శిశువును పూడ్చేసిన తల్లి.. మూడు రోజుల తరువాత ప్రాణాలతో..

 

ఓ తల్లి తాను జన్మనిచ్చిన బిడ్డనే సజీవంగా పూడ్చిపెట్టి దారుణానికి పాల్పడింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పూడ్చిపెట్టిన మూడు రోజుల తరువాత ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడం.. ఈఘటన ధక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఓ టింబర్‌ ఫ్యాక్టరీలో పనిచేసే 25 ఏళ్ల మహిళకు ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే తాను బిడ్డకు జన్మనివ్వడం తన తల్లిదండ్రులకు తెలిస్తే ఆగ్రహిస్తారని భయపడి.. ఆబిడ్డను ఆ ఫ్యాక్టరీ ఆవరణంలోనే పూడ్చిపెట్టింది. అయితే మూడు రోజుల తరువాత...ఫ్యాక్టరీలో పనిచేసే వారు అటువైపు వెళ్లగా.. శిశువు ఏడుపులు వినిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా వారు బాలుడిని కాపాడారు. దీంతో అసలు విషయం బయటపడింది. కాగా ప్రస్తుతం.. శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.