యాసిడ్ దాడి... పరారిలో కొడుకు



రోజు రోజుకీ మానవ సంబంధాలు నీరుగారి పోతున్నాయి.. ముక్కుపచ్చలారని పిల్లల్ని చంపే తండ్రి, తనతో పాటూ పిల్లల్నీ చంపే తల్లి... రోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే వున్నాయి..... మనము చదువుతూనే వున్నాము. కానీ ఓ దుర్మార్గపు కొడుకు ఇబ్రహీం పట్నంలో ఆస్తి తగాదాల దాడి నేపథ్యంలో స్వంత తల్లితండ్రులపై యాసిడ్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారూ. నిందుతుడు మాత్రం దాడి చేసిన వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. పరారిలో వున్న అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.