అది మోడీ సమస్య.. నా సమస్య కాదు...

 

ఈనెల 12న కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో పార్టీలన్నీ మాటల యుద్దాన్ని ఇంకా తీవ్ర తరం చేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మోడీపై విమర్శలు గుప్పించారు. ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ‘‘నేను కోపం తెప్పించే కిరణం లాంటి వాడిని. నన్ను చూస్తే కోపం వస్తోంది... అది నా సమస్య కాదు. అది మోదీ సమస్య’’ అని అన్నారు. ప్రధాని కావాలన్న కోరిక విషయమై తనను మోదీ విమర్శించారని, అది కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికేనని రాహుల్ గాంధీ అన్నారు.గత 15 ఏళ్ల కాలంలో తాను ఆలయాలు, మసీదులు, గురుద్వారాలకు వెళ్లానని, ఇది బీజేపీకి నచ్చడం లేదని విమర్శించారు. హిందు అనే పదానికి వారికి సరైన అర్థం తెలియదన్నారు.