తెలంగాణలో ముందస్తు ఎన్నికలు

దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు అనే మాట బలంగా వినిపిస్తుంది.. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.. అంటే వచ్చే ఏడాది  మేలో జరగాల్సిన ఎన్నికలు, ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది.. అయితే తెలంగాణలోని తెరాస ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉందట.. ఒకవేళ లోక్ సభకు ముందస్తు ఎన్నికలు అనివార్యమైతే, వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధమవ్వాలని తెరాస భావిస్తోందట.. ఇప్పటికే కేసీఆర్ ఈ విషయం గురించి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఎన్నికలు ముందే రావొచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకి ఇంకా దగ్గరవ్వాలని చెప్పారట.. దీన్నిబట్టి చూస్తుంటే బీజేపీ, లోక్ సభకు ముందస్తు ఎన్నికలకు వెళ్తే తెలంగాణ అసెంబ్లీకు కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అనమాట.