ఆరోగ్యం బాగుండాలా! కాసేపు చెప్పులు తీసి నడవండి...

ఇంట్లో ఏ కరెంటు వస్తువు ఉన్నా... అది votage fluctuationsని తట్టుకోవాలంటే ఒక ఎర్త్‌ వైర్ పెడతారు. మరి మన body పరిస్థితి ఏమిటి? మన శరీరం కూడా ఒక బ్యాటరీలాంటిదే కదా! అందులో ప్రతి అవయవం పనిచేయడానికి ఎంతో కొంత విద్యుత్తు అవసరమేగా. అందుకే నేలతో శరీరానికి నేరుగా సంబంధం ఉంటే... ఒంట్లో వైబ్రేషన్స్‌ కూడా perfectగా ఉంటాయని చెబుతున్నారు.

 

 

Earth నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికైనా, మన ఒంట్లో అధికంగా ఉన్న నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ను వదిలించుకోవడానికైనా... చెప్పులు లేకుండా కాసేపు నేల మీద నడవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకప్పుడు నేల మీద చెప్పులు లేకుండానే నడిచేవారు. రాత్రిపూట కూడా నేల మీదే పడుకునేవారు. దాని వల్ల భూమితో శరీరానికి నేరుగా సంబంధం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరిగేస్తున్నారు. బయటకి వెళ్లినా ప్లాస్టిక్‌ లేదా రబ్బర్‌ చెప్పులు వేసకుంటున్నారు. ఇవి నేల నుంచి శరీరంలోకి ఎలాంటి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి.

కాళ్లకి ఎలాంటి అడ్డూ లేకుండా నేల మీద నడవడాన్ని Grounding అని పిలుస్తారు. కేవలం Groundingతోనే రోగులను నయం చేసే Earthing Therapy అనే ట్రీట్‌మెంట్‌ కూడా ఇప్పుడు పాపులర్‌ అవుతోంది. ఈ ధెరపీతో చాలా రకాల సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.

 

 

- Grounding వల్ల ఒంట్లో వాపు, నొప్పిలాంటి సమస్యలన్నీ తీరిపోతాయట. ఒక నాలుగువారాల పాటు ఇలా నడిస్తే... వెన్నునొప్పి, మోకాలి నొప్పులు, పొద్దున పూట కీళ్లు పట్టేయడం లాంటి సమస్యలలో మంచి రిలీఫ్‌ కనిపించినట్లు రీసెర్చ్‌లో తేలింది.

- Grounding వల్ల stress కూడా చాలావరకు తగ్గిపోతుందని తెలిసింది. మన శరీరంలో cortisol అనే హార్మోన్‌ ఉంటుంది. ఈ హార్మోనుని గమనిస్తే, ఒంట్లో ఎంత stress ఉందో తెలిసిపోతుంది. నేల మీద పాదాల ఉంచి నడవటం వల్ల ఈ cortisol చాలావరకు తగ్గిపోయిందట.

- Grounding వల్ల blood circulation మెరుగుపడుతుందని చెబుతున్నారు. Blood circulation బాగుంటేనే మన ఒంట్లో ప్రతి అవయవానికీ సక్రమంగా ఆక్సిజన్‌, విటమిన్స్ అందుతాయి. దాంతో చర్మం దగ్గర నుంచి గుండె దాకా అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి.

- భూమిలో లెక్కలేనన్ని electrons, antioxidants ఉంటాయి. చెప్పులు లేకుండా నడవటం వల్ల ఇవి మన శరీరానికి నేరుగా అందుతాయి.

చూశారుగా! Grounding వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే రోజుకి ఒక అరగంటసేపన్నా... గడ్డి, నేల, ఇసుక ఉన్న ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడిచి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది.

- Nirjara