేక్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రపంచం మొత్తంలో యువకులు ఎక్కువమంది ఉన్న దేశం గురించి ప్రస్తావన వస్తే అందులో  మన భారతదేశమే  మొదటిగా నిలుస్తుంది. ఏ దేశ అభివృద్ధికైనా అనుభవం ఉన్న పెద్దవాళ్లతో పాటూ, పనిచేసే యువశక్తి  ఎంతో  అవసరం అని చెప్పాల్సిన అవసరంలేదు. దేశ  యువతంతా క్రమశిక్షణగా ఉండి వారి శక్తి సామర్ధ్యాలు సరిగా వినియోగిస్తే  ఆ దేశం   ప్రపంచ చరిత్రలోనే గొప్పదిగా నిలవగలుగుతుంది. ఈ విషయాన్ని వందేళ్ల కిందటే అర్థం చేసుకుని యువతకు తన మాటలతో దేశ భక్తి నింపడానికి, యువతే నా దేశ భవిష్యత్తు అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి వివేకానందుడు. స్వామి వివేకానందగా పేరు పొందిన నరేంద్రుడు.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాడు.  ప్రపంచాన్ని తన మాటలతో,  తన దేశ భక్తితో.. ముఖ్యంగా హిందుత్వం, ఆధ్యాత్మిక భావనతో ప్రభావితం చేసి ప్రపంచం మొత్తం భారతదేశం వేపు తల తిప్పి చూసేలా చేశాడు. ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం వందేళ్ళ తర్వాత కూడా ఆచరించదగినవి.  మంచి వక్త, తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన స్వామి వివేకానంద  పుట్టినరోజును ప్రతీ సంవత్సరం  జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద.. స్వామి వివేకానందుడు 1863 జనవరి 12న కోల్‌కతలో జన్మించారు. దేశ భవిష్యత్తులో యువత పాత్రను యువతకు గుర్తుచేయడానికి ,  యువత శక్తిని గుర్తుచేయడానికి ఆయన పిలుపు ఇచ్చిన విధానం ఆయనను ప్రసిద్ధుడిగా మార్చింది.  ఈయన రామకృష్ణ పరమహంస బోధనలకు ప్రభావితమై.. సన్మానం స్వీకరించారు.  ధార్మిక బోధకుడిగా, తత్వవేత్తగా,  వేదాలను ఉపనిషత్తులను అవపోషణ పట్టిన వ్యక్తిగా, యోగాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా.. ఇలా చాలా రకాలుగా ప్రసిద్ధి చెందాడు.   1893లో చికాగోలో నిర్వహించిన  ప్రపంచ సర్వమత మహాసభలలో  ఆయన ఇచ్చిన  ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రసంగంలో ఆయన యువశక్తి, విశ్వ సోదర భావం, ఆత్మాన్వేషణలు అనేవి సామాజిక మార్పుకు  ప్రాథమిక సూత్రాలుగా చెప్పారు. స్వామి వివేకానందుడు జాతీయవాదంపై ధృడ విశ్వాసం కలిగి, దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉందని నమ్మారు. ఎటువంటి నీచస్థితిలో ఉన్నవారికైనా గొప్ప ఆలోచనలను కలిగేలా చేయగలమనే ఆయన  నమ్మారు.   "శక్తి నీలోనే  ఉందనే నమ్మకంతో ముందుకు సాగితే, నువ్వు అద్భుతాలను సృష్టించగలవు.", "నువ్వు మేల్కొని , ఉప్పొంగు, కానీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకు",  "యువతే దేశ అభివృద్ధికి పునాదులు." అనే మాటలతో..  తన ప్రసంగాలతో దేశ యువతని, ప్రజలని  నిరంతరం ప్రోత్సహించేవారు. 1984వ సంవత్సరంలో స్వామి వివేకానందుడి ఆలోచనలను, విలువలను వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది.   