నేను చేసింది తప్పే... నన్ను అర్థం చేసుకోండి..

 

డిసెంబర్ 31 న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ దొరికిపోయిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రదీప్ దొరికిపోవడంతో మీడియా ఈ వార్తను రోజంతా టెలికాస్ట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ప్రదీప్ కౌన్సిలింగ్ కు రాకపోవడంపై కూడా... పలు పుకార్లే వస్తున్నాయి. ప్రదీప్ పరారీలో ఉన్నాడని... ప్రదీప్ వెనుక ఎవరో ఉన్నారని... ఇలా చాలా వార్తలే వచ్చాయి. ఇక వీటిపై స్పందించిన ప్రదీప్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో

 

‘‘అందరికీ నమస్కారం’’  ‘‘నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబరు 31న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు. పోలీసుల కౌన్సెలింగ్‌కు కానీ, దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్‌కు కానీ హాజరయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల వల్ల కొంత బిజీగా ఉన్నా. షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్లే రాలేకపోయాను తప్పితే మరో కారణం ఏమీ లేదు.

 

ఫోన్ ఆగకుండా మోగుతుండడం వల్ల కొన్ని ముఖ్యమైన ఫోన్లను రిసీవ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. అందరికీ చెప్పేది ఏంటంటే.. చట్టప్రకారం ప్రొసీడింగ్స్‌ను ఫాలో అవుతాను. గతేడాది డ్రంకెన్ డ్రైవ్ గురించి చెప్పిన నేను దురదృష్టవశాత్తు అందులోనే దొరికిపోయాను. నేను చేసిన తప్పును ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నా. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.  ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.