మాల్యా కోర్టు ముందు హాజరుకావాల్సిందే..

 

వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి లిక్కర్ అధినేత విజయ్ మాల్యా విదేశాల్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా మాల్యాను ఇండియా రప్పించాలని చూస్తున్నారు అధికారులు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది జరగడం లేదు. ఇప్పటికీ రెండు సార్లు లండన్ పోలీసులు అరెస్ట్ చేసినా.. అరెస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే బయటకు రావడం జరిగింది. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు మాల్యాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెరా ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న మాల్యాపై ఢిల్లీ న్యాయస్థానం మండిపడింది. డిసెంబర్ 18 లోపు కోర్టు ఎదుట మాల్యా హాజరుకావాలని .. ఇదే చివరి అవకాశమని పాటియాలా హౌజ్ కోర్టు ఈరోజు ఆదేశించింది. గడువు తేదీ లోగా కోర్టు ఎదుట హాజరుకాని పక్షంలో మాల్యాను ఆర్థిక నేరంలో దోషిగా భావించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఈ కేసు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను రెండు నెలల్లోగా తమకు అందజేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర్టు ఆదేశించింది.