కేసీఆర్ ను పవన్ అందుకే పొగిడాడు..

 

తమ అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్ పొగడానికి కారణం ఏంటో జనసేన ప్రతినిధి అడ్డేపల్లి శ్రీధర్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో పరిపాలన బాగుందని భావించారు కాబట్టే తమ పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్, కేసీఆర్ ను పొగిడారని...ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడి కంటే, తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని పవన్ నమ్ముతున్నారని చెప్పారు. అందువల్లే కేసీఆర్ కు 6 పాయింట్లు, చంద్రబాబుకు 2 పాయింట్లను ఆయన ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా పవన్ రాజకీయం సాగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య కక్షసాధింపు రాజకీయాలు జరిగాయని గుర్తు చేసిన ఆయన, పవన్ ఎన్నడూ అటువంటి రాజకీయాలు చేయబోరని అన్నారు. తమ నేత పవన్ ను కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయే రాజకీయ నేతగా వ్యాఖ్యానిస్తున్నారని, వారికి నిజమేంటో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.