రజనీ వార్నింగ్...హద్దులు మీరి ప్రవర్తించవద్దు..
posted on May 26, 2017 12:19PM

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకముందే అప్పుడే ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. ఒకపక్క ఆయన అభిమానులు రజనీ తొందరగా రాజకీయాల్లోకి రావాలని ఆశగా ఎదురుచూస్తుంటే.. మరోపక్క ఆయనను వ్యతిరేకించేవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది రజనీపై విమర్సలు చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్న ఇప్పుడు రజనీ తన అభిమానులకు ఓ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో వీరి చర్యల్ని ఎండగట్టే విధంగా అభిమానులు దూకుడు పెంచాలని.. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగించినా సహించబోమంటూ ఎదురుదాడికి దిగాలని చూస్తున్న తరుణంలో.. అభిమానానికి కళంకం తెచ్చే విధంగా హద్దులు మీరొద్దని.. ఎవరైనా అలా వ్యవహరిస్తే అభిమానసంఘం నుండి వారిని తొలగించడం జరుగుతుందంటూ హెచ్చరించారు. అంతేకాదు ఆ బాధ్యతను రాష్ట్ర సంఘం నిర్వాహకుడు సుధాకర్‌కు అప్పగించారట. మరి రజనీ మాటకు అభిమానులు ఎంత కట్టుబడి ఉంటారో చూద్దాం...