కడప నుంచి మనుషులు.. దేవినేనిని చంపుతారా?

రాజకీయాల్లో సిద్ధాంత పరమైన వ్యతిరేకతే కానీ వ్యక్తిగత శత్రుత్వం ఉండదనే మాట వింటూ ఉంటాం.. కానీ ఆ మాట కేవలం నోటి నుంచి వచ్చే మాటే కానీ, మనస్సులో నుంచి వచ్చే మాట కాదని చాలా సందర్భాల్లో రుజువైంది.. తాజాగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం రాజకీయం కూడా అలాగే ఉంది.. ఏపీ మంత్రి, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమని చంపడానికి కూడా వెనకాడమంటూ ప్రత్యర్థి నేత వార్నింగ్ ఇస్తున్నారు.. ఇటీవల వైసీపీలో చేరిన వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణ ప్రసాద్‌ దేవినేని ఉమపై వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు.. టీడీపీకి పట్టున్న గ్రామాలైన ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడిల్లో వైసీపీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.. గుంటుపల్లిలో భారీగా ఫ్లెక్సీలు పెట్టింది.. అయితే అక్కడి పంచాయతీ సిబ్బంది రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించేందుకు నిర్ణయించారు.. దీంతో వైసీపీ ఈ విషయాన్ని కృష్ణప్రసాద్‌కు, వసంత నాగేశ్వరరావుకు తెలియజేశారు.

 

 

ఇంకేముంది వసంత నాగేశ్వరరావుకి కోపం కట్టలు తెంచుకుంది.. దీంతో నాగేశ్వరరావు  ఈ నెల 7 రాత్రి గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్‌.వి.నరసింహారావుకు ఫోన్‌చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.. టీడీపీ ఏజెంట్ గా పనిచేయడం మానుకోవాలని.. మంత్రి దేవినేనిని ఏమైనా చేస్తాం.. కడప నుంచి మనుషులను తెప్పిస్తాం.. నాకే కాదు జగన్‌కు మంత్రిపై కక్ష ఉంది.. అతను అసెంబ్లీలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు... ఉమని శాసనసభలో చూడటం జగన్‌కు ఇష్టం లేదని నాగేశ్వరరావు అన్నారట.. అయితే ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆడియో టేప్ ఆధారంగా పోలీసులు వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.. మరోవైపు ఈ విషయాన్నీ చంద్రబాబు కూడా సీరియస్ గా తీసుకున్నారు.. రీసెంట్ గా అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. దీనిలో ఈ అంశం చర్చకు వచ్చింది.. దీనిపై సీరియస్‌గా స్పందించిన చంద్రబాబు.. బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.. బెదిరింపులు, హత్యలతో ఎవరూ ఏమీ సాధించలేరని ఇలాంటి చర్యలను ప్రొత్సహించిన వారిపై తీవ్ర స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు.. మంత్రి దేవినేనిని హత్య చేస్తాం అనే స్ధాయిలో వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని.. అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించాలని సీఎం సూచించారు.