1985 నుంచి  దేశవ్యాప్తంగా  జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. స్వామి వివేకానందుడి తత్వచింతనలు, ఆదర్శాలు భారత యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని ప్రభుత్వం భావించింది. యువజన దినోత్సవం- యువతకి పిలుపు.... స్వామి వివేకానందుడి బోధనలు యువతకు జీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు స్ఫూర్తినిస్తాయి. వ్యక్తిగతంగా,  సమష్టిగా అభివృద్ధి చెందడానికి విద్య అనేది ముఖ్యమైన సాధనమని ఆయన విశ్వసించారు. యువతలో ఐక్యత, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక  చింతన అభివృద్ధి చేయటం, అందరూ  దేశభక్తి కలిగి ఉండి, మన సంస్కృతి పట్ల గర్వపడాలనే సందేశాన్ని అందిస్తుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురావటంలో  యువత పాత్ర  అవసరమని, ఆ దిశగా యువత తమ నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు ఉపయోగించాలనే పిలుపునిస్తుంది.                                  *రూపశ్రీ.
  మనతో పాటూ ఉన్న మనుషులు   ఉన్నట్టుండి ఏమైపోయారో తెలియకపోయినా లేదా వారు ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నారన్న విషయం తెలిసినా మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా జరిగినప్పుడు ఏం చేయాలో, మనమేం చేయగలమో కూడా అర్ధం కాదు. అందుకే ఇటువంటివి జరిగినప్పుడు ఎదురయ్యే పరిణామాలు గురించి  అందరికీ అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీన మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వం గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాలతో బయటపడిన వారి హక్కుల కోసం వాదించడానికి,  అన్ని రకాల మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి  ఒక అవకాశం ఇస్తుంది. మానవ అక్రమ రవాణా అంటే..... మనుషులని కిడ్నాప్ చేయటమో లేదా ఏమార్చటమో  చేసి తర్వాత వారిని బలవంతంగా  వ్యభిచారం చేయించటానికో, బలవంతపు  వివాహాల కోసమో, అనైతిక కార్యకలాపాలు, కర్మాగారాల్లో పనులు చేయించటానికో ఇలా చాలా రకాలుగా  ఉపయోగించుకుంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ అక్రమ రవాణా  సమస్య నానాటికీ పెరుగుతోంది. అందుకే దీన్ని ఆపటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మానవ అక్రమ రవాణా దినోత్సవం ఎప్పుడు మొదలైంది.. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి,  ఎదుర్కోవడానికి యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన  ‘ట్రాఫికింగ్ బాధితుల రక్షణ చట్టం2000’ చట్టానికి ఆమోదం తెల్పటంతో ఈ దినోత్సవం మొదలైంది. ఆ తర్వాత  ఈ సమస్య ప్రభావం  ప్రపంచమంతటా ఉందని   గుర్తించిన  దేశాలన్నీ  దాన్ని నివారించటానికి తగిన చట్టాలు ఏర్పాటు చేసుకున్నాయి. భారతదేశంలో మానవ అక్రమ రవాణా- తీసుకున్న చర్యలు.. భారతదేశంలో పురుషులు, మహిళలు, పిల్లలు వివిధ కారణాల కోసం అక్రమ రవాణా చేయబడ్డారు, చేయబడుతున్నారు. దేశంలోని  మహిళలు, అమ్మాయిలను లైంగిక దోపిడీ కోసం, బలవంతపు వివాహాల కోసం రవాణా చేస్తున్నారు.   పురుషుల అవసరం ఎక్కువగా ఉన్నచోట  పురుషులు, అబ్బాయిలను  రవాణా చేసి  కార్మికులుగా, మసాజ్ చేసే వారిగా, ఎస్కార్ట్లుగా ఉపయోగించుకుంటున్నారు.  వీరు కొన్ని సార్లు లైంగిక దోపిడీకి కూడా  గురవుతుంటారు.   ఇక పిల్లలు కర్మాగార కార్మికులుగా, ఇంటి పనివారిగా, అడుక్కునేవారిగా, వ్యవసాయ కూలీలుగా మార్చబడతారు.   