మాల్యా కేసు విచారణ..

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా ఎంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడ ఉన్న మాల్యాను ఇండియా రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు లండన్ లో ఉన్న మాల్యాను పోలీసులు అరెస్ట్ చేయగా.. అరెస్ట్ చేసిన కొద్ది సేపటికే బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే ఈరోజు.. మాల్యాను భారత్‌కు అప్పగించడంపై లండన్‌లో విచారణ ప్రారంభమైంది.ఈ విచారణకు హాజరయ్యేందుకు సీబీఐ బృందం కూడా లండన్‌ వెళ్లింది. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థాన నేతృత్వంలోని సీబీఐ బృందం అక్కడికి చేరుకుంది. ఈ రోజు ప్రారంభమైన విచారణ.. ఈనెల 5, 6, 7, 11, 12, 13, 14వ తేదీల్లో కొనసాగనుంది. వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ విచారణ జరుగుతోంది. చీఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎమ్మా అర్బుత్‌నోట్‌ ఇరు పక్షాల వాదనలు విననున్నారు. భారత ప్రభుత్వం తరఫున బ్రిటన్స్‌ క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ వాదిస్తోంది.