చనిపోయిన వ్యక్తి బతికే ఉన్నాడు

 

ఉత్తరాఖండ్ వరదలు సృష్టించిన భీభత్సంలో చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నాడని, ఈ విషయాన్ని అక్కడి ఖేదారగాటి విశ్వ పానివమ్ పునర్వాస సంఘర్ష సమితి అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పుష్కర్ సింగ్ అనే వ్యక్తి అదే రాష్ట్రానికి చెందినవాడు. అతను 2013లో సంభవించిన ఉత్తరాఖండ్ వరదల్లో కనిపించకుండా పోయాడని, ఇప్పుడు ఆయన రుద్ర ప్రయోగలో మతిస్థిమితం లేకుండా కనిపించాడని, అతనిని సంబంధితులకు అప్పగించామని చెప్పారు.