ఏపీకి ఇవ్వండి.. అలాగే మాకు ఇవ్వండి
posted on Jul 31, 2015 11:54AM
.jpg)
ఓటుకు నోటు కేసు వ్యవహారంలో బయటపడిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మరో కీలకమైన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కాల్ డేటా ఇవ్వాలని సుప్రీంకోర్టు సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించగా సర్వీసు ప్రొవైడర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కాల్‌డేటా అంశంలో తదుపరి అన్ని రకాల చర్యలను నిలిపివేస్తూ(స్టే ఆల్ ఫరదర్ ప్రొసీడింగ్స్) మధ్యంతర స్టే జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి తక్షణమే కాల్ డేటా ఇవ్వాలని ఆదేశించిన మేరకు సర్వీసు ప్రొవైడర్లు వెంటనే కాల్ డేటాను సీల్డ్‌కవర్‌లో ఉంచి ఇవ్వాలని.. అలాగే ఈ సీల్డు కవర్లను మెసెంజర్ ద్వారా తమకు కూడా ఇవ్వాలని సూచించింది.