అమ్మకానికి రిలయన్స్..అంబానీ చరిత్ర ఇక గతమేనా..?
posted on Jun 28, 2017 2:58PM
.jpg)
ఓడలు బళ్లు..బళ్లు ఓడలు అవ్వడం అంటే ఏంటో రిలయన్స్ విషయంలో నిజమే అనిపిస్తుంది. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా ఉంది పరిస్థితి..కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న బ్యాంకు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ కఠిన చర్యలు తీసుకుంటుండటంతో బ్యాంకులు రుణాల వసూలుపై దృష్టి సారించడం ఇప్పుడు అనిల్ అంబానీకి మెడ మీద కత్తిలా తయారైంది. తమ దగ్గర తీసుకున్న రుణాలను చెల్లించాలని బ్యాంకులు అనిల్‌పై ఒత్తిడి తెస్తుండటంతో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిలో భాగంగా రిలయన్స్ ఆస్తులను విక్రయించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అనిల్ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్‌కు రూ.45 వేల కోట్ల రుణాలున్నాయి. దీంతో రుణ భారం తగ్గించుకోవడానికి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రుణ పునర్వ్యస్థీకరణకు తెర తీశారు అనిల్ అంబానీ.