నేను రాజకీయాల్లోకి వస్తే ఆ ఛాన్స్ ఉండదు..!

 

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన అభిమానులతో సమావేశమైన రజనీ తన రాజకీయ ఎంట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని..తన భవిష్యత్తును ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని అన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఎంతో కాలం నుంచి అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, వారు అలా కోరడంలో తప్పులేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఆశ ఉన్నవారిని దగ్గర చేర్చుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా 1996లో డీఎంకేకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం తన పేరును వాడుకున్నారని రజనీ అన్నారు. మరి ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన చెప్పకపోయినా, రజనీ ప్రసంగం రాజకీయాల ప్రస్తావనతోనే మొదలైంది.