జయమ్మకి విజయశాంతి మద్దతు

 

జైల్లో వున్న జయమ్మకి విజయశాంతి మద్దతు ప్రకటించారు. అక్రమ ఆస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత త్వరలో విడుదలవుతారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేత, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. జయలలిత జైలు నుండి మరింత శక్తితో బయటకు వచ్చి రాష్ట్రాన్ని మళ్లీ సుభిక్షంగా తమిళనాడును పరిపాలిస్తారని ఆమె అన్నారు.