తెలంగాణ బడ్జెట్‌లో ముఖ్య కేటాయింపులు

 

2019-20 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను సీఎం కేసీఆర్, కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, మాంద్యం ప్రభావం రాష్ట్రంపై నామమాత్రమేనని అన్నారు. దేశ వ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గిందన్నారు. వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయన్నారు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడటంతో, జాతీయ సగటుతో పోలిస్తే అధిక జీడీపీ సాధ్యమేనని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు:

2019-20 సంవత్సరానికి  ప్రతిపాదిత వ్యయం రూ. 1,46,492 కోట్లు.
రెవెన్యూ వ్యయం రూ.1,11, 055 కోట్లు
మూలధన వ్యయం రూ. 17,274 కోట్లు
మిగులు బడ్జెట్‌ అంచనా రూ.2,044 కోట్లు
ఆర్థిక లోటు రూ.24,081 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.9,402 కోట్లు
గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు
మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు
విద్యుత్ సబ్సిడీలకు రూ.8 వేల కోట్లు
రైతు రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు
రైతుబంధుకు రూ.12 వేల కోట్లు
రైతు బీమా కోసం రూ.1125 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.1,336 కోట్లు
వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల పింఛన్ రూ. 1000 నుంచి రూ. 2016కు పెంపు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ. 31,802 కోట్లు
త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ల మంజూరు.
కల్యాణలక్ష్మి, పెన్షన్ స్కీములన్నీ కొనసాగుతాయి.