కోర్ట్ కు హాజరైన రాహుల్ గాంధీ


 

 

2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు.. ఆ సమయంలోనే రాహుల్ గాంధీ, బీజేపీ మిత్రపక్షమైన ఆరెస్సెస్ మీద ఒక ఆరోపణ చేసారు.. మహాత్మా గాంధీ హత్యలో ఆరెస్సెస్ కు సంబంధం ఉందంటూ, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ అప్పుడు పెను సంచలమే రేపింది.. ఈ ఆరోపణకు మండిపడ్డ ఆరెస్సెస్, రాహుల్ మీద కేసు వేసింది.. ఈ కేసులో భాగంగానే కోర్ట్ ఆదేశం మేరకు, రాహుల్ మహారాష్ట్రలోని భీవండి కోర్ట్ కు ఈ రోజు హాజరయ్యారు.. దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న ఈ కేసుకి ఎప్పుడు శుభం కార్డు పడుతుందో మరి.