ఈతకు వెళ్ళి ఏడుగురి మృతి

 

మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఈతకు వెళ్ళిన ఏడుగురు నీట మునిగి మరణించారు. ఆమనగల్లు మండలం చారికొండ గౌరమ్మ చెరువులో ఈతకొట్టడానికి ప్రయత్నించి వీరు మరణించారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు కూడా వున్నారు. వీరందరూ హైదరాబాద్‌ మేడ్చల్ దగ్గర వున్న వున్న సుచిత్ర ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. మృతి చెందిన వారిని రుఖయ్య (18), ముసరత్ (16), మస్కాన్ (16), బాసిత్ (30), రెహ్మన్ (15), మున్నాబేగం (14) గా గుర్తించారు. అయితే చనిపోయినవారిలో ఆరుగురి మృతదేహాలు లభించగా ఏడవ మృత దేహం కోసం గాలిస్తున్నారు.