అలాగే కొన్ని తీవ్రవాద, తిరుగుబాటు గ్రూపుల ద్వారా శిక్షణ ఇవ్వబడి అసాంఘిక కార్యకాలపాల కోసం  ఉపయోగించుకుంటారు.  భారతీయ మహిళలు మిడిల్ ఈస్ట్ దేశాలకి వాణిజ్య లైంగిక దోపిడీ కోసం రవాణా చేయబడుతున్నారట. ప్రతి సంవత్సరం మిడిల్ ఈస్ట్,  యూరప్ దేశాలకు పనివారిగా,  తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులుగా వెళ్లిన భారతీయ వలసదారులు  కొన్నిసార్లు మానవ అక్రమ రవాణా పరిశ్రమలో చిక్కుకుంటున్నారు. కొన్ని సార్లు  కార్మికులు నకిలీ నియామక విధానాల ద్వారా తీసుకెళ్లి అక్కడ బానిసలుగా మార్చబడుతున్నారు. ముఖ్యంగా ఆ దేశాలకి వెళ్తే ఆదాయం పెరిగి కుటుంబం బాగుపడుతుందన్న ఆశతో  అప్పు చేసి ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ డబ్బు చెల్లించలేక, తిరిగి రాలేక క్రూరమైన యాజమానుల చేతుల్లో అష్ట కష్టాలు పడతారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు.   ఇవన్నీ గుర్తించిన భారతదేశం 2011లో "ట్రాఫికింగ్ బాధితుల చట్టం 2000" ప్రోటోకాల్‌ను ఆమోదించింది. మన భారత పౌరులు అలాంటివాటిలో చిక్కుకోకుండా  ఒక పక్క అవగాహన కల్పిస్తూనే, మరో పక్క అలా చిక్కుకున్నవారిని ఆయా దేశాల్లోని ఎంబసీల ద్వారా  కాపాడే ప్రయత్నం చేస్తుంది. వారు స్వదేశం చేరటానికి అన్ని రకాలుగా సాయం అందిస్తుంది. మానవ అక్రమ రవాణాని నివారించేందుకు ఏం చేయాలి...   నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్‌నెస్ డేలో పాల్గొనడం వల్ల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమానికి సహకరించేందుకు అందరికీ అవకాశం లభిస్తుంది. దీని గురించి స్పష్టంగా తెలుసుకనే అవకాశం కూడా లభిస్తుంది. మానవ అక్రమ రవాణాని ఎలా గుర్తించాలి?, ఎలా కంప్లైంట్ చేయాలి?  అనే వాటి గురించి అందరికీ తెలిసేలా  వర్క్‌షాప్‌లు, వెబినార్లు లేదా శిక్షణా సెషన్లను నిర్వహిస్తారు.   ఈ సమస్య గురించి సోషల్ మీడియాలో అవగాహన కల్పించడానికి,  దానికి సంబంధించిన  పోస్ట్‌లు, కథనాలను షేర్ చేయాలి. ఈ  అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహకరించి,  ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం అందించాలి. రాజకీయ నాయకులు, లాయర్లతో పాటూ కలిసి మానవ అక్రమ రవాణాను సమర్థవంతంగా పరిష్కరించే చట్టాలు, విధానాలకు మద్దతు ఇవ్వాలి.  అక్రమ రవాణా నిరోధక చట్టాల కోసం గొంతు విప్పాలి. అవేర్‌నెస్ ఈవెంట్‌లను నిర్వహించాలి. ఈ మానవ అక్రమ రవాణా మీద అందరూ తగిన అవగాహన పొందటం వల్ల  మనవాళ్ళు, మనకి తెలిసినవాళ్ళు ఏ మోసకారుల చేతుల్లోనో, ముఠాల చేతుల్లోనో చిక్కుకుని బలి కాకుండా కాపాడుకోవచ్చు.                                        *రూపశ్రీ.
  మనతో పాటూ ఉన్న మనుషులు   ఉన్నట్టుండి ఏమైపోయారో తెలియకపోయినా లేదా వారు ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నారన్న విషయం తెలిసినా మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా జరిగినప్పుడు ఏం చేయాలో, మనమేం చేయగలమో కూడా అర్ధం కాదు. అందుకే ఇటువంటివి జరిగినప్పుడు ఎదురయ్యే పరిణామాలు గురించి  అందరికీ అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీన మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వం గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాలతో బయటపడిన వారి హక్కుల కోసం వాదించడానికి,  అన్ని రకాల మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి  ఒక అవకాశం ఇస్తుంది. మానవ అక్రమ రవాణా అంటే..... మనుషులని కిడ్నాప్ చేయటమో లేదా ఏమార్చటమో  చేసి తర్వాత వారిని బలవంతంగా  వ్యభిచారం చేయించటానికో, బలవంతపు  వివాహాల కోసమో, అనైతిక కార్యకలాపాలు, కర్మాగారాల్లో పనులు చేయించటానికో ఇలా చాలా రకాలుగా  ఉపయోగించుకుంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ అక్రమ రవాణా  సమస్య నానాటికీ పెరుగుతోంది. అందుకే దీన్ని ఆపటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మానవ అక్రమ రవాణా దినోత్సవం ఎప్పుడు మొదలైంది.. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి,  ఎదుర్కోవడానికి యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన  ‘ట్రాఫికింగ్ బాధితుల రక్షణ చట్టం2000’ చట్టానికి ఆమోదం తెల్పటంతో ఈ దినోత్సవం మొదలైంది. ఆ తర్వాత  ఈ సమస్య ప్రభావం  ప్రపంచమంతటా ఉందని   గుర్తించిన  దేశాలన్నీ  దాన్ని నివారించటానికి తగిన చట్టాలు ఏర్పాటు చేసుకున్నాయి. భారతదేశంలో మానవ అక్రమ రవాణా- తీసుకున్న చర్యలు.. భారతదేశంలో పురుషులు, మహిళలు, పిల్లలు వివిధ కారణాల కోసం అక్రమ రవాణా చేయబడ్డారు, చేయబడుతున్నారు. దేశంలోని  మహిళలు, అమ్మాయిలను లైంగిక దోపిడీ కోసం, బలవంతపు వివాహాల కోసం రవాణా చేస్తున్నారు.   పురుషుల అవసరం ఎక్కువగా ఉన్నచోట  పురుషులు, అబ్బాయిలను  రవాణా చేసి  కార్మికులుగా, మసాజ్ చేసే వారిగా, ఎస్కార్ట్లుగా ఉపయోగించుకుంటున్నారు.  వీరు కొన్ని సార్లు లైంగిక దోపిడీకి కూడా  గురవుతుంటారు.   ఇక పిల్లలు కర్మాగార కార్మికులుగా, ఇంటి పనివారిగా, అడుక్కునేవారిగా, వ్యవసాయ కూలీలుగా మార్చబడతారు.   అలాగే కొన్ని తీవ్రవాద, తిరుగుబాటు గ్రూపుల ద్వారా శిక్షణ ఇవ్వబడి అసాంఘిక కార్యకాలపాల కోసం  ఉపయోగించుకుంటారు.  భారతీయ మహిళలు మిడిల్ ఈస్ట్ దేశాలకి వాణిజ్య లైంగిక దోపిడీ కోసం రవాణా చేయబడుతున్నారట. ప్రతి సంవత్సరం మిడిల్ ఈస్ట్,  యూరప్ దేశాలకు పనివారిగా,  తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులుగా వెళ్లిన భారతీయ వలసదారులు  కొన్నిసార్లు మానవ అక్రమ రవాణా పరిశ్రమలో చిక్కుకుంటున్నారు. కొన్ని సార్లు  కార్మికులు నకిలీ నియామక విధానాల ద్వారా తీసుకెళ్లి అక్కడ బానిసలుగా మార్చబడుతున్నారు. ముఖ్యంగా ఆ దేశాలకి వెళ్తే ఆదాయం పెరిగి కుటుంబం బాగుపడుతుందన్న ఆశతో  అప్పు చేసి ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ డబ్బు చెల్లించలేక, తిరిగి రాలేక క్రూరమైన యాజమానుల చేతుల్లో అష్ట కష్టాలు పడతారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు.   ఇవన్నీ గుర్తించిన భారతదేశం 2011లో "ట్రాఫికింగ్ బాధితుల చట్టం 2000" ప్రోటోకాల్‌ను ఆమోదించింది. మన భారత పౌరులు అలాంటివాటిలో చిక్కుకోకుండా  ఒక పక్క అవగాహన కల్పిస్తూనే, మరో పక్క అలా చిక్కుకున్నవారిని ఆయా దేశాల్లోని ఎంబసీల ద్వారా  కాపాడే ప్రయత్నం చేస్తుంది. వారు స్వదేశం చేరటానికి అన్ని రకాలుగా సాయం అందిస్తుంది. మానవ అక్రమ రవాణాని నివారించేందుకు ఏం చేయాలి...   నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్‌నెస్ డేలో పాల్గొనడం వల్ల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమానికి సహకరించేందుకు అందరికీ అవకాశం లభిస్తుంది. దీని గురించి స్పష్టంగా తెలుసుకనే అవకాశం కూడా లభిస్తుంది. మానవ అక్రమ రవాణాని ఎలా గుర్తించాలి?, ఎలా కంప్లైంట్ చేయాలి?  అనే వాటి గురించి అందరికీ తెలిసేలా  వర్క్‌షాప్‌లు, వెబినార్లు లేదా శిక్షణా సెషన్లను నిర్వహిస్తారు.   ఈ సమస్య గురించి సోషల్ మీడియాలో అవగాహన కల్పించడానికి,  దానికి సంబంధించిన  పోస్ట్‌లు, కథనాలను షేర్ చేయాలి. ఈ  అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహకరించి,  ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం అందించాలి. రాజకీయ నాయకులు, లాయర్లతో పాటూ కలిసి మానవ అక్రమ రవాణాను సమర్థవంతంగా పరిష్కరించే చట్టాలు, విధానాలకు మద్దతు ఇవ్వాలి.  అక్రమ రవాణా నిరోధక చట్టాల కోసం గొంతు విప్పాలి. అవేర్‌నెస్ ఈవెంట్‌లను నిర్వహించాలి. ఈ మానవ అక్రమ రవాణా మీద అందరూ తగిన అవగాహన పొందటం వల్ల  మనవాళ్ళు, మనకి తెలిసినవాళ్ళు ఏ మోసకారుల చేతుల్లోనో, ముఠాల చేతుల్లోనో చిక్కుకుని బలి కాకుండా కాపాడుకోవచ్చు.                                        *రూపశ్రీ.
సంక్రాంతి భారతీయులు జురుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ప్రముఖంగా రైతుల పండుగ.  క్రాంతి అంటే  స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. సంక్రాంతి అంటే.. కొత్త క్రాంతి.. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో వెలుగులీనుతాడు.  క్రమంగా తన వెలుగును పెంచుకుంటూ వెళతారు. సూర్యుడిలానే ప్రజలు కూడా కొత్త కాంతితో తమ జీవితాలలో ముందుకు సాగాలన్నదే సంక్రాంతి సందేశం.  సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది.  సూర్యుడి కాంతి ద్వారా భూమి వెలుగులో సంచరిస్తుంది.  ఉత్తరాయణం ప్రారంభం అయితే సూర్యుడి గమనం వేగం అవుతుంది. సూర్యుడి గమనం వల్లనే  ఈ ప్రపంచం ఇలా ఉంది. సూర్యుడి గమనం లేకపోతే ఈ ప్రపంచం అంధకారం అవుతుంది.  అందుకే సూర్యుడి విలువను, సూర్య కాంతి విలువను అర్థం చేసుకోవాలి. సంక్రాంతి అంటే 'పరివర్తనం' అని అర్థం. మకర సంక్రాంతి రోజున  'మహా-స్నాన-యోగం' జరుగుతుందట. నదులు,  సరస్సులలో ముఖ్యంగా పవిత్ర నదుల సంగమం వద్ద స్నానం చేయడం చాలా మంచిది. మకర సంక్రాంతి పంటల పండుగ కూడా. శీతాకాలం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నువ్వులతో చేసిన సాంప్రదాయ స్వీట్లు సంక్రాంతి ప్రత్యేకం.  పొంగలి కూడా సంక్రాంతి ప్రత్యేక వంటకం. దీని పేరు మీదనే ఈ పండుగకు పొంగల్ అనే పేరు కూడా వచ్చింది. సంక్రాంతి పండుగ పంటల పండుగ.  పంటలు పండాలంటే ఆ సూర్య రశ్మి చాలా అవసరం.  ఈ కారణంగానే రైతులతో పాటు దేశం యావత్తూ సూర్యుజిని సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరాధిస్తుంది.  ఉత్తరాయం ప్రారంభానికి సూచనగా, సూర్యుడి గమనానికి ప్రాధాన్యత ఇస్తూ రథం ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండుగ రోజు సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే.. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.  అది కూడా నీరు పారే ప్రాంతాలు, నదులలో అర్ఘ్యం సమర్పించడం మంచిది.   ఏ నదిలో స్నానం చేసి అర్ఘ్యం సమర్పిస్తారో.. ఆ నదీ దేవతకు ప్రార్థిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి పండుగ రోజున సన్యాసులు, పేదలకు దానం చేయడం మంచిది. అలాగే ఈ పండుగ రోజు వండే వంటల్లో ఉల్లి వెల్లుల్లిపాయలను అస్సలు తినకూడదు.                               *రూపశ్రీ.  
