నాలుగేళ్లుగా చంద్రబాబు రెండు సినిమాలు చూపిస్తున్నారు

నాలుగేళ్లుగా చంద్రబాబు రెండు సినిమాలు చూపిస్తున్నారని జగన్ అన్నారు.. సినిమాలు చూపించడానికి ఆయన ఏమన్నా మహేష్ బాబా? బాలయ్య బాబా? అనుకోకండి.. సినిమాలు అంటే వెండితెర మీద చూసే సినిమాలు కాదులేండి.. మొన్న ఆ మధ్య పిట్ట కథ కాన్సెప్ట్ తో బాబుని విమర్శించిన జగన్, తాజాగా సినిమాల కాన్సెప్ట్ తో కొత్తగా విమర్శించే ప్రయత్నం చేసారు.. బాబు నాలుగేళ్లుగా రెండు సినిమాలు చూపిస్తున్నారట.. వాటిలో ఒకటి అమరావతి కాగా రెండోది పోలవరమట.. అమరావతి సినిమాలో అదిగో సింగపూర్, ఇదిగో జపాన్ అంటూ గ్రాఫిక్స్ లు చూపించటం తప్ప శాశ్వత నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టలేదని ఆరోపించిన జగన్.. పోలవరం సినిమాలో కలెక్షన్లు బాగానే ఉన్నాయి కానీ పనులే నెమ్మదిగా సాగుతున్నాయి అంటూ విమర్శించారు.. ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో బాబుని విమర్శిస్తున్న జగన్, నెక్స్ట్ ఏ కొత్త కాన్సెప్ట్ తో వస్తారో ఏంటో.