ఉండవల్లి, పవన్ భేటీ...

 

రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉండవల్లికి సాదరంగా ఆహ్వానం పలికారు. తమ పార్టీ ప్రముఖులను ఉండవల్లికి ఆయన పరిచయం చేశారు. అనంతరం, వారి మధ్య చర్చ ప్రారంభమైంది. విభజన హామీల సాధనకు ఏపీలో జేఏఫ్సీ ఏర్పాటు చేస్తానని పవన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై వారి మధ్య చర్చ జరగనుంది. ఈ చర్చ సుమారు గంటన్నర పాటు జరగనున్నట్టు సమాచారం.