  చలికాలం చాలా రకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకు వస్తుంది. చలిగాలులు, మంచు కారణంగా తొందరగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. ఇక ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారు చలికాలం వల్ల చెప్పలేనంత ఇబ్బంది పడతారు. కొందరికి చలి కారణంగా ఛాతీ పట్టేయడం,  ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. చలి గాలులు చెవిలోకి వెళ్లి తలనొప్పి కూడా వచ్చేలా చేస్తుంది.   ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, వీటి నుండి బయటపడాలన్నా,   ఆయుర్వేదం చెప్పిన కొన్ని చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. పసుపు పాలు.. పసుపును కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ సమస్యల  నివారణకు ఉపయోగిస్తున్నారు.  పసుపులో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  కొద్దిగా పసుపును పాలలో వేసి మరిగించాలి.  ఇందులో రుచి కోసం అల్లం, మిరియాలు కూడా వేసుకోవచ్చు.  ఈ పసుపు పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.  జలుబు కారణంగా ఏర్పడిన ముక్కుల రద్దీని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హనీ, జింజర్ టీ.. అల్లం, తేనె రెండూ ఆయుర్వేదంలో మంచి ఔషధాలు.  రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం, తేనె పని చేస్తాయి. అల్లాన్ని దంచి లేదా సన్నని ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించాలి.  మరిగిన తరువాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతుకు మంచి  ఉపశమనం ఇస్తాయి. అల్లం శ్వాస కోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవిరి.. ఆవిరి పట్టడం చాలా మంచి టిప్.  జలుబు, దగ్గు, ముక్కులు మూసుకుపోవడం, తల నొప్పి, తల భారం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక గిన్నెలో నీటిని బాగా మరిగించాలి.  బాగా వేడెక్కిన నీటిలో కొన్ని చుక్కల నీలగిరి తైలం వేసుకుని నీటి ఆవిరి పట్టాలి. ఇది తల భారం తగ్గిస్తుంది,  ముక్కల రద్దీని తగ్గిస్తుంది. శ్వాస నాళాలను క్లియర్ చేస్తుంది. పుక్కిలించడం.. గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం కూడా మంచి మార్గం.  గోరు వెచ్చని నీటిలో కాసింత ఉప్పు వేయాలి.  ఈ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. నీరు గొంతును క్లీన్ చేసేలా పుక్కిలించాలి.  ఇది నోట్లో, గొంతులో ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది. నాసల్ డ్రాప్స్.. ఆయుర్వేదంలో నాసల్ డ్రాప్స్ ఉన్నాయి.   దీన్ని అను తైలం అని పిలుస్తారు. ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకోవడం వల్ల ముక్కుల రద్దీ తగ్గుతుంది.  