భర్తని చంపి శవాన్ని సూట్ కేసులో పెట్టి..


చాలా కేసుల్లో భార్యను భర్తలు చంపడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ భార్య భర్తని చంపి.. అతన్ని శవాన్ని సూట్ కేసులో పెట్టింది. ఇంత దారుణమైన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే.. సీరత్‌ ధిల్లాన్‌ అనే మహిళ తన భర్త అయిన ఏకంసింగ్‌ ధిల్లాన్‌ను కాల్చి చంపింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసు దగ్గర లొంగిపోయి చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11గంటల సమయంలో ఏకంసింగ్‌ను తన లైసెన్స్‌డ్‌ గన్‌తో కాల్చిచంపానని, ఈ కుట్రలో తన సోదరుడు, అతని స్నేహితుడు సహకరించారని నిందితురాలు పోలీసులకు తెలిపింది. ఆ తరువాత మృత దేహాన్ని సూట్‌కేసులో పెట్టి కారులో తీసుకెళ్లి కాలువలో పడేయాలనుకున్నామని.. కానీ కారు తాళాలు దొరకకపోవడంతో ఉదయాన్నే శవాన్ని తరలించాలని తాము భావించామని, ఇంతలో పోలీసులకు తెలిసిపోయిందని ఆమె చెప్పారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.  ఏకంసింగ్‌ ధిల్లాన్‌ చంపడానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.