ఆయన ఉత్తరప్రదేశ్‌‌ను "ఉత్తమ"ప్రదేశ్‌గా మారుస్తాడు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్రమోడీ. ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఆయన ట్వీట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. మన ఏకైక లక్ష్యం..ఉద్దేశం..అభివృద్ధి, ఉత్తరప్రదేశ్ అభివృద్ది చెందితే, దేశం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ను ఉత్తమప్రదేశ్‌గా తీర్చిదిద్దే క్రమంలో కొత్త ప్రభుత్వం ఎటువంటి విమర్శలకు తావివ్వదనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని నడుపుతారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.