సాధారణంగా ఏ టిప్ వాడినా ముక్కులు తాత్కాలికంగా రిలీఫ్ అయ్యి తరువాత మళ్లీ రద్దీ అవుతాయి. కానీ ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. హెర్బల్ టీ..   నల్ల మిరియాలు, అతి మధురం,  తులసి వంటి ఆయుర్వేద మూలికలతో చేసిన హెర్బల్ టీని తయారు చేసుకుని ఈ చలికాలంలో తీసుకుంటే భలే పనిచేస్తుంది.  ఇది దగ్గు, జలుబు,  రద్దీగా ఉన్న ముక్కులను తెరవడం, దగ్గు, కఫం సమస్యను తగ్గించడం చేస్తుంది.                                                   *రూపశ్రీ.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో విటమిన్-సి ముఖ్యమైనది.  విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.  జబ్బు పడినప్పుడు విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు తీసుకుంటే చాలా తొందరగా కోలుకుంటారు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  సాధారణంగా విటమిన్-సి లోపం రావడం అరుదే అయినప్పటికీ..  ఈ లోపం ఏమాత్రం ఉన్నా ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. విటమిన్-సి లోపం తొలగాలన్నా,  రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ కింది సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి. బ్రోకలీ.. బ్రోకలీలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుంది.  అలాగే కాల్షియం,  ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి.. ఉసిరికాయలు విటమిన్-సి కి చాలా మంచి మూలం.  నిమ్మకాయలో ఉండే విటమిన్-సి కంటే 10 రెట్లు విటమిన్-సి  ఉసిరికాయలలో ఉంటుంది.  ఉసిరికాయను పొడి రూపంలో తీసుకున్నా,  జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా రోజూ ఒక కాయను పచ్చిగానే తిన్నా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.   రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మం మెరిచేలా చేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు తొలగిస్తుంది. నారింజ.. నారింజ సిట్రస్ పండ్లలో ప్రముఖమైనది. నారింజను తినడం వల్ల  రోగనిరోధక శక్తి అద్బుతంగా పెరుగుతుంది.  ప్రతిరోజూ ఒక నారింజ పండు తింటుంటే వృద్దాప్యం త్వరగా రాదట.  జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట.  తెల్ల జుట్టు సమస్య అస్సలే ఉండదని ఆహార నిపుణులు అంటున్నారు.  నారింజలో పైబర్,  విటమిన్-ఎ, పొటాషియం, విటమిన్-సి ఉంటాయి.    ఇన్పెక్షన్ ప్రమాదాలు తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాప్సికం.. క్యాప్సికంలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇందులో విటమిన్-సి,  విటమిన్-ఎ,  బీటా కెరోటిన్ ఉంటాయి.  దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్-సి లోపం తొలగిపోతుంది.  దీన్ని సలాడ్ లలోనూ,  వెజిటబుల్ జ్యూస్ లోనూ జోడించుకోవచ్చు. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఇధి మాత్రమే కాకుండా ఇది శరీరం డిటాక్స్ కావడంలో సహాయపడుతుంది. అంటే.. శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలు, మలినాలు, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.                                      *రూపశ్రీ