పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మృతి

జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు  జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖ వాసి అయిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిలో మధుసూదన్ బెంటళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు.  ఆయన తల్లిదండ్రులు కావలిలో నివసిస్తున్నారు. మధుసూదన్ కుటుంబంతో సహా జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ మరణించారు. ఆయన శరీరంలోకి 42 తూటాలు దూసుకుపోయినట్లు చెబుతున్నారు.

ఇక ఈ ఉగ్రదాడిలో  మరణించిన రెండో తెలుగు వ్యక్తి విశాఖ వాసి చంద్రమౌళి  రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి.. ఈయన కుటుంబంతో సహా పర్యటనకు వెళ్లారు. ఉగ్రమూకలు ఈయనను వెంటాడి వెంటాడి హతమార్చినట్లు చెబుతున్నారు. చంపవద్దంటూ బతిమాలినా క్రూరంగా కాల్చి చంపేశారని చెబుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu