సీబీఐ కోర్టులో జగన్..బెయిలా? జైలా?

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై విచారించిన కోర్టు తీర్పు ఈరోజుకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జగన్ కోర్టుకు హాజరయ్యారు. అయితే జగన్ కు బెయిలా? జైలా? అనే విషయం ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 4 గంటల్లోపు తేలిపోబోతోంది. అంతవరకు జగన్ కోర్టులోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీ నేతలు ఏం తీర్పు వస్తుందా అని టెన్షన్ లో ఉన్నారు.