పనికిమాలిన టీడీపీ, జనసేనల్లోకి నేను వెళ్లను
posted on Jun 24, 2017 3:32PM
.jpg)
నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపై మండిపడ్డారు రోజా. లోటస్ పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె..పనికిమాలిన టీడీపీ, జనసేనలోకి వెళ్లే అవసరం తనకేం లేదన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి రాగానే జగన్ తనను ఎమ్మెల్యేని చేశారన్నారు. తనను సంవత్సరం పాటు అసెంబ్లీలోకి రాకుండా చేసిన చంద్రబాబు ఎక్కడ..జగన్ ఎక్కడా అని ప్రశ్నించారు. జగనన్న తనను సోదరి అని చెప్పుకుంటున్నారని, ఆయనకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రాణమున్నంత వరకు తాను వైసీపీలోనే ఉంటానని తెలిపారు. పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తే..తనను సంప్రదించి విషయం తెలుసుకోవాలని..అంతేకానీ ఇష్టమొచ్చినట్లు రాయడం ఏంటని ఆమె ప్రశ్నించారు.