రేవంత్ కు బెయిల్.. న్యాయమే గెలిచింది

ఓటుకు నోటు కేసులో తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి ఏసీబీ అధికారులు ఎన్ని కుట్రలు చేసినా అవేమి పారలేదు. ఎప్పుడో బెయిల్ రావల్సిన రేవంత్ రెడ్డికి ఏసీబీ అధికారులు బెయిల్ రాకుండా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు పటాపంచలైపోయాయి. కస్డడీలో విచారణ జరిగిన తరువాత బెయిల్ మంజూరు చేయవచ్చు కానీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు ఏసీబీ అధికారులు. పైగా కేసు లో ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.. సాక్ష్యులను బెదిరిస్తారు.. సాక్ష్యాలు తారుమారు చేస్తారు.. అని ఏవేవో కాహానీలు చెప్పింది.. కనీసం తన కూతురు ఏంగేజ్ మెంట్ కి కూడా ఏవో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చి సంతోషంగా లేకుండా చేశారు. కానీ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనేది నిజం. అది నిజం చేసి చూపించింది కోర్టు. ఏసీబీ చెప్పిన వాదనలన్నింటిని తోసి పుచ్చి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింద

 

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో తెలంగాణ నేతలలో ఇప్పటికే అలజడి మొదలై ఉండవచ్చు. ఎందుకంటే టీడీపీ నేతలలో చాలా పవర్ ఫుల్ నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ని నేరుగా ఢీకొనడం కుదరగా ఓ పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారు తెలంగాణ అధికార నేతలు. ఇప్పుడు జూలు విదిల్చిన సింహాల రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాటికి తెలంగాణ నేతలు తట్టుకుంటారో లేదో చూడాలి. ఇప్పటి వరకు ఈకేసులో జరిగిన పరిణామాలు వేరు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తరువాత జరగబోయే పరిణామాలు వేరని తెలుస్తోంది. అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ అధికార నేతలకు ఎలా సమాధానం చెప్తారో చూడాలి.