రామ్ చరణ్ దంపతులకు పాపా? బాబా?
posted on Apr 8, 2015 1:01PM

రామ్ చరణ్, ఉపాసన దాంపత్యం త్వరలో ఫలించబోతోందని, ఉపాసన ప్రస్తుతం గర్భవతి అని, త్వరలో ఆమె పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఉపాసన ఒక ఫిట్‌నెస్ సెంటర్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంది. ఆ ట్రైనింగ్ గర్భవతులు తీసుకునే ట్రైనింగ్ అని ఉపాసన స్వయంగా చెప్పింది. దాంతో అప్పటి వరకూ ఊహాగానాలుగా వున్న వార్తలను అభిమానులు కన్ఫమ్ చేసేసుకున్నారు. తమ హీరో త్వరలో తండ్రి కాబోతున్నాడని రామ్ చరణ్ అభిమానులు ఉత్సాహంగా చెప్పుకుంటున్నారు. ఇదిలా వుండగా రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయేది అమ్మాయా.. అబ్బాయా అనే సందేహం ఇప్పుడు అభిమానులను వేధిస్తోంది. అబ్బాయి పుట్టాలని కొంతమంది కోరుకుంటే, పుట్టేది అమ్మాయే అనని కొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోబోతున్న రామ్ చరణ్, ఉపాసనకు అభినందనలు.