వార్ ముదిరిందా.. చంద్రబాబు మీటింగ్ కు శిల్పా చక్రపాణి డుమ్మా..!

 

శిల్పా చక్రపాణి రెడ్డి, భూమా అఖిల ప్రియల మద్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అఖిల ప్రియకు ఉన్న ప్రాధాన్యం పార్టీలో సీనియర్‌ నేతలకు ఇవ్వడం లేదన్నది సీనియర్ల వాదన. ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబు ఈరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నా కానీ ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు. మంత్రి అఖిల ప్రియ కావాలనే శిల్పా చక్రపాణి రెడ్డిని పార్టీకి దూరం చేసినట్లు తెలుగుదేశం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అఖిల ప్రియ వర్గం మాత్రం శిల్పా కావాలనే పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు.

 

కాగా సీఎం పర్యటన సందర్భంగా 10 మంది డీఎస్పీలు, 23 మంది సీఐలు, 86 మంది ఎస్‌ఐలు, 254 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 654 మంది కానిస్టేబుళ్లు, 6 ప్లటూన్ల ఏఆర్, 3 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తున్నారు. 46 మంది మహిళా పోలీసులు, 300 మంది హోంగార్డులు, 6 స్పెషల్‌ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు. మొత్తానికి భూమా, శిల్పా కుటుంబాల మధ్య వార్ బాగానే ముదిరినట్టు ఉంది.