పరీక్ష పోస్ట్ పోన్ అవ్వాలని హత్య...


పెరుగుతున్న టెక్నాలజీతోపాటు పిల్లల మనసులు కూడా ఎంత మారుతున్నాయో అప్పుడప్పుడు జరిగే సంఘటనలు వింటే అర్ధమవుతుంది. పరీక్షలు, పేరెంట్స్ మీటింగ్ పోస్ట్ పోన్ అవ్వడానికి ఎవరైనా హత్య చేస్తారా. కానీ ఇక్కడ ఓ విద్యార్ది మాత్రం ఈ సిల్లీ రీజన్స్ కోసం హత్య చేశాడు. ఇంతకీ ఆ పిల్లాడు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? అది తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. గుర్గావ్ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రద్యుమన్ ఠాకూర్ అనే విద్యార్ధి హత్య ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ కేసులో గుర్గావ్ పోలీసులు మొదట.. స్కూలు బస్సుకు చెందిన కండక్టర్ అశోక్ కుమార్ పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తరవాత సీబీఐ ఎంట్రీ ఇవ్వడంతో కేసు మరో మలుపు తిరిగింది. వారు ముమ్మర దర్యాప్తు చేయగా... ఓ సీనియర్ విద్యార్థి ఉన్నట్టు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు సీబీఐ చెప్పే విషయాలు వింటే మాత్రం మతి పోవాల్సిందే. ఎందుకంటే..  అతను చదువులో వెనుకబడ్డాడని... దీంతో, పరీక్షలు వాయిదా పడాలని అతను కోరుకున్నాడని.. ఈ కారణంగానే ప్రద్యుమన్ ను హత్య చేసి ఉంటాడని తాము భావిస్తున్నామని చెప్పారు. అంతేకాదు విచారణ కోసం సదరు విద్యార్థిని జువైనల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరుతోంది. ఏది ఏమైనా పరీక్షల పోస్ట్ పోన్ కోసం హత్య చేయడం అంటే చాలా దారుణమైన విషయం.