రెండు రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు..

 

రాష్ట్రవిభజన సమయంలో ముఖ్యంగా భద్రాచలంలోని ముంపు మండలాలపై ఇరు రాష్ట్రాల మధ్య చాలా గొడవలే జరిగాయి. ఆ ముంపు మండలాలు కూడా మమ్మల్ని తెలంగాణలోనే కలపండి అని మొత్తుకున్నాయి. కానీ కేంద్రం నాలుగు మండలాలను ఏపీలో కలిపింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఏపీలో కలిపిన నాలుగు రాష్ట్రాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. వాటి అభివృద్ధికి ఏపీ, తెలంగాణలు నిధులివ్వాలన్నారు. ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానని వాపోయారు. ఏపీ అసెంబ్లీలో తనకు అసోసియేటెడ్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఆయన వినతి పత్రం ఇచ్చారు.