ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా దసరా

 

వచ్చే ఏడాది నుంచి దసరా ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని, ఈ విషయంలో త్వరలో ప్రభుత్వ అధికారిక నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.