మాల్యాకు ఊరట.. బెయిల్ గడువు పొడిగింపు...

 

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ లో తలదాచుకున్న కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. మాల్యాను ఇండియా రప్పించాలని ఈడీ అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు కేసును విచారించింది. ఈసందర్భంగా మాల్యాకు భారీ ఊరటే లభించింది.  విచారణకు హాజరైన మాల్యా.. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని, తాను అమాయకుడినని, ఎవరినీ మోసం చేయలేదని కోర్టుకు తెలిపారు. ఇక విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. అంతేకాదు బెయిల్‌ గడువు సైతం పొగడించారు. మరో ఆరునెలలు బెయిల్ గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు.