శశికళ జైలులో సీసీటీవీ రికార్డులు మాయం

పరప్పన అగ్రహార జైల్లో పరిస్థితులపై కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప ఇచ్చిన నివేదిక ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన రెండో నివేదిక మరిన్ని ప్రకంపనలు రేకేత్తిస్తోంది. ఈ నివేదికలో శశికళ జైలు గదికి సంబంధించి సీసీటీవీ రికార్డింగ్స్ మాయం అయ్యాయని, అందువల్ల ఆమెకు కల్పించిన విలాసవంతమైన సౌకర్యాల వివరాలు తెలియకుండా పోయాయని ఆరోపించారు. విజిటర్స్ గ్యాలరీలో రెండు సీసీటీవీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయని, అడ్మిషన్ రూంలోని కెమెరా కూడా మూలపడిందని అలాగే తనను కలిసేందుకు వచ్చిన వారితో శశికళ మాట్లాడిన రికార్డింగ్స్‌ను ఎవరో డిలీట్ చేసినట్లు తన విచారణలో తేలిందని రూప వెల్లడించారు.. కొద్ది రోజుల క్రితం రూప ఇచ్చిన తొలి నివేదికలో చిన్నమ్మకు జైల్లో సౌకర్యాలు కల్పించినందుకు గానూ జైళ్ల శాఖ అధికారులకు రూ.2 కోట్లు లంచం ఇచ్చారంటూ వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.